పురుష యొక్క బలి: సమస్త విషయములకు ఆరంభము

  • by

3&4 వచనముల తరువాత పురుషసూక్త యొక్క దృష్టి పురుష యొక్క గుణముల నుండి పురుష యొక్క బలి వైపుకు మళ్లుతుంది. 6&7 వచనములు దీనిని ఈ క్రింది విధముగా చేస్తాయి. (సంస్కృత లిప్యాంతరీకరణ, మరియు పురుషసూక్తను గూర్చిన నా ఆలోచనలలో చాలా వరకు, జోసెఫ్ పడింజరెకర వ్రాసిన క్రైస్ట్ ఇన్ ది ఎంషేంట్ వేదాస్ (346 పేజీ. 2007) అను పుస్తకమును అధ్యయనము చేయుట ద్వారా సేకరించబడినవి)

పురుషసూక్తలోని 6-7 వచనములు

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
పురుషను నైవేద్యముగా ఇస్తూ దైవములు బలిని అర్పించినప్పుడు, వసంత ఋతువు దానిలోని కరిగించబడిన వెన్న కాగా, గ్రీష్మము దానిలోని వంటచెరుకు కాగా, శరద్ ఋతువు నైవేద్యమైయ్యింది. ఆదియందు జన్మించిన పురుషను వారు బలిగా కట్టెల మీద ధారపోశారు. దైవములు, సాధువులు, మరియు ఋషీముణులు ఆయనను బాధితునిగా బలి అర్పించారు యత్పురుసేనా హవిస దేవ యజ్ఞం అతన్వత వసంతో అస్యసిద్ అజ్యం గ్రీష్మ ఇద్మః సరద్ద్హవిః తమ్ యజ్ఞం బర్హిసి ప్రౌక్షణ్ పురుషం జతంగ్రతః తెన దేవ అయజ్యన్తః సద్య ర్సయస్ క యే

ఇక్కడ అంతా ఒకేసారి స్పష్టము కాకపోయినప్పటికీ, పురుషను బలి అర్పించుట అను విషయము మాత్రం స్పష్టమవుతుంది. పురాతన వేదాల యొక్క వ్యాఖ్యానకర్తయైన శయనాచార్య ఇలా వ్యాఖ్యానించాడు:

“ఋషులు – సాధువులు మరియు దైవములు – బలి బాధితుడైన పురుషను బలి అర్పించు స్థానమునకు బలి పశువుగా బంధించి, తమ మనస్సుల ద్వారా ఆయనను బలి అర్పించారు” రిగ్ వేద పై శయనాచారి

వ్రాసిన వ్యాఖ్యానము 10.90.7

8-9 వచనములు “తస్మద్యజ్ఞసర్వహుతః…” అను మాటతో ఆరంభమవుతాయి, అనగా తనను బలి అర్పించినప్పుడు పురుష ఏమి దాచుకొనకుండా సమస్తమును అర్పించాడు. బలి అర్పించుటలో పురుష కలిగియుండిన ప్రేమను ఇది తెలియపరుస్తుంది. కేవలం ప్రేమ ద్వారానే మనము ఏమి దాచుకొనకుండా ఇతరులకు సమస్తమును ఇవ్వగలము. వేద పుస్తకములో (బైబిలు) యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) చెప్పినట్లు

“తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు”

యోహాను 15:13

సిలువ మీద బలిగా ఆయన స్వయేచ్చతో తనను తాను అర్పించుకున్నాడు కాబట్టి యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) ఈ మాటలను చెప్పాడు. పురుష బలికి మరియు యేసు సత్సంగ్ కు మధ్య అనుబంధము ఏమైనా ఉందా? పురుషసూక్తలోని 5వ వచనము (ఇప్పటి వరకు మనము దీనిని చూడలేదు) ఒక ఆధారమును ఇస్తుంది – కాని ఆ ఆధారము మర్మముగా ఉన్నది. 5వ వచనమును చూడండి

పురుషసూక్తలోని 5వ వచనము

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
దానిలో నుండి – పురుషలోని భాగములో నుండి – విశ్వము పుట్టింది మరియు అది పురుష యొక్క సింహాసనము చేయబడింది మరియు ఆయన సర్వాంతర్యామి అయ్యాడు తస్మాద్ విరలజయత విరాజో ఆది పురుషః స జతో అత్యరిచ్యత పశ్చాదబుమిమ్ అతో పురః

పురుష సూక్త ప్రకారం, పురుష సమయము యొక్క ఆరంభములో బలిగావించబడ్డాడు మరియు అది విశ్వము యొక్క సృష్టికి కారణమైయ్యింది. కాబట్టి ఈ బలి భూమి మీద చేయబడలేదు ఎందుకంటే ఈ బలిలో నుండే భూమి పుట్టింది. ఈ సృష్టి పురుష యొక్క బలిలో నుండి పుట్టింది అని 13వ వచనము స్పష్టముగా చూపుతుంది. అది ఇలా సెలవిస్తుంది

పురుషసూక్తలోని 13వ వచనము

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
చంద్రుడు ఆయన మనస్సులో నుండి పుట్టాడు. సూర్యుడు ఆయన కంటిలో నుండి వెలువడినాడు. మెరుపులు, వర్షం, మరియు అగ్ని ఆయన నోటి నుండి వచ్చాయి. ఆయన శ్వాసలో నుండి గాలి పుట్టింది. చంద్రమ మనసో జాతస్ కాక్సొహ్ సూర్యో అజాయత ముఖద్ ఇంద్ర శ్చ అగ్నిశ్చ ప్రనద్ వాయుర్ అజాయత

ఇదంతా స్పష్టమవుతుంది అని వేద పుస్తకము (బైబిలు) యొక్క లోతైన అవగాహనలో ఉన్నది. మీకా ఋషి (ప్రవక్త) యొక్క రచనలను చదివినప్పుడు దీనిని మనము చూస్తాము. ఆయన సుమారుగా క్రీ.పూ. 750లో జన్మించాడు మరియు యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) యొక్క రాకకు 750 సంవత్సరాల క్రితం అతడు జీవించినా, ఆయన జన్మించబోవు పట్టణమును గూర్చి సూచిస్తూ అతడు ఆయన రాకను ముందుగానే చూశాడు. అతడు ఇలా ప్రవచించాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా,
యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను
నాకొరకు ఇశ్రాయేలీయులను
ఏలబోవువాడు నీలోనుండి వచ్చును;
పురాతన కాలము మొదలుకొని
శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

మీకా 5:2

బేత్లెహేము నగరములో నుండి పాలకుడు (లేక క్రీస్తు) పుడతాడని మీకా ప్రవచించాడు.  750 సంవత్సరాలు తరువాత యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) దర్శనమును నెరవేర్చుతు బేత్లెహేములో జన్మించాడు. అయితే, ఈ రానున్న వాని యొక్క మూలములను గూర్చిన వర్ణన మీద మనము దృష్టిపెట్టాలి. మీకా భవిష్యద్ ఆగమనమును గూర్చి ప్రవచిస్తున్నాడు గాని, ఈ రానున్న వాని యొక్క మూలములు భూత కాలములో లోతుగా నాటబడియున్నవని చెబుతాడు. ఆయన “మూలములు పురాతనమైనవి.” ఈ రానున్న వాని యొక్క ఆరంభములు ఈ భూమి పుట్టకు మునుపునవి! ‘…ఈ పురాతనమైన’ అనునది ఎంతటి పురాతనమైనది? ఇది ‘నిత్యత్వ కాలమునకు’ సంబంధించినది. వేద పుస్తకములోని (బైబిలు) ఇతర సత్య జ్ఞాన మాటలు దీనిని మరింత స్పష్టము చేస్తాయి. కొలస్సయులకు 1:15లో పౌలు ఋషి (క్రీ.శ. 50వ సంవత్సరములో వ్రాశాడు) యేసును గూర్చి ఇలా ప్రకటించాడు:

ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

కొలస్సయులకు 1:15

యేసు ‘అదృశ్య దేవుని స్వరూపి’ అని మరియు ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు’ అని ప్రకటించబడ్డాడు. మరొక మాటలో, యేసు యొక్క నరావతారం చరిత్రలో ఖచ్చితమైన కాలములో జరిగినను (క్రీ.పూ. 4 – క్రీ.శ. 33), ఆయన సృష్టి అంతటికి ముందే ఉనికిలో ఉన్నాడు – నిత్యత్వము నుండి ఆయన ఉన్నాడు. ఆయన ఇలా ఎందుకు చేశాడంటే దేవుడు (ప్రజాపతి) ఎల్లప్పుడు నిత్యత్వము నుండి ఉన్నాడు, మరియు ఆయన ‘స్వరూపము’గా యేసు (యేసు సత్సంగ్) కూడా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాడు.

జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన బలి – సమస్త విషయములకు ఆరంభము

ఆయన కేవలం నిత్యత్వము నుండి ఉనికిలో మాత్రమే లేడుగాని, యోహాను ఋషి (ప్రవక్త) ఈ యేసును (యేసు సత్సంగ్) పరలోకమందు ఒక దర్శనములో చూసి ఇలా వర్ణించాడు

“…  జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల”

ప్రకటన 13:8

ఇది వైరుధ్యముగా ఉందా? యేసు (యేసు సత్సంగ్) క్రీ.శ. 33లో చంపబడలేదా? ఆయన చంపబడినట్లయితే, ఆయన ‘జగదుత్పత్తి మొదలుకొని’ ఎలా వధించబడ్డాడు? ఈ వైరుధ్యములోనే పురుషసూక్త మరియు వేద పుస్తకము ఒకే విషయమును వర్ణించుచున్నవని మనము చూస్తాము. పురుష యొక్క బలి ‘ఆరంభములో’ జరిగింది అని పురుషసూక్త చెబుతున్నట్లు మనము చూశాము. తాను వ్రాసిన వేదాలలో క్రీస్తు అను పుస్తకములో జోసెఫ్ పడింజరెకర, ఆరంభములో ఈ పురుష యొక్క బలి ‘దేవుని హృదయములో’ (సంస్కృతం పదమైన ‘మనసయాగం’ను అతడు ఈ అర్థము ఇచ్చునట్లు అనువదించాడు)   ఉన్నదని పురుషసూక్త యొక్క సంస్కృతం వ్యాఖ్యానం తెలియజేస్తున్నట్లు వ్రాశాడు. ఆరంభములో ఇవ్వబడిన ఈ బలి “మానసిక లేక చిహ్నాత్మకమైనది”* అని సంస్కృతం పండితుడైన ఎన్ జే షేండే చెబుతున్నట్లు అతడు సూచించాడు.

కాబట్టి పురుషసూక్త యొక్క మర్మము ఇప్పుడు స్పష్టమవుతుంది. పురుష నిత్యత్వము నుండే దేవుడైయున్నాడు మరియు దేవుని స్వరూపమైయున్నాడు. ఆయన సమస్తము కంటే ముందు ఉన్నాడు. ఆయన అందరిలో జ్యేష్ఠుడైయున్నాడు. మానవాళి యొక్క సృష్టి బలి యొక్క అవసరతను కోరుతుంది అని దేవుడు తన సర్వజ్ఞానములో ఎరిగియుండెను మరియు – దీని కొరకు ఆయన ఇవ్వదగినది అంతా అవసరమైయుండెను – మరియు పాపములను కడుగుటకు లేక శుద్ధిచేయుటకు బలిగా పురుష నరావతారములో రావలసియుండెను. ఈ సమయములో విశ్వమును మరియు మానవజాతిని సృష్టించాలా లేదా అను నిర్ణయమును దేవుడు తీసుకొనవలసియుండెను. ఆ నిర్ణయములో బలిగావించబడుటకు పురుష నిర్ణయించుకున్నాడు కాబట్టి సృష్టి కార్యము జరిగింది. కాబట్టి, మానసికముగా, లేక దేవుని యొక్క హృదయములో, వేద పుస్తకము ప్రకటించుచున్నట్లు పురుష ‘జగదుత్పత్తి మొదలుకొని వధింపబడెను.’

ఆ నిర్ణయము తీసుకొనబడిన తరువాత – కాలము ఆరంభమగుటకు ముందే – దేవుడు (ప్రజాపతి –  సర్వసృష్టికి ప్రభువు) కాలమును, విశ్వమును మరియు మానవాళిని సృష్టించాడు. ఈ విధంగా, పురుష యొక్క స్వచిత్త బలి ‘విశ్వము పుట్టుటకు’ (వ. 5), చంద్రుడు, సూర్యుడు మరియు వర్షము చేయబడుటకు (వ. 13) మరియు సమయం ఆరంభమగుటకు (6వ వచనములో ప్రస్తావించబడిన వసంతము, గ్రీష్మము మరియు శరద్ రుతువు) కారణమైయ్యింది. పురుష వీటన్నిటిలో జ్యేష్ఠుడైయున్నాడు.

పురుషను బలి అర్పించిన దైవములు ఎవరు?

కాని ఒక చిక్కు ఇంకా వీడలేదు. ‘దైవములు’ (దేవుళ్లు) పురుషను బలి అర్పించారని పురుషసూక్త 6వ వచనము చెబుతుంది. ఈ దైవములు ఎవరు? వేద పుస్తకం (బైబిలు) దీనిని వివరిస్తుంది. ఋషులలో ఒకరైన దావీదు క్రీ.పూ. 1000లో ఒక పవిత్రమైన కీర్తనను వ్రాశాడు, అది దేవుడు (ప్రజాపతి) స్త్రీ పురుషులను గూర్చి ఏ విధంగా మాట్లాడాడో బయలుపరుస్తుంది:

మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను

కీర్తనలు 82:6

ఋషియైన దావీదు వ్రాసిన ఈ పవిత్రమైన కీర్తనను 1000 సంవత్సరాల తరువాత యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) వ్యాఖ్యానిస్తూ ఇలా సెలవిచ్చాడు:

అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

యోహాను 10:34-36

దావీదు ఋషి ఉపయోగించిన ‘దైవములు’ అను పదమును నిజమైన లేఖనముగా యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) ఉద్ఘాటించాడు. ఇది ఏ విధంగా సాధ్యం? మనము ‘దేవుని స్వరూపములో చేయబడితిమి’ అని వేద పుస్తకములోని సృష్టి వృత్తాంతములలో మనము చూడవచ్చు (ఆదికాండము 1:27). మనము దేవుని స్వరూపములో చేయబడితిమి కాబట్టి ఒక విధముగా మనలను మనము ‘దైవములు’ అని పరిగణించుకోవచ్చు. కాని వేద పుస్తకము మరింత వివరణను ఇస్తుంది. అది ఇలా ప్రకటిస్తుంది, ఈ పురుష బలిని అంగీకరించువారు:

తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను

ఎఫెసీయులకు 1:4-5

పరిపూర్ణమైన బలిగా పురుషను అర్పించాలని సృష్టికి ముందు ప్రజాపతి-పురుష నిర్ణయించుకున్నప్పుడు, దేవుడు ప్రజలను కూడా ఎన్నుకున్నాడు. ఆయన వారిని ఎందు కోసము ఎన్నుకున్నాడు? ఆయన ‘కుమారులు’గా ఉండుటకు మనలను ఎన్నుకున్నాడు అని అది స్పష్టముగా చెబుతుంది.

మరొక మాటలో, ఈ బలి ద్వారా దేవుని పిల్లలగునట్లు పరిపూర్ణమైన బలిని అర్పించునట్లు తనను తాను సమర్పించుకొనుటకు దేవుడు నిర్ణయించుకున్నప్పుడు స్త్రీ పురుషులు ఎన్నుకొనబడ్డారని వేద పుస్తకము (బైబిలు) ప్రకటిస్తుంది. ఈ సంపూర్ణ భావనలో మనము ‘దైవములు’ అని పిలువబడతాము. ఇది ‘దేవుని వాక్యమును పొందుకున్నవారి విషయములో’  – ఆయన వాక్యమును అంగీకరించు వారి (యేసు సత్సంగ్ పైన ప్రకటించినట్లు) విషయములో నిజమైయున్నది. ఈ భావనలో భవిష్యత్ దేవుని కుమారుల యొక్క అవసరతలు పురుషను బలిగావించాయి. ‘నైవేద్యముగా పురుషను అర్పిస్తూ దైవములు బలిని అర్పించారు’ అని పురుషసూక్త యొక్క 6వ వచనము సెలవిస్తుంది. పురుష అర్పించిన బలి మనలను శుద్ధిచేస్తుంది.

పురుష యొక్క బలి – పరలోకమునకు మార్గము

దేవుని ప్రణాళిక బయలుపరచబడింది అని పురాతన పురుషసూక్త మరియు వేద పుస్తకము యొక్క జ్ఞానములో మనము చూడవచ్చు. ఇది అద్భుతమైన ప్రణాళిక – ఇది మన ఊహకు అందనిది. పురుషసూక్త 16వ వచనములో సెలవిచ్చుచున్నట్లు ఇది మనకు కూడా చాలా ప్రాముఖ్యమైయున్నది

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
దైవములు పురుషను బలిగా అర్పించారు. ఇది ప్రప్రథమముగా స్థాపించబడిన నియమము. దీని ద్వారా ఋషులు పరలోకమును పొందుతారు యజ్ఞేన యజ్ఞమజయంత దేవస్తని ధర్మాని ప్రథమన్యసన్ తెహ నాకం మహిమనః సచంత యాత్ర పూర్వే సద్యః శాంతిదేవః

ఋషి ఒక ‘జ్ఞాన’ పురుషుడు. పరలోకమును సంపాదించుటకు ప్రయాసపడుట నిజముగా జ్ఞానపూరితమైన విషయము. ఇది మనకు దూరముగా లేదు. ఇది అసాధ్యము కాదు. ఇది కఠినమైన క్రమశిక్షణ మరియు ధ్యానం ద్వారా మోక్షమును సాధించు అత్యంత పవిత్రమైన పురుషుల కొరకు మాత్రమే కాదు. ఇది గురువుల కొరకు మాత్రమే కాదు. భిన్నముగా, యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) యొక్క నరావతారము ద్వారా స్వయంగా పురుష అందించిన మార్గమిది.

పురుష యొక్క బలి – పరలోకమునకు మరొక మార్గము లేదు

వాస్తవానికి ఇది మన కొరకు సమకూర్చుబడుట మాత్రమేకాదు గాని శయనాచార్య వ్రాసిన సంస్కృతం వ్యాఖ్యానములో పురుషసూక్త యొక్క 15 మరియు 16 వచనముల మధ్య ఇలా వ్రాయబడియున్నది

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
ఈ విధంగా, దీనిని ఎరిగినవాడు మృత్యుంజయ స్థితికి చేరతాడు. దీనికి మరొక మార్గము లేదు తమేవ విద్వనమ్రత ఇహ భవతి నాన్యః పంత అయనయ వేద్యతే

నిత్య జీవమును (మృత్యుంజయ స్థితి) పొందుటకు మరొక మార్గము లేదు! ఈ విషయమును గూర్చి మరి ఎక్కువగా  అధ్యయనం చేయుట జ్ఞానయుక్తమే. పురుషసూక్తలో చెప్పబడిన కథను ప్రతిబింబించు దేవుని గూర్చిన, మానవాళిని గూర్చిన మరియు సత్యమును గూర్చిన కథను అది ఏ విధంగా వివరిస్తుందో తెలుపుటకు వేద పుస్తకములో (బైబిలు) పలు భాగములను మనము సమీక్షించాము. కాని ఈ కథను మనము వివరముగాను క్రమముగాను చూడలేదు. కాబట్టి, మాతో కలసి వేద పుస్తకమును చదవమని మిమ్మును ఆహ్వానించుచున్నాము, ఆరంభముతో మొదలుపెట్టి, సృష్టిని గూర్చి అధ్యయనం చేస్తూ, పురుష బలిని ఎందుకు అర్పించవలసివచ్చింది,  అర్పించుటకు కారణము ఏమిటి, మను కాలములో జలప్రళయం (వేద పుస్తకములో నోవహు) కలుగునట్లు లోకములో ఏమి జరిగింది, మరియు వారిని మరణము నుండి విడిపించి పరలోకములో నిత్య జీవమును అనుగ్రహించు పరిపూర్ణమైన బలిని గూర్చిన వాగ్దానమును ప్రపంచ దేశములు ఏ విధంగా నేర్చుకున్నాయో మరియు భద్రపరచాయో అధ్యయనం చెయ్యండి. ఇది నిజముగా అధ్యయనం చేయుటకు యోగ్యమైనది.

*(ఎన్ జే షేండే. ది పురుషసూక్త (ఆర్ వి 10-90) ఇన్ వేదిక్ లిటరేచర్ (పబ్లికేషన్స్ అఫ్ ది సెంటర్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్, యూనివర్సిటీ అఫ్ పూనా) 1965.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *