Skip to content

మోక్షమును సాధించుటకు అబ్రాహాము అనుసరించిన సులువైన మార్గము

  • by

వారసుడులేని పాండు రాజు పడిన పాట్లను గూర్చి మహాభారతం వివరిస్తుంది. మారు వేషములో ప్రేమ కలాపాలలో పాలుపంచుకొనుటకు కిందమ ఋషి మరియు అతని భార్య జింక రూపములను దాల్చారు. విచారకరముగా, పాండు రాజు ఆ సమయములో వేటాడుతు అనుకోకుండా వారి మీదికి బాణము విసిరాడు. కిందమునికి కోపము వచ్చి పాండు తరువాత సారి తన భార్యలతో రతిలో పాలుపంచుకొన్నప్పుడు మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంగా పాండు రాజు బిడ్డలు లేకుండా మరియు తన సింహాసనమునకు వారసులు లేకుండా మిగిలిపోయాడు. తన రాజవంశమునకు ఏర్పడిన ఈ అపాయమును అతడు ఎలా అధిగమించగలిగాడు?

స్వయంగా పాండు రాజు జననము కూడా గత తరములో ఇలాంటి సమస్యల మధ్యనే జరిగింది. మునుపటి రాజైన విచిత్రవిర్య వారసుడు లేకుండా మరణించాడు. విచిత్రవిర్య తల్లియైన సత్యవతి విచిత్రవిర్య తండ్రియైన శంతనుని వివాహము చేసుకొనుటకు ముందు ఒక కుమారుని కనినది. విచిత్రవిర్య యొక్క విధవలైన అంబిక మరియు అంబాలికలకు గర్భమును కలిగించుటకు ఆమె ఈ కుమారుడైన వ్యాసుని ఆహ్వానించింది. వ్యాసుడు మరియు అంబికల కలయిక ద్వారా పాండు జన్మించాడు. ఈ విధంగా నియోగ ద్వారా పాండు రాజు వ్యాసుని యొక్క భౌతిక కుమారుడైయ్యాడుగాని, మునుపటి రాజైన విచిత్రవిర్యకు వారసుడైయ్యాడు. నియోగ అనగా భర్త చనిపోయినప్పుడు మరొక వ్యక్తి వీర్యము ద్వారా బిడ్డను కను ఆచారమైయున్నది. అక్కడ కలిగిన గొప్ప అవసరత ఒక తెగింపుతో కూడిన కార్యము చేయునట్లు వారిని పురికొల్పింది.

ఇప్పుడు కిందముడు శపించుట వలన పాండు రాజు కూడా అదే సమస్యను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? మరొకసారి, తెగింపుతో కూడిన ఒక కార్యము అవసరమైయ్యింది. పాండు యొక్క భార్యలలో ఒకరైన కుంతీ (లేక ప్రత) రాణికి దేవతల ద్వారా గర్భమును ధరించు ఒక రహస్య మంత్రము (ఆమె బాల్యములో బ్రాహ్మణ దుర్వాసుడు ఆమెకు బయలుపరచాడు) తెలుసు. కాబట్టి కుంతీదేవి ఈ రహస్య మంత్రమును ఉపయోగించి పాండవుల సహోదరులలో మొదటి ముగ్గురిని కనినది: యధిష్టిరుడు, భీముడు, అర్జునుడు. కుంతీ రాణికి తోటి భార్యయైన మాద్రి రాణి కుంతీదేవి యొద్ద నుండి ఈ మంత్రమును పొందుకొని పాండవులలో మిగిలినవారైన నకులుడు మరియు సహదేవుడుకి జన్మనిచ్చింది.

బిడ్డలు లేకుండా ఉండుట దంపతులకు గొప్ప దుఖమును కలిగిస్తుంది. అది ఒక దేశము యొక్క వారసుని విషయమైతే మరింత దుఖము కలుగుతుంది. ప్రత్నామ్నాయ జోడిలను కనుగొనుట లేక రహస్య మంత్రములను ఉచ్చరించుట వంటి కార్యములు చేయుట తప్ప, అట్టి పరిస్థితులలో మౌనముగా ఉండుట ఒక ఎంపిక కాదు.

అబ్రాహాము ఋషి కూడా నాలుగు వేల సంవత్సరముల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అతడు ఈ సమస్యను పరిష్కరించిన విధానమును హెబ్రీ వేదపుస్తకము (బైబిలు) ఒక మాదిరిగా వర్ణిస్తుంది మరియు దానిలో నుండి మనము నేర్చుకోవాలని కోరుతుంది.

అబ్రాహాము చేసిన ఫిర్యాదు

ఆదికాండము 12వ అధ్యాయములో వాగ్దానము నమోదు చేయబడిన తరువాత అబ్రాహాము జీవితములో చాలా సంవత్సరములు గడచిపోయాయి. ఆ వాగ్దానమునకు విధేయుడై అబ్రాహాము నేడు ఇశ్రాయేలు అని పిలువబడు వాగ్దాన దేశములోనికి వెళ్లాడు. తాను ఆశించినది మినహా – తనకు చేయబడిన వాగ్దానము నెరవేరుటకు కుమారుని యొక్క జననము – అనేక ఇతర కార్యములు అతని జీవితములో జరిగాయి. కాబట్టి అబ్రాహాము చేసిన ఫిర్యాదుతో మనము ఈ వృత్తాంతమును కొనసాగిద్దాము:

 

దీని తరువాత, యెహోవా మాట అబ్రాముకు దర్శనమిచ్చింది:

“అబ్రామ్, భయపడకు.

నేను మీ కవచం,

మీ గొప్ప ప్రతిఫలం. ”

కానీ అబ్రాము, “సార్వభౌమ యెహోవా, నేను సంతానం లేనివాడిగా ఉన్నందున మీరు నాకు ఏమి ఇవ్వగలరు మరియు నా ఎస్టేట్ను వారసత్వంగా పొందేవాడు డమాస్కస్కు చెందిన ఎలిజెర్.” అబ్రాము, “మీరు నాకు పిల్లలను ఇవ్వలేదు; కాబట్టి నా ఇంటిలో ఒక సేవకుడు నా వారసుడు అవుతాడు. ”

ఆదికాండము 15: 1-3

దేవుని వాగ్దానము

తనకు వాగ్దానము చేయబడిన ‘గొప్ప దేశము’ కొరకు ఎదురుచూస్తూ అబ్రాహాము ఆ దేశములో వేచియున్నాడు. కాని అతనికి కుమారుడు జన్మించలేదు, మరియు అప్పటికి అతని వయస్సు 85 సంవత్సరములు అయ్యింది, కాబట్టి అతడు చేసిన ఫిర్యాదు ఈ విషయము మీద దృష్టిపెట్టింది:

 అప్పుడు యెహోవా మాట అతనికి వచ్చింది: “ఈ వ్యక్తి నీ వారసుడు కాడు, నీ శరీరము నుండి వచ్చే కుమారుడు నీ వారసుడు.” అతను అతన్ని బయటికి తీసుకెళ్ళి, “ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించండి-నిజానికి మీరు వాటిని లెక్కించగలిగితే” అన్నాడు. అప్పుడు ఆయన, “మీ సంతానం అలానే ఉంటుంది” అని అన్నాడు.

ఆదికాండము 15:4-5

వారి సంభాషణలో దేవుడు వాగ్దానమును నూతనపరచి, అబ్రాహాము కుమారుని పొందుతాడని, తరువాత అతని సంతానము ఆకాశములోని నక్షత్రముల వలె లెక్కకు మించినవారు, అనగా లెక్కుంచుటకు కష్టమైన దేశముగా మారతారని సెలవిచ్చాడు.

అబ్రాహాము యొక్క స్పందన: శాశ్వత ప్రభావముగల పూజ వంటిది

ఇప్పుడు మరొక సారి అబ్రాహాముకు నిర్ణయము తీసుకొనవలసివచ్చింది. ఈ నూతనపరచబడిన వాగ్దానమునకు అబ్రాహాము ఏ విధంగా స్పందించాడు? దీని తరువాత ఉన్న బైబిలు వచనము అత్యంత ప్రాముఖ్యమైన కథనములలో ఒకటిగా ఉన్నది. ఒక నిత్య సత్యమును అర్థము చేసుకొనుటకు ఇది పునాదిగా ఉన్నది. అక్కడ ఇలా వ్రాయబడియున్నది:

అబ్రాము యెహోవాను నమ్మెను; యెహోవా అది అబ్రాముకు నీతిగా ఎంచెను.

ఆదికాండము 15:6

ఈ కథనములో ఉన్న సర్వనామముల స్థానములో నామవాచకములను పెట్టి చదివితే దీనిని సులువుగా అర్థము చేసుకోవచ్చు:

అబ్రాము యెహోవాను నమ్మెను; యెహోవా అది అబ్రాముకు నీతిగా ఎంచెను.

ఆదికాండము 15:6

ఇది ఒక అప్రసిద్ధమైన చిన్న కథనముగా ఉంది. దీనికి క్రొత్త శీర్షికలు విశేషతలు లేవు కాబట్టి, దీనిని మనము ఆదమరిచే అవకాశం ఉంది. కాని ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు? ఎందుకంటే ఈ చిన్న కథనములో అబ్రాహాము ‘నీతి’ని పొందుకున్నాడు. ఇది ఒక పూజ చేయుట ద్వారా ఎన్నడును తరగని లేక కోల్పోబడని మేలులను పొందుకొనుటతో సమానముగా ఉన్నది. దేవుని ఎదుట సరిగా నిలువబడుటకు మనకు కావలసినది నీతి మరియు నీతి మాత్రమే.

మన సమస్యను సమీక్షించుట: భ్రష్టత్వము

దేవుని దృష్టికోణములో, మనము దేవుని పోలికెలో చేయబడినప్పటికీ పోలికెను భ్రష్టముచేయు కార్యము ఏదో జరిగింది. ఇప్పుడు తీర్పు ఏమిటంటే

యెహోవా మనుష్యుల కుమారులను స్వర్గం నుండి చూస్తాడు, అర్థం చేసుకునేవారు, దేవుణ్ణి వెదకుతున్నవారు ఎవరైనా ఉన్నారా అని. అందరూ పక్కకు తప్పుకున్నారు, వారు కలిసి అవినీతిపరులుగా మారారు; మంచి చేసేవారు ఎవరూ లేరు, ఒకరు కూడా లేరు.

కీర్తనలు 14:2-3

స్వాభావికముగా మనము ఈ భ్రష్టత్వమును చూడగలము. ఇందుమూలముగానే మనము పాపమును గ్రహించి శుద్ధీకరణ అవసరతను గుర్తిస్తాము, కాబట్టి కుంభమేళ వంటి పండుగలలో ప్రజలు విరివిగా పాలుపంచుకుంటారు. మనలను గూర్చి మనము కలిగియున్న ఈ అభిప్రాయమును ప్రార్థ స్నాన (లేక ప్రథాసన) మంత్రము కూడా వ్యక్తపరుస్తుంది:

నేను పాపిని. నేను పాపమునకు ఫలితముగా ఉన్నాను. నేను పాపములో జన్మించాను. నా ప్రాణం పాపములో ఉన్నది. నేను పాపులలో ప్రథముడను. సౌందర్యవంతమైన నేత్రములు కలిగిన ప్రభువా, నన్ను రక్షించు, బలిని స్వీకరించు ప్రభువా.

మన భ్రష్టత్వమునకు ఫలితంగా మనలో నీతి లేదు కాబట్టి మనము నీతిగల దేవుని నుండి వేరుచేయబడతాము. మన భ్రష్టత్వము కారణంగా మనలోని చెడ్డ కర్మ ఎదిగింది – దానికి జీతముగా నిష్ఫలతను మరణమును అనుగ్రహించింది. దీనిని మీరు నమ్మకపోతే వార్తాపత్రికలోని వార్తలను చూసి గత 24 గంటలలో ప్రజలు ఏమి చేయుటకు పూనుకున్నారో చూడండి. మనము జీవమును సృష్టించిన వాని నుండి దూరమయ్యాము కాబట్టి వేదపుస్తకములో (బైబిలు) యెషయా ఋషి వ్రాసిన మాటలు నెరవేర్చబడుటను చూడండి

మనమందరం అపవిత్రుడిలా మారిపోయాము, మన నీతి చర్యలన్నీ మురికి రాగులవలె ఉన్నాయి; మనమందరం ఒక ఆకులాగా మెరిసిపోతాము, గాలిలాగే మన పాపాలు మనలను తుడిచివేస్తాయి.

యెషయా 64:6

అబ్రాహాము మరియు నీతి

కాని ఇక్కడ అబ్రాహాము మరియు దేవునికి మధ్య, అబ్రాహాము ‘నీతి’ని – దేవుడు అంగీకరించు విధముగా – పొందుకున్నాడు అని మనము చూస్తాము, కాని ఇది ఆదమరిచే విధముగా మధ్యలో ఒక చిన్న వాక్యములో ఇవ్వబడింది. అయితే ఈ నీతిని సంపాదించుటకు అబ్రాహాము ఏమి చేశాడు’? మరొకసారి ఇది ఎంత క్లుపంగా ఇవ్వబడింది అంటే, మనము దీనిని ఆదమరిచే అపాయము ఉంది, అబ్రాహాము ‘నమ్మాడు’ అంతే అని ఇది సెలవిస్తుంది. అంతేనా?! మనలో అధిగమించలేని పాపము మరియు భ్రష్టత్వము అను సమస్య ఉన్నది కాబట్టి తరతరాలుగా మనము నీతిని పొందుకొనుటకు స్వాభావికముగా ఒక క్లిష్టమైన మరియు కష్టమైన మతములను, కృషులను, పూజలను, నైతికతలను, సన్యాసి జీవితములను, బోధలను మొదలగువాటిని వెదకుచు వస్తున్నాము. అయితే అబ్రాహాము అనబడు ఈ వ్యక్తి విలువైన ఈ నీతిని కేవలం ‘నమ్ముట’ ద్వారా మాత్రమే పొందాడు. ఇది ఎంత సులువుగా ఉన్నదంటే దీనిని మనము ఆదమరిచే అవకాశం ఉంది.

అబ్రాహాము నీతిని ‘సంపాదించలేదు’; అది అతనికి ‘ఆపాదించబడింది’. కాబట్టి, ఇక్కడ తేడా ఏమిటి? సరే, ఏదైనా ఒకటి ‘సాధించాలంటే’ దాని కొరకు మీరు పని చేయాలి – మరియు పని చేసినప్పుడు దానికి మీరు అర్హులవుతారు. ఇది మీరు చేసిన పని కొరకు జీతమును సంపాదించుటను పోలియున్నది. కాని ఏదైనా మీకు ఆపాదించబడినప్పుడు, అది మీకు ఇవ్వబడుతుంది. అనగా ఉచితముగా ఇచ్చిన ఒక బహుమానము వలె అది సంపాదించబడినది కాదు లేక మన యోగ్యత వలన పొందినది కాదు, కాని ఉచితముగా పొందుకొనబడినది.

నీతి అనేది దేవుని ఉనికిని నమ్ముట ద్వారా, లేక తగిన విధముగా మంచి కార్యములను మత కార్యములను చేయుట ద్వారా కలుగుతుంది అని నీతిని గూర్చి మనము కలిగియున్న సామాన్య అవగాహనను అబ్రాహాము వృత్తాంతము తిరగవ్రాస్తుంది. అబ్రాహాము ఈ విధంగా నీతిని పొందలేదు. అతనికి ఇవ్వబడిన వాగ్దానమును అతడు నమ్మాడు అంతే, మరియు అతనికి నీతి ఇవ్వబడినది లేక ఆపాదించబడినది.

మిగిలిన బైబిలు అంతా ఈ సంభాషణను మన కొరకు ఒక చిహ్నముగా చూస్తుంది. దేవుడు చేసిన వాగ్దానము మీద అబ్రాహాము కలిగియుండిన నమ్మకము, మరియు దాని ద్వారా పొందిన నీతి, మనము కూడా అనుసరించవలసిన ఒక పద్ధతి అయ్యున్నది. దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ ఇచ్చు వాగ్దానముల మీద సువార్త అంతా ఆధారపడి ఉంటుంది.

అయితే నీతిని పొందుటకు వెల ఎవరు చెల్లిస్తారు లేక దానిని ఎవరు సంపాదిస్తారు? ఈ విషయమును మనము తదుపరి చూద్దాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *