Skip to content

చెడియున్నారు (భాగం 2) … గురి తప్పుట

  • by

మనము సృజించబడిన వాస్తవిక దేవుని స్వరూపములో నుండి మనము చెడిపోయామని వేద పుస్తకము (బైబిలు) వర్ణించు విధానమును మునుపటి వ్యాసములో చూశాము. దీనిని మరింత మంచిగా చూచుటకు నాకు సహాయపడిన చిత్రము, చెడిపోయిన ఎల్వ్స్ అయిన భూమధ్య భాగములోని ఆర్క్స్.  కాని ఇది ఎలా జరిగింది?

పాపము యొక్క మూలము

https://www.youtube.com/watch?v=xmBZ7IwkKSY&list=PLzit8YGY5NWsf6n4-_72Swv0h9T-b3Pki&index=1

ఇది బైబిలులోని ఆదికాండము అను పుస్తకములో నివేదించబడింది. దేవుని స్వరూపమందు చేయబడిన  తరువాత మొదటి మానవులు పరీక్షించబడ్డారు. ‘సర్పము’తో సంభాషణను ఈ కథనము నివేదిస్తుంది. ఈ సర్పము ఎల్లప్పుడూ సార్వత్రికముగా సాతాను – దేవుని యొక్క ఆత్మీయ విరోధి – అని గుర్తించబడెను. బైబిలు అంతటిలో, మరొక వ్యక్తి ద్వారా మాట్లాడుట ద్వారా సాతాను సాధారణంగా చెడు చేయుటకు శోధిస్తాడు. ఈ సందర్భములో అతడు సర్పము ద్వారా మాట్లాడాడు. ఇది ఈ విధముగా నివేదించబడింది.

 1 హోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారునామీదికి లేచువారు అనేకులు.
దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడుఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిననునేను భయపడను

ఆదికాండము 3:1-6

వారి ఎంపికకు మూలము, మరియు వారిని శోధించిన విషయము, ‘దేవుని వలె’ వారు మారిపోవుట. ఈ సమయము వరకు వారు  అన్ని విషయములలో దేవుని నమ్మారు మరియు అన్ని విషయముల కొరకు ఆయన మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మారు. కాని ఇప్పుడు దానిని విడచి, ‘దేవుని వలె’ మారి, తమను తాము నమ్మి తమ మాటను అనుసరించు అవకాశం వచ్చింది. వారు స్వయంగా ‘దైవములు’ కావచ్చు, తమ నౌకలకు సారధులు కావచ్చు, తమ భవిష్యత్తుకు యజమానులు కావచ్చు, స్వాతంత్ర్యత కలిగి తమకు తామే జవాబుదారులు అయ్యే అవకాశం వచ్చింది.

దేవుని మీద చేసిన తిరుగుబాటులో వారిలో ఏదో మార్పు జరిగింది. బైబిలు భాగము చెబుతున్నట్లు, వారు సిగ్గునొంది తమను తాము కప్పుకొనుటకు ప్రయత్నించారు. వాస్తవానికి, కొంత సమయం తరువాత ఆదాము యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఆదామును నిలదీసినప్పుడు, ఆదాము హవ్వ మీద (మరియు ఆమెను చేసిన దేవుని మీద) నెపము వేశాడు. ఆమె సర్పము మీద నేరము మోపింది. వారిలో ఎవ్వరు బాధ్యత తీసుకోలేదు.

ఆదాము చేసిన తిరుగుబాటుకు పరిణామాలు

మనము అదే స్వాభావిక క్రమమును వారసత్వముగా పొందాము కాబట్టి ఆ రోజు ఆరంభమైనది కొనసాగింది. అందుకనే మనము ఆదాము వలె ప్రవర్తిస్తాము – మనము అతని స్వభావమును సంపాదించుకున్నాము కాబట్టి. ఆదాము యొక్క తిరుగుబాటుకు మనము నిందించబడుచున్నాము అని బైబిలు చెబుతుందని కొందరు పొరపాటు పడతారు. వాస్తవానికి, కేవలం ఆదాము మాత్రమే నిందించబడినాడు గాని మనము ఆ తిరుగుబాటు యొక్క పరిణామాలతో జీవించుచున్నాము. దీనిని గూర్చి మనము జన్యుపరంగా ఆలోచన చేయవచ్చు. పిల్లలు తల్లిదండ్రుల జన్యుకణములను వంశపరంగా స్వీకరించుట ద్వారా వారి యొక్క గుణములను కూడా – మంచి మరియు చెడు – పొందుకుంటారు. మనము ఆదాము యొక్క ఈ తిరుగుబాటు స్వభావమును వారసత్వముగా పొందుకున్నాము కాబట్టి స్వాభావికముగా, అజ్ఞాతముగా, కాని చిత్తపూర్వకముగానే ఈ తిరుగుబాటును కొనసాగిస్తాము. మనము విశ్వమునకు దేవుడు కావాలని కోరకపోవచ్చుగాని, మన సందర్భాలలో మనము దైవములు కావాలని కోరతాము; దేవుని నుండి స్వతంత్రులుగా ఉండాలని కోరతాము.

పాపము యొక్క ప్రభావములు నేడు దృశ్యమైయున్నవి

మరియు ఇది మనము సులువుగా తీసుకొను మానవ జీవితములో అనేక విషయాలను వివరిస్తుంది. ఈ కారణం చేతనే ప్రతిచోట ప్రజలకు తమ తలుపులకు తాళాలు కావాలి, పోలీసులు, లాయర్లు, బ్యాంకింగ్ కొరకు భద్రతగల పాస్వర్డ్ లు కావాలి – ఎందుకంటే మన ప్రస్తుత స్థితిలో మనము ఒకరి నుండి ఒకరము దొంగిలిస్తాము. ఇందు మూలముగానే సామ్రాజ్యములు మరియు సమాజములు కుళ్లుపట్టి పతనమైపోతాయి – ఎందుకంటే ఈ సామ్రాజ్యములన్నిటిలో ఉన్న పౌరులకు కుళ్లిపోయే ధోరణి ఉంది. ఇందు మూలముగానే అన్ని రకముల ప్రభుత్వములు మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రయత్నించిన తరువాత, కొందరు ఇతరుల కంటే మంచిగా పని చేసినా సరే, ప్రతి రాజకీయ లేక ఆర్థిక వ్యవస్థ దానంతట అదే పతనమైపోతుంది – ఎందుకంటే వ్యవస్థ అంతటిని ఒక దినమున కూల్చివేయు ధోరణిని ఈ అభిప్రాయములు గల ప్రజలు కలిగియున్నారు. ఇందు మూలముగానే మన తరమువారు మునుపటివారి కంటే ఎంతో విద్యావంతులైనా ఈ సమస్యలు కొనసాగుతునే ఉన్నాయి, ఎందుకంటే ఇది మన విద్యా స్థాయి కంటే ఎంతో లోతైనది. ఇందువలనే ప్రతసన మంత్రం ప్రార్థనతో మనలను మనము బాగా గుర్తించుకోవచ్చు – ఎందుకంటే అది మనలను బాగా వర్ణిస్తుంది.

పాపము – గురి ‘తప్పుట’

ఇందు మూలముగానే ఏ మతము కూడా సమాజమును గూర్చి ఒక సంపూర్ణ దర్శనమును అందించలేకపోయింది – నాస్తికులు కూడా ఇవ్వలేకపోయారు (స్టాలిన్ యొక్క సోవిట్ యునియన్, మావో యొక్క చైనా, పోల్ పోట్ యొక్క కంబోడియాను గూర్చి ఆలోచించండి) – ఎందుకంటే మనలో  ఏదో మనము దర్శనమును తప్పిపోవునట్లు చేస్తుంది. వాస్తవానికి, ‘తప్పుట’ అను పదము మన పరిస్థితిని క్రోడీకరిస్తుంది. బైబిలులోని ఒక వచనము దీనిని సరిగా అర్థము చేసుకొనుటకు ఒక చిత్రమును ఇస్తుంది. అక్కడ ఇలా వ్రాయబడియుంది

 6 ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు.

న్యాయాధిపతులు 20:16

ఈ వచనము వడిసెల రాయిని గురి తప్పకుండా విసరగల నైపుణ్యత కలిగిన సైనికులను గూర్చి వివరిస్తుంది. పైన ‘తప్పక’ అని అనువదించబడిన హెబ్రీ పదము יַחֲטִֽא׃. ఇంచుమించు బైబిలు అంతటిలో ఇదే హెబ్రీ పదము పాపము అని అనువదించబడింది. ఉదాహరణకు, తన యజమాని భార్య అతనిని వేడుకొనినను ఆమెతో వ్యభిచారము చేయకుండా పారిపోయిన, ఐగుప్తుకు బానిసగా అమ్మబడిన యోసేపు విషయములో కూడా ‘పాపము’ అను మాటకు ఇదే హెబ్రీ పదము ఉపయోగించబడింది. అతడు ఆమెతో ఇలా అన్నాడు:

 9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

ఆదికాండము 39:9

మరియు పది ఆజ్ఞలు ఇవ్వబడిన వెంటనే లేఖనము చెబుతుంది:

  20 అందుకు మోషేభయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.

నిర్గమకాండము 20:20

ఈ రెండు చోట్ల కూడా ఒకే హెబ్రీ పదమైన יַחֲטִֽא׃ ‘పాపము’ అని అనువదించబడింది. గురి వైపుకు వడిసెల రాయిని విసిరిన సైనికుల సందర్భములో ‘తప్పని’ అని అనువదించబడిన ఇదే పదము ఈ వచనములలో ప్రజలు ఒకరితో ఒకరు వ్యవహరించునప్పుడు చేయు ‘పాపము’ కొరకు ఉపయోగించబడింది. ‘పాపము’ అంటే ఏమిటో అర్థము చేసుకొనుటలో సహాయపడుటకు ఇది ఒక చిత్రమును మనకు అందిస్తుంది. ఒక సైనికుడు రాయిని తీసుకొని గురిని కొట్టుటకు దానిని విసురుతాడు. అది తప్పిపోతే అతని ఉద్దేశము విఫలమైనట్లే. అదే విధముగా, ఆయనతో అనుబంధము కలిగియుండు విషయములో మరియు ఇతరులతో వ్యవహరించు విషయములో గురిని కొట్టుటకు మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి. ‘పాపము’ చేయుట అంటే మన కొరకు ఉద్దేశించబడిన మరియు పలు వ్యవస్థలలో, మతములలో, అభిప్రాయములలో మన కొరకు మనము కోరుకొను ఈ ఉద్దేశమును, లేక గురిని తప్పిపోవుటయే.

‘పాపము’ యొక్క దుర్వార్త – సత్యమును గూర్చినది, ఎంపికను గూర్చినది కాదు

మానవుల యొక్క ఈ చెడిపోయిన మరియు గురి తప్పిన చిత్రము అందమైనది కాదు, మంచిది కాదు, లేక ఆశాజనకమైనది కాదు. అనేక సంవత్సరములుగా ప్రజలు ఈ బోధనను తీవ్రముగా ఖండించుట నేను చూశాను. కెనడాలోని ఒక విస్వవిద్యాలయమునకు చెందిన ఒక విద్యార్థి నా వైపుకు చూస్తూ కోపముతో ఇలా అనిన సందర్భము ఒకటి నాకు జ్ఞాపకముంది, “మీరు చెబుతున్నది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మిమ్మల్ని నమ్మను.” ఇది మనకు ఇష్టముండకపోవచ్చు, కాని దాని మీద గురి పెట్టుట బిందువును తప్పిపోవుట అవుతుంది. ఒకదానిని ‘ఇష్టపడుట’కు అది సత్యమా లేదా అసత్యామా అనుటతో సంబంధం ఏమిటి? నాకు పన్నులు, యుద్ధములు, ఎయిడ్స్ మరియు భూకంపములు ఇష్టం లేదు – ఎవరికీ ఇష్టముండదు – కాని ఆ అయిష్టత వాటిని లేకుండా చేయదు, మరియు వాటిని మనము అలక్ష్యం చేయలేము.

మనము ఒకరి నుండి ఒకరిని కాపాడుకొనుటకు సమాజములన్నిటిలో నిర్మించిన చట్టములు, పోలీసులు, తాళములు, తాళపు చెవులు, భద్రత మొదలగు వ్యవస్థలన్నీ ఏదో సరిగా లేదు అని సూచిస్తున్నాయి. కుంభ మేళ వంటి పండుగలు ‘మన పాపములను కడిగివేయుట’కు కొన్ని లక్షల మందిని ఆకర్షించుట మనము గురిని ‘తప్పాము’ అని స్వాభావికముగా మనకు స్వయంగా తెలుసు అని సూచించుచున్నాయి. పరలోకము కొరకు బలి అవసరమైయున్నది అను ఆలోచన అన్ని మతములలో ఉన్నదను సత్యము, మనలో ఏదో సరిగా లేదు అనుటకు ఒక ఆధారముగా ఉన్నది. వీలైనంత వరకు, ఈ సిద్ధాంతమును సమతుల్య విధానములో పరిగణించవలసియున్నది.

కాని ఈ పాపము యొక్క సిద్ధాంతము అన్ని మతములు, భాషలు మరియు దేశములలో ఉనికిలో ఉండుట – మనలను గురి తప్పునట్లు చేయుట – ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనిని గూర్చి దేవుడు ఏమి చేయబోతున్నాడు? మన తరువాత వ్యాసములో  దేవుని యొక్క ప్రతిస్పందనను మనము చూద్దాము – అక్కడ రానున్న మెస్సీయను గూర్చిన మొదటి వాగ్దానమును చూస్తాము – మన కొరకు పంపబడబోవు పురుష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *