Skip to content

సూర్యుని క్రింద జీవిత సంతృప్తిని కనుగొనుటకు ప్రయత్నించుట మాయ

  • by

మాయ అను సంస్కృతము పదమునకు ‘లేనిది’ అని అర్థము, కాబట్టి ఇది “వంచన’ అయ్యున్నది. పలువురు సాధువులు మరియు గురుకులములు మాయలో ఉన్న వంచనను పలు విధాలుగా వర్ణించారు, కాని సామాన్యముగా భౌతిక వస్తువులు మన ఆత్మను తప్పుదోవ పట్టించి మనలను బానిసత్వములో బంధించగలవు అను ఆలోచనను వ్యక్తపరచారు. మన ఆత్మ భౌతిక వస్తువులను నియంత్రించి, వాటిని ఆస్వాదించాలని ఆశపడుతుంది. అయితే, అలా చేయడం ద్వారా మనము దురభిలాష, లోభము మరియు కోపమును సేవించుట ఆరంభిస్తాము. తరువాత మనము మన ప్రయత్నములను ముమ్మరము చేసి, తప్పు మీద తప్పు చేసి, మాయ లేక వంచనలో మరింత లోతుగా కూరుకొనిపోతాము. ఈ విధంగా మాయ ఒక సుడిగాలి వలె పని చేసి, మరింత బలమును పొందుకొని, ఒక వ్యక్తిని మరింత బిగపట్టి నిరాశలోనికి నడిపిస్తుంది. తాత్కాలికమైన దానిని శాశ్వతమైన విలువ కలిగినదిగా పరిగణించి, లోకము అందించలేని నిత్యమైన ఆనందమును వెదకునట్లు మాయ చేస్తుంది.

జ్ఞానమును గూర్చి వ్రాయబడిన ఒక అద్భుతమైన తమిళ పుస్తకము, తిరుక్కురళ్, మాయను గూర్చి మరియు మన మీద మాయ యొక్క ప్రభావమును గూర్చి ఈ విధంగా వర్ణిస్తుంది:

“ఒకడు తన బంధములను హత్తుకొనియుండి, వాటిని విడిచిపెట్టుటకు ఇష్టపడనప్పుడు, దుఖములు కూడా వానిని విడువక పట్టుకుంటాయి.”

తిరుక్కురళ్ 35.347–348

హెబ్రీ వేదములలో కూడా తిరుక్కురళ్ ను పోలిన జ్ఞాన సాహిత్యము ఉన్నది. ఈ జ్ఞాన సాహిత్యము యొక్క రచయిత పేరు సొలొమోను. అతడు ‘సూర్యుని క్రింద’ నివసించుచున్నప్పుడు అనుభవించిన మాయను మరియు దాని ప్రభావములను జ్ఞాపకము చేసుకున్నాడు – అనగా, భౌతిక వస్తువులకు మాత్రమే విలువ ఉన్నదని అన్నట్లు జీవిస్తూ, సూర్యుని క్రింద భౌతిక లోకములో నిలిచియుండు ఆనందము కొరకు వెదకుట.

‘సూర్యుని క్రింద’ సొలొమోను మాయను అనుభవించుట

తన జ్ఞానమును బట్టి సుప్రసిద్ధుడైన పురాతన రాజైన సొలొమోను సుమారుగా క్రీ. పూ. 950 కాలములో బైబిలులోని పాత నిబంధనలో భాగమైన అనేక పద్యములను వ్రాశాడు. ప్రసంగి గ్రంథములో, జీవితములో సంతృప్తిని పొందుటకు అతడు చేసిన ప్రయత్నములన్నిటిని గూర్చి వర్ణించాడు. అతడు ఇలా వ్రాశాడు:

  నీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయ ముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.
2 నవ్వుతోనీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతోనీచేత కలుగునదేమియనియు నేవంటిని.
3 నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.
4 ​నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
5 నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
6 వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
7 ​పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
8 నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
9 నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.
10 నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.

ప్రసంగి 2:1-10

ధనము, ఖ్యాతి, జ్ఞానము, గొప్ప కట్టడములు, స్త్రీలు, సుఖము, రాజ్యము, మంచి ఉద్యోగము, ద్రాక్షరసము… సొలొమోను ఇవన్నీ అనుభవించాడు – మరియు లోకములో ఇప్పటి వరకు జీవించిన ప్రజలందరి కంటే ఎక్కువ అనుభవించాడు. ఐంస్టీన్ వంటి జ్ఞానము, లక్ష్మీ మిట్టల్ వంటి ఐశ్వర్యము, ఒక బాలీవుడ్ స్టార్ వంటి సామాజిక/లైంగిక జీవితము, మరియు బ్రిటిష్ రాజ కుటుంబములోని ప్రిన్స్ విలియం వంటి రాజరికము – అన్ని కలిపి ఒక వ్యక్తిలో మిళితమైయ్యాయి. ఇట్టి వ్యక్తిని ఎవరు జయించగలరు? అతడు ప్రజలందరిలో ఇంత సంతృప్తిపరుడు అని మీరు అనుకోవచ్చు.

అతడు వ్రాసిన మరొక పద్యముల పుస్తకమైన పరమగీతములో, ఇది కూడా బైబిలులో ఉన్నది, అతడు తాను అనుభవించుచున్న ఒక శృంగారకరమైన ప్రేమ-వ్యవహారమును గూర్చి వ్రాశాడు – జీవిత కాల సంతృప్తిని కలిగిస్తుంది అనిపించు విషయము. పూర్తి పద్యము ఇక్కడ ఉన్నది. అయితే అతనికి మరియు అతని ప్రేయసికి మధ్య జరిగిన ప్రేమ సంభాషణ పద్యములోని ఒక భాగము క్రింద ఇవ్వబడింది

పరమగీతము యొక్క సారాంశము

 

అతను
9 నా ప్రియమైన, నిన్ను ఒక మరేతో పోలుస్తున్నాను
ఫరో యొక్క రథం గుర్రాలలో.
10 మీ బుగ్గలు చెవిపోగులతో అందంగా ఉన్నాయి,
ఆభరణాల తీగలతో మీ మెడ.
11 మేము మీకు బంగారు చెవిపోగులు చేస్తాము,
వెండితో నిండి ఉంది.

ఆమె
12 రాజు తన బల్ల వద్ద ఉన్నప్పుడు,
నా పరిమళం దాని సువాసనను వ్యాప్తి చేసింది.
13 నా ప్రియమైన నాకు మిర్రల సాచెట్
నా రొమ్ముల మధ్య విశ్రాంతి.
14 నా ప్రియమైన నాకు గోరింట వికసిస్తుంది
ఎన్ గెడి యొక్క ద్రాక్షతోటల నుండి.

అతను
15 నా ప్రియమైన, మీరు ఎంత అందంగా ఉన్నారు!
ఓహ్, ఎంత అందంగా ఉంది!
మీ కళ్ళు పావురాలు.

ఆమె
16 ప్రియమైన, నీవు ఎంత అందంగా ఉన్నావు!
ఓహ్, ఎంత మనోహరమైనది!
మరియు మా మంచం ప్రశాంతంగా ఉంది.

అతను

17 మా ఇంటి కిరణాలు దేవదారు;
మా తెప్పలు ఫిర్లు.

ఆమె

3 అడవి చెట్ల మధ్య ఆపిల్ చెట్టులా
యువకులలో నాకు ప్రియమైనది.
నేను అతని నీడలో కూర్చోవడం ఆనందంగా ఉంది,
మరియు అతని పండు నా రుచికి తీపిగా ఉంటుంది.
4 అతను నన్ను విందు హాలుకు నడిపించనివ్వండి,
మరియు నాపై అతని బ్యానర్ ప్రేమగా ఉండనివ్వండి.
5 ఎండుద్రాక్షతో నన్ను బలోపేతం చేయండి,
ఆపిల్లతో నన్ను రిఫ్రెష్ చేయండి,
నేను ప్రేమతో మూర్ఛపోతున్నాను.
6 అతని ఎడమ చేయి నా తల క్రింద ఉంది,
అతని కుడి చేయి నన్ను ఆలింగనం చేస్తుంది.
7 యెరూషలేము కుమార్తెలు, నేను నిన్ను వసూలు చేస్తున్నాను
గజెల్స్ మరియు ఫీల్డ్ యొక్క పనుల ద్వారా:
ప్రేమను రేకెత్తించవద్దు లేదా మేల్కొల్పవద్దు
అది కోరుకునే వరకు.

పరమగీతము 1:9 – 2:7

సుమారుగా మూడు వేల సంవత్సరముల క్రితం వ్రాయబడిన ఈ పద్యములో, ఒక ఉత్తమమైన బాలీవుడ్ చలనచిత్రములో కనిపించు శృంగార తీక్ష్ణత ఉన్నది. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యముతో అతడు ఏడు వందల మంది ఉంపుడుగత్తెలను పొందుకున్నాడని బైబిలు నివేదిస్తుంది! అత్యంత ప్రఖ్యాతిగాంచిన బాలీవుడ్ లేక హాలీవుడ్ ప్రేమికులు ఏనాడు పొందలేని సంఖ్య ఇది. కాబట్టి ఇంత ప్రేమను పొందుకొని అతడు సంతృప్తి కలిగి జీవించాడు అని మీరనుకోవచ్చు. అయితే ఇంత ప్రేమ, ఇంత ఐశ్వర్యము, ప్రఖ్యాతి మరియు జ్ఞానము పొందియుండిన తరువాత కూడా – అతడు జీవితాన్ని ఇలా క్రోడీకరించాడు:

  వీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.
2 వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
3 ​సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
4 ​తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.
5 ​సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.
6 ​గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.
7 ​నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును
8 ​​ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.
9 మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.
10 ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.
11 పూర్వులు జ్ఞాపక మునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.
12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని.
13 ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
14 ​సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.

ప్రసంగి 1:1-14

  11 ​అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
12 రాజు తరువాత రాబోవు వాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించు టకై పూనుకొంటిని.
13 అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయో జనకరమని నేను తెలిసికొంటిని.
14 ​జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని.
15 కావున బుద్ధి హీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే.
16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దిన ములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే.
17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.
18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.
19 వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.
20 కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.
21 ​ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.
22 ​సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
23 ​వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియం దైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే.

ప్రసంగి 2:11-23

ఆహ్లాదము, ఐశ్వర్యము, మంచి ఉద్యోగము, ప్రగతి, శృంగార ప్రేమలో అనుభవించు ఉన్నతమైన సంతృప్తి కూడా మాయయే అని అతడు చూపాడు. కాని నేడు కూడా సంతృప్తిని పొందుటకు ఇదే ఖచ్చితమైన మార్గమని మనము వింటుంటాము. వీటి ద్వారా సొలొమోను సంతృప్తిని పొందలేదు అని అతడు వ్రాసిన పద్య భాగము ఇంతకు ముందే మనకు చెప్పింది.

సొలొమోను అతని పద్యములను కొనసాగిస్తూ మరణము మరియు జీవితమును విశ్లేషించాడు:

  19 నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.
20 ​సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
21 ​నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?

ప్రసంగి 3:19-21

  2 సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
3 అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
4 బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.
5 బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

ప్రసంగి 9:2-5

ఐశ్వర్యము మరియు ప్రేమను అన్వేషించుటను గూర్చిన పద్యములు – వీటిని సాధారణంగా మనము అపవిత్రమైనవిగా చూస్తాము – పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఎందుకు వ్రాయబడ్డాయి? పవిత్ర గ్రంథములు సన్యాసులుగా జీవించుటను గూర్చి, ధర్మమును గూర్చి, మరియు నైతిక విలువలను గూర్చి మాట్లాడాలని మనము ఆశిస్తాము. మరియు బైబిలులోని సొలొమోను మరణమును గూర్చి అంతిమగమ్యముగాను మరియు నిరాశాజనకముగాను ఎందుకు వ్రాశాడు?

సొలొమోను అనుసరించిన మార్గము, ఇది లోకములో ఎక్కువ మంది అనుసరించు మార్గము, స్వయం కొరకు జీవించు, మరియు తన సుఖము మరియు సంతోషము కొరకు తనకు నచ్చిన విధానములను అనుసరించు మార్గమైయున్నది. కాని సొలొమోను అనుభవించిన అంతము అంత మంచిది కాదు – సంతృప్తి తాత్కాలికమైనది మరియు వంచనయైయున్నది. అతని పద్యములు బైబిలులో ఒక పెద్ద హెచ్చరికగా ఉన్నాయి – “అక్కడకి వెళ్లవద్దు – అది మిమ్మును నిరుత్సాహపరుస్తుంది!” ఇంచుమించు మనమంతా సొలొమోను అనుసరించిన మార్గములో వెళ్లుటకు ప్రయత్నిస్తాము కాబట్టి, అతని మాటలు వింటే మనము జ్ఞానవంతులమవుతాము.

సువార్తసొలొమోను పద్యములకు జవాబిచ్చుట

బైబిలులో ప్రస్తావించబడిన వారందరిలో యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) అత్యంత సుపరిచితమైన వ్యక్తి. ఆయన కూడా జీవితమును గూర్చి వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు

“… జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని”

యోహాను 10:10

 

28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.     

మత్తయి 11:28-30

యేసు ఇలా చెప్పినప్పుడు సొలొమోను తన పద్యములలో వ్రాసిన వ్యర్థతకు మరియు నిరాశకు జవాబిచ్చాడు. సొలొమోను అనుసరించిన మరణ-మార్గమునకు ఇది జవాబు కావచ్చు. ఎందుకంటే, సువార్తకు అర్థము ‘శుభవార్త’ కదా. సువార్త నిజముగా శుభవార్త అయ్యున్నదా? దీనికి జవాబును తెలుసుకొనుటకు మనకు సువార్తను గూర్చి కొంత అవగాహన కావాలి. మరియు సువార్తలో చెప్పబడిన విషయములను మనము పరీక్షించాలి – అవివేకముగా విమర్శించుటకు బదులుగా, సువార్తను గూర్చి క్షుణ్ణంగా ఆలోచనచేయాలి.

నేను నా గాధలో వివరించినట్లు, నేను కూడా ఇదే మార్గమును అనుసరించాను. మీరు కూడా వీటిని పరీక్షించుటను ఆరంభించుటకు ఈ వెబ్సైటులోని వ్యాసములు రూపొందించబడినవి. యేసు నరావతారి అగుటను గూర్చి చదువుతూ ఆరంభిస్తే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *