ఆదినుండే – మోక్షమును గూర్చిన వాగ్దానం

  • by

తాము ఆదియందు సృష్టించబడిన స్థితి నుండి మానవజాతి పతనమైన విధానమును మనము చూశాము. అయితే దేవుడు ఆది నుండి కలిగియుండిన ప్రణాళికతో బైబిలు (వేద పుస్తకము) కొనసాగుతుంది. ఈ ప్రణాళిక అప్పుడు ఇవ్వబడిన వాగ్దానము మీద కేంద్రీకృతమైయున్నది మరియు ఇదే ప్రణాళిక పురుషసూక్తలో కూడా కనబడుతుంది.

బైబిలు – నిజముగా ఒక గ్రంథాలయము

ఈ వాగ్దానము యొక్క ప్రాముఖ్యతను ప్రశంసించుటకు బైబిలును గూర్చిన కొన్ని మౌలిక వాస్తవాలను మనము తెలుసుకోవాలి. ఇది ఒక పుస్తకమైనను, దీనిని గూర్చి మనము ఒక పుస్తకముగా ఆలోచిస్తున్నను, ఇది ఒక సంచార గ్రంథాలయమని ఆలోచించుట యుక్తముగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పుస్తకముల సంగ్రహముగా ఉంది, దీనిని 1500 సంవత్సరముల కాల వ్యవధిలో అనేక రకముల రచయితలు వ్రాశారు. నేడు ఈ పుస్తకములన్నీ ఒక సంపుటిగా ఐక్యపరచబడినవి – అదే బైబిలు. ఈ వాస్తవము ఒక్కటే బైబిలును లోకములోని గొప్ప పుస్తకములలో ఋగ్వేదము వలె విశేషమైనదిగా చేస్తుంది. భిన్నమైన రచయితలు కలిగియుండుటతో పాటుగా, బైబిలులోని వేర్వేరు పుస్తకములు చేయు కథనములను, ప్రకటనలను, మరియు ప్రవచనములను తరువాత రచయితలు అనుసరిస్తారు. ఒకవేళ బైబిలును ఒకే రచయిత, లేక ఒకరికొకరికి పరిచయం ఉన్న పలువురు రచయితలు వ్రాసియుంటే, ఇది అంత ప్రాముఖ్యమైన విషయమయ్యేది కాదు. కాని బైబిలు రచయితల మధ్య కొన్ని వందల, కొన్ని వేల సంవత్సరముల వ్యవధి ఉంది, వారు భిన్నమైన నాగరికతలలో, భాషలలో, సామాజిక వర్గీకరణలలో, మరియు సాహిత్య విధానములలో వ్రాశారు – అయినను వారి సందేశములను మరియు ప్రవచనములను తరువాత రచయితలు అభివృద్ధి చేశారు లేక బైబిలేతర సాహిత్యములలోని చారిత్రిక సత్యములు ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. ఇది బైబిలును మరింత ప్రత్యేకమైన పుస్తకముగా చేస్తుంది – మరయు దాని సందేశమును అర్థము చేసుకొనుటకు ఈ విషయము మనలను పురికొల్పాలి. పాత నిబంధన పుస్తకములకు (యేసుకు ముందు కాలమునాటి పుస్తకములు) ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతులు సుమారుగా క్రీ.పూ. 200 నాటివి కాబట్టి బైబిలుకు ఉన్న సాహిత్య ఆధారము ప్రపంచములోని పురాతన పుస్తకములన్నిటి కంటే శ్రేష్టమైనది.

తోటలో మోక్షమును గూర్చిన వాగ్దానము

సృష్టి మరియు పతనమును గూర్చిన వృత్తాంతములోని తదుపరి సన్నివేశములను “తేరి చూచుట” ద్వారా బైబిలులోని ఆదికాండము గ్రంథము యొక్క ఆరంభములోనే మోక్షమును గూర్చి మనము చూస్తాము. మరొకమాటలో, ఇది ఆరంభమును జ్ఞాపకము చేసుకొనుచున్నప్పటికీ, అంతమును దృష్టిలో ఉంచుకొని ఇది వ్రాయబడింది. దేవుడు తన విరోధియైన సాతనును, సర్పము రూపములో ఉన్న దుష్టత్వమును ఎదుర్కొన్నప్పుడు ఆయన చేసిన వాగ్దానమును ఇక్కడ మనము చూస్తాము. సాతానుడు మానవ పతనమును కలిగించిన వెంటనే దేవుడు వానితో ఒక పొడుపుకథ రూపములో మాట్లాడతాడు:

“… మరియు (దేవుడు) నీకును (సాతానుకును) స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.”

ఆది. 3:15

దీనిలో ఐదు వేవ్వేరు పాత్రలు ఉన్నాయని మరియు ఇది భవిష్యత్తును గూర్చి తెలుపు వాగ్దానముగా ఉన్నదని (భవిష్యత్తు కాలములో ఇవ్వబడిన పునరావృతమైన పదములలో ఇది కనబడుతుంది) దీనిని జాగ్రత్తగా చదువుట ద్వారా మీరు కనుగొంటారు. దీనిలోని పాత్రలు ఎవరనగా:

  1. దేవుడు/ప్రజాపతి
  2. సాతాను/సర్పము
  3. స్త్రీ
  4. స్త్రీ సంతానము
  5. సాతాను సంతానము

ఈ పాత్రలు భవిష్యత్తులో ఒకరితో ఒకరు ఏ విధంగా సంబంధం కలిగియుంటారో ఈ పొడుపుకథ తెలియజేస్తుంది. అది ఈ క్రింద ఇవ్వబడినది


ఆదికాండములోని వాగ్దానములో ఉన్న పాత్రలకు మధ్య సంబంధములు

సాతానుకు మరియు స్త్రీకి ‘సంతానము’ కలుగుతుంది అని దేవుడు నిర్ణయించాడు. ఈ సంతానములకు మధ్య మరియు స్త్రీకి సాతానుకు మధ్య ‘వైరము’ లేక ద్వేషము ఉంటుంది. సాతాను స్త్రీ సంతానము యొక్క ‘మడిమె మీద కొడతాడు’ మరియు స్త్రీ సంతానము సాతాను యొక్క ‘తలను చితకద్రొక్కుతాడు.’

సంతానమును గూర్చి కొన్ని ఆలోచనలు – ‘ఆయన’

ఇప్పటి వరకు మనము వాక్యభాగములో ఉన్న విషయములను సూటిగా చూశాము. ఇప్పుడు కొన్ని తార్కిక ఆలోచనలను చూద్దాము. స్త్రీ యొక్క ‘సంతానము ‘ఆయన’ మరియు ‘అతని’ అని సంబోధించబడెను కాబట్టి, అది ఒక పురుష మాత్రుడు అని మనకు తెలుస్తుంది – ఒక పురుషుడు. దీనిలో నుండి మనము కొన్ని వ్యాఖ్యలను చేయవచ్చు. ఈ సంతానము ‘ఆయన’ కాబట్టి ‘ఆమె’ కాలేదు మరియు ఈ విధంగా స్త్రీ మాత్రము కాదు. ‘ఆయన’గా ఈ సంతానము ‘వారు’ కాదు, అనగా ఆయన ఒక ప్రజల గుంపు, లేక ఒక జాతి, లేక ఒక బృందము, లేక ఒక దేశము కాదు. అనేక సమయాలలో అనేక విధాలుగా ‘వారు’ జవాబు కావచ్చని ప్రజలు అనుకున్నారు. కాని సంతానము, ‘ఆయన’ అయ్యుండి ఒక దేశమును లేక హిందువులు, భౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు, లేక ఒక జాతిని సంబోధించు ఒక ప్రజల గుంపుగా లేడు. ‘ఆయన’గా సంతానము ‘అది’ (సంతానము ఒక వ్యక్తి) అయ్యుండలేదు. ఇది సంతానము ఒక తర్కం, బోధ, సాంకేతిక విజ్ఞానము, రాజకీయ వ్యవస్థ, లేక మతము అనే సాధ్యతను తొలగిస్తుంది. ఈ ‘అది’ వంటి రకములేనే లోకమును బాగుచేయుటకు మనము ఉపయోగించాము మరియు ఉపయోగిస్తున్నాము. మన పరిస్థితిని సరిచేయగలది ఈ ‘అది’ లాంటిదే అని మనము ఆలోచిస్తాము, కాబట్టి శతాబ్దముల తరబడి ఉత్తమమైన మానవ పండితులు వేర్వేరు రాజకీయ వ్యవస్థలు, విద్యా వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానములు, మతములు మొదలగువాటిని ప్రతిపాదించారు. కాని ఈ వాగ్దానము మాత్రమే వేరొక దిశను చూపుతుంది. దేవుని మనస్సులో మరొక విషయము ఉన్నది – ‘ఆయన.’ మరియు ఆ ‘ఆయన’ సర్పము యొక్క తలను కొడతాడు.

అంతేగాక, ఇక్కడ చెప్పని విషయమును గుర్తించుట ఆసక్తికరముగా ఉంటుంది. దేవుడు స్త్రీకి సంతానమును వాగ్దానము చేసినల్టు పురుషునికి సంతానమును వాగ్దానము చేయలేదు. బైబిలు అంతటిలో మరియు ప్రాచీన లోకములో కుమారులు తండ్రుల వరుస నుండి వచ్చుటను గూర్చి ఉద్ఘాటించబడినది కాబట్టి ఇది ఒక అసాధారణమైన విషయము. కాని ఈ సందర్భములో పురుషుని నుండి ఒక సంతానము (‘ఆయన’) వచ్చుటను గూర్చి వాగ్దానము చేయబడలేదు. పురుషుని గూర్చి ప్రస్తావించకుండా స్త్రీ నుండి ఒక సంతానము కలుగుతుంది అని మాత్రమే ఇది చెబుతుంది.

ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న మానవులందరిలో, చారిత్రికముగా కావచ్చు లేక పౌరాణికముగా కావచ్చు, తల్లిని కలిగియుండి భౌతిక తండ్రి కలిగియుండనివానిగా ఒక్కడే ఉన్నాడు. ఆయనే యేసు (యేసు సత్సంగ్) మరియు ఆయన కన్య గర్భమందు జన్మించాడని క్రొత్త నిబంధన (వాగ్దానము ఇవ్వబడిన కొన్ని వేల సంవత్సరముల తరువాత వ్రాయబడింది) ప్రకటిస్తుంది – ఈ విధంగా ఆయనకు తల్లేగాని మానవ తండ్రి లేడు. ఈ పొడుపుకథలో ఆది నుండే యేసు ఒక ఛాయాగా ఉన్నాడా? సంతానము ‘ఆమె,’ ‘వారు,’ లేక ‘అది’ కాక ‘ఆయన’ అయ్యున్నాడు అను పరిశీలనలో ఇది చక్కగా అమర్చబడుతుంది. ఈ దృష్టికోణములో, పొడుపుకథ యొక్క కొన్ని భాగములు స్పష్టమవుతాయి.

‘వాని మడిమె మీద కొట్టుదువు’??

సాతాను/సర్పము ‘వాని మడిమె’ మీద కొట్టును అను మాటకు అర్థము ఏమిటి? ఆఫ్రికాలోని అడవులలో పని చేయక ముందు ఇది నాకు అర్థము కాలేదు. భయంకరమైన వేడిమిలో కూడా మేము రబ్బరు బూట్లు వేసుకోవలసి వచ్చేది – ఎందుకంటే అక్కడ సర్పములు పొడవాటి గడ్డిలో దాగుకొని మీ కాలును – అనగా మీ మడిమెను – కొట్టి మిమ్మును చంపుతాయి. అక్కడ నేను గడిపిన రోజునే నేను ఒక సర్పమును త్రొక్కే వాడిని మరియు మరణించేవాడిని కూడా. ఆ తరువాత ఈ పొడుపు కథ నాకు అర్థమయ్యింది. ‘ఆయన’ సర్పమును నాశనం చేస్తాడు (‘నీ తలను కొట్టును’), కాని దానికి వెలగా అతడు మరణించవలసియుంటుంది (‘వాని మడిమెను కొట్టును’). ఇది యేసు అర్పించిన బలి ద్వారా సాధించబడిన విజయమునకు ఛాయగా ఉన్నది.

సర్పము యొక్క సంతానము?

కాని ఆయనకు వేరొక విరోధి, అనగా ఈ సాతాను సంతానము ఎవరు? దీనిని గూర్చి స్పష్టముగా తెలుసుకొనుటకు ఇక్కడ అవకాశము లేనప్పటికీ, తరువాత పుస్తకములు రానున్న వ్యక్తిని గూర్చి మాట్లాడతాయి. ఈ వర్ణనను వినండి:

ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, … మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.  ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి. (2 థెస్స. 2:1-4; సూ. క్రీ.శ. 50లో గ్రీసులో పౌలు ద్వారా వ్రాయబడింది)

ఈ తరువాత పుస్తకములు స్పష్టముగా స్త్రీ సంతానము మరియు సర్పము యొక్క సంతానముకు మధ్య జరగబోవు యుద్దమును గూర్చి మాట్లాడతాయి. కాని ఇది మానవ చరిత్ర యొక్క ఆరంభములోనే ఆదికాండములోని ఈ వాగ్దానములో పిండము రూపములో ప్రస్తావించబడింది. దీని వివరాలు తరువాత ఇవ్వబడినవి. కాబట్టి చరిత్ర యొక్క ముగింపు, సాతాను మరియు దేవునికి మధ్య జరగబోవు అంతిమ యుద్దమును గూర్చి మొదటి పుస్తకములోనే ప్రస్తావించబడింది.

ఇంతకు ముందు పురాతన కీర్తనయైన పురుషసూక్తను మనము చూశాము. ఈ కీర్తన పరిపూర్ణమైన పురుషుని – పురుష – యొక్క రాకను గూర్చి ప్రవచించింది అని మరియు ఆ పురుషుడు ‘మానవ శక్తితో’ రాడని మనము చూశాము. ఈ పురుషుడు కూడా బలిగావించబడతాడు. వాస్తవానికి ఇది దేవుని యొక్క మనస్సులో మరియు హృదయములో ఆది నుండి నిర్ణయించబడింది అని మరియు నిర్థారించబడింది అని మనము చూశాము. ఈ రెండు పుస్తకములు ఒకే వ్యక్తిని గూర్చి మాట్లాడుతున్నాయా? అవును అని నేను నమ్ముతాను. పురుషసూక్త మరియు ఆదికాండములోని వాగ్దానము రెండూ ఒకే సన్నివేశమును జ్ఞాపకము చేసుకొనుచున్నాయి – తాను బలిగావించబడుటకు మనుష్యునిగా నరావతారము దాల్చుతానని దేవుడు నిర్ణయించుకున్న సన్నివేశమును – ఇది మత భేదము లేకుండా మానవులందరి యొక్క సార్వత్రిక అవసరత అయ్యున్నది. కాని ఈ ఒక్క వాగ్దానము మాత్రమే ఋగ్వేదము మరియు బైబిలులో పోలిక కలిగినదిగా లేదు. ఇవి మానవ చరిత్రలో మొదటిగా నమోదు చేయబడినవి కాబట్టి, తదుపరి నమోదు చేయబడిన ఇతర సన్నివేశములను మనము తదుపరి చూడబోతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *