Skip to content

కుంభమేళ పండుగ: పాపం గురించిన చెడువార్తనూ, మనం శుద్ధికావడం అవసరతనూ చూపించడం

  • by

మానవచరిత్రలో అత్యంత పెద్ద కలయిక భారత దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. తత్తరపడేలా 100 మిలియనుల (10 కోట్లు) ప్రజలు గంగా నదీ తీరాన్న ఉన్న అలహాబాదు నగరానికి 55 రోజుల కుంభమేళ పండుగ కాలానికి చేరతారు. ఈ పండుగ ఆరంభదినానికి గంగా నదిలో 10 మిలియనుల (ఒక కోటి) మంది స్నానం ఆచరిస్తారు.

కుంభమేళ పండుగలో గంగానదీ తీరాన్న భక్తులు

కుంభమేళలో ముఖ్యదినాలలో దాదాపు 20 మిలియనుల (రెండు కోట్లు) భక్తులు స్నానాలు చేస్తారని నిర్వాహకులు ఎదురుచూస్తారు. ఎన్.డి.టి.వి (NDTV) ప్రకారం మక్కాకు సావంత్సరిక తీర్ధయాత్రలకు వెళ్ళే ముస్లిముల సంఖ్య – సంవత్సారానికి 3 నుండి 4 మిలియనులు – దీనికి చాలా తక్కువ.

నేను అలహాబాదుకు వెళ్ళాను, ఎటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు అన్నీ లేకుండా అనేక లక్షలమంది ఒక్కసారే అక్కడ ఎలా ఉండగల్గారు అనేదానిని నేను ఊహించలేదు. ఎందుకంటే ఆ నగరం పెద్దదేమీ కాదు. గత పండుగలో ఈ ప్రజలందరి దైనందిన అవసరాలు తీర్చడానికి స్నానాల గదులనూ, వైద్యులనూ సమకూర్చడంలో చాలా పెద్ద ప్రయత్నాలు జరిగాయని  బి.బి.సి (BBC) నివేదించింది.  

పదికోట్లమంది ప్రజలు గంగా నదిలో స్నానం చెయ్యడానికి దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యడం ఎందుకు? నేపాల్ దేశం నుండి ఒక భక్తుడు బి.బి.సి (BBC) కు ఈ విధంగా నివేదించాడు:

“నేను నా పాపాలను కడిగివేసుకొన్నాను.”

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రూటర్స్ (Reuters) ఇలా చేపుతుంది:

“నేను ఈ జీవితంనుండీ, గత జీవితంనుండీ నా పాపాలన్నిటిని నేను కడిగి వేసుకొన్నాను.”  చలిలో దిగంబరంగా సంచారం చేస్తున్న ఒక సన్యాసి, 77 సంవత్సరాల స్వామీ శంకరానంద సరస్వతి చెప్పాడు.

ఎన్.డి.టి.వి (NDTV) ఇలా చెపుతుంది:

పవిత్ర జలాలలో మునగడం వారి పాపాలనుండి వారిని శుద్ధి చేస్తుందని ఆరాధకులు విశ్వసిస్తారు.

గత పండుగలో తీర్థయాత్రికుడు మోహన్ శర్మను బి.బి.సి. ప్రశ్నించినప్పుడు “మనం చేసిన పాపాలు ఇక్కడ శుద్ధిఅయ్యాయి” అని సమాధానం ఇచ్చాడు.

‘పాపం’ విషయంలో సార్వత్రిక మానవుల భావన

మరొక మాటలో చెప్పాలంటే కోట్లాదిమంది ప్రజలు తమ పాపాలు ‘శుద్ధి కావడానికి’ డబ్బును వెచ్చిస్తారు, కిక్కిరిసిన రైలు బండ్లలో ప్రయాణాలు చేస్తారు, ఇరుకైన పరిస్థితులకు ఓర్చుకోవడం, గంగా నదిలో స్నానం చేస్తారు. భక్తులు చేస్తున్న ఈ కార్యకలాపాలను చూడడానికి ముందు వారు తమ జీవితాలలో గుర్తిస్తున్న సమస్యను గురించి ఆలోచన చేద్దాం – అది ‘పాపం.”

శ్రీ సత్య సాయి బాబా, ‘మంచి,’ ‘చెడు’

శ్రీ సత్య సాయి బాబా ఒక హైందవ ఉపదేశకుడు, ఈయన రచనలను నేను చదివాను. ఈయన బోధలు అభినందణీయమైనవిగా గుర్తించాను. ఆయన బోధలను నేను ఈ క్రింద సంక్షిప్తపరచాను. మీరు వీటిని చదివేటప్పుడు, “ఈ మంచి ధర్మసూత్రాలను అనుసరించగలమా? వాటి ద్వారా జీవించవచ్చా?

“ధర్మ అంటే ఏమిటి (మన నైతిక భాద్యత)? నీవు బోధిస్తున్నదానిని అభ్యాసం చెయ్యడం, ఇది జరుగవలసి ఉంది అని నీవు చెపుతున్నదానిని నీవు చెయ్యడం. ధర్మసూత్రాలను పాటించడం, వాటిని క్రమంగా అభ్యాసంలో ఉంచడం. ధర్మంగా సంపాదించడం, సద్భక్తిగా కాంక్షించడం, దేవుని భయంలో జీవించడం, దేవుణ్ణి చేరడం కోసం జీవించడం: ఇదే ‘ధర్మ.’ సత్యసాయి స్పీక్స్ 4, పేజీ 339.

“ఖచ్చితంగా నీ ధర్మం ఏమిటి?……

  • మొదట మీ తల్లిదండ్రులను ప్రేమతోనూ, గౌరవంతోనూ, కృతజ్ఞతతోనూ సంరక్షించండి.
  • రెండవది, సత్యాన్ని పలకండి, ధర్మంగా ప్రవర్తించండి.
  • మూడవది, కొన్ని క్షణాలు దొరికిన ప్రతీసారి నీ మనసులో ప్రభువు పేరును ఒక రూపంతో పునరుచ్చరణ చెయ్యండి.
  • నాలుగవది, ఇతరులను గురించి తప్పుగా మాట్లాడడంలో లేక ఇతరులలో లోపాలు వెదకడంలో జోక్యం చేసుకోకండి.
  • చివరిగా, ఏ రూపంలోనూ ఇతరులకు హాని జలిగించకండి.“ సత్యసాయి స్పీక్స్ 4. పేజీలు 348-349.

“ఎవరైతే తన అహంభావాన్ని అణచివేసుకొంటారో, వారు తమ స్వార్ధపూరిత కోరికలను జయిస్తారు, తనలోని పశుసంబంధ అనుభూతులనూ, ప్రేరేపణలనూ నాశనం చేసుకొంటారు, శరీరాన్ని తన స్వీయంగా భావించే సహజ ధోరణిని విడిచిపెడతారు, అటువంటి వారు ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉన్నారు.” ధర్మ వాహిని, పేజీ .4 .

ఈ మాటలను నేను చదువుతున్నప్పుడు, నేను ఆచరణలో నడువవలసిన ధర్మ సూత్రాలుగా వీటిని నేను కనుగొన్నాను – సులభమైన కర్తవ్యం. మీరు అంగీకరిస్తారా? అయితే వీటి ప్రకారం మీరు జీవిస్తున్నారా?  నీవు, (నేనూ) దీనిని కొలిచావా? ఇటువంటి మంచి బోధను సరిగా కొలవలేకపోయినా, వాటిని చెయ్యడంలో వైఫల్యం చెందినా ఏమి జరుగుతుంది? శ్రీ సత్యసాయి బాబా ఈ ప్రశ్నకు ఈ క్రింది విధానంలో జవాబిస్తున్నారు:

“సాధారణంగా, నేను సౌమ్యంగా మాట్లాడుతాను. అయితే ఈ క్రమశిక్షణ అంశం మీద, నాకు ఎటువంటి మినహాయింపు లభించదు, ఖచ్చితమైన విధేయతను నొక్కి చెపుతాను.  నీ స్థాయికి తగినట్టుగా దాని తీక్ష్ణతను తగ్గించను.” సత్యసాయి స్పీక్స్ 2, పేజీ. 186.

కావలసిన ఆవస్యకతలను పాటించగల్గినట్లయితే ఆ తీక్ష్ణత సరిపోతుంది. అయితే తగిన ఆవస్యకతలు పాటించకపోతే ఏమి జరుగుతుంది? ఇక్కడ నుండే ‘పాపం’ అనే అంశం ప్రస్తావనకు వస్తుంది. నైతిక లక్ష్యాన్ని మనం తప్పిపోయినప్పుడు లేక నేను చెయ్యవలసిన దానిని చెయ్యడంలో వైఫల్యం చెందినప్పుడు నేను ‘పాపం’ చేస్తున్నాను, నేను పాపిని. పాపి అని పిలువబడడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. మనల్ని అసౌకర్యానికీ, దోషారోపణకూ గురి చేస్తుంది. వాస్తవానికి ఈ తలంపులన్నిటినీ క్షమించడంలో ప్రయత్నించడానికి మనం అధికమైన మానసిక, భావోద్రేక శక్తిని వెచ్చిస్తాం. బహుశా మనం శ్రీ సత్య సాయి బాబా కంటే ఇతర ఉపదేశకుల వైపు చూడగలం. అయితే వారు ‘మంచి’  ఉపదేశకులు అయినట్లయితే వారి నైతిక ధర్మసూత్రాలూ ఒకేలా ఉంటాయి – వాటిని అభ్యాసంలో పెట్టడం అదే స్థాయిలో కష్టంగా ఉంటాయి.

మనం అందరం యెటువంటి మతంలో ఉన్నప్పటికీ, యెటువంటి విద్యా స్థాయిలో ఉన్నప్పటికీ ఇటువంటి పాప భావనను కలిగియున్నామని బైబిలు గ్రంథం (వేద పుస్తకం) చెపుతుంది. ఎందుకంటే ఈ పాప భావన మన మనస్సాక్షి నుండి వస్తుంది. వేద పుస్తకం ఈ విధంగా వ్యక్తపరుస్తుంది:

నిజానికి ధర్మశాస్త్రం (బైబిలులో పది ఆజ్ఞలు) లేని అన్యజనులు (అంటే యూదేతరులు) ధర్మశాస్త్రానికి కావలసిన కార్యాలను స్వభావసిద్ధంగా చేస్తారు. వారికి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వారు తమకు తాము ధర్మశాస్త్రంగా ఉంటారు. ధర్మశాస్త్ర సంబంధ ఆవశ్యకతలు తమ హృదయాలమీద రాయబడినట్టు కనపరచుకొంటారు. వారి మనస్సాక్షి కూడా సాక్ష్యాన్ని కలిగియుంటుంది, వారి తలంపులు కొన్నిసార్లు వారి మీద నిందారోపణ చేస్తాయి, ఇతర సమయాలలో వారిని కాపాడుతుంటాయి. (రోమా 2:14-15)

ఈ కారణంగా లక్షలాది తీర్థయాత్రికులు తమలోని పాపాన్ని గుర్తించగల్గుతారు. ఇది వేద పుస్తకం (బైబిలు) చెప్పిన విధంగా ఉంది:

“అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.” (రోమా 3:23)

ప్రతాసన మంత్రంలో పాపం వ్యక్తం అయ్యింది

ఈ భావన ప్రముఖ ప్రార్థస్నాన (లేక ప్రతాసన) మంత్రంలో పాపం వ్యక్తం చెయ్యబడింది. దీనిని ఈ క్రింద తిరిగి ఇస్తున్నాను:

నేను ఒక పాపిని. నేను పాప ఫలితాన్ని. నేను పాపంలో జన్మించాను. నా ఆత్మ పాపం కింద ఉన్నాను. నేను పాపులందరిలో నీచుడను. రమ్యమైన కళ్ళుకలిగిన ఓ ప్రభూ, , బలియాగానికి ప్రభువా నన్ను రక్షించు.

ఈ ప్రార్థనా మనవితో నిన్ను నీవు ఐక్యపరచుకో గోరుచున్నావా?

సువార్త “మన పాపాలను శుద్ధి చేస్తుంది”

కుంభమేళ తీర్థయాత్రికులూ, ప్రతాసన భక్తులు ఎదురుచూస్తున్న ఒకే సమస్యను గురించి సువార్త మాట్లాడుతుంది – వారి పాపాలు శుద్ధి చెయ్యబడాలి. తమ ‘వస్త్రాలు’ ఉదుకుకొన్న వారికి ఇది ఒక వాగ్దానాన్ని చేస్తుంది (అంటే వారి నైతిక క్రియలు). పరలోకంలో (‘పట్టణం’) అమరత్వం (జీవమిచ్చు వృక్షం).

“ జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.” (ప్రకటన 22:14)

కుంభమేళ పండుగ మన పాప వాస్తవంలోని ‘చెడువార్తను’ మనకు చూపిస్తుంది. ఇది ఈవిధంగా శుద్ధికోసం మనల్ని మేల్కొలపజెయ్యాలి. సువార్తలోని వాగ్దానం యదార్ధం కావడానికి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే, ఇది యదార్ధం కనుక, ఖచ్చితంగా దీనిని స్పష్టమైన విధానంలో పరిశోధన చెయ్యడం యోగ్యమైనది. ఈ వెబ్ సైట్ ఉద్దేశం ఇదే.

నిత్య జీవం గురించి నీవు ఆసక్తి కలిగియుంటే, పాపం నుండి నీకు స్వతంత్రత కావాలని కోరిక కలిగియుంటే, ఎందుకు, ఏవిధంగా ప్రజాపతి బయలు పడ్డాడో చూడడానికి ప్రయాణం చెయ్యడం జ్ఞాన యుక్తమైన అంశం – ప్రజాపతి – ఈ లొకాన్నీ, మనలనూ సృష్టించిన దేవుడు మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సంశాన్ని వేదాలు మనకు బోధిస్తున్నాయి. రుగ్ వేదంలో ప్రజాపతి మానవావతారాన్నీ, ఆయమ మన కోసం చేసిన బలినీ వివరిస్తున్న పురుషసుక్త ఉంది. బైబిలు (వేదపుస్తకం) ఈ ప్రణాళిక మానవావతారం ద్వారా మానవ చరిత్రలోనికి ఏవిధంగా వచ్చిందో, యెషు సత్సంగ్ (యేసు క్రీస్తు) జీవితం, మరణం. గురించీ బహు వివరంగా వివరిస్తుంది. నీ ‘పాపాలు కూడా శుద్ది చెయ్యబడడానికీ’ పరిశోధించడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, ఈ ప్రణాళికను అర్థం చేసుకో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *