Skip to content

బలి కొరకైన సార్వత్రిక ఆవశ్యకత

  • by

ప్రజలు ఊహలలోను పాపములోను నివసిస్తారని తరాల తరబడి సాధువులు ఋషీమునులు ఎరిగియున్నారు. దీని వలన వారికి “శుద్ధీకరణ” అవసరత ఉన్నదని అన్ని మతములు, తరములు మరియు విద్యా స్థాయిలలో ఉన్న ప్రజలు గ్రహించటం జరిగింది. ఇందు నిమిత్తమే అనేక మంది కుంభమేళ పండుగలో పాలుపంచుకొని పూజ చేయుటకు ముందు ప్రార్థ స్నాన (లేక ప్రతస్నాన) మంత్రమును చదువుతారు (“నేను పాపిని, నను పాపము ద్వారా జన్మించినవాడిని. నేను పాపములో జన్మించాను. నా ఆత్మ పాపపు ఆధీనంలో ఉంది. నేను పాపులలో ప్రధముడను. అందమైన కన్నులు గల ప్రభువా, నన్ను రక్షించు, బలులు స్వీకరించు ప్రభువా, నన్ను రక్షించు.”) శుద్ధి చేయబడాలనే ఈ అవసరతతో పాటుగా మన పాపముల కొరకు మరియు మన జీవితములలోని చీకటి (తమ) కొరకు “వెల” చెల్లించుటకు బలిని అర్పించు అవసరత ఉన్నదను భావన కూడా ఉంది. అలాగే పూజల అర్పించుటలో, లేక కుంభమేళ మరియు ఇతర పండుగలలో అర్పణలు చెల్లించాలి అనే భావనకు స్పందిస్తూ ప్రజలు సమయము, డబ్బు, మరియు సన్యాసిగా మారుట వంటి బలులు అర్పిస్తారు. ఒక ఆవు నదిని ఈదుచుండగా దాని తోక పట్టుకొని ఈదు ప్రజలను గూర్చి నేను విన్నాను. ఇది ప్రాయశ్చిత్తము పొందుటకు పూజగా లేక బలిగా చేయబడుతుంది.

అత్యంత పురాతనమైన మత గ్రంథములు ఉనికిలో ఉన్న సమయము నుండే బలి అర్పించవలసిన ఈ అవసరత ఉనికిలో ఉండినది. బలి అర్పించుట చాలా ప్రాముఖ్యము మరియు దానిని అర్పించవలసియున్నది అని మన భావనలు మనకు చెబుతాయని ఈ గ్రంథములు ఉద్ఘాటిస్తాయి. ఉదాహరణకు ఈ క్రింది బోధనలను పరిగణించండి:

కథోపనిషదు (హైందవ గ్రంథము) యొక్క కథానాయకుడైన నచికేత ఇలా అంటాడు:

“దహనబలి స్వర్గమునకు మార్గమని మరియు స్వర్గమునకు నడిపిస్తుంది అని నాకు తెలుసు” కథోపనిషదు 1.14

హైందవుల పుస్తకము అంటుంది:

“బలి అర్పించుట ద్వారా మనుష్యుడు స్వర్గం చేరతాడు” శతపత బ్రహ్మణ VIII.6.1.10

“బలి అర్పించుట ద్వారా, మానవులు మాత్రమేగాక దేవుళ్లు కూడా అమరత్వమును పొందగలరు” శతపత బ్రహ్మణ II.2.2.8-14

కాబట్టి బలి అర్పించుట ద్వారా మనము అమరత్వమును మరియు స్వర్గమును (మోక్షం) పొందగలము. అయితే మన పాపములు/తమకు పరిహారం చెల్లించుటకు ఏ విధమైన బలి కావాలి మరియు అది ఎంత పరిమాణములో ఉండాలి? అనేది నేటికి ఎదురయ్యే ప్రశ్న. ఐదు సంవత్సాలు సన్యాసిగా ఉంటే సరిపోతుందా? బీదలకు డబ్బులిచ్చుట సరిపోయే బలియేనా? అయినట్లయితే, ఎంత?

