సంస్కృతము మరియు హెబ్రీ వేదముల మధ్య పోలికలు: ఎందుకు?

  • by

సంస్కృత వేదములలో మను వృత్తాంతము మరియు హెబ్రీ వేదములలో నోవహు వృత్తాంతము మధ్య ఉన్న పోలికలను మనము చూశాము. ఈ పోలికలు కేవలం జలప్రళయ వృత్తాంతములలో మాత్రమే లేవు. కాలారంభములో వాగ్దానము చేయబడిన పురుష బలికి మరియు హెబ్రీ పుస్తకమైన ఆదికాండములో వాగ్దానము చేయబడిన సంతానమునకు మధ్య కూడా పోలిక ఉన్నది. అయితే ఈ పోలికలను మనము ఎందుకు చూస్తాము? ఇవి యాదృచ్ఛికమా? ఒక వృత్తాంతము మరొక దాని నుండి దొంగిలించే లేక సేకరించే అవకాశం ఉందా? ఇక్కడ ఒక సూచనను చూస్తాము.

బాబెలు గోపురము – జలప్రళయము తరువాత

నోవహు యొక్క వృత్తాంతమును అనుసరిస్తూ, వేద పుస్తకము అతని ముగ్గురు కుమారుల యొక్క వారసులను గూర్చి నివేదిస్తూ, “వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను” (ఆదికాండము 10:32) అని వ్యాఖ్యానిస్తుంది. మనుకు నలుగురు కుమారులు ఉన్నారని, వారి ద్వారా మానవాళి అంతా ఉనికిలోనికి వచ్చింది అని సంస్కృత వేదములు ప్రకటిస్తాయి. అయితే ఈ ‘వ్యాప్తి’ ఎలా జరిగింది?

నోవహు ముగ్గురు కుమారుల వారసుల యొక్క పట్టికను పురాతన హెబ్రీ గ్రంథములు ఇచ్చుచున్నవి – పూర్తి పట్టికను ఇక్కడ చూడండి.  ఈ వారసులు దేవుని (ప్రజాపతి) ఆజ్ఞను – అనగా ‘భూమిని నిండించమని’ (ఆదికాండము 11:4) సెలవిచ్చిన సృష్టికర్త ఆజ్ఞను – ఏ విధంగా ఉల్లంఘించారో ఈ నివేదిక తెలియపరుస్తుంది. బదులుగా ఈ ప్రజలు ఒకే చోట ఉండునట్లు ఒక గోపురమును నిర్మించగోరారు. ఈ గోపురము ‘ఆకాశమునంటు’ (ఆదికాండము 11:4) విధముగా ఉండాలని వారు కోరారు, అనగా నోవహు వారసులైన వీరు సృష్టికర్తకు బదులుగా నక్షత్రములను, సూర్యుని, చంద్రుని, గ్రహములను మొదలగువాటిని ఆరాధించ ఉద్దేశముతో ఒక గోపురమును కట్టసాగారు. నక్షత్రముల ఆరాధన మెసొపొతమియలో (ఈ వారసులు నివసించిన స్థలము) ఆరంభమై లోకమంతా వ్యాపించింది అను విషయము సుపరిచితమైనదే.

ఈ విధంగా మన పితరులు సృష్టికర్తను ఆరాధించుటకు బదులుగా నక్షత్రములను ఆరాధించారు. దీనిని భంగపరచుటకు, ఆరాధనలోని భ్రష్టత్వమును అదుపు చేయుటకు సృష్టికర్త ఇలా చేయుటకు నిర్ణయించుకున్నాడని వృత్తాంతము తెలియపరుస్తుంది

…వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము.

ఆదికాండము 11:7

దీనికి ఫలితంగా, నోవహు యొక్క మొదటి వారసులైన వీరు ఒకరిమాట ఒకరు అర్థము చేసుకోలేకపోయారు, ఈ విధంగా సృష్టికర్త

భూమియందంతట వారిని చెదరగొట్టెను 

ఆదికాండము 11:8

ఈ ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుటకు కష్టమైన తరువాత, వారు తమ తమ భాషల చొప్పున వలసలు వెళ్లారు. ఈ విధంగా వారు ‘చెదరిపోయారు.’ నేడు లోకములోని వేర్వేరు ప్రజల గుంపులు వేర్వేరు భాషలను ఎందుకు మాట్లాడుతున్నారో ఇది వివరిస్తుంది. ప్రతి గుంపు తమ వాస్తవిక స్థావరమైన మెసొపొతమియ నుండి (కొన్నిసార్లు అనేక తరములలో) నేడు వారు ఉండు స్థలములకు వలసవెళ్లిపోయింది. ఈ విధంగా, వారి చరిత్రలు ఇక్కడ నుండి విడిపోతాయి. కాని ఆ సమయము వరకు కూడా ప్రతి భాషా గుంపుకు (ఈ మొదటి దేశములను రూపించిన గుంపులు) ఒక సామాన్య చరిత్ర ఉండేది. ఈ సామాన్య చరిత్రలో పురుష యొక్క బలి ద్వారా మోక్షమును గూర్చిన వాగ్దానము మరియు మను (నోవహు) ఇచ్చిన జలప్రళయమును గూర్చిన వృత్తాంతము ఉన్నాయి. సంస్కృత ఋషులు ఈ సన్నివేశములను తాము వ్రాసిన వేదముల ద్వారా మరియు హేబ్రీయులు ఈ సన్నివేశములను తమ వేదము (మోషే ఋషి ఇచ్చిన ధర్మశాస్త్రము) ద్వారా స్మరణకు చేసుకున్నారు.

విభిన్న జలప్రళయ వృత్తాంతముల యొక్క సాక్ష్యము – ప్రపంచమంతటి నుండి

ఆసక్తికరముగా, జలప్రళయ వృత్తాంతము పురాతన హెబ్రీ మరియు సంస్కృత వేదములలో మాత్రమే జ్ఞాపకము చేసుకోబడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్నమైన ప్రజల గుంపులు తమ తమ చరిత్రలలో గొప్ప జలప్రళయమును గూర్చి జ్ఞాపకము చేసుకుంటారు. క్రింద ఇవ్వబడిన పటము దీనిని వివరిస్తుంది.

బైబిలులో ఉన్న జలప్రళయ వృత్తాంతముల దృష్ట్యా లోకమంతటిలోని పలు సంస్కృతులలోని జలప్రళయ వృత్తాంతములు

పటము యొక్క పై భాగములో ప్రపంచవ్యాప్తంగా నివసించుచున్న -ప్రతి ఖండములోని – పలు భాషా గుంపులు ఇవ్వబడినవి. హెబ్రీ జలప్రళయ వృత్తాంతములోని సదరు వివరము వారి జలప్రళయ వృత్తాంతములో కూడా ఉన్నదో లేదో పటము లోపల ఉన్న గడులు (పటమునకు ఎడమ వైపు ఉన్నవి) సూచిస్తాయి. ఈ వివరము వారి జలప్రళయ వృత్తాంతములో ఉన్నదని నలుపు గడులు సూచిస్తాయి, అదే విధంగా సదరు వివరము వారి స్థానిక జలప్రళయ వృత్తాంతములో లేదని ఖాళి గడులు సూచిస్తాయి. అయితే ఈ జలప్రళయము సృష్టికర్త ఇచ్చిన తీర్పు అని, దానిలో కొంతమంది పెద్ద పడవలోనికి ఎక్కుట ద్వారా రక్షించబడ్డారను ‘స్మృతి’ని, ఇంచుమించు అన్ని గుంపులలోను కనీసం కొన్ని సామాన్య విషయములు ఉన్నాయను విషయమును మీరు చూడవచ్చు. మరొక మాటలో, ఈ జలప్రళయమును గూర్చిన స్మృతి కేవలం సంస్కృతము లేక హెబ్రీ వేదములలో మాత్రమే లేదు, కాని లోకములోను మరియు ఇతర ఖండములలోను ఉన్న ఇతర సాంస్కృతిక చరిత్రలలో కూడా ఉన్నది. ఈ సన్నివేశము అనేక సంవత్సరముల క్రితం నిశ్చయముగా జరిగింది అని ఇది తెలియపరుస్తుంది.

 హిందీ క్యాలెండర్ ఇచ్చు సాక్ష్యము

హిందీ క్యాలెండర్ – నెలలోని రోజులు పై నుండి క్రిందికి వరుసలో ఉన్నాయి, కాని ఏడు రోజుల వారము ఉన్నది

హిందీ క్యాలెండర్ కు పాశ్చాత్య క్యాలెండర్ కు మధ్య ఉన్న భిన్నత్వము మరియు పోలిక మునుపటిని గూర్చిన ఒక పంచుకొనబడిన స్మృతికి రుజువుగా ఉన్నది. రోజులు అడ్డముగా (ఎడమవైపు నుండి కుడివైపుకు) గాక నిలువు (పై నుండి క్రిందికి) వరుసలలో ఉండునట్లు ఎక్కువ శాతం హిందీ క్యాలెండర్లు నిర్మించబడతాయి, ఇది పాశ్చాత్య దేశములలో క్యాలండర్లకు సార్వత్రిక నిర్మాణముగా ఉన్నది. భారత దేశములోని కొన్ని క్యాలండర్లు అంకెలను వ్రాయుటకు హిందీ లిపిని ఉపయోగిస్తాయి (१, २,  ३ …) మరికొన్ని రోమన్ అంకెలను ఉపయోగిస్తాయి. ఒక క్యాలెండర్ ను రూపొందించుటకు సరైన క్రమము ఏది లేదు కాబట్టి ఈ భేదములు సహజమే. కాని క్యాలండర్లన్నిటిలో ఒక కేంద్ర పోలిక ఉన్నది. హిందీ క్యాలెండర్ పాశ్చాత్య దేశముల వలెనె ఏడు దినముల వారమును ఉపయోగిస్తుంది. ఎందుకని? ఇవి సూర్యుడు చుట్టూ భూమి మరియు భూమి చుట్టు చంద్రుడు చేయు భ్రమణము మీద ఆధారపడినవి – ఈ విధంగా మానవులందరికీ ఒకే రకమైన జ్యోతిశ్శాస్త్ర పునాదులను ఇచ్చాయి – కాబట్టి క్యాలెండర్ సంవత్సరములుగా మరియు నెలలుగా ఎందుకు విభజించబడిందో మనము అర్థము చేసుకోవచ్చు. కాని ఏడు దినముల వారమునకు జ్యోతిశ్శాస్త్ర కాల ఆధారము లేదు. ఇది మునుపటి చరిత్రలోని (ఎంత కాలము మునుపో ఎవరికీ తెలియదు) ఆచారములు మరియు పరంపర ద్వారా వెలువడింది.

… మరియు భౌద్ధ థాయ్ క్యాలెండర్

థాయ్ క్యాలెండర్ ఎడమవైపు నుండి కుడివైపుకు ఉంటుంది, కాని పాశ్చాత్యము కంటే భిన్నమైన సంవత్సరమును అనుసరిస్తుంది – అయినను ఏడు రోజుల వారమును చూడవచ్చు

ఒక భౌద్ధ మత దేశముగా, థాయ్ ప్రజలు తమ సంవత్సరములను గౌతమ బుద్ధిని యొక్క జీవితము నుండి ఆరంభిస్తారు, కాబట్టి వారి సంవత్సరములు పాశ్చాత్యము కంటే 543 సంవత్సరాల ముందు ఉంటాయి (అనగా క్రీ.శ. 2019 థాయ్ క్యాలెండర్ లో భౌద్ధ యుగము 2562 అయ్యుంటుంది). అయినను వారు ఏడు దినముల వారమును అనుసరిస్తారు. దీనిని వారు ఎక్కడ నుండి పొందుకున్నారు? అనేక దేశములలో నుండి అనేకమైన భిన్నత్వములు గల ఈ క్యాలెండర్లు ఏడు దినముల వారమునకు జ్యోతిశ్శాస్త్ర ఆధారము లేనప్పటికీ దీనినే ఎందుకు అనుసరిస్తారు?

వారమును గూర్చి పురాతన గ్రీకుల యొక్క సాక్ష్యము

పురాతన గ్రీకు ప్రజలు కూడా తమ క్యాలెండర్లో ఏడు దినముల వారమును ఉపయోగించారు.

సుమారుగా క్రీ.పూ. 400 కాలములో జీవించిన పురాతన గ్రీకు వైద్యుడైన హిప్పోక్రేట్స్ ఆధునిక ఔషధమునకు పితామహునిగా గుర్తించబడతాడు. అతడు అనేక పుస్తకములను వ్రాశాడు. వాటిలో అతని ఔషధ పరిశోధనలు నమోదు చేయబడినవి మరియు నేటికి కూడా భద్రపరచబడినవి. ఈ విధంగా చేస్తూ అతడు కూడా కాలమునకు ‘వారము’ను పరిమాణముగా ఉపయోగించాడు. ఒక రోగము యొక్క ఎదుగుచున్న చిహ్నములను గూర్చి అతడు ఇలా వ్రాశాడు:

నాల్గవ దినము ఏడవ దినమును సూచిస్తుంది; ఎనిమిదవ దినము రెండవ వారము యొక్కఆరంభము; ఈ విధంగా, పదకొండవ దినము రెండవ వారములో నాల్గవ దినము కాబట్టి, అది కూడా సూచితముగా ఉన్నది; మరొకసారి, పదిహేడవ దినము కూడా సూచితముగా ఉన్నది. ఎందుకంటే అది పదనాల్గవ దినము నుండి నాల్గవ దినమైయున్నది, మరియు పదకొండవ దినము నుండి ఏడవ దినమైయున్నది (హిప్పోక్రేట్స్, ఎఫోరిజమ్స్. #24)

క్రీ.పూ. 350 కాలములో వ్రాసిన అరిస్టోటిల్ కాలమును సూచించుటకు తరచుగా ‘వారము’ను ఉపయోగించాడు. ఒక ఉదాహరణను చూడండి:

శిశు మరణములు ఎక్కువగా శిశువు ఒక వారము రోజుల వయస్సునకు చేరకముందు జరిగేవి, కాబట్టి ఆ వయస్సులో శిశువుకు పేరుపెట్టుట ద్వారా అది బ్రతికే అవకాశములు ఎక్కువగా ఉంటాయి అను నమ్మికలో నుండి ఇది ఆనవాయితీగా మారిపోయింది. (అరిస్టోటిల్, ది హిస్టరీ అఫ్ అనిమల్స్, భాగం 12, సూ. )

.పూ. 350

ఇండియా మరియు థాయిలాండ్ నుండి చాలా దూరమున ఉన్న ఈ పురాతన గ్రీకు రచయితలు, ‘వారము’ను గూర్చి తమ గ్రీకు పాఠకులు అర్థము చేసుకుంటారు అనే తలంపుతో వ్రాస్తూ ‘వారము’ను గూర్చిన ఈ ఆలోచనను ఎక్కడ నుండి పొందుకున్నారు? ఏడు దినముల వారమును స్థాపించిన ఒక చారిత్రిక సన్నివేశమును (వీరు ఈ సన్నివేశమును మరచిపోయి యుంటారు) ఈ సంస్కృతులు అన్ని ఒకప్పుడు అనుభవించియుండవచ్చు కదా?

హెబ్రీ వేదములు ఇలాంటి ఒక సన్నివేశమునే వర్ణిస్తాయి – లోకము యొక్క ఆరంభ సృష్టి. ఆ వివరణాత్మకమైన పురాతన వృత్తాంతములో సృష్టికర్త లోకమును సృష్టించి ఏడు దినములలో ఆది మానవులను రూపించాడు (ఏడవ దినము విశ్రాంతి తీసుకొని ఆరు దినములలో). దీని వలన, ఆదిమ మానవులు తమ క్యాలెండర్లలో ఏడు దినముల వారమును అనుసరించారు. భాషలు తారుమారు అగుట ద్వారా మానవాళి చెదిరిపోయినప్పుడు, ‘చెదిరిపోవుట’కు ముందు జరిగిన రానున్న బలిని గూర్చిన వాగ్దానము, ఉపద్రవమును కలిగించిన జలప్రళయమును గూర్చిన వృత్తాంతము, ఏడు దినముల వారము వంటి ఈ సన్నివేశములను అనేక భాషలు మాట్లాడు ఈ ప్రజలలో చాలామంది జ్ఞాపకముంచుకున్నారు. ఈ స్మృతులు ఆదిమ మానవాళికి సజీవమైన కలాంకృతులుగాను, వేదములలో నమోదు చేయబడిన ఈ సన్నివేశముల యొక్క చరిత్రకు సాక్ష్యముగాను ఉన్నాయి. హెబ్రీ మరియు సంస్కృత వేదములకు మధ్య ఉన్న పోలికలకు ఈ వర్ణన సూటియైన వివరణగా ఉన్నది. నేడు చాలామంది ఈ రచనలను మూఢనమ్మకములతో కూడిన కల్పితములు అని విసర్జిస్తారు కాని ఈ పోలికలు వాటిని గూర్చి మనలను శ్రద్ధగా ఆలోచించునట్లు చేయాలి.

ఆది మానవులకు ఒక సామన్య చరిత్ర ఉంది మరియు దానిలో మోక్షమును గూర్చి సృష్టికర్త చేసిన వాగ్దానము కూడా ఉండినది. అయితే ఈ వాగ్దానము ఏ విధంగా నెరవేరుతుంది? భాషలు తారుమారగుట ద్వారా ప్రజలు చెదిరిపోయిన తరువాత జీవించిన ఒక పరిశుద్ధమైన వ్యక్తిని గూర్చిన వృత్తాంతముతో మనము కొనసాగిద్దాము. దీనిని మనము తదుపరి చూద్దాము.

[ఇలాంటి పోలికలనే చూపు పురాతన స్మృతులను గూర్చి – కాని ఈ సారి చైనీస్ భాష యొక్క ముక్తాఫల అక్షరములలో – మరింత నేర్చుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *