Skip to content

దేవుని స్వరూపములో

  • by

పురుషసూక్త సమయము యొక్క ఆరంభము కంటే వెనుకకు వెళ్లి పురుషను బలి అర్పించుటకు దేవుని (ప్రజాపతి) మనస్సు నిర్ణయించుకున్నట్లు వివరిస్తుందని మనము చూశాము. ఈ నిర్ణయములో నుండి సమస్త విషయముల యొక్క సృష్టి ఆరంభమైయ్యింది – మానవుల సృష్టితో సహా.

అతితిదేవోభవ (అతిథి దేవుడు) లేదా నమస్తే (నేను మీలోని దైవానికి నమస్కరిస్తున్నాను) అనే పదబంధాన్ని మనం తరచుగా వింటాము, ఉపయోగిస్తాము. ఈ పదబంధాలు ప్రజలందరిలో ఏదో దైవంగా ఉన్నాయనే సత్యాన్ని ప్రతిబింబిస్తాయి. హీబ్రూ వేదాలు మనలో దైవం ఏ విధంగా ఉందో వివరిస్తుంది, దాని వివరణ కోసం మానవజాతి సృష్టికి మనల్ని సరైనదిగా తీసుకుంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ విలువ, గౌరవాన్ని ఇస్తుంది.

మనలను గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో అవగాహన కలిగియుండుటకు మానవ సృష్టిని గూర్చి వేద పుస్తకము (బైబిలు) ఏమి సెలవిస్తుందో ఇప్పుడు చూద్దాము.

26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.

ఆదికాండము 1:26-27

“దేవుని స్వరూపములో”

మానవుడు ‘దేవుని స్వరూపములో’ సృష్టించబడెను అంటే అర్థము ఏమిటి? దేవుడు రెండు చేతులు, తల, మొదలగునవి కలిగియున్న ఒక భౌతిక జీవి అని దీని అర్థము కాదు. కాని లోతైన స్థాయిలో, ప్రజల యొక్క సామన్య గుణములు దేవుని యొక్క సమాంతర గుణముల నుండి వెలువడినవి. కాబట్టి ఒక ఉదాహరణగా, దేవునికి (బైబిలులో) మరియు మానవులకు (పరిశీలనాత్మకముగా) ఇరువురికి వివేకము, భావోద్వేగాలు, మరియు చిత్తము ఉన్నాయి. కొన్నిసార్లు బైబిలులో దేవుడు దుఖముతో ఉన్నట్లు, గాయపడినట్లు, కోపముతో లేక ఆనందముగా ఉన్నట్లు చిత్రించబడినాడు – ఇవి మానవులమైన మనము కూడా అనుభవించు భావోద్వేగాలు. మనము అనుదినము ఎంపికలను చేస్తాము, నిర్ణయాలను తీసుకుంటాము. బైబిలులోని దేవుడు కూడా ఇదే విధముగా ఎంపికలు చేస్తాడు మరియు నిర్ణయాలు తీసుకుంటాడు. తర్కించుటకు మరియు ఆలోచన చేయుటకు మనము కలిగియున్న సామర్థ్యములు దేవుని యొద్ద నుండి వచ్చినవి. దేవుడు వాటిని కలిగియున్నాడు కాబట్టి మరియు మనము ఆయన స్వరూపమందు చేయబడితిమి కాబట్టి మనము కూడా వివేకము, భావోద్వేగాలు మరియు చిత్తము అను సామర్థ్యములను కలిగియున్నాము.

లోతైన స్థాయిలో మనము జ్ఞానము గలవారము, ‘నేను’ ‘నీవు’ అను స్వయం-జ్ఞానము మరియు తెలివిగల జీవులము. మనము అవ్యక్తిగతమైన “అవి” కాము. దేవుడు ఇలా ఉన్నాడు కాబట్టి మనము ఇలా ఉన్నాము. ఈ ప్రాధమిక దృష్టికోణములో, స్టార్ వార్స్ వంటి సుపరిచితమైన సినిమాలో చూపిన ‘ఫోర్సు’ వలె బైబిలు దేవుడు అద్వైత అవ్యక్తిగా వర్ణించబడలేదు. మానవులు “అవి” గాక జ్ఞానముగల వ్యక్తులు అను సత్యము దేవుని గూర్చిన ఈ ఆదిమ బోధన వెలుగులో అర్థమవుతుంది. దేవుడు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి మనము ఇలా ఉన్నాము, మరియు మనము ఆయన స్వరూపమందు చేయబడితిమి.

మనము ఎందుకు రసజ్ఞులము

మనము కళ మరియు నాటకమును ప్రేమిస్తాము. మనము సౌందర్యమును స్వాభావికముగా ప్రశంసిస్తాము మరియు అది మనకు అవసరము కూడా. ఇది కన్నులకు కనిపించు సౌందర్యము మాత్రమేగాక, సంగీతము మరియు సాహిత్యము కూడా దీనిలో ఉన్నవి. మన జీవితములలో సంగీతము ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి – మనకు నాట్యమంటే ఎంత ఇష్టమో కదా. సంగీతము మన జీవితములను ఎంత ఆహ్లాదపరుస్తుందో. మనకు మంచి కథలంటే చాలా ఇష్టం, అవి నవలలు లేక నాటికలు కావచ్చు, లేక నేడు ఎక్కువ అందుబాటులో ఉండు చలనచిత్రములైనా కావచ్చు. కథలలో కథానాయకులు, ప్రతినాయకులు, నాటికలు ఉంటాయి, మరియు గొప్ప కథలు ఈ నాయకులను, ప్రతినాయకులను మరియు నాటికలను మన జీవితాలలోనికి నూరిపోస్తాయి. ఆహ్లాదము, పునర్జీవనము, తాజాదనము కొరకు అనేక రకములైన కళలను ఉపయోగించుట, వాటిని మెచ్చుకొనుట చాలా స్వాభావికము ఎందుకంటే దేవుడు కళాకారుడైయున్నాడు మరియు మనము ఆయన స్వరూపములమైయున్నాము.

ఇది అడగదగిన ప్రశ్న. కళ, నాటిక, సంగీతము, నాట్యము, లేక సాహిత్య విషయములలో మనము స్వాభావికముగా ఎందుకు రసజ్ఞులమైయున్నాము? నేను భారత దేశమునకు వెళ్లిన ప్రతిసారి, పాశ్చాత్య చలనచిత్రాల కంటే ఎక్కువ నాట్యము మరియు నృత్యము కలిగియున్న భారత చలనచిత్రములను చూసి ఆశ్చర్యపోయేవాడిని. సూటిగా మాట్లాడు నాస్తికుడు మరియు అభిజ్ఞా ప్రక్రియల అవగాహన మీద అధికారం కలిగియున్న డేనియల్ డెన్నెట్ భౌతికవాద దృష్టికోణములో జవాబిచ్చుచున్నాడు:

“కాని ఈ పరిశోధన చాలా వరకు సంగీతమును మంజూరుగా తీసుకుంటుంది. ఇలాంటి ప్రశ్నలను ఇది చాలా అరుదుగా అడుగుతుంది: సంగీతము ఎందుకు ఉనికిలో ఉంది? దీనికి క్లుప్త జవాబు ఉంది, మరియు ఇది చాలా వరకు నిజమైయుంది: మనము దానిని ప్రేమించుచున్నాము కాబట్టి అది ఉనికిలో ఉంది మరియు దానిలోని ఎక్కువ శాతమును మనము ఉనికిలోనికి తీసుకొనివస్తాము. కాని మనము దానిని ఎందుకు ప్రేమించుచున్నాము? అది మనకు అందముగా కనబడుతుంది కాబట్టి. కాని అది మనకు ఎందుకు అందముగా కనబడుతుంది? ఇది మంచి భౌతికవాద ప్రశ్న, కాని దీనికి మంచి జవాబు ఇంకా దొరకలేదు.”

డేనియల్ డెన్నెట్. బ్రేకింగ్ ది స్పెల్: రిలీజియన్ అస్ ఏ న్యాచురల్ ఫెనోమిన. పేజీ. 43

మానవాళిని గూర్చి భౌతికవాద దృష్టికోణము మానవ స్వభావమును గూర్చిన ఈ ప్రధానమైన ప్రశ్నకు జవాబును ఇవ్వలేదు. బైబిలు దృష్టికోణములో దేవుడు కళాత్మకమైనవాడు మరియు రసజ్ఞుడు కాబట్టి, అని దీనికి జవాబు. ఆయన వస్తువులను అందముగా చేశాడు మరియు అందమును ఆస్వాదిస్తాడు. ఆయన స్వరూపమందు చేయబడిన మనము కూడా ఆస్వాదిస్తాము.

మనము ఎందుకు నైతికమైనవారము

దీనితో పాటు, ‘దేవుని స్వరూపమందు చేయబడుట’ అన్ని సంస్కృతులలో చాలా సాధారణమైన ప్రాకృతిక నైతిక సామర్థ్యమును వివరిస్తుంది, దీనిని మనము గురు సాయి బాబా యొక్క నైతిక బోధలు అను అంశములో చూశాము. మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి కాబట్టి మరియు నైతికత ఆయనలో ఇమిడియున్నది కాబట్టి, ఒక దిక్సూచి అయస్కాంత ఉత్తరదిక్కుకు తిరిగి ఉన్నట్లు, ఆయనను పోలియున్నాము కాబట్టి మనము కూడా ‘సరియైన,’ ‘మంచి,’ ‘తగిన’ దాని వైపుకు మొగ్గుచూపుతాము. కేవలం మతపరమైన మానవులు మాత్రమే ఈ విధముగా చేయబడలేదు – అందరు ఇలా చేయబడ్డారు. దీనిని గ్రహించకపోవుట అనేక అపార్థములకు దారి తీస్తుంది. ఉదాహరణకు అమెరికాకు చెందిన భౌతికవాదుడైన సామ్ హ్యారిస్ యొక్క సవాల్ ను చూడండి.

“మత విశ్వాసము మాత్రమే నైతికతకు సరియైన ఆదరమును ఇస్తుంది అని మీరు నమ్ముట సరియైతే, నాస్తికులు విశ్వాసుల కంటే తక్కువ నైతికత కలిగియుండాలి.”

సామ్ హ్యారిస్. 2005. లెటర్ టు ఏ క్రిస్టియన్ నేషన్ పేజీ.38-39

హ్యారిస్ ఇక్కడ తప్పు మాట్లాడుతున్నాడు. మన నైతికత దేవుని స్వరూపమందు చేయబడుట వలన కలిగిందిగాని, మతపరముగా ఉండుట వలన కాదు. అందువలనే, మనందరి వలెనె నాస్తికులకు కూడా ఈ నైతిక భావన ఉంది మరియు వారు నైతికముగా వ్యవహరించగలరు. మనలో నైతికత ఎందుకు ఉంది అనునది కనుగొనుట నాస్తికత్వములో కష్టము – కాని దేవుని నైతిక స్వరూపమందు చేయబడుట అనునది దీనికి సులువైన సూటైన వివరణ.

మనము ఎందుకు బంధములను కలిగియుంటాము

బైబిలానుసారముగా, మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి అని గుర్తించుట మనలను గూర్చి మనము అర్థము చేసుకొనుటకు ఆరంభ బిందువైయున్నది. ఇందు మూలముగా, మనము దేవుని గూర్చి (బైబిలులో ఆయనను గూర్చి బయలుపరచబడిన వాటి నుండి) లేక ప్రజలను గూర్చి (పరిశీలన మరియు విశ్లేషణ ద్వారా) ఒక మెళకువను కనుగొన్నప్పుడు, మరొకరిని గూర్చి కూడా అవగాహనను పొందుతాము. ఉదాహరణకు, బంధములకు ప్రజలు ఇచ్చు ప్రాముఖ్యతను గూర్చి ఒకసారి ఆలోచించండి. ఒక మంచి చలనచిత్రమును చూచుట బాగుంటుంది, కాని ఒక స్నేహితునితో కలిసి చూచుట ఇంకా బాగుంటుంది. మన అనుభవాలను పంచుకొనుట కొరకు స్వాభావికముగా మనము స్నేహితులను వెదకుతాము. మన శ్రేయస్సు కొరకు అర్థవంతమైన స్నేహాలు మరియు కుటుంబ బంధాలు మూలమైయున్నవి. దీనికి భిన్నముగా, ఒంటరితనము మరియు/లేక తెగిపోయిన కుటుంబ బంధములు మరియు స్నేహములలో తెగతెంపులు మనలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఇతరులతో మనము కలిగియుండు బంధముల ద్వారా తటస్తంగాను, కదలకుండాను మనము ఉండలేము. అవి పాత్రల మధ్య బంధములకు (ప్రేమికులు, కుటుంబ సభ్యులు మొదలగు వారి మధ్య) ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాయి కాబట్టే బాలివుడ్ చలనచిత్రములు చాలా సుప్రసిద్ధమైయ్యాయి.

ఇప్పుడు, మనము దేవుని స్వరూపమందు ఉంటె, మనము దేవునుతో కూడా ఇలాంటి అనుబంధ ఉద్ఘాటననే ఆశిస్తాము, మరియు కలిగియున్నాము కూడా. “దేవుడు ప్రేమస్వరూపి…” (1 యోహాను 4:8) అని బైబిలు సెలవిస్తుంది. ఆయన పట్ల మరియు ఇతరుల పట్ల మనము కలిగియున్న ప్రేమకు దేవుడు ఇచ్చు ప్రాముఖ్యతను గూర్చి బైబిలులో అనేక సంగతులు వ్రాయబడియున్నవి – వాస్తవానికి యేసు (యేసు సత్సంగ్) వీటిని బైబిలులోని రెండు అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞలని పిలచాడు. దీనిని గూర్చి మీరు ఆలోచించునప్పుడు, ప్రేమ బంధము కలిగినదైయుండాలి ఎందుకంటే దానిలో ప్రేమించువాడు (ప్రేమికుడు) మరియు ఆ ప్రేమను పొందుకొను వ్యక్తి – ప్రేమిక – కూడా ఉండాలి.

కాబట్టి మనము దేవుడు ప్రేమికుడు అని ఆలోచించాలి. ఆయనను గూర్చి మనము ‘ఆరంభ ప్రతిపాదకుడు’, ‘ప్రధమ కారకము’, ‘సర్వజ్ఞ దైవము’, ‘దయగల జీవి’ లేక ‘అవ్యక్త ఆత్మ’ అని మాత్రమే ఆలోచన చేసినప్పుడు మనము బైబిలులోని దేవుని గూర్చి ఆలోచన చేయుట లేదు – బదులుగా మన మనస్సులలో మనము ఒక దేవుని సృష్టిస్తున్నాము. ఆయనలో ఈ వర్ణనలు ఉన్నప్పటికీ, ఆయన బంధముల మీద అంతులేని ఆశగలవానిగా కూడా ఉన్నాడు. ఆయన ‘లో’ ప్రేమ లేదు. ఆయ‘నే’ ప్రేమ అయ్యున్నాడు. ప్రజలతో దేవుని యొక్క అనుబంధమును వర్ణించిన రెండు ప్రఖ్యాతిగాంచిన బైబిలు రూపకములు ఏమనగా, తండ్రితో పిల్లల బంధము మరియు భార్య భర్తల బంధము. ఇవి ఎలాంటి భావనలు లేని ‘ప్రధమ కారక’ తత్వవాద సాదృశ్యములు కావుగాని, మానవ బంధములలో లోతైన మరియు అత్యంత సన్నిహితమైనవైయున్నవి.

కాబట్టి ఇప్పటి వరకు మనము నిర్మించిన పునాది ఇది. ప్రజలు దేవుని స్వరూపమందు చేయబడ్డారు మరియు వారిలో మనస్సు, భావోద్వేగాలు మరియు చిత్తము ఉన్నవి. మనము జ్ఞానముగలవారము మరియు స్వయం-జ్ఞానం గలవారము. మనము నైతిక జీవులము మరియు మన ‘నైతిక వ్యాకరణము’ మనకు ఏది ‘సరియైనది’ మరియు ‘తగినది’ మరియు ఏది కాదు అను లోతైన అవగాహనను ఇస్తుంది. సౌందర్యమును, నాటికను, కళ మరియు కథను వాటి యొక్క అన్ని రూపములలో అభివృద్ధి చేయగల మరియు ఆస్వాదించగల అంతరంగ సామర్థ్యము మనకు ఉంది. మనము స్వాభావికముగా ఇతరులతో అనుబంధములను స్నేహములను వెదకుతాము మరియు అభివృద్ధి చేసుకుంటాము. దేవుడు ఇవన్నీ కలిగియున్నాడు కాబట్టి మనము కూడా కలిగియున్నాము మరియు మనము ఆయన స్వరూపమందు చేయబడితిమి. ఈ పునాదిని నిర్మించుచుండగా మనలను గూర్చి మనము పరిశీలించు వాటితో ఇక్కడ మనము కనుగొన్న విషయములు సంతులత కలిగియున్నవి. మన తరువాత వ్యాసంలో కొన్ని సంక్లిష్టతలను మనము చూద్దాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *