‘పురుష’ సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అని వివరించబడినట్లుగా పురుషసుక్తలో మనం మొదటి వచనంలో చూసాం. తరువాత పురుషను మనం యెషు సత్సంగ్ (యేసు క్రీస్తు) కాగలడా అనే ప్రశ్నను లేవనెత్తాం, ఈ ప్రశ్నను మనసులో ఉంచుకొని పురుషసుక్త ద్వారా మన ప్రయాణాన్ని ఆరంభించాం. కనుక మనం పురుషసుక్తలో రెండవవచనం వద్దకు వచ్చాం. ఈ రెండవ వచనం పురుష అనే వ్యక్తి గురించి అసాధారణమైన పదాలతో కూడిన వివరణ కొనసాగిస్తుంది. ఇక్కడ సంస్కృత అనువాదం, ఇంగ్లీషు అనువాదం ఇక్కడ ఉంది. (జోసెఫ్ పదినింజరెకర రాసిన క్రైస్ట్ ఇన్ ద ఎన్షిఎంట్ వేదాస్ పుస్తకం (346 పేజీ. 2007)).
పురుషసుక్త రెండవవచనం | |
ఇంగ్లీషు అనువాదం | సంస్కృత ప్రతిలేఖనం |
పురుష ఈ సర్వప్రపంచంలోని సమస్తమై యున్నాడు, సమస్తంగా ఉండబోతున్నాడు. నిత్యత్వానికి ఆయనే ప్రభువు. సర్వముకూ ఆహారం (సహజ పదార్ధం) లేకుండా సమకూరుస్తున్నాడు. | పురుషవేదంసర్వమ్యస్సభవ్యముతర్త్వయెసనోయదాన్నేనటిరోహతి |
పురుష లక్షణాలు
పురుష సర్వప్రపంచంలో అతీతుడు. (స్థలం, పదార్ధం అంతటిలో), కాలానికి ఆయనే ప్రభువు (ప్రభువుగా ఉన్నాడు, ప్రభువుగా ఉంటాడు), ‘నిత్యత్వానికి ఆయనే ప్రభువు’ – నిత్యజీవం. హైందవ పురాణంలో అనేక దేవుళ్ళు ఉన్నారు అయితే ఎవరికీ అటువంటి అనంత గుణలక్షణాలు లేవు.
ఈ గుణలక్షణాలు కేవలం ఏకైక నిజ దేవునికి మాత్రమే చెందియుండే భక్తిపూర్వకభయాన్ని ప్రేరేపించే దైవికగుణలక్షణాలు – ఆయన సర్వసృష్టికి ప్రభువు. ఈయన రుగ్.వేదలో ఉన్న ప్రజాపతి అయి ఉంటాడు (హెబ్రీ పాతనిబంధన యెహోవాతో పర్యాయపదం). ఈ విధంగా ఈ వ్యక్తి, పురుష, సమస్త సృష్టికి ప్రభువు – ఏకైక దేవుని మావవావతారంగా మాత్రమే మనం అర్థం చేసుకోగలం.
అయితే మనకు మరింత యుక్తమైన వాస్తవం – పురుష ఈ నిత్యత్వాన్ని మనకు ‘అనుగ్రహిస్తాడు’ (నిత్యజీవం). సహజ పదార్ధాన్ని వినియోగించడు. అంటే, నిత్యజీవం ఇవ్వడానికీ లేక అనుగ్రహించడానికీ సహజమైన పదార్ధం/శక్తిని ఆయన వినియోగించడు. మనం అందరం మరణ శాపం, కర్మ శాపం కింద ఉన్నాం. ఇది మన ఉనికి నిరర్థకత, దీనిలోనుండి మనం తప్పించుకోవాలని చూస్తున్నాం. దీనికోసం పూజలూ, స్నానాదులూ, ఇతర సన్యాససంబంధ అభ్యాసాలు చెయ్యడంలో చాలా కష్టపడుతున్నాం. ఏదైనా ఒక చిన్న అవకాశం ఉన్నా, అది వాస్తవమైనదిగా ఉన్నా, నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించడానికి శక్తినీ, అభిలాషనూ పురుష కలిగియున్నాడు, ఈ సమాచారాన్ని కనీసం తెలుసుకొని యుండడం జ్ఞానయుక్తమైనది.
వేద పుస్తకంలోని (బైబిలు) పురాతన చిత్రపటాలతో పోల్చబడింది
దీనిని మనసులో ఉంచుకొని మానవ చరిత్రలో అత్యంత పురాతన ప్రవిత్ర రచనలలో ఒకదానిని గురించి ఆలోచన చేద్దాం. హెబ్రీ నిబంధనలో దీనిని మనం చూడవచ్చు (బైబిలులో పాతనిబంధన లేక వేదపుస్తకం అని పిలుస్తాం). రుగ్.వేదం వలే ఈ గ్రంథం దివ్యవాక్కులు, కీర్తనలు, చరిత్ర, వివిధ ఋషుల ప్రవచనాల సంగ్రహం. ఈ ఋషులు చాలా కాలం క్రితం జీవించియున్నప్పటికీ చరిత్రలో వివిధ కాలాల్లో వారు నివసించారు, రచనలు చేసారు. అందుచేత పాతనిబంధన గ్రంధం ఒక సంగ్రహంగానూ లేక ప్రేరేపించబడిన వివిధ రచనల గ్రంధాలయంగా తలంచవచ్చు. ఈ ఋషుల రచనలలో అనేకం హెబ్రీలో ఉన్నాయి, ఈ ఋషులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఘనుడైన ఋషి అబ్రహాము సంతానం. అయితే వారు రాసిన ఒక గ్రంథం ఉంది, యోబు అను పితరుడు దీనిని రాశాడు, ఈయన అబ్రహాముకు ముందే జీవించాడు. ఆయన జీవించినప్పుడు ఏ హెబ్రీ దేశం లేదు. యోబును గురించి అధ్యయనం చేసినవారు క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల కాలంలో, 4000 సంవత్సరాల క్రితం జీవించియుండవచ్చుఅని అంచనా వేశారు.
….. యోబు గ్రంథంలో
యోబు అని ఆయన పేరుతో పిలువబడిన ఈ పవిత్ర గ్రంథంలో, తన స్నేహితులతో ఈ కింది మాటలు పలుకుతున్నాడు:
అయితే నా విమోచకుడు సజీవుడనియు,
తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదునేనే కన్నులార ఆయననుచూచెదను నాలో
నా అంతరింద్రియములు కృశించియున్నవి. (యోబు 19:25-27)
యోబు రాబోతున్న ‘విమోహకుని’ గురించి మాట్లాడుతున్నాడు. యోబు భవిష్యత్తులోనికి చూస్తున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే విమోచకుడు భూమిమీదకు రాబోతున్నాడు (భవిష్యత్తు కాలం). అయితే ఈ విమోచకుడు ఇంకా ప్రస్తుతకాలంలో ‘జీవిస్తున్నాడు.’ – భూమి మీద కాదు. కనుక పురుషసుక్తలో ఈ వచనంలోని పురుష వలే ఈ విమోచాకుడు కాలానికి ప్రభువు, ఎందుకంటే ఆయన ఉనికి మనకున్నట్టుగా కాలానికి పరిమితం కాలేదు.
తరువాత యోబు ‘నా చర్మము చీకిపోయిన తరువాత’ (అంటే తన మరణం తరువాత) నేను ఆయనను చూచెదను అని చెపుతున్నాడు. యోబు ఆయనను (ఈ విమోచకుని) చూస్తాడు, అదే సమయంలో ‘దేవుణ్ణి చూస్తాడు.’ మరొకమాటలో చెప్పాలంటే రాబోతున్న ఈ విమోచకుడు ప్రజాపతి మానవావతారం, పురుష వలే దేవుని మానవావతారం. అయితే యోబు తన మరణం తరువాత ఆయనను ఏవిధంగా చూస్తాడు? యోబు చెపుతున్న ‘మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను’ అని చెపుతున్న మాటను మనం శ్రద్ధగా గమనించాలి. భూమి మీద నిలుచుచున్న ఈ విమోచకుడను యోబు చూస్తాడు అని చెపుతున్నాడు. విమోచకుడు యోబుకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు, దేవుడైన ఈ విమోచకుడు భూమిమీద నడుస్తున్నప్పుడు, యోబు ఆయన కోసం ఎదురుచూస్తున్నాడు, యోబు తన సొంత కళ్ళతో విమోచకుడిని చూచేందుకు తాను కూడా భూమి నడిచేలా ఆయనకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు. ఈ నిరీక్షణ యోబును ఆకర్షించింది, ఆ దినం చూడడం కోసం అతని ‘హృదయం అంతరంగంలో కోరుకొంటుంది.’ యోబును మార్చిన మంత్ర ఇదే.
…… యెషయా
హెబ్రీ ఋషి కూడా రాబోతున్న మానవుని గురించి మాట్లాడుతున్నాడు, ఈ మాటలు రాబోతున్న పురుష ను గురించిన వివరణలానూ, యోబులో చెప్పిన విమోచకుని గురించిన వివరణలానూ ఉంది. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల మధ్య యెషయ అనే ప్రవక్త ఉన్నాడు. దైవిక ప్రేరణ క్రింద ఆయన అనేక దైవవాక్కులు రాశాడు. రానున్న మనుష్యకుమారుని గురించి యెషయా ఇలా రాశాడు:
1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును. 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:1-2,6)
మరొక మాటలో చెప్పాలంటే, ఋషి యెషయా కుమారుని జననం గురించి ముందుగా చూస్తున్నాడు, ముందుగా ప్రకటిస్తున్నాడు, ఆయన ‘బలవంతుడైన దేవుడు అని పిలువబడును.’ ఈ వార్త ప్రత్యేకించి ‘మరణచ్చాయగల దేశనివాసుల’కు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని అర్థం ఏమిటి? రాబోతున్న మరణాన్నీ, మనల్ని పాలిస్తున్న కర్మనూ మనం తప్పించుకోలేమని తెలిసిన జీవితాలలో మనం జీవిస్తున్నాము. అందుచేత మనం అక్షరాలా ‘మరణచ్చాయలో’ జీవిస్తున్నాము. అందుచేత రాబోతున్న మనుష్యకుమారు ‘బలవంతుడైన దేవుడు’ గా పిలువబడతాడు, గొప్ప వెలుగు అవుతాడు లేక రాబోతున్న మన మరణ చ్చాయలో జీవిస్తున్న మనకు నిరీక్షణ అవుతాడు.
… మీకా
మరొక ఋషి, మీకా కూడా యెషయ జీవించిన కాలంలోనే జీవించాడు. (క్రీస్తు పూర్వం 750) రాబోతున్న మనుష్యకుమారుని గురించిన దైవవాక్కులను మీకా కూడా పలికాడు:
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. (మీకా 5:2)
ఎఫ్రాతా ప్రాంతంలోని బెత్లెహెం పట్టణం నుండి మనుష్యకుమారుడు వస్తాడని మీకా చెప్పాడు. అక్కడ యూదా వంశం (యూదులు) నివసించింది. చరిత్రలో ఒక నిర్దిష్ట సమయంలో ఈ మానవుడు “రాబోతున్నాడు” అనేది అత్యంత విశిష్టమైన అంశం, కాలం ఆరంభంనుండి ఆయన ఉనికి కలిగియున్నాడు. పురుషసుక్త లోని వచన 2 వ వచనం చెపుతున్న ప్రకారం, యోబు గ్రంథంలో రాబోతున్న విమోచకుని గురించి చెపుతున్న ప్రకారం, ఈ మనుష్యకుమారుడు మనకు వలే కాలానికి పరిమితుడుగా ఉండడు. ఆయన కాలానికి ప్రభువు. ఇది దైవిక సామర్ధ్యం. మానవ సంబంధమైనది కాదు. ఆ విధంగా వారందరూ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు.
యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు)లో నెరవేరింది
అయితే ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ మీకా ఒక చారిత్రాత్మక సూచన ఇస్తున్నాడు. రాబోతున్న వ్యక్తి బెత్లెహెం నుండి రాబోతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఇశ్రాయేలు/వెస్ట్ బాంక్ అని పిలువబడే బెత్లెహెం అనే పట్టణం వేలాది సంవత్సరాల క్రితం ఉనికిలో ఉంది. మీరు దీని సమాచారాన్ని గూగుల్ లో చూడవచ్చు. దాని రూపు రేఖల్ని చూడవచ్చు. ఇది పెద్ద పట్టణం కాదు, పెద్ద పట్టణంగా ఎప్పుడూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖమైంది, ప్రతీ సంవత్సరం ప్రపంచ వార్తల్లో ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇది ప్రభువైన యేసు క్రీస్తు (లేక యెషుసత్సంగ్) జనన స్థలం. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ జన్మించాడు. ఆయన గలిలయ ప్రాతాన్ని ప్రభావితం చేస్తాడని యెషయ మరొక సూచన ఇచ్చాడు. యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు) బెత్లెహెంలో (మీకా ముందుగా చూచిన విధంగా) జన్మించినప్పటికీ, యెషయా ముందుగా చెప్పినట్టు ఆయన గలిలయ ప్రాంతంలో పెరిగాడు, బోధకుడిగా పరిచర్య చేసాడు. బెత్లెహెం ఆయన జన్మస్థానం, గలిలయ ఆయన పరిచర్య స్థానం, ఇవి రెండూ యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు) జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలాలు. కనుక యేసుక్రీస్తు ( యెషుసత్సంగ్) లో వివిధ ఋషులు ముందుగా పలికిన దైవవాక్కులు నెరవేరాయి. ఈ పురుష/విమోచాకుడు/పాలకుడుగా చెప్పబడిన వాడు యెషుగా ముందుగా చూడబడినవాడుగా ఉన్నవాడేనా? ఈ ప్రశ్నకు జవాబు ‘మరణచ్చాయ’ (కర్మ) లో మనం ఏవిధంగా జీవిస్తున్న మనకు ఏవిధంగా నిత్యజీవం అనుగ్రహించబడుతుందో (given ‘immortality) మనకు స్పష్టపరుస్తుంది. దీనిని గురించి ఆలోచించడం ఖచ్చితంగా యోగ్యమైన సమయమే. అందుచేత పురుషసుక్త ద్వారా మరింత అధ్యయనం కొనసాగిద్దాం. వాటిని హెబ్రీ వేద పుస్తకంలోని ఋషులతో సరిపోల్చుదాం.