Skip to content

వర్ణం నుండి వర్ణ రహితం: ప్రజలందరికీ కోసం వస్తున్న మానవుడు

  • by

రిగ్ వేదంలోని పురుష సూక్తం ప్రారంభంలోనే రాబోయే వ్యక్తిని ముందుగానే వేదాలు చూశాయి. అప్పుడు మేము హీబ్రూ వేదాలతో కొనసాగాము, సంస్కృత, హీబ్రూ వేదాలు (బైబిలు) రెండింటినీ సత్యస్వరూపి అయిన యేసు (నజరేయుడైన యేసు) నెరవేర్చాలని సూచించారు.

కాబట్టి యేసు ఈ ప్రవచించిన పురుషుడు లేదా క్రీస్తునా? అతను రావడం కేవలం ఒక నిర్దిష్ట సమూహం కోసమా, లేదా అందరి కోసమా – అన్ని కులాలతో కలిప, వర్ణంనుండివర్ణరహితం  కోసం కూడానా?

పురుష  సూక్తంలోకులం (వర్ణం)  

పురుష సూక్తంలో పురుషని గురించి ఇలా చెప్పుతుంది:

పురుష సూక్తంలో  11-12  వచనాలు సంస్కృతంసంస్కృత భాషానువాద కరణఅనువాదం
यत पुरुषं वयदधुः कतिधा वयकल्पयन |
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ||
बराह्मणो.अस्य मुखमासीद बाहू राजन्यः कर्तः |
ऊरूतदस्य यद वैश्यः पद्भ्यां शूद्रो अजायत ||
11 yat puruṣaṃ vyadadhuḥ katidhā vyakalpayan |
mukhaṃ kimasya kau bāhū kā ūrū pādā ucyete ||
12 brāhmaṇo.asya mukhamāsīd bāhū rājanyaḥ kṛtaḥ |
ūrūtadasya yad vaiśyaḥ padbhyāṃ śūdro ajāyata
11 వారు పురుషుని విభజించినప్పుడు వారు ఎన్ని భాగాలు చేశారు?
వారు అతని నోరుని, చేతులను ఏమని పిలుస్తారు? వారు అతని తొడలును, కాళ్ళను ఏమని పిలుస్తారు?
12 అతని నోరు బ్రాహ్మణుడు, అతని రెండు చేతుల్లోనూ రాజ్యము పాలించే వాడు చేయబడింది.
అతని తొడలు వైశ్యునిగా అయ్యింది, అతని పాదాల నుండి శూద్రుడు ఉత్పత్తి చేయబడింది.

సంస్కృత వేదాలలో కులాలు లేదా వర్ణం గురించి పూర్వం ఇలా ప్రస్తావించబడింది. ఇది నాలుగు కులాలను పురుషుడి శరీరం నుండి వేరుచేయబడింది అని వివరిస్తుంది: అతని నోటి నుండి బ్రాహ్మణ కులం / వర్ణ, అతని చేతుల నుండి రాజ్య తయారీ కులం (నేడు క్షత్రియ కులం / వర్ణం అని పిలుస్తారు), అతని తొడల నుండి వైశ్య కులం / వర్ణ, అతని పాదాలు నుండి శూద్ర కులం. యేసు పురుషుడు కావాలంటే అతను శరీరం మొతానికి ప్రాతినిధ్యం వహించాలి.

 అతడు ఏంటి ?

యేసుబ్రాహ్మణుడు, క్షత్రియుడు

‘క్రీస్తు’ అనేది పురాతన హీబ్రూ గ్రంధాల్లో ఆయనకు బిరుదు దాని అర్ధం ‘పాలకుడు’ – పాలకులకు పాలకుడు. ‘క్రీస్తు’ గా, యేసు పూర్తిగా క్షత్రియునిగా గుర్తించి ప్రాతినిధ్యం వహిస్తాడు. ‘కొమ్మ’ గా, యేసు పూజారి గా కూడా వస్తాడు అని ప్రవచించాడని మనం చూశాము, కాబట్టి ఆయన బ్రాహ్మణునితో పూర్తిగా గుర్తించి ప్రాతినిధ్యం వహిస్తాడు. వాస్తవానికి, హీబ్రూ ప్రవచనం ఆయన పూజారిగా ( యాజకునిగా), రాజుగా, రెండు పాత్రలను ఒక వ్యక్తిగా ఏకం చేస్తాడని సూచించింది.

13 అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.

జెకర్యా 6:13

వైశ్యునిగాయేసు

హీబ్రూ ఋషులు/ప్రవక్తలు రాబోయేవారు వ్యాపారిలకు వ్యాపారి అవుతాడు అని కూడా ప్రవచించారు. వారు ముందే చెప్పారు:

యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

యెషయా 43:3

దేవుడు రాబోయే వానితో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, ఆయన వ్యాపార విషయాలలో వ్యాపారం చేయడు, కానీ ఆయన ప్రజల కోసం వ్యాపారం చేస్తాడు – తన జీవితాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా. కాబట్టి రాబోయేది ఒక వ్యాపారి, ప్రజలను విడిపించడంలో వ్యాపారం చేస్తాడు. ఒక వ్యాపారిగా ఆయన వైశ్యునితో గుర్తించి ప్రాతినిధ్యం వహిస్తాడు.

శూదృడుసేవకుడు

ఋషులు/ప్రవక్తలు ముందుగానే రాబోయే వాని పాత్ర సేవకునిగా లేదా శూద్రనిగా అని చాలా వివరంగా చెప్పారు. పాపం తొలగించడానికి కొమ్మ ఒక సేవకునిగా వస్తాడు అని ప్రవక్తలు ఎలా ముందే చెప్పారో మేము చూశాము:

ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;

యెషయా 3:8-9

రాబోయే కొమ్మ పూజారిగా, పాలకుడుగా, వ్యాపారిగా  సేవకుడుగా – శూద్రడు కూడా. యెషయా తన సేవకుడు (శూద్ర) పాత్రను గురించి చాలా వివరంగా ప్రవచించాడు. ఈ శూద్రని సేవపై శ్రద్ధ వహించాలని దేవుడు అన్ని ‘శూద్రులు’ దేశాలకు (అది మనమే!) సలహా ఇస్తున్నాడు.

పములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.
నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.
ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను.
అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయ పరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.
యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో బును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు
నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

యెషయా 49:1-6

ఈ సేవకుడు హీబ్రూ / యూదు జాతి నుండి వచ్చినప్పటికీ, ఆయన సేవ ‘భూమి చివరలకు చేరుకుంటుంది’ అని చెప్పారు. యేసు సేవ ప్రవచించినట్లు భూమిపై ఉన్న అన్ని దేశాలను నిజంగా తాకింది. సేవకుడిగా, యేసు పూర్తిగా శూద్రునిగా గుర్తిపు పొంది వారికి ప్రాతినిధ్యం వహించాడు.

వర్ణలేనివారుకూడా

ప్రజలందరికీ మధ్యవర్తిత్వం వహించడానికి యేసు కూడా వర్ణ లేని (తక్కువ జాతీ ) లేదా షెడ్యూలు కులాలకు, గిరిజనులకు, దళితులకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఎలా ఉంటాడు? హిబ్రూ వేదాలు ఆయనను పూర్తిగా విచ్ఛిన్నం అవుతాడని, తృణీకరిస్తారు, వర్ణ లేని వానిగా మిగతా వారు చూస్తారు అని చెప్పారు.

ఏ విధంగా?

కొన్ని వివరణలు చేర్చిన, పూర్తి ప్రవచనం ఇక్కడ ఉంది. ఇది ‘ఆయన’ మరియు ‘అతని’ గురించి మాట్లాడుతుందని గమనించండి, కనుక ఇది రాబోయే మనిషిని ప్రవచిస్తుంది. ప్రవచనం ‘కొమ్మ’ చిత్రాన్ని ఉపయోగిస్తున్నందున ఆ కొమ్మ పూజారి (యాజకుడు) మరియు పాలకునిగా సూచిస్తుందని మాకు తెలుసు. కానీ వివరణ వర్ణ రహితంగా.

వస్తున్నదితృణీకరించినవాడు

ము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.

యెషయా 53:1-3

దేవుని ముందు ‘చిగురు’ అయినప్పటికీ (అనగా ఈ మర్రి కొమ్మ), ఈ మనిషి ‘తృణీకరించబడతాడు’  ‘తిరస్కకరణకూ గురి ఆవుతాడు’, పూర్తి ‘బాధలు’,  ఇతరు చేత తక్కువ గౌరవం కలిగి ఉంటారు. ఆయన అక్షరాలా అంటరానివానిగా గుర్తిస్తారు. ఈ రాబోయే మనిషి షెడ్యూల్డ్ తెగల (అడవిలో నివసించే ప్రజలు), వెనుకబడిన కులాల – దళితుల అంటరానివారినికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు .

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

యెషయా 53:4-5

మనం కొన్నిసార్లు ఇతరుల దురదృష్టానికి తీర్పు తీరుస్తాం, లేదా సమాజంలో తక్కువ స్థితిలో ఉన్నవారిని, వారి పాపాల పర్యవసానంగా లేదా కర్మగా చూస్తాం. అదే విధంగా, ఈ మనిషి శ్రమలు చాలా గొప్పవి, ఆయన దేవునిచే శిక్షి పొందుతున్నాడని మనం అనుకుంటాము. అందుకే అతన్ని తృణీకరించారు అనుకుంటాము. కానీ అతను తన పాపాలకు శిక్షింపబడలేదు – మన పాపాల కోసం శిక్షింపబడేను. మన ఆరోగ్యం కోసం, శాంతి కోసం అతను భయంకరమైన అపరాధాల భారాన్ని మోస్తాడు..

సిలువపై ‘నలగొట్టి’, దెబ్బతిన్న, బాధపడుతున్న నజరేయుడైన యేసును, సిలువ వేయటంతో ఇది నెరవేరింది. ఆయన జీవించడానికి 750 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం వ్రాయబడింది. తక్కువ గౌరవంతో, అతని బాధలో, యేసు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు, ఇప్పుడు అన్ని వెనుకబడిన కులాలకు, గిరిజనులకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

యెషయా 53:6-7

ఇది మన పాపం, ధర్మం నుండి మనం తొలిగిపోయి త్రోవ తప్పిపొవడంతో, ఈ మనిషి మన దోషాలను లేదా పాపాలను మోయాలి. ఆయన వధకు మా స్థలంలోనికి శాంతియుతంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు, నిరసన వ్యక్తం చేయలేదు లేదా కనీసం ‘నోరు కూడా తెరవ లేదు’. యేసు ఇష్టపూర్వకంగా సిలువకు వెళ్ళిన తీరులో ఇది కచ్చితంగా నెరవేరింది.

అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?

యెషయా 53:8

ఆయన ‘సజీవుల భూమి నుంచి కొట్టివేయబడెను’ అన్న ప్రవచనం యేసు సిలువపై మరణించినప్పుడు నెరవేర్చినట్లు పేర్కొంది.

అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

యెషయా 53:9

అతను ఏ అన్యాయం చేయలేదు’, ‘ అతని నోట ఏ కపటము లేదు’ అయినప్పటికీ యేసును ‘దుష్ట’ వ్యక్తిగా పేర్కొన్నారు. అయినప్పటికీ, అతన్ని ధనవంతుడైన పూజారి అరిమతయియకు చెందిన యోసేపు సమాధిలో సమాధి చేశారు. యేసు ‘భక్తిహీనులతో సమాధి నియమింపబడెను’, కానీ ‘తన మరణంలో ధనవంతుని యుద్ద ఉంచెను’ అన్నది కూడా నెరవేర్చాడు.

10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

యెషయా 53:10

ఈ క్రూరమైన మరణం ఏదో భయంకరమైన ప్రమాదం లేదా దురదృష్టం కాదు. అది ‘దేవుని సంకల్పం’.

ఎందుకు?

ఎందుకంటే ఈ మనిషి ‘జీవితం’ ‘పాపానికి అర్పణ’ అవుతుంది.

ఎవరి పాపం?

‘దారితప్పిన’ వారు మనలోను ‘అనేక దేశాల్లోను’ ఉన్నారు. యేసు సిలువపై మరణించినప్పుడు, జాతీ, మతం లేదా సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా మనందరినీ పాపం నుండి అది శుభ్రపరిచెను.

విజయంతోతృణీకరించినవాడు

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

యెషయా 53:11

ప్రవచన స్వరం ఇప్పుడు విజయవంతముగా మారుతుంది. భయంకరమైన ‘బాధ’ తరువాత (‘తృణీకరించబడటం,’ ‘సజీవుల భూమి నుండి కొట్టివేయబడటం,’ ‘సమాధి’ కేటాయించిన తరువాత), ఈ సేవకుడుని ‘మానవులకు వెలుగుగా’ చూస్తారు.

అతను తిరిగి జీవంలోనికి వస్తాడు! అలా చేయడం వల్ల ఈ సేవకుడు చాలా మందిని ‘నీతిమంతునిగా’ చేస్తాడు.

‘నీతిమంతునిగా తీర్చిబడటం’ అంటే ‘నీతి’’ పొందడం అనే అర్ధం. అబ్రహముకు ‘నీతి’, ‘జమ’ చేయటం లేదా ఇవ్వటం. అది అతని నమ్మకం కారణంగా అతనికి ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఈ సేవకుడు తక్కువగా అంటరాని వారిగా ఉన్న ‘చాలా మందిని’ నీతిమంతునిగా చేయటం, లేదా నీతిని జమ చేస్తాడు. కచ్చితంగా అదే విధముగా యేసును సిలువ వేసిన తరువాత ఆయన మృతులలో నుండి లేవడం ద్వారా సాధించినది, ఇప్పుడు మనల్ని నీతిమంతునిగా చేసింది.

12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

యెషయా 53:12

యేసు జీవించడానికి 750 సంవత్సరాల ముందు ఇది వ్రాసినప్పటికీ, ఇది దేవుని ప్రణాళిక అని చూపించడానికి ఆయన ఇంత వివరంగా నెరవేర్చాడు. తరచుగా అతి తక్కువ గౌరవం కలిగి, కులం తక్కువ ఉన్న వారికి యేసు ప్రాతినిధ్యం వహించగలడని కూడా ఇది చూపిస్తు, ఇది ఉంటుంది. వాస్తవానికి, అతను వారి పాపాలను, అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పాపాలకు ప్రాతినిధ్యం వహిస్తానికి, భరించడానికి, శుభ్రపరచడానికి వచ్చాడు.

దేవుని ప్రణాళికకు కేంద్రంగా ఆయన మీకు, నాకు జీవం అనే బహుమతిని అందించేదుకు వచ్చాడు – అపరాధ, కర్మ పాపాలు నుండి పవిత్రపరచటం. ఇంత విలువైన బహుమతిని పూర్తిగా పరిగణించి అర్థం చేసుకోవడం విలువైనదే కదా? దీన్ని చేయడానికి ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *