పురుష యొక్క బలి: సమస్త విషయములకు ఆరంభము

3&4 వచనముల తరువాత పురుషసూక్త యొక్క దృష్టి పురుష యొక్క గుణముల నుండి పురుష యొక్క బలి వైపుకు మళ్లుతుంది. 6&7 వచనములు దీనిని ఈ క్రింది విధముగా చేస్తాయి. (సంస్కృత లిప్యాంతరీకరణ, మరియు పురుషసూక్తను గూర్చిన నా ఆలోచనలలో చాలా వరకు, జోసెఫ్ పడింజరెకర వ్రాసిన క్రైస్ట్ ఇన్ ది ఎంషేంట్ వేదాస్ (346 పేజీ. 2007) అను పుస్తకమును అధ్యయనము చేయుట ద్వారా సేకరించబడినవి)

పురుషసూక్తలోని 6-7 వచనములు

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
పురుషను నైవేద్యముగా ఇస్తూ దైవములు బలిని అర్పించినప్పుడు, వసంత ఋతువు దానిలోని కరిగించబడిన వెన్న కాగా, గ్రీష్మము దానిలోని వంటచెరుకు కాగా, శరద్ ఋతువు నైవేద్యమైయ్యింది. ఆదియందు జన్మించిన పురుషను వారు బలిగా కట్టెల మీద ధారపోశారు. దైవములు, సాధువులు, మరియు ఋషీముణులు ఆయనను బాధితునిగా బలి అర్పించారు యత్పురుసేనా హవిస దేవ యజ్ఞం అతన్వత వసంతో అస్యసిద్ అజ్యం గ్రీష్మ ఇద్మః సరద్ద్హవిః తమ్ యజ్ఞం బర్హిసి ప్రౌక్షణ్ పురుషం జతంగ్రతః తెన దేవ అయజ్యన్తః సద్య ర్సయస్ క యే

ఇక్కడ అంతా ఒకేసారి స్పష్టము కాకపోయినప్పటికీ, పురుషను బలి అర్పించుట అను విషయము మాత్రం స్పష్టమవుతుంది. పురాతన వేదాల యొక్క వ్యాఖ్యానకర్తయైన శయనాచార్య ఇలా వ్యాఖ్యానించాడు:

“ఋషులు – సాధువులు మరియు దైవములు – బలి బాధితుడైన పురుషను బలి అర్పించు స్థానమునకు బలి పశువుగా బంధించి, తమ మనస్సుల ద్వారా ఆయనను బలి అర్పించారు” రిగ్ వేద పై శయనాచారి

వ్రాసిన వ్యాఖ్యానము 10.90.7

8-9 వచనములు “తస్మద్యజ్ఞసర్వహుతః…” అను మాటతో ఆరంభమవుతాయి, అనగా తనను బలి అర్పించినప్పుడు పురుష ఏమి దాచుకొనకుండా సమస్తమును అర్పించాడు. బలి అర్పించుటలో పురుష కలిగియుండిన ప్రేమను ఇది తెలియపరుస్తుంది. కేవలం ప్రేమ ద్వారానే మనము ఏమి దాచుకొనకుండా ఇతరులకు సమస్తమును ఇవ్వగలము. వేద పుస్తకములో (బైబిలు) యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) చెప్పినట్లు

“తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు”

యోహాను 15:13

సిలువ మీద బలిగా ఆయన స్వయేచ్చతో తనను తాను అర్పించుకున్నాడు కాబట్టి యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) ఈ మాటలను చెప్పాడు. పురుష బలికి మరియు యేసు సత్సంగ్ కు మధ్య అనుబంధము ఏమైనా ఉందా? పురుషసూక్తలోని 5వ వచనము (ఇప్పటి వరకు మనము దీనిని చూడలేదు) ఒక ఆధారమును ఇస్తుంది – కాని ఆ ఆధారము మర్మముగా ఉన్నది. 5వ వచనమును చూడండి

పురుషసూక్తలోని 5వ వచనము

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
దానిలో నుండి – పురుషలోని భాగములో నుండి – విశ్వము పుట్టింది మరియు అది పురుష యొక్క సింహాసనము చేయబడింది మరియు ఆయన సర్వాంతర్యామి అయ్యాడు తస్మాద్ విరలజయత విరాజో ఆది పురుషః స జతో అత్యరిచ్యత పశ్చాదబుమిమ్ అతో పురః

పురుష సూక్త ప్రకారం, పురుష సమయము యొక్క ఆరంభములో బలిగావించబడ్డాడు మరియు అది విశ్వము యొక్క సృష్టికి కారణమైయ్యింది. కాబట్టి ఈ బలి భూమి మీద చేయబడలేదు ఎందుకంటే ఈ బలిలో నుండే భూమి పుట్టింది. ఈ సృష్టి పురుష యొక్క బలిలో నుండి పుట్టింది అని 13వ వచనము స్పష్టముగా చూపుతుంది. అది ఇలా సెలవిస్తుంది

పురుషసూక్తలోని 13వ వచనము

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
చంద్రుడు ఆయన మనస్సులో నుండి పుట్టాడు. సూర్యుడు ఆయన కంటిలో నుండి వెలువడినాడు. మెరుపులు, వర్షం, మరియు అగ్ని ఆయన నోటి నుండి వచ్చాయి. ఆయన శ్వాసలో నుండి గాలి పుట్టింది. చంద్రమ మనసో జాతస్ కాక్సొహ్ సూర్యో అజాయత ముఖద్ ఇంద్ర శ్చ అగ్నిశ్చ ప్రనద్ వాయుర్ అజాయత

ఇదంతా స్పష్టమవుతుంది అని వేద పుస్తకము (బైబిలు) యొక్క లోతైన అవగాహనలో ఉన్నది. మీకా ఋషి (ప్రవక్త) యొక్క రచనలను చదివినప్పుడు దీనిని మనము చూస్తాము. ఆయన సుమారుగా క్రీ.పూ. 750లో జన్మించాడు మరియు యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) యొక్క రాకకు 750 సంవత్సరాల క్రితం అతడు జీవించినా, ఆయన జన్మించబోవు పట్టణమును గూర్చి సూచిస్తూ అతడు ఆయన రాకను ముందుగానే చూశాడు. అతడు ఇలా ప్రవచించాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా,
యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను
నాకొరకు ఇశ్రాయేలీయులను
ఏలబోవువాడు నీలోనుండి వచ్చును;
పురాతన కాలము మొదలుకొని
శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

మీకా 5:2

బేత్లెహేము నగరములో నుండి పాలకుడు (లేక క్రీస్తు) పుడతాడని మీకా ప్రవచించాడు.  750 సంవత్సరాలు తరువాత యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) దర్శనమును నెరవేర్చుతు బేత్లెహేములో జన్మించాడు. అయితే, ఈ రానున్న వాని యొక్క మూలములను గూర్చిన వర్ణన మీద మనము దృష్టిపెట్టాలి. మీకా భవిష్యద్ ఆగమనమును గూర్చి ప్రవచిస్తున్నాడు గాని, ఈ రానున్న వాని యొక్క మూలములు భూత కాలములో లోతుగా నాటబడియున్నవని చెబుతాడు. ఆయన “మూలములు పురాతనమైనవి.” ఈ రానున్న వాని యొక్క ఆరంభములు ఈ భూమి పుట్టకు మునుపునవి! ‘…ఈ పురాతనమైన’ అనునది ఎంతటి పురాతనమైనది? ఇది ‘నిత్యత్వ కాలమునకు’ సంబంధించినది. వేద పుస్తకములోని (బైబిలు) ఇతర సత్య జ్ఞాన మాటలు దీనిని మరింత స్పష్టము చేస్తాయి. కొలస్సయులకు 1:15లో పౌలు ఋషి (క్రీ.శ. 50వ సంవత్సరములో వ్రాశాడు) యేసును గూర్చి ఇలా ప్రకటించాడు:

ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

కొలస్సయులకు 1:15

యేసు ‘అదృశ్య దేవుని స్వరూపి’ అని మరియు ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు’ అని ప్రకటించబడ్డాడు. మరొక మాటలో, యేసు యొక్క నరావతారం చరిత్రలో ఖచ్చితమైన కాలములో జరిగినను (క్రీ.పూ. 4 – క్రీ.శ. 33), ఆయన సృష్టి అంతటికి ముందే ఉనికిలో ఉన్నాడు – నిత్యత్వము నుండి ఆయన ఉన్నాడు. ఆయన ఇలా ఎందుకు చేశాడంటే దేవుడు (ప్రజాపతి) ఎల్లప్పుడు నిత్యత్వము నుండి ఉన్నాడు, మరియు ఆయన ‘స్వరూపము’గా యేసు (యేసు సత్సంగ్) కూడా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాడు.

జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన బలి – సమస్త విషయములకు ఆరంభము

ఆయన కేవలం నిత్యత్వము నుండి ఉనికిలో మాత్రమే లేడుగాని, యోహాను ఋషి (ప్రవక్త) ఈ యేసును (యేసు సత్సంగ్) పరలోకమందు ఒక దర్శనములో చూసి ఇలా వర్ణించాడు

“…  జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల”

ప్రకటన 13:8

ఇది వైరుధ్యముగా ఉందా? యేసు (యేసు సత్సంగ్) క్రీ.శ. 33లో చంపబడలేదా? ఆయన చంపబడినట్లయితే, ఆయన ‘జగదుత్పత్తి మొదలుకొని’ ఎలా వధించబడ్డాడు? ఈ వైరుధ్యములోనే పురుషసూక్త మరియు వేద పుస్తకము ఒకే విషయమును వర్ణించుచున్నవని మనము చూస్తాము. పురుష యొక్క బలి ‘ఆరంభములో’ జరిగింది అని పురుషసూక్త చెబుతున్నట్లు మనము చూశాము. తాను వ్రాసిన వేదాలలో క్రీస్తు అను పుస్తకములో జోసెఫ్ పడింజరెకర, ఆరంభములో ఈ పురుష యొక్క బలి ‘దేవుని హృదయములో’ (సంస్కృతం పదమైన ‘మనసయాగం’ను అతడు ఈ అర్థము ఇచ్చునట్లు అనువదించాడు)   ఉన్నదని పురుషసూక్త యొక్క సంస్కృతం వ్యాఖ్యానం తెలియజేస్తున్నట్లు వ్రాశాడు. ఆరంభములో ఇవ్వబడిన ఈ బలి “మానసిక లేక చిహ్నాత్మకమైనది”* అని సంస్కృతం పండితుడైన ఎన్ జే షేండే చెబుతున్నట్లు అతడు సూచించాడు.

కాబట్టి పురుషసూక్త యొక్క మర్మము ఇప్పుడు స్పష్టమవుతుంది. పురుష నిత్యత్వము నుండే దేవుడైయున్నాడు మరియు దేవుని స్వరూపమైయున్నాడు. ఆయన సమస్తము కంటే ముందు ఉన్నాడు. ఆయన అందరిలో జ్యేష్ఠుడైయున్నాడు. మానవాళి యొక్క సృష్టి బలి యొక్క అవసరతను కోరుతుంది అని దేవుడు తన సర్వజ్ఞానములో ఎరిగియుండెను మరియు – దీని కొరకు ఆయన ఇవ్వదగినది అంతా అవసరమైయుండెను – మరియు పాపములను కడుగుటకు లేక శుద్ధిచేయుటకు బలిగా పురుష నరావతారములో రావలసియుండెను. ఈ సమయములో విశ్వమును మరియు మానవజాతిని సృష్టించాలా లేదా అను నిర్ణయమును దేవుడు తీసుకొనవలసియుండెను. ఆ నిర్ణయములో బలిగావించబడుటకు పురుష నిర్ణయించుకున్నాడు కాబట్టి సృష్టి కార్యము జరిగింది. కాబట్టి, మానసికముగా, లేక దేవుని యొక్క హృదయములో, వేద పుస్తకము ప్రకటించుచున్నట్లు పురుష ‘జగదుత్పత్తి మొదలుకొని వధింపబడెను.’

ఆ నిర్ణయము తీసుకొనబడిన తరువాత – కాలము ఆరంభమగుటకు ముందే – దేవుడు (ప్రజాపతి –  సర్వసృష్టికి ప్రభువు) కాలమును, విశ్వమును మరియు మానవాళిని సృష్టించాడు. ఈ విధంగా, పురుష యొక్క స్వచిత్త బలి ‘విశ్వము పుట్టుటకు’ (వ. 5), చంద్రుడు, సూర్యుడు మరియు వర్షము చేయబడుటకు (వ. 13) మరియు సమయం ఆరంభమగుటకు (6వ వచనములో ప్రస్తావించబడిన వసంతము, గ్రీష్మము మరియు శరద్ రుతువు) కారణమైయ్యింది. పురుష వీటన్నిటిలో జ్యేష్ఠుడైయున్నాడు.

పురుషను బలి అర్పించిన దైవములు ఎవరు?

కాని ఒక చిక్కు ఇంకా వీడలేదు. ‘దైవములు’ (దేవుళ్లు) పురుషను బలి అర్పించారని పురుషసూక్త 6వ వచనము చెబుతుంది. ఈ దైవములు ఎవరు? వేద పుస్తకం (బైబిలు) దీనిని వివరిస్తుంది. ఋషులలో ఒకరైన దావీదు క్రీ.పూ. 1000లో ఒక పవిత్రమైన కీర్తనను వ్రాశాడు, అది దేవుడు (ప్రజాపతి) స్త్రీ పురుషులను గూర్చి ఏ విధంగా మాట్లాడాడో బయలుపరుస్తుంది:

మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను

కీర్తనలు 82:6

ఋషియైన దావీదు వ్రాసిన ఈ పవిత్రమైన కీర్తనను 1000 సంవత్సరాల తరువాత యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) వ్యాఖ్యానిస్తూ ఇలా సెలవిచ్చాడు:

అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

యోహాను 10:34-36

దావీదు ఋషి ఉపయోగించిన ‘దైవములు’ అను పదమును నిజమైన లేఖనముగా యేసు సత్సంగ్ (యేసు క్రీస్తు) ఉద్ఘాటించాడు. ఇది ఏ విధంగా సాధ్యం? మనము ‘దేవుని స్వరూపములో చేయబడితిమి’ అని వేద పుస్తకములోని సృష్టి వృత్తాంతములలో మనము చూడవచ్చు (ఆదికాండము 1:27). మనము దేవుని స్వరూపములో చేయబడితిమి కాబట్టి ఒక విధముగా మనలను మనము ‘దైవములు’ అని పరిగణించుకోవచ్చు. కాని వేద పుస్తకము మరింత వివరణను ఇస్తుంది. అది ఇలా ప్రకటిస్తుంది, ఈ పురుష బలిని అంగీకరించువారు:

తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను

ఎఫెసీయులకు 1:4-5

పరిపూర్ణమైన బలిగా పురుషను అర్పించాలని సృష్టికి ముందు ప్రజాపతి-పురుష నిర్ణయించుకున్నప్పుడు, దేవుడు ప్రజలను కూడా ఎన్నుకున్నాడు. ఆయన వారిని ఎందు కోసము ఎన్నుకున్నాడు? ఆయన ‘కుమారులు’గా ఉండుటకు మనలను ఎన్నుకున్నాడు అని అది స్పష్టముగా చెబుతుంది.

మరొక మాటలో, ఈ బలి ద్వారా దేవుని పిల్లలగునట్లు పరిపూర్ణమైన బలిని అర్పించునట్లు తనను తాను సమర్పించుకొనుటకు దేవుడు నిర్ణయించుకున్నప్పుడు స్త్రీ పురుషులు ఎన్నుకొనబడ్డారని వేద పుస్తకము (బైబిలు) ప్రకటిస్తుంది. ఈ సంపూర్ణ భావనలో మనము ‘దైవములు’ అని పిలువబడతాము. ఇది ‘దేవుని వాక్యమును పొందుకున్నవారి విషయములో’  – ఆయన వాక్యమును అంగీకరించు వారి (యేసు సత్సంగ్ పైన ప్రకటించినట్లు) విషయములో నిజమైయున్నది. ఈ భావనలో భవిష్యత్ దేవుని కుమారుల యొక్క అవసరతలు పురుషను బలిగావించాయి. ‘నైవేద్యముగా పురుషను అర్పిస్తూ దైవములు బలిని అర్పించారు’ అని పురుషసూక్త యొక్క 6వ వచనము సెలవిస్తుంది. పురుష అర్పించిన బలి మనలను శుద్ధిచేస్తుంది.

పురుష యొక్క బలి – పరలోకమునకు మార్గము

దేవుని ప్రణాళిక బయలుపరచబడింది అని పురాతన పురుషసూక్త మరియు వేద పుస్తకము యొక్క జ్ఞానములో మనము చూడవచ్చు. ఇది అద్భుతమైన ప్రణాళిక – ఇది మన ఊహకు అందనిది. పురుషసూక్త 16వ వచనములో సెలవిచ్చుచున్నట్లు ఇది మనకు కూడా చాలా ప్రాముఖ్యమైయున్నది

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
దైవములు పురుషను బలిగా అర్పించారు. ఇది ప్రప్రథమముగా స్థాపించబడిన నియమము. దీని ద్వారా ఋషులు పరలోకమును పొందుతారు యజ్ఞేన యజ్ఞమజయంత దేవస్తని ధర్మాని ప్రథమన్యసన్ తెహ నాకం మహిమనః సచంత యాత్ర పూర్వే సద్యః శాంతిదేవః

ఋషి ఒక ‘జ్ఞాన’ పురుషుడు. పరలోకమును సంపాదించుటకు ప్రయాసపడుట నిజముగా జ్ఞానపూరితమైన విషయము. ఇది మనకు దూరముగా లేదు. ఇది అసాధ్యము కాదు. ఇది కఠినమైన క్రమశిక్షణ మరియు ధ్యానం ద్వారా మోక్షమును సాధించు అత్యంత పవిత్రమైన పురుషుల కొరకు మాత్రమే కాదు. ఇది గురువుల కొరకు మాత్రమే కాదు. భిన్నముగా, యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) యొక్క నరావతారము ద్వారా స్వయంగా పురుష అందించిన మార్గమిది.

పురుష యొక్క బలి – పరలోకమునకు మరొక మార్గము లేదు

వాస్తవానికి ఇది మన కొరకు సమకూర్చుబడుట మాత్రమేకాదు గాని శయనాచార్య వ్రాసిన సంస్కృతం వ్యాఖ్యానములో పురుషసూక్త యొక్క 15 మరియు 16 వచనముల మధ్య ఇలా వ్రాయబడియున్నది

తెలుగు అనువాదం సంస్కృతం లిప్యాంతరీకరణ
ఈ విధంగా, దీనిని ఎరిగినవాడు మృత్యుంజయ స్థితికి చేరతాడు. దీనికి మరొక మార్గము లేదు తమేవ విద్వనమ్రత ఇహ భవతి నాన్యః పంత అయనయ వేద్యతే

నిత్య జీవమును (మృత్యుంజయ స్థితి) పొందుటకు మరొక మార్గము లేదు! ఈ విషయమును గూర్చి మరి ఎక్కువగా  అధ్యయనం చేయుట జ్ఞానయుక్తమే. పురుషసూక్తలో చెప్పబడిన కథను ప్రతిబింబించు దేవుని గూర్చిన, మానవాళిని గూర్చిన మరియు సత్యమును గూర్చిన కథను అది ఏ విధంగా వివరిస్తుందో తెలుపుటకు వేద పుస్తకములో (బైబిలు) పలు భాగములను మనము సమీక్షించాము. కాని ఈ కథను మనము వివరముగాను క్రమముగాను చూడలేదు. కాబట్టి, మాతో కలసి వేద పుస్తకమును చదవమని మిమ్మును ఆహ్వానించుచున్నాము, ఆరంభముతో మొదలుపెట్టి, సృష్టిని గూర్చి అధ్యయనం చేస్తూ, పురుష బలిని ఎందుకు అర్పించవలసివచ్చింది,  అర్పించుటకు కారణము ఏమిటి, మను కాలములో జలప్రళయం (వేద పుస్తకములో నోవహు) కలుగునట్లు లోకములో ఏమి జరిగింది, మరియు వారిని మరణము నుండి విడిపించి పరలోకములో నిత్య జీవమును అనుగ్రహించు పరిపూర్ణమైన బలిని గూర్చిన వాగ్దానమును ప్రపంచ దేశములు ఏ విధంగా నేర్చుకున్నాయో మరియు భద్రపరచాయో అధ్యయనం చెయ్యండి. ఇది నిజముగా అధ్యయనం చేయుటకు యోగ్యమైనది.

*(ఎన్ జే షేండే. ది పురుషసూక్త (ఆర్ వి 10-90) ఇన్ వేదిక్ లిటరేచర్ (పబ్లికేషన్స్ అఫ్ ది సెంటర్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్, యూనివర్సిటీ అఫ్ పూనా) 1965.

వచనాలు 3, 4 – పురుష మనుష్యఅవతారం

వచనం 2 నుండి పురుషసుక్త ఈ క్రింది వాటితో కొనసాగుతుంది. (సంస్కృత ప్రతిలేఖనాలు, పురుషసుక్త మీద అనేకమైన నా తలంపులు, జోసఫ్ పడింజరేకర రచించిన క్రైస్ట్ ఇన్ ద ఏన్షియంట్ వేదాస్ (పేజీ 346, 2007) అధ్యయనంనుండి వచ్చాయి.)

ఇంగ్లిష్ అనువాదం సంస్కృత ప్రతిలేఖనాలు
సృష్టి పురుష మహిమ – ఆయన మహాత్యం ఘనమైనది. అయినా ఆయన ఈ సృష్టికంటే ఉన్నతుడు. పురుష (వ్యక్తిత్వంలో) నాలుగవభాగం లోకంలో ఉంది. ఆయనలో మూడు వంతులు ఇంకా శాశ్వతంగా పరలోకంలో నివసిస్తున్నాయి. పురుష తనలోని మూడువంతులతో ఉన్నతంగా ఉద్భవించాడు. ఆయనలో ఒక నాలుగవ భాగం ఇక్కడ జన్మించింది. అక్కడనుండి సమస్తజీవులలో జీవాన్ని విస్తరించాడు. ఎతవనస్యమహిమాతోజ్యయంస్కపురుషఃపదోయస్యవిస్వభ్ యు తానిత్రిపదస్యంమృతందివిత్రిపాదుర్ద్వాదైత్ పురుష్పాదౌశ్యేహ అభవత్పునఃతోవిశ్వాన్వియాక్రమత్సాసననసనేయభి

ఇక్కడ వినియోగించిన భావన అర్థం చేసుకోవడం క్లిష్టమైనది. అయితే ఈ వచనాలు పురుష ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన తన సృష్టికంట ఘనమైన వాడు అని స్పష్టంగా చెపుతుంది. ఈ లోకంలో బయలు పడిన ఆయన ఘనతలో కేవలం ఆ భాగంమాత్రమే అర్థం చేసుకోగలం. అయితే ఈ లోకంలో ఆయన మనుష్యావతారం గురించి కూడా మాట్లాడుతుంది – నీవు నేనూ జీవించే మనుష్యుల లోకం (‘ఆయనలో ఒక నాలుగవ ఇక్కడ జన్మించింది’). కనుక దేవుడు ఈ లోకానికి తన మనుష్యావతారంలో వచ్చినప్పుడు, ఆయన మహిమలో కేవలం ఒక భాగం మాత్రమే ఈ లోకంలో బయలుపరచబడింది. ఆయన జన్మించినప్పుడు ఆయన తననుతాను రిక్తునిగా చేసుకొన్నాడు. ఇది వచనం 2 లో పురుష వర్ణించబడిన దానితో స్థిరంగా ఉంది – ‘పది వేళ్ళకు పరిమితం చేసుకొన్నాడు.’

వేద పుస్తకాన్ (బైబిలు) నజరేతువాడు యేసు మానవావతారం గురించిన వివరణతో ఇది స్థిరంగా ఉంది. ఆయన గురించి ఇలా చెపుతుంది:

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. (కొలస్సీ 2:2-3)

కనుక ప్రభువైన క్రీస్తు దేవుని మానవావతారం, అయితే దాని ప్రత్యక్షతలో అధిక భాగం “గుప్తమై” (దాచబడి) ఉంది. అది ఏవిధంగా దాచబడి ఉంది? మరింతగా వివరించబదుతుంది:

మీ మనసు (వైఖరి) క్రీస్తు యేసుకు కలిగిన మనసులా ఉండాలి:

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:5-11)

కనుక ప్రభువైన యేసు తన మనుష్యావతారంలో ‘తన్నుతాను రిక్తునిగా చేసుకొన్నాడు’, తన బలికోసం ఆ స్థితిలో తన్నుతాను సిద్ధపరచుకొన్నాడు. బయలుపరచబడిన ఆయన మహిమ పురుషాసుక్తలో ఉన్నట్టుగా కేవలం పాక్షికం. దీనికి రాబోతున్న ఆయన బలి కారణం. పురుషాసుక్త అదే అంశాన్ని అనుసరించింది, ఎందుకంటే ఈ వచనాల తరువాత పురుష లోని పాక్షిక మహిమను వర్ణించడం నుండి ఆయన బలిమీద లక్ష్యముంచడం మీదకు మారింది. తరువాత మా వ్యాసం (next post) లో మనం చూడవచ్చు.

వచనం 2 – పురుష నిత్యత్వానికి ప్రభువు

‘పురుష’ సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అని వివరించబడినట్లుగా పురుషసుక్తలో  మనం మొదటి వచనంలో చూసాం. తరువాత పురుషను మనం యెషు సత్సంగ్ (యేసు క్రీస్తు) కాగలడా అనే ప్రశ్నను లేవనెత్తాం,  ఈ ప్రశ్నను మనసులో ఉంచుకొని పురుషసుక్త ద్వారా మన ప్రయాణాన్ని ఆరంభించాం. కనుక మనం పురుషసుక్తలో రెండవవచనం వద్దకు వచ్చాం. ఈ రెండవ వచనం పురుష అనే వ్యక్తి గురించి అసాధారణమైన పదాలతో కూడిన వివరణ కొనసాగిస్తుంది. ఇక్కడ సంస్కృత అనువాదం, ఇంగ్లీషు అనువాదం ఇక్కడ ఉంది. (జోసెఫ్ పదినింజరెకర రాసిన క్రైస్ట్ ఇన్ ద ఎన్షిఎంట్ వేదాస్ పుస్తకం (346 పేజీ. 2007)).

పురుషసుక్త రెండవవచనం
ఇంగ్లీషు అనువాదం సంస్కృత ప్రతిలేఖనం
పురుష ఈ సర్వప్రపంచంలోని సమస్తమై యున్నాడు, సమస్తంగా ఉండబోతున్నాడు. నిత్యత్వానికి ఆయనే ప్రభువు. సర్వముకూ ఆహారం (సహజ పదార్ధం) లేకుండా సమకూరుస్తున్నాడు. పురుషవేదంసర్వమ్యస్సభవ్యముతర్త్వయెసనోయదాన్నేనటిరోహతి

పురుష లక్షణాలు

పురుష సర్వప్రపంచంలో అతీతుడు. (స్థలం, పదార్ధం అంతటిలో), కాలానికి ఆయనే ప్రభువు (ప్రభువుగా ఉన్నాడు, ప్రభువుగా ఉంటాడు), ‘నిత్యత్వానికి ఆయనే ప్రభువు’ – నిత్యజీవం. హైందవ పురాణంలో అనేక దేవుళ్ళు ఉన్నారు అయితే ఎవరికీ అటువంటి అనంత గుణలక్షణాలు లేవు.

ఈ గుణలక్షణాలు కేవలం ఏకైక నిజ దేవునికి మాత్రమే చెందియుండే భక్తిపూర్వకభయాన్ని ప్రేరేపించే దైవికగుణలక్షణాలు – ఆయన సర్వసృష్టికి ప్రభువు. ఈయన రుగ్.వేదలో ఉన్న ప్రజాపతి అయి ఉంటాడు (హెబ్రీ పాతనిబంధన యెహోవాతో పర్యాయపదం). ఈ విధంగా ఈ వ్యక్తి, పురుష, సమస్త సృష్టికి ప్రభువు – ఏకైక దేవుని మావవావతారంగా మాత్రమే మనం అర్థం చేసుకోగలం. 
అయితే మనకు మరింత యుక్తమైన వాస్తవం – పురుష ఈ నిత్యత్వాన్ని మనకు ‘అనుగ్రహిస్తాడు’ (నిత్యజీవం). సహజ పదార్ధాన్ని వినియోగించడు. అంటే, నిత్యజీవం ఇవ్వడానికీ లేక అనుగ్రహించడానికీ సహజమైన పదార్ధం/శక్తిని ఆయన వినియోగించడు. మనం అందరం మరణ శాపం, కర్మ శాపం కింద ఉన్నాం. ఇది మన ఉనికి నిరర్థకత, దీనిలోనుండి మనం తప్పించుకోవాలని చూస్తున్నాం. దీనికోసం పూజలూ, స్నానాదులూ, ఇతర సన్యాససంబంధ అభ్యాసాలు చెయ్యడంలో చాలా కష్టపడుతున్నాం. ఏదైనా ఒక చిన్న అవకాశం ఉన్నా, అది వాస్తవమైనదిగా ఉన్నా, నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించడానికి శక్తినీ, అభిలాషనూ పురుష కలిగియున్నాడు, ఈ సమాచారాన్ని కనీసం తెలుసుకొని యుండడం జ్ఞానయుక్తమైనది. 

వేద పుస్తకంలోని (బైబిలు) పురాతన చిత్రపటాలతో పోల్చబడింది

దీనిని మనసులో ఉంచుకొని మానవ చరిత్రలో అత్యంత పురాతన ప్రవిత్ర రచనలలో ఒకదానిని గురించి ఆలోచన చేద్దాం. హెబ్రీ నిబంధనలో దీనిని మనం చూడవచ్చు (బైబిలులో పాతనిబంధన లేక వేదపుస్తకం అని పిలుస్తాం). రుగ్.వేదం వలే ఈ గ్రంథం దివ్యవాక్కులు, కీర్తనలు, చరిత్ర, వివిధ ఋషుల ప్రవచనాల  సంగ్రహం. ఈ ఋషులు చాలా కాలం క్రితం జీవించియున్నప్పటికీ చరిత్రలో వివిధ కాలాల్లో వారు నివసించారు, రచనలు చేసారు. అందుచేత పాతనిబంధన గ్రంధం ఒక సంగ్రహంగానూ లేక ప్రేరేపించబడిన వివిధ రచనల గ్రంధాలయంగా తలంచవచ్చు. ఈ ఋషుల రచనలలో అనేకం హెబ్రీలో ఉన్నాయి,  ఈ ఋషులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఘనుడైన ఋషి అబ్రహాము సంతానం. అయితే వారు రాసిన ఒక గ్రంథం ఉంది, యోబు అను పితరుడు దీనిని రాశాడు, ఈయన అబ్రహాముకు ముందే జీవించాడు. ఆయన జీవించినప్పుడు ఏ హెబ్రీ దేశం లేదు. యోబును గురించి అధ్యయనం చేసినవారు క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల కాలంలో, 4000 సంవత్సరాల క్రితం జీవించియుండవచ్చుఅని అంచనా వేశారు.

….. యోబు గ్రంథంలో

యోబు అని ఆయన పేరుతో పిలువబడిన ఈ పవిత్ర గ్రంథంలో, తన స్నేహితులతో ఈ కింది మాటలు పలుకుతున్నాడు:

అయితే నా విమోచకుడు సజీవుడనియు,  

తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు

నేనే కన్నులార ఆయననుచూచెదను నాలో

నా అంతరింద్రియములు కృశించియున్నవి. (యోబు 19:25-27)

యోబు రాబోతున్న ‘విమోహకుని’ గురించి మాట్లాడుతున్నాడు. యోబు భవిష్యత్తులోనికి చూస్తున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే విమోచకుడు భూమిమీదకు రాబోతున్నాడు (భవిష్యత్తు కాలం). అయితే ఈ విమోచకుడు ఇంకా ప్రస్తుతకాలంలో ‘జీవిస్తున్నాడు.’ – భూమి మీద కాదు. కనుక పురుషసుక్తలో ఈ వచనంలోని పురుష వలే ఈ విమోచాకుడు కాలానికి ప్రభువు, ఎందుకంటే ఆయన ఉనికి మనకున్నట్టుగా కాలానికి పరిమితం కాలేదు.

తరువాత యోబు ‘నా చర్మము చీకిపోయిన తరువాత’ (అంటే తన మరణం తరువాత) నేను ఆయనను చూచెదను అని చెపుతున్నాడు. యోబు ఆయనను (ఈ విమోచకుని) చూస్తాడు, అదే సమయంలో ‘దేవుణ్ణి చూస్తాడు.’ మరొకమాటలో చెప్పాలంటే రాబోతున్న ఈ విమోచకుడు ప్రజాపతి మానవావతారం, పురుష వలే దేవుని మానవావతారం. అయితే యోబు తన మరణం తరువాత ఆయనను ఏవిధంగా చూస్తాడు? యోబు చెపుతున్న ‘మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను’ అని చెపుతున్న మాటను మనం శ్రద్ధగా గమనించాలి. భూమి మీద నిలుచుచున్న ఈ విమోచకుడను యోబు చూస్తాడు అని చెపుతున్నాడు. విమోచకుడు యోబుకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు,  దేవుడైన ఈ విమోచకుడు భూమిమీద నడుస్తున్నప్పుడు, యోబు ఆయన కోసం ఎదురుచూస్తున్నాడు, యోబు తన సొంత కళ్ళతో విమోచకుడిని చూచేందుకు తాను కూడా భూమి నడిచేలా ఆయనకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు. ఈ నిరీక్షణ యోబును ఆకర్షించింది, ఆ దినం చూడడం కోసం అతని ‘హృదయం అంతరంగంలో కోరుకొంటుంది.’ యోబును మార్చిన మంత్ర ఇదే.

… యెషయా

హెబ్రీ ఋషి కూడా రాబోతున్న మానవుని గురించి మాట్లాడుతున్నాడు, ఈ మాటలు రాబోతున్న పురుష ను గురించిన వివరణలానూ, యోబులో చెప్పిన విమోచకుని గురించిన వివరణలానూ ఉంది. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల మధ్య యెషయ అనే ప్రవక్త ఉన్నాడు. దైవిక ప్రేరణ క్రింద ఆయన అనేక దైవవాక్కులు రాశాడు. రానున్న మనుష్యకుమారుని గురించి యెషయా ఇలా రాశాడు:

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును. 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు  నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.   (యెషయా 9:1-2,6)

మరొక మాటలో చెప్పాలంటే, ఋషి యెషయా కుమారుని జననం గురించి ముందుగా చూస్తున్నాడు, ముందుగా ప్రకటిస్తున్నాడు, ఆయన ‘బలవంతుడైన దేవుడు అని పిలువబడును.’ ఈ వార్త ప్రత్యేకించి ‘మరణచ్చాయగల దేశనివాసుల’కు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని అర్థం ఏమిటి? రాబోతున్న మరణాన్నీ, మనల్ని పాలిస్తున్న కర్మనూ మనం తప్పించుకోలేమని తెలిసిన జీవితాలలో మనం జీవిస్తున్నాము. అందుచేత మనం అక్షరాలా ‘మరణచ్చాయలో’ జీవిస్తున్నాము. అందుచేత రాబోతున్న మనుష్యకుమారు ‘బలవంతుడైన దేవుడు’ గా పిలువబడతాడు, గొప్ప వెలుగు అవుతాడు లేక రాబోతున్న మన మరణ చ్చాయలో జీవిస్తున్న మనకు నిరీక్షణ అవుతాడు.

… మీకా

మరొక ఋషి, మీకా కూడా యెషయ జీవించిన కాలంలోనే జీవించాడు.  (క్రీస్తు పూర్వం 750) రాబోతున్న మనుష్యకుమారుని గురించిన దైవవాక్కులను మీకా కూడా పలికాడు:

 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. (మీకా 5:2)

ఎఫ్రాతా ప్రాంతంలోని బెత్లెహెం పట్టణం నుండి మనుష్యకుమారుడు వస్తాడని మీకా చెప్పాడు. అక్కడ యూదా వంశం (యూదులు) నివసించింది. చరిత్రలో ఒక నిర్దిష్ట సమయంలో ఈ మానవుడు “రాబోతున్నాడు” అనేది అత్యంత విశిష్టమైన అంశం, కాలం ఆరంభంనుండి ఆయన ఉనికి కలిగియున్నాడు. పురుషసుక్త లోని వచన 2 వ వచనం చెపుతున్న ప్రకారం, యోబు గ్రంథంలో రాబోతున్న విమోచకుని గురించి చెపుతున్న ప్రకారం, ఈ మనుష్యకుమారుడు మనకు వలే కాలానికి పరిమితుడుగా ఉండడు. ఆయన కాలానికి ప్రభువు. ఇది దైవిక సామర్ధ్యం. మానవ సంబంధమైనది కాదు. ఆ విధంగా వారందరూ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు.

యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు)లో నెరవేరింది

అయితే ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ మీకా ఒక చారిత్రాత్మక సూచన ఇస్తున్నాడు. రాబోతున్న వ్యక్తి బెత్లెహెం నుండి రాబోతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఇశ్రాయేలు/వెస్ట్ బాంక్ అని పిలువబడే బెత్లెహెం అనే పట్టణం వేలాది సంవత్సరాల క్రితం ఉనికిలో ఉంది. మీరు దీని సమాచారాన్ని గూగుల్ లో చూడవచ్చు. దాని రూపు రేఖల్ని చూడవచ్చు. ఇది పెద్ద పట్టణం కాదు, పెద్ద పట్టణంగా ఎప్పుడూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖమైంది, ప్రతీ సంవత్సరం ప్రపంచ వార్తల్లో ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇది ప్రభువైన యేసు క్రీస్తు (లేక యెషుసత్సంగ్) జనన స్థలం. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ జన్మించాడు. ఆయన గలిలయ ప్రాతాన్ని ప్రభావితం చేస్తాడని యెషయ మరొక సూచన ఇచ్చాడు.  యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు) బెత్లెహెంలో (మీకా ముందుగా చూచిన విధంగా) జన్మించినప్పటికీ, యెషయా ముందుగా చెప్పినట్టు ఆయన గలిలయ ప్రాంతంలో పెరిగాడు, బోధకుడిగా పరిచర్య చేసాడు. బెత్లెహెం ఆయన జన్మస్థానం, గలిలయ ఆయన పరిచర్య స్థానం, ఇవి రెండూ యెషుసత్సంగ్ (యేసు క్రీస్తు) జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలాలు. కనుక యేసుక్రీస్తు ( యెషుసత్సంగ్) లో వివిధ ఋషులు ముందుగా పలికిన దైవవాక్కులు నెరవేరాయి.  ఈ పురుష/విమోచాకుడు/పాలకుడుగా చెప్పబడిన వాడు యెషుగా ముందుగా చూడబడినవాడుగా ఉన్నవాడేనా? ఈ ప్రశ్నకు జవాబు ‘మరణచ్చాయ’ (కర్మ) లో మనం ఏవిధంగా జీవిస్తున్న మనకు ఏవిధంగా నిత్యజీవం అనుగ్రహించబడుతుందో (given ‘immortality) మనకు స్పష్టపరుస్తుంది. దీనిని గురించి ఆలోచించడం ఖచ్చితంగా యోగ్యమైన సమయమే. అందుచేత పురుషసుక్త ద్వారా మరింత అధ్యయనం కొనసాగిద్దాం. వాటిని హెబ్రీ వేద పుస్తకంలోని ఋషులతో సరిపోల్చుదాం.

పురుషసుక్తను గురించి ఆలోచించడం – మానవుని స్తుతికీర్తన

రుగ్ వేదం (లేక రిగ్ వేద)లో అత్యంత ప్రసిద్ధ కీర్తన బహుశా పురుషసుక్త  (పురుషసుక్తం). ఇది 10 వ మండల 90 వ అధ్యాయంలో ఉంది. ఈ కీర్తన ఒక విశిష్టమైన పురుషుని – పురుస (పురుష అని పలుకబడింది) కోసం ఉద్దేశించింది.  ఇది రుగ్ వేద లో కనుగొనబడింది. ప్రపంచంలో అత్యంత పురాతన మంత్రాలలో ఇది ఒకటి. ముక్తి లేక మోక్షం (జ్ఞానోదయం) మార్గాన్ని గురించి మనం నేర్చుకోగల్గినదానిని  చూడడానికి దీనిని అధ్యయనం చెయ్యడం అత్యంత యోగ్యమైనది.  

కనుక పురుష ఎవరు? వేదిక భాగం ఇలా చెపుతుంది:

“పురుష, ప్రజాపతి ఇద్దరూ ఒకే వ్యక్తి.” (సంస్కృత ప్రతిలేఖనం పురుసోహిప్రజాపతి) మాధ్యందియసతపతబ్రాహ్మణ VII.4:1,156

ఉపనిషత్తులు ఇదే అంశాన్ని చెపుతూఉన్నాయి, ఇలా చెపుతున్నాయి:

“పురుష సమస్తం మీద శ్రేష్టమైనవాడు. పురుషకు ఏదీ (ఎవరూ) ఘనమైనది కాదు. ఆయనే ముగింపు, అత్యంత ఉన్నతమైన లక్ష్యం.” (అవ్యకత్పురుసఃపరాహ్. పురుసన్నపరంకింసిత్సకత్సాస పర గటి) కతోపనిషత్ 3:11

“అవ్యక్తతకు మించిన సర్వాధికారి పురుష….. ఆయనను యెరిగిన వారు స్వతంత్రులుగా మారుతారు, నిత్యత్వాన్ని పొందుతారు (అవ్యకత్ యు పరాహ్ పురుష …. యజ్నత్వముస్యతేజంతురాంత్వం స గచ్చతి) కతోపనిషత్ 6:8

కాబట్టి పురుష అంటే ప్రజాపతి (సమస్త సృష్టికి ప్రభువు). అయితే అత్యంత ప్రాముఖ్యమైనది, ఆయనను నేరుగా తెలుసుకోవడం నిన్నూ, నన్నూ ప్రభావితం చేస్తుంది. ఉపనిషత్ ఇలా చెపుతుంది:

“నిత్యజీవంలోనికి ప్రవేశించడానికి మరో ఇతర మార్గం లేదు. (అయితే పురుష ద్వారా) (నన్యఃపంతవిద్యతే – అయనయ) సేతస్వతరోపనిషత్ 3:8

కాబట్టి మనం పురుషను వివరించే రుగ్ వేదలో ఉన్న కీర్తన పురుషసుక్తను అధ్యయనం చేద్దాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు, మనం ఆలోచించడానికి ఒక అసాధారణ, నవీన తలంపును మన ముందు ఉంచుతున్నాను:  పురుషసుక్తలో చెప్పబడిన ఈ పురుష దాదాపు 2000 సంవత్సరాల క్రితం యెషుసత్సంగ్ (నజరేతువాడు యేసు) మానవావతారంలో నెరవేర్చబడ్డాడా? నేను చెప్పిన విధంగా, బహుశా ఇది ఒక వింతైన తలంపు. అయితే యేసుసత్సంగ్ (నజరేతువాడు యేసు) అన్ని మతాలలో పరిశుద్ధుడుగా కనిపిస్తున్నాడు. ఆయన దేవుని మానవావతారంగా చెప్పబడ్డాడు. ఆయన, పురుష ఇద్దరూ కూడా (మనం చూస్తున్నట్లు) బలిగా అర్పించబడ్డారు. అందుచేత ఇది ఈ భావనను గురించి ఆలోచించేలా, దానిని పరిశోధించేలా ఒక మంచి కారణాన్ని చూపుతుంది. సంస్కృత ప్రతిలేఖనాలు, పురుషసుక్త మీద నాకున్న అనేక ఇతర తలంపులు జోసఫ్ పదింజరేకర రాసిన క్రిస్ట్ ఇన్ ద ఎన్షియెంట్ వేదాస్ (పేజీ 346. 2007)ను అధ్యయనం చెయ్యడంద్వారా కలిగాయి.

పురుషసుక్త మొదటి వచనం

సంస్కృతం నుండి ప్రతిలేఖనం ఇంగ్లీషులోనికి అనువాదం
సహస్రసిర్సా-పురుషఃసహస్రాక్షహ్స్రపత్ సభుమిమ్విస్వాతోవర్త్వాత్యతిస్తాద్దసంగులం పురుషకు వెయ్యి తలలు ఉన్నాయి, వెయ్యి కళ్ళు ఉన్నాయి, వెయ్యి పాదాలు ఉన్నాయి. భూమికి అన్నివైపులూ ఆవరించి, ఆయన ప్రకాశిస్తున్నాడు. పది వేళ్ళకు తన్నుతాను పరిమితం చేసుకొన్నాడు.

పై భాగంలో చూచినవిధంగా పురుష ప్రజాపతిలా ఒకేలా ఉన్నాడు. ఇక్కడ వివరించిన విధంగా (as explained here), ఆదిమ వేదాలు దేవుడు సమస్తాన్ని సృష్టించాడనీ – “సమస్త సృష్టికి ప్రభువు” అని యెంచుతున్నాయి,

పురుషసుక్త ఆరంభంలో పురుషకు ‘వెయ్యి తలలు, వెయ్యికళ్ళు, వెయ్యి పాదాలు’ ఉన్నాయని మనం చూసాం. దీని అర్థం ఏమిటి? ‘వెయ్యి’ అనే పదం ఒక నిర్దిష్టమైన సంఖ్యకాదు. అయితే దీని అర్థం ‘అసంఖ్యాకమైనది’ లేక ‘పరిమితి లేనిది.’ కాబట్టి పురుష పరిమితిలేని జ్ఞానాన్ని (‘బుద్ధి’) కలిగియున్నాడు. ఈ నాటి భాషలో చెప్పాలంటే ఆయన సర్వజ్ఞాని లేక సర్వం యెరిగినవాడు. ఇది దేవుని (ప్రజాపతి) దైవిక గుణలక్షణం. ఆయన ఒక్కడే సమస్తం యెరిగినవాడు, దేవుడు చూస్తాడు, అన్నింటిని గురించిన అవగాహన కూడా ఉంది. పురుష ‘వెయ్యి కళ్ళు’ కలిగియున్నాడు అని చెప్పడం పురుష సర్వవ్యాపి అని చెప్పడం లాంటిదే – సమస్తాన్ని గురించిన అవగాహన ఆయనకు ఉంది ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. అదేవిధంగా ‘వెయ్యి పాదాలు’ పదం సర్వశక్తి – పరిమితిలేని శక్తిని సూచిస్తుంది.

ఈ విధంగా పురుషసుక్త ఆరంభంలో సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడైన వ్యక్తిగా  పురుష పరిచయం చెయ్యబడడం మనం చూసాం. మానవావతారి అయిన దేవుడు మాత్రమే అటువంటి వ్యక్తిగా ఉండగలడు. ‘ఆయన తన్నుతాను పది వేళ్ళకు పరిమితం చేసుకొన్నాడు’ అనే వాక్యంతో వచనం ముగించబడింది. దీని అర్థం ఏమిటి? అవతారం చెందిన వ్యక్తిగా, పురుష తనకున్న దైవిక శక్తులను శూన్యం చేసుకొన్నాడు, సామాన్య మానవుని వలే పరిమితం చేసుకొన్నాడు – ‘పది వేళ్ళు ఉన్నవాని’లా.             ఆ విధంగా పురుష దేవుడు అయినప్పటికీ, అన్నింటిని పరిమితం చేసుకొని, తన మానవావతారంలో తన్నుతాను శూన్యం చేసుకొన్నాడు.

యేషుసత్సంగ్ (నజరేతువాడు యేసు)ను గురించి మాట్లాడుతున్నప్పుడు వేద పుస్తకాన్ (బైబిలు) ఖచ్చితంగా ఇదే తలంపును వ్యక్తపరుస్తుంది. బైబిలు ఇలా చెపుతుంది:

మీ మనసు (వైఖరి) క్రీస్తు యేసుకు కలిగిన మనసులా ఉండాలి:

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:5-11)

పురుషసుక్తలో పురుషను గురించి పరిచయం చేసినప్పుడు వినియోగించిన ఒకే తలంపులను ఖచ్చితంగా వేద పుస్తకాన్ (బైబిలు) వినియోగించడం మీరు చూడవచ్చు – అనంతుడైన దేవుడు పరిమితుయిన మనిషిగా అవతరించడం. అయితే బైబిలులోని ఈ వాక్యభాగం పురుషసుక్త చేసిన విధంగా త్వరితంగా ఆయన బలిని వివరిస్తుంది పురుషసుక్త కూడా వివరిస్తుంది. కనుక మోక్షాన్ని కోరుకొనే ప్రతీ ఒక్కరూ ఈ దైవ వాక్కులను మరింత పరిశోదించడం యోగ్యమైనదే. ఎందుకంటే ఉపనిషత్తులు ఇలా చెపుతున్నాయి:

‘నిత్యజీవంలోనికి ప్రవేశించడానికి మరో మార్గం లేదు (అయితే పురుష ద్వారా) (నన్యఃపంతవిద్యతే-అయనయ) శ్వేతస్వవతరోపనిషత్ 3:8

పురుషసుక్త వచనం 2 ఇక్కడ కొనసాగిద్దాం.