ప్రజాపతి / యెహోవా: బలి అర్పించుటలో సమకూర్చువాడు

ఆదిమ వేదాలలో, సృష్టియావత్తు యొక్క నిర్మాణకర్తయైన ప్రభువును – విశ్వమును చేసి దానిని నియంత్రించువాడు – ప్రజాపతి అని పిలచేవారు. ప్రజాపతి ద్వారా సమస్తమును ఉనికిలోనికి వచ్చింది.

వేద పుస్తకము (బైబిలు) యొక్క ఆదిమ హెబ్రీ గ్రంథములను తోరా అని పిలుస్తారు. తోరా సుమారుగా క్రీ.పూ. 1500లో ఇంచుమించు రిగ్ వేదము వ్రాయబడిన కాలములోనే వ్రాయబడింది. సర్వ సృష్టికి సృష్టికర్తయైన ఒక సజీవుడైన దేవుడు ఉన్నాడని ప్రకటిస్తూ తోరా ఆరంభమవుతుంది. వాస్తవిక హెబ్రీ భాషలో ఈ దేవుని ఎలోహిమ్ లేక యాహ్వె అని పిలిచేవారు మరియు ఈ రెండు పదములు హెబ్రీ గ్రంథములలో మార్చి మార్చి ఉపయోగించబడ్డాయి. కాబట్టి, రిగ్ వేదములోని ప్రజాపతి వలె, తోరాలోని యాహ్వె (యెహోవా)లేక ఎలోహిమ్ సమస్త సృష్టికి ప్రభువుగా ఉన్నాడు.

తోరా యొక్క ఆరంభములో, అబ్రాహాము అను ఋషితో జరిగిన సంభాషణలో యెహోవా తనను తాను “సమకూర్చు” దేవునిగా బయలుపరచుకున్నాడు. సమకూర్చు యెహోవా (హెబ్రీ భాషలో యెహోవా యీరే) మరియు రిగ్ వేదములోని “సృష్టములను కాపాడు లేక భద్రపరచు” ప్రజాపతి మధ్య అనేక పోలికలను నేను గమనించాను.

యెహోవా ఏ విధముగా సమకూర్చుతాడు? ప్రజలకున్న బలులు అర్పించవలసిన అవసరతను గూర్చి మనము ఇంతకు ముందే చూశాము, కాని మనము అర్పించు బలులు సరిపోతాయి అనే నిశ్చయత మాత్రం మనకు కలుగలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనకు ఉన్న ఈ అవసరతను తీర్చుటకు ప్రజాపతి ఏ విధముగా సమకూర్చుతాడో తండ్యమహ బ్రహ్మణ ప్రకటిస్తుంది. అక్కడ ఇలా వ్రాయబడియున్నది:

“స్వయం-బలి అర్పించిన ప్రజాపతి (సర్వసృష్టికి ప్రభువు) దేవతల కొరకు తనను తాను అర్పించుకొనెను” తండ్యమహ బ్రహ్మణ 7వ అధ్యాయము 2వ ఖండము.

[సంస్కృతములో, “ప్రజపతిర్దేవబ్యం ఆత్మనం యజ్ఞం కృత్వ ప్రయచ్చత్”].

ఇక్కడ ప్రజాపతి ఏక వచనములో ఉన్నది. తోరాలో ఒకే ఒక్క యెహోవా ఉన్నట్లే ఇక్కడ ఒకే ప్రజాపతి ఉన్నాడు. తరువాత పురాణ సాహిత్యాలలో (క్రీ.శ. 500-1000 మధ్య కాలములో వ్రాయబడినవి) అనేక మంది ప్రజాపతులు గుర్తించబడ్డారు. అయితే పైన ఇవ్వబడిన ఆదిమ గ్రంథములో ప్రజాపతి ఏక వచనముగా ఉన్నది. మరియు ప్రజాపతి తననుతాను అర్పించుకుంటాడని లేక ఆయన ఇతరుల కొరకు అర్పింపబడు బలి అని ఈ కథనములో మనము చూడవచ్చు: రిగ్ వేదము దీనిని ఈ విధముగా నిర్థారిస్తుంది.

“ప్రజాపతియే నిజమైన బలి” [సంస్కృతం: ‘ప్రజాపతిర్ యజ్ఞః’]

సతపత బ్రహ్మణలోని ఈ క్రింది మాటలను అనువదించుట ద్వారా సంస్కృతం పండితుడైన హెచ్. అగుయిలర్ ఈ విధముగా వ్యాఖ్యానిస్తాడు:

“అవును, బలి అర్పించబడిన (వధ) మరొకటి లేదు, కేవలం ప్రజాపతి మాత్రమే బలి అయ్యాడు, మరియు దేవుళ్లు ఆయనను బలిగా అర్పించారు. దీనిని గూర్చి ఋషి ఈ విధముగా చెప్పాడు: ‘బల్యర్పణ సహాయముతో దేవుళ్లు బలిని అర్పించారు – బల్యర్పణ యొక్క సహాయముతో వారు ఆయనను (ప్రజాపతిని) అర్పించారు కాబట్టి – ఇవి మొదటి నియమాలు, ఎందుకంటే ఈ నియమములు మొదట స్థాపించబడ్డాయి”  హెచ్. అగుయిలర్, ది సాక్రిఫైస్ ఇన్ ది రిగ్ వేద

యెహోవ లేక ప్రజాపతి మన అవసరతను గుర్తించి మన కొరకు స్వయం-బలిని అర్పించాడని ఆరంభ దినముల నుండే వేదాలు ప్రకటించుచున్నాయి. రిగ్ వేదములోని పురుష-ప్రజాపతి పురుషసూక్తను బలి అర్పించిన అంశము మీద తరువాత వ్యాసములలో దృష్టి పెట్టునప్పుడు ఆయన దీనిని ఎలా చేశాడో చూద్దాము. శ్వేతస్వతరోపనిషదు ఇలా చెబుతుంది,

‘నిత్య జీవమును పొందుటకు వేరొక మార్గము లేదు’ (సంస్కృతం: నాన్యఃపంథ విద్యతే – అయనయ) శ్వేతస్వతరోపనిషదు 3:8

మీకు నిత్య జీవము మీద ఆసక్తి ఉంటే, మీకు మోక్షము లేక జ్ఞానోదయము కావాలని ఆశిస్తే, ప్రజాపతి (యెహోవా) ఎందుకు మరియు ఎలా మన కొరకు స్వయం-బలిని అర్పించాడో తెలుసుకొను ప్రయాణములో మీరు పాలుపంచుకొనుట ఉత్తమమైన విషయము, తద్వారా మనము స్వర్గమును పొందవచ్చు. వేదాలు మనలను ముసుగులో ఉంచవు. రిగ్ వేదములోని పురుషసూక్త ప్రజాపతి నరవతారమును దాల్చుటను గూర్చి మన కొరకు ఆయన చేసిన త్యాగమును గూర్చి మాట్లాడుతుంది. యేసు సత్సంగ్ ను (నజరేయుడైన యేసును) మరియు మనకు మోక్షమును లేక ముక్తిని (అమరత్వము) ప్రసాదించుటకు ఆయన చేసిన స్వయం బలిని గూర్చి బైబిలు (వేద పుస్తకము) వివరించు విధముగా పురషను గూర్చి వివరించు పురుషసూక్తను ఇక్కడ మనము పరిచయం చేద్దాము. ఇక్కడ యేసు యొక్క బలిని మరియు ఆయన మనకిచ్చిన బహుమానమును ప్రత్యక్షంగా చూద్దాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *