వచనం 2 నుండి పురుషసుక్త ఈ క్రింది వాటితో కొనసాగుతుంది. (సంస్కృత ప్రతిలేఖనాలు, పురుషసుక్త మీద అనేకమైన నా తలంపులు, జోసఫ్ పడింజరేకర రచించిన క్రైస్ట్ ఇన్ ద ఏన్షియంట్ వేదాస్ (పేజీ 346, 2007) అధ్యయనంనుండి వచ్చాయి.)
ఇంగ్లిష్ అనువాదం | సంస్కృత ప్రతిలేఖనాలు |
సృష్టి పురుష మహిమ – ఆయన మహాత్యం ఘనమైనది. అయినా ఆయన ఈ సృష్టికంటే ఉన్నతుడు. పురుష (వ్యక్తిత్వంలో) నాలుగవభాగం లోకంలో ఉంది. ఆయనలో మూడు వంతులు ఇంకా శాశ్వతంగా పరలోకంలో నివసిస్తున్నాయి. పురుష తనలోని మూడువంతులతో ఉన్నతంగా ఉద్భవించాడు. ఆయనలో ఒక నాలుగవ భాగం ఇక్కడ జన్మించింది. అక్కడనుండి సమస్తజీవులలో జీవాన్ని విస్తరించాడు. | ఎతవనస్యమహిమాతోజ్యయంస్కపురుషఃపదోయస్యవిస్వభ్ యు తానిత్రిపదస్యంమృతందివిత్రిపాదుర్ద్వాదైత్ పురుష్పాదౌశ్యేహ అభవత్పునఃతోవిశ్వాన్వియాక్రమత్సాసననసనేయభి |
ఇక్కడ వినియోగించిన భావన అర్థం చేసుకోవడం క్లిష్టమైనది. అయితే ఈ వచనాలు పురుష ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన తన సృష్టికంట ఘనమైన వాడు అని స్పష్టంగా చెపుతుంది. ఈ లోకంలో బయలు పడిన ఆయన ఘనతలో కేవలం ఆ భాగంమాత్రమే అర్థం చేసుకోగలం. అయితే ఈ లోకంలో ఆయన మనుష్యావతారం గురించి కూడా మాట్లాడుతుంది – నీవు నేనూ జీవించే మనుష్యుల లోకం (‘ఆయనలో ఒక నాలుగవ ఇక్కడ జన్మించింది’). కనుక దేవుడు ఈ లోకానికి తన మనుష్యావతారంలో వచ్చినప్పుడు, ఆయన మహిమలో కేవలం ఒక భాగం మాత్రమే ఈ లోకంలో బయలుపరచబడింది. ఆయన జన్మించినప్పుడు ఆయన తననుతాను రిక్తునిగా చేసుకొన్నాడు. ఇది వచనం 2 లో పురుష వర్ణించబడిన దానితో స్థిరంగా ఉంది – ‘పది వేళ్ళకు పరిమితం చేసుకొన్నాడు.’
వేద పుస్తకాన్ (బైబిలు) నజరేతువాడు యేసు మానవావతారం గురించిన వివరణతో ఇది స్థిరంగా ఉంది. ఆయన గురించి ఇలా చెపుతుంది:
నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. (కొలస్సీ 2:2-3)
కనుక ప్రభువైన క్రీస్తు దేవుని మానవావతారం, అయితే దాని ప్రత్యక్షతలో అధిక భాగం “గుప్తమై” (దాచబడి) ఉంది. అది ఏవిధంగా దాచబడి ఉంది? మరింతగా వివరించబదుతుంది:
మీ మనసు (వైఖరి) క్రీస్తు యేసుకు కలిగిన మనసులా ఉండాలి:
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,
10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:5-11)
కనుక ప్రభువైన యేసు తన మనుష్యావతారంలో ‘తన్నుతాను రిక్తునిగా చేసుకొన్నాడు’, తన బలికోసం ఆ స్థితిలో తన్నుతాను సిద్ధపరచుకొన్నాడు. బయలుపరచబడిన ఆయన మహిమ పురుషాసుక్తలో ఉన్నట్టుగా కేవలం పాక్షికం. దీనికి రాబోతున్న ఆయన బలి కారణం. పురుషాసుక్త అదే అంశాన్ని అనుసరించింది, ఎందుకంటే ఈ వచనాల తరువాత పురుష లోని పాక్షిక మహిమను వర్ణించడం నుండి ఆయన బలిమీద లక్ష్యముంచడం మీదకు మారింది. తరువాత మా వ్యాసం (next post) లో మనం చూడవచ్చు.