Skip to content

దీపావళి, ప్రభువైన యేసు

  • by

నేను భారత దేశంలో పని చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి దీపావళి అనుభవాన్ని “దగ్గరగా” పొందాను. అక్కడ నేను ఒక నెల పాటు ఉండాల్సి వచ్చింది. నేను ఉన్న మొదటి రోజుల్లో నా చుట్టూ దీపావళి వేడుక జరిగింది. నాకు జ్ఞాపకం ఉన్నదంతా టపాసులు మాత్రమే – పొగతో గాలి దట్టంగా ఉంది, కళ్ళుకు పలచగా నొప్పి వచ్చింది. నా చుట్టూ జరుగుతున్న ఉత్సాహం అంతటితో దీపావళి గురించి నేను నేర్చుకోవాలని కోరుకున్నాను, దీపావళి అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? అని నేర్చుకోవాలని కోరుకున్నాను. దానితో ప్రేమలో పడ్డాను.

“దీపాల పండుగ” నన్ను చాలా ఉత్తేజపరచింది. ఎందుకంటే నేను యెషుసత్సంగ్ అనుచరుడను, ఆయనయందు విశ్వాసముంచుతున్నాను. యెషుసత్సంగ్  అంటే ప్రభువైన యేసు అని కూడా పేరు. ఆయన బోధలోని ముఖ్య సందేశం ఆయన వెలుగు మనలోని చీకటిని జయిస్తుంది. కనుక దీపావళి ఎక్కువగా ప్రభువైన యేసులా ఉంది.

మనలో చాలామందిమి మనలో ఉన్న చీకటితో సమస్య ఉందని గుర్తిస్తున్నాం. ఈ కారణంగా అనేక లక్షల మంది కుంభమేలా పండుగలో పాల్గొంటారు (– ఎందుకంటే మనలో పాపాలు ఉన్నాయని మనలో లక్షలాదిమందికి తెలుసు. వాటిని శుద్ధి చేసుకోవాలనీ, మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన అవసరం ఉందనీ తెలుసు. అంతేకాకుండ మనలో పాపం లేక చీకటి ఉందని ప్రముఖంగా పేరుపొందిన పురాతన ప్రార్థన ప్రార్థస్నాన (లేక ప్రతాసన) మంత్రం దీనిని గుర్తించింది.

నేను పాపిని, పాపానికి ఫలితం నేను. పాపంలోనే పుట్టాను. నా ఆత్మ పాపం ఆధీనంలో ఉంది. పాపులలో  మిక్కిలి దుష్టుడను. రమ్యమైన దృష్టి ఉన్న ఓ ప్రభూ, బలియాగానికి ప్రభువా నన్ను రక్షించు.

అయితే మనలో ఉన్న ఈ చీకటి తలంపులన్నీ లేక పాపం అంతా ప్రోత్సాహించడం లేదు. వాస్తవానికి కొన్నిసార్లు మనం దీనిని “చెడువార్త” అని తలస్తుంటాం. ఈ కారణంగా వెలుగు చీకటిని జయిస్తుంది అనే తలంపు మనకు గొప్ప ఆశాభావాన్ని, వేడుకను ఇస్తుంది. అందుచేత కొవ్వొత్తులు, మిఠాయిలు, టపాసులతో పాటు వెలుగు చీకటిని జయిస్తుందనే ఈ ఆశాభావాన్నీ, వెలుగునూ దీపావళి మనకు తెలియచేస్తుంది.

ప్రభువైన యేసు – లోకానికి వెలుగు

ప్రభువైన యేసు ఖచ్చితంగా చేసినది ఇదే. వేద పుస్తకాన్ (లేక బైబిలు)లోని సువార్త ప్రభువైన యేసును ఈ విధంగా వివరిస్తుంది:

(యోహాను 1:1-5) – ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

గమనించండి, ఈ “వాక్కు” దీపావళి వ్యక్తపరచే ఆశాభావం నెరవేర్పు. ఈ “వాక్కు” లోనికి ఈ ఆశాభావం దేవుని నుండి వస్తుంది. తరువాత వచనాలలో ఆ వాక్కు ‘ప్రభువైన యేసు’ అని యోహాను గుర్తిస్తున్నాడు.  సువార్త ఇంకా ఇలా చెపుతుంది:

(యోహాను 1:9-13) నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. 11. ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

ప్రభువైన ఈ లోకంలోని “మనుష్యులందరికీ వెలుగు ఇవ్వడానికి” ఏ విధంగా వచ్చాడో ఈ భాగం మనకు వివరిస్తుంది. ఇది కేవలం క్రైస్తవులకే అని కొందరు ఆలోచిస్తారు, అయితే గమనించండి, ‘దేవుని పిల్లలు అవడానికి’ ‘లోకం’లోని ‘ప్రతీఒక్కరికీ’ ఈ ఆహ్వానం ఇవ్వబడిందని చెపుతుంది. ఈ ఆహ్వానం ప్రతిఒక్కరికి ఇవ్వబడింది. కనీసం ఆయనలో ఆసక్తి చూపించినవారందరికీ ఇవ్వబడింది. దీపావళిలా వెలుగు మనుష్యులలో ఉన్న చీకటిని జయిస్తుంది.

అనేక వందలాది సంవత్సరాలకు ముందు ప్రభువైన యేసు జీవితం వాగ్దానం చెయ్యబడింది

ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అసాధారణమైన అంశం – ఆయన మానవ అవతారం ముందుగా సూచించబడింది, అనేక విధాలుగానూ, ఆదిమ మానవ చరిత్ర నుండి అనేక దృష్టాంతాలలోనూ ముందుగా చెప్పబడింది. అవి అన్నీ హెబ్రీ వేదాలలో పొందుపరచబడ్డాయి. కనుక ఆయన ఈ భూమిమీదకు రావడానికి ముందే ఆయన గురించి రాశారు. ఆయన మానవ అవతారానికి సంబంధించిన ముందు సూచనలు అత్యంత పురాతన రుగ్ వేదాలలో కూడా జ్ఞాపకం చెయ్యబడ్డాయి. అవి రాబోతున్న పురుషను స్తుతిస్తున్నాయి, మను జలప్రళయం లాంటి ఆరంభ సంఘటనలను కొన్నింటిని నమోదు చేసాయి. ఈ వ్యక్తినే బైబిలు – వేదం పుస్తకాన్ – ‘నోవాహు’ అని పిలుస్తుంది. ఈ పురాతన సంఘటనలు మనుష్యులలోని పాపపు చీకటిని వర్ణిస్తున్నాయి. అదే సమయంలో ‘పురుష’, ప్రభువైన యేసు క్రీస్తు రాకడను గురించీ వర్ణిస్తుంది.

రుగ్ వేదాలలో ముందుగా చెప్పిన ప్రవచనాలలో దేవుడు మానవుడిగా రావడం, పరిపూర్ణుడైన మానవుడు, పురుష, బలియాగం కాబోతున్నాడు. ఈ బలియాగం మన పాపాల కర్మకోసం వెలను చెల్లించడానికీ, మనలను అంతరంగంలో శుద్ధి చెయ్యడానికీ సరిపోతుంది. శుద్ధి చెయ్యడం, పూజలు మంచివే అయితే మన విషయంలో అవి పరిమితమైనవి. అంతరంగంలో శుద్ధి చెయ్యడానికి మనకు మరింత శ్రేష్ఠమైన బలి అవసరం.

హెబ్రీ వేదాలు ప్రభువైన యేసు గురించి ప్రవచించాయి

రుగ్ వేదాలలో ఉన్న ఈ కీర్తనలతో పాటు, హెబ్రీ వేదాలు ఈ రాబోతున్న వాని గురించి ప్రవచించాయి.  హెబ్రీ వేదాలలో ప్రముఖమైనది యెషయా (క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలలో జీవించాడు, అంటే ప్రభువైన యేసు భూమి మీద జీవించడానికి 750 ముందు జీవించాడు.) ఆయనకు రాబోతున్న వాని గురించిన అనేక అంతర్భావాలు ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తును గురించి ప్రకటిస్తున్నప్పుడు దీపావళిని ఎదురుచూస్తున్నాడు:

(యెషయా 9:2) చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.)

ఇలా ఎందుకు జరుగుతుంది? యెషయా కొనసాగిస్తున్నాడు:

(యెషయా 9:6) ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

అయితే ఆయన మనుష్య అవతారం అయినప్పటికీ, ఆయన మనకు సేవకుడు అవుతాడు, మన చీకటి అవసరాలలో ఆయన మనకు సహాయం చేస్తాడు.

(యెషయా 53:4-6) నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. 5. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.6. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

ప్రభువైన యేసు క్రీస్తు సిలువను గురించి యెషయా వివరిస్తున్నాడు. ఈ కార్యం జరగడానికి 750 సంవత్సరాలకు ముందు దీనిని చేసాడు. మనలను స్వస్థపరచే బలియాగంగా దీనిని వివరిస్తున్నాడు. ఈ సేవకుడు చెయ్యబోయే ఈ కార్యం దేవుడు ఆయనతో చెప్పినట్టుగా ఉంది.

(యెషయా 49:6-7) నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.7. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

కాబట్టి గమనిచండి! ఇది నాకోసం, ఇది నీ కోసం. ఇది ప్రతిఒక్కరి కోసం.

అపొస్తలుడైన పౌలు మాదిరి

వాస్తవానికి తన కోసం ప్రభువైన యేసు బలియాగాన్ని ఖచ్చితంగా ఆలోచించని ఒకే వ్యక్తి పౌలు. యేసు నామాన్ని వ్యతిరేకించాడు. అయితే ప్రభువైన యేసును ఒకసారి ఎదుర్కొన్నాడు, ఫలితంగా తరువాత దినాలలో ఇలా రాసాడు:

(2 కొరింథు 4:6) గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభు వనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

పౌలు ప్రభువైన యేసును వ్యక్తిగతంగా కలుసుకొన్నాడు, ఫలితంగా ‘తన హృదయంలో ప్రకాశించడానికి’ వెలుగును కలిగించాడు.

నీ కోసం ప్రభువైన యేసు వెలుగును అనుభవించడం

చీకటినుండీ, పాపం నుండీ ఈ ‘రక్షణ’ పొందడానికీ, యెషయా ప్రవచించిన వెలుగుగా మారడానికీ, ప్రభువైన యేసు పొందినది, పౌలు అనుభవించినదానిని మనం పొందడానికి మనం  మనం ఏం చెయ్యాలి?ఈ ప్రశ్నకు జవాబును మరొక పత్రికలో ఇలా రాసాడు:

(రోమా 6:23)  ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఇది కృపావరం అని పిలుస్తున్నాడని గమనించండి. ఒక బహుమానం, దాని నిర్వచనం ప్రకారం, దానిని మనం సంపాదించుకోలేం. ఎవరైనా నీవు సంపాదించుకోకుండానే నీకు ఇచ్చినప్పుడు లేక నీకు అర్హత లేకపోయినా నీకు బహుమానం ఇచ్చినప్పుడు అది నీ స్వాధీనంలో లేకుండా లేక నీవు దానికి ‘స్వీకరించనప్పుడు’ దాని వల్ల నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. మరింత సమాచారం ఇక్కడ వివరించబడింది. ఆ కారణంగా యోహాను ఇంతకుముందే ప్రస్తావించాడు, ఇలా రాసాడు:

(యోహాను 1:12) తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

కనుక ఆయనను అంగీకరించండి. ఉచితంగా అనుగ్రహించబడిన ఈ బహుమతి కోసం అడగడం ద్వారా నీవు దీనిని చెయ్యవచ్చు, నీవు అడగడానికి కారణం ఆయన సజీవుడు. అవును మన పాపాల కోసం ఆయన బలియాగం అయ్యాడు. అయితే మూడు రోజుల తరువాత ఆయన తిరిగి సజీవుడయ్యాడు. అనేక సంవత్సరాల క్రితం శ్రమలు పొందిన సేవకుని గురించి ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రకారం ఆయన శ్రమను అనుభవించాడు, ఆయన:

(యెషయా 53:11) అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

కనుక ప్రభువైన యేసు సజీవుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనను వింటాడు.  మీరు ప్రార్థస్నాన (లేక ప్రతాసన) మంత్రం ప్రార్థన చెయ్యవచ్చు, ఆయన మీ ప్రార్థన వింటాడు, ఆయన నీకోసం తనను తాను బలియాగంగా అప్పగించుకొన్నాడు కనుక ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయనకు సమస్త అధికారం ఉంది. ఇక్కడ నీవు ఆయనకు చెయ్యవలసిన ప్రార్థన ఇక్కడ ఉంది:

నేను పాపిని, పాపానికి ఫలితం నేను. పాపంలోనే పుట్టాను. నా ఆత్మ పాపం ఆధీనంలో ఉంది. పాపులలో  మిక్కిలి దుష్టుడను. రమ్యమైన దృష్టి ఉన్న ఓ ప్రభూ, బలియాగానికి ప్రభువా నన్ను రక్షించు.

ఇక్కడ ఉన్న ఇతర వ్యాసాలను చూడండి. మానవ జాతి ఆరంభంనుండి మొదలౌతాయి. చీకటి నుండి మనలను రక్షించడానికీ, మనకు వెలుగును తీసుకొనిరావడానికీ ఈ దేవుని ప్రణాళికను సంస్కృతి, హెబ్రీ వేదాలు చూపిస్తున్నాయి. ఇది మనకు బహుమతిగా అందించబడింది.

దీపాలు వెలిగిస్తుండగానూ, బహుమతులు ఒకరితో ఒకరు పంచుకొంతుండగానూ, అనేక సంవత్సరాల క్రితం పౌలు అనుభవించిన విధంగా ప్రభువైన యేసు మీకు నుండి మీకు అందించబడుతున్న ఆంతరంగిక వెలుగును మీరు పొందవచ్చు. సంతోషకరమైన దీపావళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *