రాజ్ వలె: యేసు క్రీస్తు అను పేరులో ‘క్రీస్తు’ అను మాటకు అర్థం ఏమిటి?

కొన్నిసార్లు యేసు యొక్క చివరి పేరు ఏమిటి అని నేను ప్రజలను అడుగుతాను. వారు సాధారణంగా ఇలా జవాబిస్తారు,

“ఆయన చివరి పేరు ‘క్రీస్తు’ అనుకుంటా, కాని నాకు సరిగా తెలియదు.”

అప్పుడు నేను ఇలా అడుగుతాను,

“అయితే, యేసు బాలునిగా ఉన్నప్పుడు యోసేపు క్రీస్తు మరియు మరియ క్రీస్తు తమ కుమారుడైన యేసు క్రీస్తును బజారుకు తీసుకువెళ్లారా?”

ఇలా అడిగితే, “క్రీస్తు” యేసు యొక్క ఇంటి పేరు కాదని వారు గ్రహిస్తారు. కాబట్టి, ‘క్రీస్తు’ అంటే ఏమిటి? ఇది ఎక్కడ నుండి వచ్చింది? దీని అర్థము ఏమిటి? వాస్తవానికి ‘క్రీస్తు’ అను పదము ‘నాయకులు’ లేక ‘పరిపాలన’ అను అర్థమునిచ్చు ఒక బిరుదు అని వినుట చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వాతంత్ర్యమునకు ముందు భారత దేశమును పరిపాలించిన బ్రిటిష్ రాజ్యమును ఈ ‘రాజ్’ అను బిరుదు కొంతవరకు పోలియున్నది.

అనువాదము vs. లిప్యాంతరీకరణ

ముందుగా మనము అనువాదములోని కొన్ని మూల విషయములను అర్థము చేసుకుందాము. అనువాదకులు కొన్నిసార్లు పేర్లను మరియు బిరుదులను అనువదించునప్పుడు అర్థము కంటే ఎక్కువగా ధ్వని ఆధారంగా అనువదిస్తారు. దీనిని లిప్యాంతరీకరణ అని పిలుస్తారు. ఉదాహరణకు, कुंभ मेला అను హిందీ పదమునకు ఆంగ్ల లిప్యాంతరీకరణ “Kumbh Mela” అయ్యున్నది. मेला అను మాటకు అర్థము ‘తిరునాళ్ళు’ లేక ‘పండుగ’ అయినప్పటికీ, ఇది ఆంగ్ల భాషలో kumbh fairఅని అనువదించబడుటకు బదులుగా Kumbh Mela అని లిప్యాంతరీకరణ చేయబడుతుంది. “Raj” అను పదము “राज” అను హిందీ పదము యొక్క లిప్యాంతరీకరణ అయ్యున్నది. राज అను మాటకు అర్థము ‘పరిపాలన’ అయ్యున్నప్పటికీ, “British Rule” కు బదులుగా “British Raj” అను పదమును ఉపయోగించుట ద్వారా ఈ పదము ఆంగ్లములోనికి ధ్వని ద్వారా లిప్యాంతరీకరణ చేయబడినది. వేద పుస్తకము (బైబిలు) విషయములో కూడా, అనువాదకులు ఏ పేర్లను మరియు బిరుదులను అనువదించాలి (అర్థము ఆధారంగా) మరియు వేటిని లిప్యాంతరీకరణ (ధ్వని ఆధారంగా) చేయాలి అను విషయమును స్వయంగా నిర్ణయించవలసియుండినది. దీనికి విశేషమైన నియమము ఏమి లేదు.

సెప్టుజెంట్

హెబ్రీ వేదములు (పాత నిబంధన) ఆనాటి అంతర్జాతీయ భాష అయిన గ్రీకు భాషలోనికి అనువదించబడినప్పుడు క్రీ.పూ. 250లో బైబిలు మొట్టమొదటిసారిగా అనువదించబడింది. ఆ అనువాదమును సెప్టుజెంట్ (లేక LXX) అని పిలుస్తారు మరియు అది చాలా ఖ్యాతిని పొందింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది కాబట్టి, దానిలోని అనేక ఉద్ధరణములు పాత నిబంధనలో నుండి తీసుకొనబడినవి.

సెప్టుజెంట్ లో అనువాదము & లిప్యాంతరీకరణ

ఈ ప్రక్రియను మరియు అది ఆధునిక బైబిళ్ళ మీద చూపు ప్రభావమును ఈ క్రింద చిత్రము తెలియజేస్తుంది.

మూల భాషలలో నుండి ఆధునిక బైబిళ్ళలోనికి అనువాద క్రమమును గూర్చిన పట్టిక

చౌకము #1లో మూల హెబ్రీ పాత నిబంధన (క్రీ.పూ. 1500 – 400 మధ్య కాలములో వ్రాయబడినది) ఇవ్వబడినది. సెప్టుజెంట్ క్రీ.పూ. 250లో వ్రాయబడిన హెబ్రీ –> గ్రీకు అనువాదము కాబట్టి, బాణము చౌకము #1 నుండి #2 వైపుకు సూచిస్తుంది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది (క్రీ.శ. 50-90), కాబట్టి #2లో పాత మరియు క్రొత్త నిబంధనలు రెండు ఇవ్వబడినవి. క్రింద సగభాగములో (#3) బైబిలు యొక్క ఆధునిక భాషా అనువాదములు ఇవ్వబడినవి. పాత నిబంధన (హెబ్రీ వేదములు) మూల హెబ్రీ భాష నుండి అనువదించబడింది (1–>3) మరియు క్రొత్త నిబంధన మూల గ్రీకు భాష నుండి అనువదించబడింది  (2–>3). ఇంతకు ముందు వివరించబడినట్లు పేర్లను మరియు బిరుదులను అనువాదకులు నిర్ణయించవలసియుండినది. ఇది లిప్యాంతరీకరణ మరియు అనువాదము అను శీర్షికలతో నీలిరంగు బాణముల ద్వారా సూచించబడినది, మరియు అనువాదకులు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చని ఇది సూచిస్తుంది.

‘క్రీస్తు’ అను పదము యొక్క ఆరంభము 

‘క్రీస్తు’ అను పదము మీద దృష్టిపెట్టి పై ప్రక్రియను అనుసరించండి.

‘క్రీస్తు’ అను పదము బైబిలులో ఎక్కడ నుండి ఆవిర్భవించింది? 

‘מָשִׁיחַ’ (మషియాఖ్) అను పదము హెబ్రీ పాత నిబంధనలోని బిరుదైయున్నది, మరియు రాజుగా లేక నాయకునిగా ‘అభిషేకించబడిన లేక పవిత్రపరచబడిన’ వ్యక్తి అని దీని అర్థము. ఆ కాలములోని హెబ్రీ రాజులు రాజు అగుటకు ముందు అభిషేకించబడేవారు (నూనెతో తలంటు ఆచారము), కాబట్టి వారు అభిషిక్తులు లేక మషియాఖ్ అని పిలువబడేవారు. తరువాత వారు నాయకులైయ్యేవారు, అయితే వారి పరిపాలన దేవుని యొక్క పరలోక పరిపాలనకు ఆధీనములోను, ఆయన నియమములకు అనుగుణంగాను ఉండవలసియుండేది. ఈ భావనలో పాత నిబంధనలోని హెబ్రీ రాజులు రాజ్ ను పోలియుండేవారు. రాజ్ దక్షిణ ఆసియాలోని బ్రిటిష్ ప్రాంతములను పాలించేవాడు, కాని అతడు బ్రిటన్ లోని ప్రభుత్వము యొక్క ఆధీనములో ఉండి, దాని నియమ నిబంధనలను పాటించేవాడు.

పాత నిబంధన రానున్న ఒక విశేషమైన మషియాఖ్ ను గూర్చి ప్రవచించింది. ఆయన ఒక విశేషమైన రాజుగా ఉంటాడు. క్రీ.పూ. 250లో సెప్టుజెంట్ అనువదించబడినప్పుడు, అనువాదకులు అదే అర్థమునిచ్చు ఒక గ్రీకు పదమును ఉపయోగించారు. ఆ గ్రీకు పదము Χριστός (క్రిస్టోస్ అను వినిపిస్తుంది), మరియు అది క్రియో అను పదము నుండి వెలువడుతుంది, ఆచారముగా తలపై నూనె అంటుట అని ఆ పదము యొక్క అర్థము. ఈ ప్రవచించబడిన ‘మషియాఖ్’గా యేసును గుర్తించుటకు క్రొత్త నిబంధన రచయితలు క్రిస్టోస్ అను పదమును ఉపయోగించుట కొనసాగించారు.

ఐరోపా భాషలలో, దీనికి పోలిన అర్థమునిచ్చు వేరొక పదము లేదు కాబట్టి, క్రొత్త నిబంధన గ్రీకు పదమైన ‘క్రిస్టోస్’ను వారు ‘క్రైస్ట్’ అని లిప్యాంతరీకరణ చేశారు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన మూలములు కలిగిన, హెబ్రీ నుండి గ్రీకు భాషలోనికి అనువాదము ద్వారా వచ్చిన ఒక విశేషమైన బిరుదైయున్నది, మరియు తరువాత అది గ్రీకు భాషలో నుండి ఆధునిక భాషలలోనికి లిప్యాంతరీకరణ చేయబడినది. పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి ఆధునిక భాషలలోనికి సూటిగా అనువదించబడినది మరియు మూల హెబ్రీ పదమైన ‘మషియాఖ్’ విషయములో అనువాదకులు విభిన్నమైన ఎంపికలను చేశారు. కొన్ని భైబిళ్ళు ‘మషియాఖ్’ అను పదమును కొన్ని మార్పులతో ‘మెస్సీయ’ అని లిప్యాంతరీకరణ చేయగా, మరికొన్ని ‘అభిషిక్తుడు’ అని అర్థమునిచ్చు విధముగా అనువదించాయి. క్రీస్తు అను పదమునకు హిందీ పదము (मसीह) అరబిక్ భాష నుండి లిప్యాంతరీకరణ చేయబడినది, మరియు ఆ అరబిక్ పదము మూల హెబ్రీ భాషలో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది. కాబట్టి ‘మసిహ్’ అను దాని ఉచ్చారణ మూల హెబ్రీ పదమునకు దగ్గర సంబంధము కలిగినదిగా ఉన్నది. 

హెబ్రీ పదమైన מָשִׁיחַ (మషియాఖ్, మెస్సీయ) గ్రీకు సెప్టుజెంట్ లో “క్రిస్టోస్” అని అనువదించబడింది. ఇది ఆంగ్ల భాషలోనికి ‘క్రైస్ట్’ అని అనువదించబడింది. క్రిస్ట్ అను పదము యొక్క తెలుగు అనువాదము గ్రీకు పదమైన “క్రిస్టోస్”లో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది మరియు క్రీస్తు (Krīstu) అని పలుకబడుతుంది.

సాధారణంగా ‘క్రీస్తు’ అను పదమును మనము పాత నిబంధనలో చూడము గనుక, పాత నిబంధనతో ఈ పదము యొక్క అనుబంధము ఎల్లప్పుడు స్పష్టముగా కనిపించదు. కాని, ‘క్రీస్తు’=’మెస్సీయ’=’అభిషిక్తుడు’ అని, మరియు ఇది ఒక విశేషమైన బిరుదు అని ఈ అధ్యయనము ద్వారా మనకు స్పష్టమవుతుంది.

మొదటి శతాబ్దములో ఎదురుచూసిన క్రీస్తు

ఇప్పుడు సువార్తలో నుండి కొన్ని విషయములను చూద్దాము. క్రిస్మస్ వృత్తాంతములోని భాగముగా, యూదుల రాజును చూచుటకు జ్ఞానులు వచ్చినప్పుడు, హేరోదు రాజు ఈ క్రింది విధంగా స్పందించాడు. ఇక్కడ క్రీస్తు అను పదము ప్రత్యేకముగా యేసును సూచించనప్పటికీ, దానిలోని స్పష్టతను గమనించండి.

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:3-4

‘ప్రత్యేకించబడిన క్రీస్తు’ అను ఆలోచన హేరోదు మరియు అతని సలహాదారులకు అర్థమైయ్యింది అని మీరు చూడవచ్చు – మరియు ఇక్కడ ఈ పదము యేసును విశేషముగా సూచించదు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన నుండి వస్తుంది అని, మొదటి శతాబ్దములోని ప్రజలు (హేరోదు మరియు అతని సలహాదారులు వంటివారు) సెప్టుజెంట్ లో దీనిని సాధారణంగా చదివేవారని ఇది సూచిస్తుంది. ‘క్రీస్తు’ అను పదము ఒక పేరు కాదుగాని, ఒక బిరుదైయున్నది, మరియు మరియు ఒక నాయకుని లేక రాజును సూచిస్తుంది. ఇందువలనే, మరొక రాజు యొక్క రాకను బట్టి హేరోదు ‘కలత చెందాడు.’ ‘క్రీస్తు’ అను పదమును క్రైస్తవులు సృష్టించారు అను ఆలోచనను ఇప్పుడు మనము ప్రక్కనపెట్టవచ్చు. క్రైస్తవులు ఉనికిలోని రాక ముందే కొన్ని వందల సంవత్సరములుగా ఈ బిరుదు ఉపయోగించబడింది.

క్రీస్తు అధికారములోని వైరుధ్యములు

హెబ్రీ వేదములలో ప్రవచించబడిన రానున్న క్రీస్తు యేసే అని ఆయన యొక్క ఆదిమ అనుచరులు నమ్మారు, కాని ఇతరులు ఆయనను వ్యతిరేకించారు. 

ఎందుకు?

ప్రేమ లేక శక్తి ద్వారా పాలించుట అను వైరుధ్యములో దీనిని జవాబు దాగియున్నది. బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనములో భారత దేశమును పాలించు అధికారము రాజ్ కు ఇవ్వబడినది. అయితే రాజ్ మొదటిగా సైన్య శక్తితో వచ్చి దాని శక్తి ద్వారా దేశమును లోపరచుకున్నది కాబట్టి భారత దేశమును పాలించగలిగినది. ప్రజలు రాజ్ ను ఇష్టపడలేదు, కాబట్టి తుదకు గాంధీ వంటి నాయకుల నాయకత్వములో రాజ్ ముగింపునకు వచ్చింది.  

క్రీస్తుగా యేసు అధికారము కలిగియున్నను బలవంతముగా లోపరచుకొనుటకు రాలేదు. ప్రేమ లేక భక్తి ఆధారంగా నిత్య రాజ్యమును స్థాపించుటకు ఆయన వచ్చాడు, మరియు ఇలా జరిగుటకు ఒక వైపున శక్తి మరియు అధికారము అను వైరుధ్యము మరొక వైపున ఉన్న ప్రేమతో ఏకమవ్వవలసియుండినది. ‘క్రీస్తు’ రాకను అర్థము చేసుకొనుటలో మనకు సహాయం చేయుటకు హెబ్రీ ఋషులు ఈ వైరుధ్యమును వివరించారు. హెబ్రీ వేదములలో ‘క్రీస్తు’ అను పదము యొక్క మొదటి ప్రత్యక్షతలో వారు ఇచ్చిన మెళకువలను మనము అనుసరిద్దాము, వీటిని క్రీ.పూ. 1000లో హెబ్రీ రాజైన దావీదు వ్రాశాడు.

యూదుల చరిత్ర: భారత దేశములో & ప్రపంచమంతటా

యూదులకు భారత దేశములో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా నివాసముంటు భారత దేశ సమాజముల మధ్య చిన్న చిన్న సమాజములుగా జీవిస్తున్నారు. మిగిలిన అల్పసంఖ్యాక మతములకు (జైనులు, సిక్కులు, బౌద్ధులు వంటివారు) భిన్నముగా, యూదులు భారత దేశము వెలుపల నుండి వచ్చి ఇక్కడ తమ నివాసమును ఏర్పరచుకున్నారు. 2017 వేసవి కాలములో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ మోది ఇశ్రాయేలునకు చారిత్రిక పర్యటనకు వెళ్లుటకు ముందు, ఇశ్రాయేలు దేశ ప్రధానమంత్రియైన నితన్యాహుతో కలిసి వార్తాపత్రికలో ఒక సమైఖ్య వ్యాసమును వ్రాశాడు. వారు ఇలా వ్రాసినప్పుడు యూదులు భారత దేశమునకు వచ్చిన ఈ విషయమును వారు గుర్తించారు:

భారత దేశములో ఉన్న యూదుల సమాజము ఎల్లప్పుడూ ఆప్యాయతతోను, గౌరవముతోను ఆహ్వానించబడింది మరియు ఏనాడు హింసను ఎదుర్కొనలేదు.

వాస్తవానికి, యూదులు భారత దేశ చరిత్ర మీద ఒక విశేషమైన ప్రభావమును చూపారు, మరియు భారత చరిత్రలో ఒక కఠినమైన మర్మమునకు పరిష్కారమును ఇచ్చారు – భారత దేశములో రచనలు ఎలా ఆరంభమైయ్యాయి? ఈ ప్రశ్నకు జవాబు భారత సంస్కృతిలో సాంప్రదాయిక రచనలన్నిటి మీద ప్రభావం చూపుతుంది.

భారత దేశములో యూదుల చరిత్ర

భిన్నముగా ఉన్నప్పటికీ, యూదులు సాంప్రదాయిక భారత దేశ వస్త్రధారణను అనువర్తించుకున్నారు

యూదుల సమాజములు భారత దేశములో ఎంత కాలము నుండి నివసించుచున్నాయి? ‘ఇరవై ఏడు శతాబ్దములు” తరువాత మిజోరాంలో ఉన్న మనష్షే గోత్రమునకు (బెని మనషే) చెందిన యూదులు ఇశ్రాయేలు దేశమునకు తిరిగివచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ పత్రిక ఈ మధ్య ఒక వ్యాసమును ప్రచురించింది. అంటే తమ పితరులు క్రీ.పూ. 700 సంవత్సరములో ఇక్కడకి వచ్చినట్లు అది సూచిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ లో నివసించుచున్న ఎఫ్రయిము అను యూదుల గోత్రమునకు చెందిన (బెనె ఎఫ్రాయిమ్) వారి తెలుగు మాట్లాడు సోదరులు పర్షియా, ఆఫ్గనిస్తాన్, టిబెట్, మరియు చైనా దేశములలో సంచరిస్తు చివరికి వెయ్యి సంవత్సరముల క్రితం భారత దేశమునకు వచ్చిన జ్ఞాపికను వెల్లడి చేస్తారు. కేరళ రాష్ట్రములో, కొచ్చిన్ యూదులు అక్కడ రెండు వేల ఆరు వందల సంవత్సరములుగా నివసిస్తున్నారు. కొన్ని శతాబ్దములుగా యూదులు భారత దేశమంతా చిన్న చిన్న సమాజములను నిర్మించుకున్నారు. కాని ఇప్పుడు వారు భారత దేశమును విడచి ఇశ్రాయేలుకు వెళ్లుచున్నారు.

కొచ్చిన్ లోని యూదుల సమాజమందిరములోని ఒక శిలాఫలకము. ఇది వందల సంవత్సరములుగా అక్కడ ఉంది

యూదులు భారత దేశములో నివసించుటకు ఎలా వచ్చారు? ఇంత కాలము తరువాత వారు ఇశ్రాయేలుకు తిరిగి ఎందుకు వెళ్తున్నారు? వేరే అన్ని దేశముల కంటే ఎక్కువగా వారి చరిత్రను గూర్చి మనకు సత్యములు అందుబాటులో ఉన్నాయి. ఒక కాలక్రమమును ఉపయోగించి వారి చరిత్రను క్రోడీకరించుటకు మనము ఈ సమాచారమును ఉపయోగించుదాము.

అబ్రాహాము: యూదుల కుటుంబము ఆరంభమైయ్యింది

అబ్రాహాముతో ఈ కాలక్రమము ఆరంభమవుతుంది. అతనికి దేశముల వాగ్దానము ఇవ్వబడినది, మరియు అతడు దేవునితో అనేకమార్లు కలుసుకొని తుదకు తన కుమారుడైన ఇస్సాకును చిహ్నాత్మకముగా బలి అర్పించాడు. యేసు (యేసు సత్సంగ్) యొక్క భవిష్యత్ బలి కొరకు స్థలమును సూచించుట ద్వారా ఇది యేసు వైపుకు చూపు ఒక చిహ్నముగా ఉన్నది. ఇస్సాకు కుమారునికి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు వారసులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలమును సూచించు కాలక్రమము పచ్చ రంగులో కొనసాగుతుంది. ఈ కాలము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు (వంశావళి: అబ్రాహాము -> ఇస్సాకు -> ఇశ్రాయేలు (ఈయనకు యాకోబు అని కూడా పేరు) -> యోసేపు)  ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు నడిపించుటతో ఆరంభమవుతుంది, మరియు వారు అక్కడ బానిసలుగా చేయబడ్డారు.

ఫరోకు బానిసలుగా ఐగుప్తులో జీవించుట

మోషే: దేవుని ఆధీనములో ఇశ్రాయేలీయులు ఒక దేశమయ్యారు

ఐగుప్తును నాశనము చేసి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి ఇశ్రాయేలు దేశమునకు నడిపించిన పస్కా తెగులు తరువాత మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. అతడు మరణించుటకు ముందు, మోషే ఇశ్రాయేలీయుల మీద ఆశీర్వాదములను మరియు శాపములను ప్రకటించాడు (ఇక్కడ కాలక్రమము పసుపు రంగులో ఉంది). వారు దేవునికి విధేయులైతే ఆశీర్వదించబడతారు, కాకపోతే శపించబడతారు. ఇశ్రాయేలు చరిత్ర తరువాత ఈ ఆశీర్వాదములకు మరియు శాపములకు కట్టుబడియుంది.

కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించారు కాని వారికి రాజు లేడు, మరియు యెరూషలేము వారికి రాజధానిగా ఉండేది కాదు – ఆ కాలములో అది వేరొక ప్రజల ఆధీనములో ఉండేది. అయితే, రాజైన దావీదు కాలములో క్రీ.పూ. 1000లో ఇది మార్పు చెందింది.
యెరూషలేము నుండి పాలించిన దావీదు సామ్రాజ్యపు రాజుల పరిపాలనలో జీవించుట

దావీదు యెరూషలేములో ఒక రాజరిక సామ్రాజ్యమును స్థాపించాడు

దావీదు యెరూషలేమును జయించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అతడు రానున్న మెస్సీయను గూర్చి వాగ్దానమును పొందుకున్నాడు, మరియు ఆ కాలము మొదలుకొని ‘క్రీస్తు’ రాక కొరకు యూదులు ఎదురు చూశారు. ధనికుడు మరియు ప్రఖ్యాతిగాంచినవాడైన, అతని కుమారుడైన సొలొమోను అతని తరువాత రాజ్యమును పాలించి యెరూషలేములోని మోరీయ పర్వతము మీద మొదటి యూదుల దేవాలయమును నిర్మించాడు. దావీదు రాజు యొక్క వారసులు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించుట కొనసాగించారు మరియు ఈ కాలము నీలం రంగులో చూపబడుతుంది (క్రీ.పూ. 1000 – 600). ఇది ఇశ్రాయేలీయుల మహిమ కాలము – ఆ కాలములో వారు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదములను పొందుకున్నారు. వారు ఒక శక్తివంతమైన దేశముగా ఉండేవారు; వారి సమాజము, సంస్కృతి మరియు దేవాలయము పురోగతి చెందినదిగా ఉండేవి. అయితే ఈ కాలములో వారి మధ్య ఎదిగిన భ్రష్టత్వమును గూర్చి కూడా పాత నిబంధన వర్ణిస్తుంది. వారు మార్పు చెందని యెడల మోషే చెప్పిన శాపములు వారి మీదికి వస్తాయని ఈ కాలములో అనేకమంది ఋషులు ఇశ్రాయేలీయులను హెచ్చరించారు. ఈ కాలములో ఇశ్రాయేలీయులు రెండు రాజ్యములుగా విడిపోయారు: ఇశ్రాయేలు లేక ఎఫ్రాయిము అని పిలువబడు ఉత్తర రాజ్యము, మరియు యూదా అని పిలువబడు దక్షిణ రాజ్యము (నేటి కొరియన్ల వలె, ఒకే ప్రజల గుంపు రెండు దేశములుగా విడిపోవుట – ఉత్తర మరియు దక్షిణ కొరియా).

యూదుల మొదటి చెర: అష్షురు & బబులోను

చివరిగా, వారి మీద రెండు విడతలుగా శాపములు దిగివచ్చాయి. క్రీ.పూ. 722లో అష్షురీయులు ఉత్తర రాజ్యమును నాశనము చేసి అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులను తమ రాజ్యమంతటిలో చెరకు తీసుకొనిపోయారు. మిజోరాంలో ఉన్న బెనె మనష్షే మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బెనె ఎఫ్రాయిమ్ వారు ఈ కాలమూలో చెరకు తేబడిన ఇశ్రాయేలీయులే. తరువాత క్రీ.పూ 586లో నెబుకద్నేజరు అను బబులోనీయుల బలమైన రాజు తొమ్మిది వందల సంవత్సరముల క్రితం మోషే వ్రాసిన శాపమునకు అనుగుణంగా దక్షిణ రాజ్యమునుచెరగొని పోయాడు:

49 ​యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 
50 క్రూరముఖము కలిగి వృద్ధులను ¸°వనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 
51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 
52 ​మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.

ద్వితీయోపదేశకాండము 28: 49-52

నెబుకద్నేజరు యెరూషలేమును జయించి, దానిని కాల్చివేసి, సొలొమోను నిర్మించిన దేవాలయమును నాశనము చేశాడు. తరువాత అతడు ఇశ్రాయేలీయులను బబులోనును చెరగొనిపోయాడు. ఇది మోషే చేసిన ప్రవచనమును నెరవేర్చింది

63 కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 
64 ​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 

ద్వితీయోపదేశకాండము 28:63-64
జయించబడి బబులోనుకు చెరగొనిపోబడింది

 కేరళలోని కొచ్చిన్ ప్రాంతములో ఉన్న యూదులు ఈ సమయములో చెరగొనిపోబడిన యూదులు. డెబ్బై సంవత్సరముల పాటు, ఇది ఎరుపు రంగులో చూపబడింది, ఈ ఇశ్రాయేలీయులు (లేక నేడు పిలువబడుచున్నట్లు యూదులు)  అబ్రాహాముకు మరియు అతని వారసులకు వాగ్దానము చేయబడిన భూమికి వెలుపల నివసించారు.

 భారత సమాజముపై యూదులు చూపిన ప్రభావం

అశోక స్తంభము మీద బ్రహ్మి లిపి (క్రీ.పూ. 250 BCE)

 భారత దేశములో ఆరంభమైన రచనలను గూర్చిన ప్రశ్నను మనము చూద్దాము. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళము వంటి ఆధునిక భారత దేశ భాషలు మరియు ఋగ్వేదము మరియు ఇతర సాంప్రదాయక సాహిత్యము వ్రాయబడిన పురాతన సంస్కృతము వంటి భాషలను బ్రహ్మిక్ లిపులు అని పిలుస్తారు, మరియు ఇవన్నీ బ్రాహ్మి లిపి అని పిలువబడు పురాతన లిపి నుండి వెలువడినవి. బ్రాహ్మి లిపి నేడు అశోకుని కాలము వంటి కొన్ని పురాతన స్మారకముల మీద మాత్రమే కనిపిస్తుంది.

ఈ బ్రహ్మి లిపి ఆధునిక లిపులుగా ఎలా పరివర్తన చెందినదో అర్థము చేసుకోవచ్చుగాని, అసలు ఈ బ్రహ్మి లిపి భారత దేశమునకు ఎలా వచ్చింది అను విషయములో మాత్రం స్పష్టతలేదు. బ్రహ్మి లిపి హెబ్రీ-ఫొయినిషియన్ లిపితో సంబంధము కలిగియున్నదని పండితులు గుర్తిస్తారు, మరియు ఇది ఇశ్రాయేలులోని యూదులు భారత దేశములోనికి వలసవచ్చినప్పుడు ఉపయోగించిన లిపి అయ్యున్నది. చరిత్రకారుడైన డా. అవిగ్దోర్ షాచన్ (1) చెరలోని వచ్చి భారత దేశములో స్థిరపడిన ఇశ్రాయేలీయులు హెబ్రీ- ఫొయినిషియన్  లిపిని తెచ్చారని అది తరువాత బ్రహ్మి లిపి అయ్యింది అని ప్రతిపాదిస్తారు. బ్రహ్మి లిపికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఇది తెలియజేస్తుంది. అబ్రాహాము దేశములో నుండి చెరగొనిపోబడివచ్చిన యూదులు భారత దేశములో స్థిరపడిన కాలములోనే ఉత్తర భారత దేశములో బ్రహ్మి లిపి ప్రత్యక్షమగుట కేవలం ఒక యాదృచ్చికమేనా? అబ్రాహాము వారసుల యొక్క లిపిని అన్వయించుకున్న స్థానికులు దానిని (అ)బ్రహామిన్ లిపి అని పిలిచారు. అబ్రాహాము మతము ఒకే దేవుని నమ్మింది మరియు ఆయన కార్యములు పరిమితమైనవి కావు. ఆయన మొదటివాడు, కడపటివాడు, నిత్యుడు. (అ)బ్రహాము ప్రజల మతములో నుండే బ్రహ్మన్ మీద నమ్మకము కూడా ఇక్కడే మొదలైయుండవచ్చు. తమ లిపిని మరియు మతమును భారత దేశమునకు తెచ్చిన యూదులు, దేశమును స్వాధీనపరచుకొని పాలించాలని ప్రయత్నించిన ఇతరుల కంటే ఎక్కువగా భారత దేశము యొక్క ఆలోచన మరియు చరిత్ర మీద ప్రభావము చూపారు. మరియు హెబ్రీ- ఫొయినిషియన్/బ్రహ్మి లిపిలో వ్రాయబడిన హెబ్రీ వేదములు, రానున్న వానిని గూర్చి తెలియజేస్తాయి, ఇది సంస్కృతములోని ఋగ్వేదములు ఉన్న రానున్న పురుషను పోలియున్నది. తమ పితరుల దేశము నుండి పశ్చిమ ఆసియాలోనికి చెరగొనిపోబడి వచ్చిన యూదుల యొక్క చరిత్ర మీద మరొకసారి దృష్టిపెడదాము.

పారసీకుల పరిపాలనలో చెరలో నుండి తిరిగివచ్చుట

అటు తరువాత, పారసీక రాజైన కొరేషు బబులోనును జయించి ప్రపంచములోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు. యూదులు తమ దేశమునకు తిరిగివెళ్లుటకు అతడు అనుమతినిచ్చాడు.

పారసీక సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

అయితే వారు స్వతంత్ర దేశముగా మాత్రం కాలేదు, వారు పారసీక సామ్రాజ్యములో ఒక సంస్థానమైయ్యారు. ఇది రెండు వందల సంవత్సరముల పాటు కొనసాగింది మరియు కాలక్రమములో గులాబీ రంగులో ఉంది. ఈ కాలములో యూదుల దేవాలయము (దీనిని రెండవ దేవాలయము అని పిలుస్తారు) మరియు యెరూషలేము పట్టణము పునర్నిమించబడ్డాయి. ఇశ్రాయేలుకు తిరిగివచ్చుటకు యూదులకు అనుమతి ఇవ్వబడినప్పటికీ, అనేకమంది చెరలోనే విదేశాలలో ఉండిపోయారు.

గ్రీకుల కాలము

అలెగ్జాండర్ మహా చక్రవర్తి పారసీకుల సామ్రాజ్యమును జయించి మరొక రెండు వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలును గ్రీకు సామ్రాజ్యములో ఒక సంస్థానముగా చేశాడు. ఇది నిండు నీలము రంగులో చూపించబడింది.

గ్రీకు సామ్రాజ్యములలో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల కాలము

తరువాత రోమీయులు గ్రీకు సామ్రాజ్యములను ఓడించి ప్రపంచ శక్తిగా ఆధిపత్యము చెలాయించారు. యూదులు మరొకసారి ఈ సామ్రాజ్యములో సంస్థానమైయ్యారు మరియు ఇది లేత పసుపు రంగులో చూపబడింది. ఈ సమయములో యేసు జీవించాడు. సువార్తలలో రోమా సైనికులు ఎందుకు ఉన్నారో ఇది వివరిస్తుంది – యేసు జీవితమునకు ముందు ఇశ్రాయేలులోని యూదులను రోమీయులు పాలించారు కాబట్టి.

రోమా సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల నాయకత్వములో యూదుల రెండవ చెర

బబులోనీయుల కాలము మొదలుకొని (క్రీ.పూ. 586) దావీదు రాజుల కాలము వలె యూదులు స్వతంత్రులుగా ఉండేవారు కాదు. స్వాతంత్ర్యమునకు ముందు బ్రిటిష్ వారు భారత దేశమును పాలించిన విధముగానే, ఇతర సామ్రాజ్యములు వారిని పాలించాయి. యూదులు దీనిని ద్వేషించి రోమా పరిపాలన మీద తిరిగిబాటు చేశారు. రోమీయులు వచ్చి యెరూషలేమును నాశనం చేసి (క్రీ.శ. 70), రెండవ దేవాలయమును కాల్చివేసి, రోమా సామ్రాజ్యమంతటిలో బానిసలుగా ఉండుటకు యూదులను చెరగొనిపోయారు. ఇది యూదుల రెండవ చెర. రోమా సామ్రాజ్యము చాలా పెద్దదిగా ఉండేది కాబట్టి, యూదులు ప్రపంచము యొక్క నలుమూలలకు చెదిరిపోయారు.

క్రీ.శ. 70లో యెరూషలేము మరియు దేవాలయమును రోమీయులు ధ్వంసం చేశారు. యూదులు ప్రపంచము నలుమూలల చెదిరిపోయారు

యూదులు సుమారుగా రెండు వేల సంవత్సరముల పాటు ఈ విధంగా నివసించారు: అన్య దేశములకు చెదిరిపోయారుగాని, ఆ దేశములవారు వారిని అంగీకరించలేదు. అనేక దేశములలో వారు తరచుగా భయంకరమైన హింసను ఎదుర్కొన్నారు. యూదుల మీద హింస ఐరోపాలో ఎక్కువగా జరిగింది. పశ్చిమ ఐరోపాలోని స్పెయిన్ దేశము మొదలుకొని రష్యా వరకు ఈ రాజ్యములలావు యూదులు భయంకరమైన పరిస్థితుల మధ్య నివసించారు. ఈ హింసలను తప్పించుకొనుటకుగాను యూదులు కొచ్చిన్ కి రావడం ఆరంభించారు. పశ్చిమ ఆసియాలోని యూదులు పదిహేడు, పద్దెనిమిదయ శతాబ్దములలో భారత దేశములోని ఇతర భాగములకు వచ్చుట ఆరంభించారు.

డేవిడ్ సస్సన్ & సన్స్ – భారత దేశములో నివసించిన ధనికులైన బఘ్దాది యూదులు

వీరిని బఘ్దాది యూదులు అని పిలచేవారు, వీరు ముంబై, ఢిల్లీ, మరియు కలకత్తా వంటి చోట్ల స్థిరపడ్డారు. క్రీ.పూ. 1500లలో మోషే ఇచ్చిన శాపములకు అనుగుణంగానే వారు జీవించడం జరిగింది.

65 ​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 

ద్వితీయోపదేశకాండము 28:65

ఇశ్రాయేలీయులకు విరోధముగా ఇవ్వబడిన శాపముల కారణంగా ప్రజలు ఇలా ప్రశ్నించుట ఆరంభించారు:

24 యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

ద్వితీయోపదేశకాండము 29:24

మరియు దీనికి జవాబు:

25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి 
26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి 
27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. 
28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. 

ద్వితీయోపదేశకాండము 29:25-28

క్రింద ఇవ్వబడిన కాలక్రమము ఈ పంతొమ్మిదివందల సంవత్సరాల కాలమును చూపుతుంది. ఇది సుదీర్ఘమైన ఎరుపు రంగు గీతలో చూపబడింది.

యూదుల యొక్క విస్తృతమైన చారిత్రిక కాలక్రమము – వారి రెండు చెర కాలములు ఇవ్వబడినవి

యూదా ప్రజలు తమ చరిత్రలో రెండు చెర కాలములను అనుభవించారు అని మీరు చూడవచ్చు, కాని రెండవ చెర మొదటి చెర కాలము కంటే చాలా సుదీర్ఘమైనదిగా ఉన్నది.

ఇరవైయ్యవ శతాబ్దపు మారణహోమం (హోలోకాస్ట్)

హిట్లర్, నాజీ జర్మనీ ద్వారా ఐరోపాలో ఉన్న యూదులందరినీ హతమార్చాలని ప్రయత్నించినప్పుడు యూదులపై హింస తారాస్థాయికి చేరింది. అతడు ఇంచుమించు సఫలీకృతుడైయ్యాడుగాని, చివరికి అతడు ఓడించబడ్డాడు మరియు యూదుల శేషము మిగిలిపోయ్యింది.

ఇశ్రాయేలు యొక్క ఆధునిక పునర్జన్మ

మాతృభూమి లేకుండా కొన్ని వేల సంవత్సరముల తరువాత ‘యూదులు’ అను వారు మిగిలియున్నారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయము. కాని ఇది మూడు వేల ఐదువందల సంవత్సరాల క్రితం మోషే వ్రాసిన చివరి మాటలను కలిగియుంటుంది. 1948లో, మోషే కొన్ని శతాబ్దముల క్రితం వ్రాసిన విధముగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆధునిక ఇశ్రాయేలు యొక్క పునర్జన్మను లోకము చవిచూసింది:

​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 
​మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 

ద్వితీయోపదేశకాండము 30:3-5

గొప్ప ప్రతిఘటన మధ్య ఈ దేశము స్థాపించబడుట కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము. చుట్టుపక్కల ఉన్న దేశములన్నీ కలిసి 1948లో … 1956లో … 1967లో మరియు 1973లో ఇశ్రాయేలు మీదికి యుద్ధమునకు వచ్చాయి. చాలా చిన్న దేశమైన ఇశ్రాయేలు కొన్ని సందర్భాలలో ఒకేసారి ఐదు దేశముల మీద యుద్ధము చేసింది. మరియు ఇశ్రాయేలు నిలువబడుట మాత్రమేగాక, దాని సరిహద్దులు పెరిగాయి. 1967లో జరిగిన ఆరురోజుల యుద్ధములో, మూడు వేల సంవత్సరముల క్రితం దావీదు స్థాపించిన దాని చారిత్రిక రాజధానియైన యెరూషలేమును ఇశ్రాయేలు తిరిగి సంపాదించుకుంది. ఇశ్రాయేలు దేశము యొక్క స్థాపనకు ఫలితంగా, మరియు ఈ యుద్దముల వలన కలిగిన పరిణామముల కారణంగా నేడు ప్రపంచములోనే అత్యంత కఠినమైన రాజకీయ సమస్యను మనము ఎదుర్కొనుచున్నాము.

మోషే ద్వారా ప్రవచించబడినట్లు మరియు ఇక్కడ మరింత స్పష్టముగా వివరించబడినట్లు, ఇశ్రాయేలు యొక్క పునర్జన్మ భారత దేశములో ఉన్న యూదులు ఇశ్రాయేలుకు తిరిగివెళ్లుటకు ఒక అవకాశమును ఇచ్చింది. తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత దేశమునకు చెందినవారైన యూదులు ఇశ్రాయేలులో ఎనబై వేల మంది ఉన్నారు మరియు నేడు భారత దేశములో కేవలం ఐదు వేల మంది యూదులు మాత్రమే మిగిలియున్నారు. మోషే ఇచ్చిన ఆశీర్వాదము ప్రకారం వారు అత్యంత ‘దూర దేశము’ల నుండి (మిజోరాం వంటి) కూడా ‘సమకూర్చబడుతున్నారు మరియు ‘తిరిగి’ తీసుకొనిరాబడుతున్నారు. దీని అంతర్భావములను యూదులు మరియు యూదులు కానివారు కూడా గమనించాలని మోషే వ్రాశాడు.

(1) డా. అవిగ్దోర్ షాచన్.  ఇన్ ది ఫుట్స్టెప్స్ ఆఫ్ ది లోస్ట్ టెన్ ట్రైబ్స్ పేజీ 261

సంస్కృతము మరియు హెబ్రీ వేదముల మధ్య పోలికలు: ఎందుకు?

సంస్కృత వేదములలో మను వృత్తాంతము మరియు హెబ్రీ వేదములలో నోవహు వృత్తాంతము మధ్య ఉన్న పోలికలను మనము చూశాము. ఈ పోలికలు కేవలం జలప్రళయ వృత్తాంతములలో మాత్రమే లేవు. కాలారంభములో వాగ్దానము చేయబడిన పురుష బలికి మరియు హెబ్రీ పుస్తకమైన ఆదికాండములో వాగ్దానము చేయబడిన సంతానమునకు మధ్య కూడా పోలిక ఉన్నది. అయితే ఈ పోలికలను మనము ఎందుకు చూస్తాము? ఇవి యాదృచ్ఛికమా? ఒక వృత్తాంతము మరొక దాని నుండి దొంగిలించే లేక సేకరించే అవకాశం ఉందా? ఇక్కడ ఒక సూచనను చూస్తాము.

బాబెలు గోపురము – జలప్రళయము తరువాత

నోవహు యొక్క వృత్తాంతమును అనుసరిస్తూ, వేద పుస్తకము అతని ముగ్గురు కుమారుల యొక్క వారసులను గూర్చి నివేదిస్తూ, “వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను” (ఆదికాండము 10:32) అని వ్యాఖ్యానిస్తుంది. మనుకు నలుగురు కుమారులు ఉన్నారని, వారి ద్వారా మానవాళి అంతా ఉనికిలోనికి వచ్చింది అని సంస్కృత వేదములు ప్రకటిస్తాయి. అయితే ఈ ‘వ్యాప్తి’ ఎలా జరిగింది?

నోవహు ముగ్గురు కుమారుల వారసుల యొక్క పట్టికను పురాతన హెబ్రీ గ్రంథములు ఇచ్చుచున్నవి – పూర్తి పట్టికను ఇక్కడ చూడండి.  ఈ వారసులు దేవుని (ప్రజాపతి) ఆజ్ఞను – అనగా ‘భూమిని నిండించమని’ (ఆదికాండము 11:4) సెలవిచ్చిన సృష్టికర్త ఆజ్ఞను – ఏ విధంగా ఉల్లంఘించారో ఈ నివేదిక తెలియపరుస్తుంది. బదులుగా ఈ ప్రజలు ఒకే చోట ఉండునట్లు ఒక గోపురమును నిర్మించగోరారు. ఈ గోపురము ‘ఆకాశమునంటు’ (ఆదికాండము 11:4) విధముగా ఉండాలని వారు కోరారు, అనగా నోవహు వారసులైన వీరు సృష్టికర్తకు బదులుగా నక్షత్రములను, సూర్యుని, చంద్రుని, గ్రహములను మొదలగువాటిని ఆరాధించ ఉద్దేశముతో ఒక గోపురమును కట్టసాగారు. నక్షత్రముల ఆరాధన మెసొపొతమియలో (ఈ వారసులు నివసించిన స్థలము) ఆరంభమై లోకమంతా వ్యాపించింది అను విషయము సుపరిచితమైనదే.

ఈ విధంగా మన పితరులు సృష్టికర్తను ఆరాధించుటకు బదులుగా నక్షత్రములను ఆరాధించారు. దీనిని భంగపరచుటకు, ఆరాధనలోని భ్రష్టత్వమును అదుపు చేయుటకు సృష్టికర్త ఇలా చేయుటకు నిర్ణయించుకున్నాడని వృత్తాంతము తెలియపరుస్తుంది

…వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము.

ఆదికాండము 11:7

దీనికి ఫలితంగా, నోవహు యొక్క మొదటి వారసులైన వీరు ఒకరిమాట ఒకరు అర్థము చేసుకోలేకపోయారు, ఈ విధంగా సృష్టికర్త

భూమియందంతట వారిని చెదరగొట్టెను 

ఆదికాండము 11:8

ఈ ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుటకు కష్టమైన తరువాత, వారు తమ తమ భాషల చొప్పున వలసలు వెళ్లారు. ఈ విధంగా వారు ‘చెదరిపోయారు.’ నేడు లోకములోని వేర్వేరు ప్రజల గుంపులు వేర్వేరు భాషలను ఎందుకు మాట్లాడుతున్నారో ఇది వివరిస్తుంది. ప్రతి గుంపు తమ వాస్తవిక స్థావరమైన మెసొపొతమియ నుండి (కొన్నిసార్లు అనేక తరములలో) నేడు వారు ఉండు స్థలములకు వలసవెళ్లిపోయింది. ఈ విధంగా, వారి చరిత్రలు ఇక్కడ నుండి విడిపోతాయి. కాని ఆ సమయము వరకు కూడా ప్రతి భాషా గుంపుకు (ఈ మొదటి దేశములను రూపించిన గుంపులు) ఒక సామాన్య చరిత్ర ఉండేది. ఈ సామాన్య చరిత్రలో పురుష యొక్క బలి ద్వారా మోక్షమును గూర్చిన వాగ్దానము మరియు మను (నోవహు) ఇచ్చిన జలప్రళయమును గూర్చిన వృత్తాంతము ఉన్నాయి. సంస్కృత ఋషులు ఈ సన్నివేశములను తాము వ్రాసిన వేదముల ద్వారా మరియు హేబ్రీయులు ఈ సన్నివేశములను తమ వేదము (మోషే ఋషి ఇచ్చిన ధర్మశాస్త్రము) ద్వారా స్మరణకు చేసుకున్నారు.

విభిన్న జలప్రళయ వృత్తాంతముల యొక్క సాక్ష్యము – ప్రపంచమంతటి నుండి

ఆసక్తికరముగా, జలప్రళయ వృత్తాంతము పురాతన హెబ్రీ మరియు సంస్కృత వేదములలో మాత్రమే జ్ఞాపకము చేసుకోబడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్నమైన ప్రజల గుంపులు తమ తమ చరిత్రలలో గొప్ప జలప్రళయమును గూర్చి జ్ఞాపకము చేసుకుంటారు. క్రింద ఇవ్వబడిన పటము దీనిని వివరిస్తుంది.

Flood accounts from cultures around the world compared to the flood account in the Bible

బైబిలులో ఉన్న జలప్రళయ వృత్తాంతముల దృష్ట్యా లోకమంతటిలోని పలు సంస్కృతులలోని జలప్రళయ వృత్తాంతములు

పటము యొక్క పై భాగములో ప్రపంచవ్యాప్తంగా నివసించుచున్న -ప్రతి ఖండములోని – పలు భాషా గుంపులు ఇవ్వబడినవి. హెబ్రీ జలప్రళయ వృత్తాంతములోని సదరు వివరము వారి జలప్రళయ వృత్తాంతములో కూడా ఉన్నదో లేదో పటము లోపల ఉన్న గడులు (పటమునకు ఎడమ వైపు ఉన్నవి) సూచిస్తాయి. ఈ వివరము వారి జలప్రళయ వృత్తాంతములో ఉన్నదని నలుపు గడులు సూచిస్తాయి, అదే విధంగా సదరు వివరము వారి స్థానిక జలప్రళయ వృత్తాంతములో లేదని ఖాళి గడులు సూచిస్తాయి. అయితే ఈ జలప్రళయము సృష్టికర్త ఇచ్చిన తీర్పు అని, దానిలో కొంతమంది పెద్ద పడవలోనికి ఎక్కుట ద్వారా రక్షించబడ్డారను ‘స్మృతి’ని, ఇంచుమించు అన్ని గుంపులలోను కనీసం కొన్ని సామాన్య విషయములు ఉన్నాయను విషయమును మీరు చూడవచ్చు. మరొక మాటలో, ఈ జలప్రళయమును గూర్చిన స్మృతి కేవలం సంస్కృతము లేక హెబ్రీ వేదములలో మాత్రమే లేదు, కాని లోకములోను మరియు ఇతర ఖండములలోను ఉన్న ఇతర సాంస్కృతిక చరిత్రలలో కూడా ఉన్నది. ఈ సన్నివేశము అనేక సంవత్సరముల క్రితం నిశ్చయముగా జరిగింది అని ఇది తెలియపరుస్తుంది.

 

హిందీ క్యాలెండర్ ఇచ్చు సాక్ష్యము

hindu-calendar-panchang

హిందీ క్యాలెండర్ – నెలలోని రోజులు పై నుండి క్రిందికి వరుసలో ఉన్నాయి, కాని ఏడు రోజుల వారము ఉన్నది

హిందీ క్యాలెండర్ కు పాశ్చాత్య క్యాలెండర్ కు మధ్య ఉన్న భిన్నత్వము మరియు పోలిక మునుపటిని గూర్చిన ఒక పంచుకొనబడిన స్మృతికి రుజువుగా ఉన్నది. రోజులు అడ్డముగా (ఎడమవైపు నుండి కుడివైపుకు) గాక నిలువు (పై నుండి క్రిందికి) వరుసలలో ఉండునట్లు ఎక్కువ శాతం హిందీ క్యాలెండర్లు నిర్మించబడతాయి, ఇది పాశ్చాత్య దేశములలో క్యాలండర్లకు సార్వత్రిక నిర్మాణముగా ఉన్నది. భారత దేశములోని కొన్ని క్యాలండర్లు అంకెలను వ్రాయుటకు హిందీ లిపిని ఉపయోగిస్తాయి (१, २,  ३ …) మరికొన్ని రోమన్ అంకెలను ఉపయోగిస్తాయి. ఒక క్యాలెండర్ ను రూపొందించుటకు సరైన క్రమము ఏది లేదు కాబట్టి ఈ భేదములు సహజమే. కాని క్యాలండర్లన్నిటిలో ఒక కేంద్ర పోలిక ఉన్నది. హిందీ క్యాలెండర్ పాశ్చాత్య దేశముల వలెనె ఏడు దినముల వారమును ఉపయోగిస్తుంది. ఎందుకని? ఇవి సూర్యుడు చుట్టూ భూమి మరియు భూమి చుట్టు చంద్రుడు చేయు భ్రమణము మీద ఆధారపడినవి – ఈ విధంగా మానవులందరికీ ఒకే రకమైన జ్యోతిశ్శాస్త్ర పునాదులను ఇచ్చాయి – కాబట్టి క్యాలెండర్ సంవత్సరములుగా మరియు నెలలుగా ఎందుకు విభజించబడిందో మనము అర్థము చేసుకోవచ్చు. కాని ఏడు దినముల వారమునకు జ్యోతిశ్శాస్త్ర కాల ఆధారము లేదు. ఇది మునుపటి చరిత్రలోని (ఎంత కాలము మునుపో ఎవరికీ తెలియదు) ఆచారములు మరియు పరంపర ద్వారా వెలువడింది.

… మరియు భౌద్ధ థాయ్ క్యాలెండర్

thai_lunar_calendar

థాయ్ క్యాలెండర్ ఎడమవైపు నుండి కుడివైపుకు ఉంటుంది, కాని పాశ్చాత్యము కంటే భిన్నమైన సంవత్సరమును అనుసరిస్తుంది – అయినను ఏడు రోజుల వారమును చూడవచ్చు

ఒక భౌద్ధ మత దేశముగా, థాయ్ ప్రజలు తమ సంవత్సరములను గౌతమ బుద్ధిని యొక్క జీవితము నుండి ఆరంభిస్తారు, కాబట్టి వారి సంవత్సరములు పాశ్చాత్యము కంటే 543 సంవత్సరాల ముందు ఉంటాయి (అనగా క్రీ.శ. 2019 థాయ్ క్యాలెండర్ లో భౌద్ధ యుగము 2562 అయ్యుంటుంది). అయినను వారు ఏడు దినముల వారమును అనుసరిస్తారు. దీనిని వారు ఎక్కడ నుండి పొందుకున్నారు? అనేక దేశములలో నుండి అనేకమైన భిన్నత్వములు గల ఈ క్యాలెండర్లు ఏడు దినముల వారమునకు జ్యోతిశ్శాస్త్ర ఆధారము లేనప్పటికీ దీనినే ఎందుకు అనుసరిస్తారు?

వారమును గూర్చి పురాతన గ్రీకుల యొక్క సాక్ష్యము

పురాతన గ్రీకు ప్రజలు కూడా తమ క్యాలెండర్లో ఏడు దినముల వారమును ఉపయోగించారు.

సుమారుగా క్రీ.పూ. 400 కాలములో జీవించిన పురాతన గ్రీకు వైద్యుడైన హిప్పోక్రేట్స్ ఆధునిక ఔషధమునకు పితామహునిగా గుర్తించబడతాడు. అతడు అనేక పుస్తకములను వ్రాశాడు. వాటిలో అతని ఔషధ పరిశోధనలు నమోదు చేయబడినవి మరియు నేటికి కూడా భద్రపరచబడినవి. ఈ విధంగా చేస్తూ అతడు కూడా కాలమునకు ‘వారము’ను పరిమాణముగా ఉపయోగించాడు. ఒక రోగము యొక్క ఎదుగుచున్న చిహ్నములను గూర్చి అతడు ఇలా వ్రాశాడు:

నాల్గవ దినము ఏడవ దినమును సూచిస్తుంది; ఎనిమిదవ దినము రెండవ వారము యొక్కఆరంభము; ఈ విధంగా, పదకొండవ దినము రెండవ వారములో నాల్గవ దినము కాబట్టి, అది కూడా సూచితముగా ఉన్నది; మరొకసారి, పదిహేడవ దినము కూడా సూచితముగా ఉన్నది. ఎందుకంటే అది పదనాల్గవ దినము నుండి నాల్గవ దినమైయున్నది, మరియు పదకొండవ దినము నుండి ఏడవ దినమైయున్నది (హిప్పోక్రేట్స్, ఎఫోరిజమ్స్. #24)

క్రీ.పూ. 350 కాలములో వ్రాసిన అరిస్టోటిల్ కాలమును సూచించుటకు తరచుగా ‘వారము’ను ఉపయోగించాడు. ఒక ఉదాహరణను చూడండి:

శిశు మరణములు ఎక్కువగా శిశువు ఒక వారము రోజుల వయస్సునకు చేరకముందు జరిగేవి, కాబట్టి ఆ వయస్సులో శిశువుకు పేరుపెట్టుట ద్వారా అది బ్రతికే అవకాశములు ఎక్కువగా ఉంటాయి అను నమ్మికలో నుండి ఇది ఆనవాయితీగా మారిపోయింది. (అరిస్టోటిల్, ది హిస్టరీ అఫ్ అనిమల్స్, భాగం 12, సూ. )

.పూ. 350

ఇండియా మరియు థాయిలాండ్ నుండి చాలా దూరమున ఉన్న ఈ పురాతన గ్రీకు రచయితలు, ‘వారము’ను గూర్చి తమ గ్రీకు పాఠకులు అర్థము చేసుకుంటారు అనే తలంపుతో వ్రాస్తూ ‘వారము’ను గూర్చిన ఈ ఆలోచనను ఎక్కడ నుండి పొందుకున్నారు? ఏడు దినముల వారమును స్థాపించిన ఒక చారిత్రిక సన్నివేశమును (వీరు ఈ సన్నివేశమును మరచిపోయి యుంటారు) ఈ సంస్కృతులు అన్ని ఒకప్పుడు అనుభవించియుండవచ్చు కదా?

హెబ్రీ వేదములు ఇలాంటి ఒక సన్నివేశమునే వర్ణిస్తాయి – లోకము యొక్క ఆరంభ సృష్టి. ఆ వివరణాత్మకమైన పురాతన వృత్తాంతములో సృష్టికర్త లోకమును సృష్టించి ఏడు దినములలో ఆది మానవులను రూపించాడు (ఏడవ దినము విశ్రాంతి తీసుకొని ఆరు దినములలో). దీని వలన, ఆదిమ మానవులు తమ క్యాలెండర్లలో ఏడు దినముల వారమును అనుసరించారు. భాషలు తారుమారు అగుట ద్వారా మానవాళి చెదిరిపోయినప్పుడు, ‘చెదిరిపోవుట’కు ముందు జరిగిన రానున్న బలిని గూర్చిన వాగ్దానము, ఉపద్రవమును కలిగించిన జలప్రళయమును గూర్చిన వృత్తాంతము, ఏడు దినముల వారము వంటి ఈ సన్నివేశములను అనేక భాషలు మాట్లాడు ఈ ప్రజలలో చాలామంది జ్ఞాపకముంచుకున్నారు. ఈ స్మృతులు ఆదిమ మానవాళికి సజీవమైన కలాంకృతులుగాను, వేదములలో నమోదు చేయబడిన ఈ సన్నివేశముల యొక్క చరిత్రకు సాక్ష్యముగాను ఉన్నాయి. హెబ్రీ మరియు సంస్కృత వేదములకు మధ్య ఉన్న పోలికలకు ఈ వర్ణన సూటియైన వివరణగా ఉన్నది. నేడు చాలామంది ఈ రచనలను మూఢనమ్మకములతో కూడిన కల్పితములు అని విసర్జిస్తారు కాని ఈ పోలికలు వాటిని గూర్చి మనలను శ్రద్ధగా ఆలోచించునట్లు చేయాలి.

ఆది మానవులకు ఒక సామన్య చరిత్ర ఉంది మరియు దానిలో మోక్షమును గూర్చి సృష్టికర్త చేసిన వాగ్దానము కూడా ఉండినది. అయితే ఈ వాగ్దానము ఏ విధంగా నెరవేరుతుంది? భాషలు తారుమారగుట ద్వారా ప్రజలు చెదిరిపోయిన తరువాత జీవించిన ఒక పరిశుద్ధమైన వ్యక్తిని గూర్చిన వృత్తాంతముతో మనము కొనసాగిద్దాము. దీనిని మనము తదుపరి చూద్దాము.

[ఇలాంటి పోలికలనే చూపు పురాతన స్మృతులను గూర్చి – కాని ఈ సారి చైనీస్ భాష యొక్క ముక్తాఫల అక్షరములలో – మరింత నేర్చుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి]

ప్రభువైన యేసు బలియాగం నుండి శుద్ధి వరాన్ని పొందడం ఎలా?

మనుష్యులందరి కోసం తనను తాను బలిగా అర్పించుకోడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశం పురాతన రుగ్.వేదాల సంకీర్తనలలో ముందు ఛాయగా కనిపించింది, ఆదిమ హెబ్రీ వేదాల పండుగలు, వాగ్దానాలలో కూడా సూచించబడింది. ప్రార్థ స్నాన (ప్రతాసన) మంత్రం ప్రార్థనను మనం వల్లె వేసిన ప్రతీ సారి మనం అడిగే ప్రశ్నకు ప్రభువైన యేసే సమాధానం. ఇది ఎలా సాధ్యం? మనలనందరినీ ప్రభావితం చేసే కర్మ నియమాన్ని బైబిలు (వేదం పుస్తకం) ప్రకటిస్తుంది.

పాపమునకు వచ్చు జీతం మరణం….. (రోమా 6:23)

ఈ కర్మ నియమాన్ని ఒక ఉదాహరణ ద్వారా ఈ క్రింద చూపించాను. “మరణం” అంటే ఎడబాటు. మన ఆత్మ మన శరీరంలో నుండి ఎడబాటు అయినప్పుడు మనం భౌతికంగా చనిపోతాం. అదే విధంగా దేవుని నుండి మనం ఆత్మీయగా ఎడబాటు చెందుతాం. ఇది సత్యం, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు (పాప రహితుడు).

రెండు శిఖరాల మధ్య అగాధం వలనే మనం దేవుని నుండి ఎడబాటు అయ్యాం

మనం ఒక శిఖరం మీద ఉన్నవారిలా మన గురించి మనం చూడవచ్చు. దేవుడు మరొక శిఖరం మీద ఉన్నట్టు చూడవచ్చు. అంతం లేని పాప అగాధం చేత మనం దేవునినుండి వేరై యున్నాం.

ఈ ఎడబాటు దోషారోపణనూ, భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం సహజంగా చెయ్యడానికి ప్రయత్నించేదేమిటంటే మన వైపునుండి (మరణం) దేవుని వైపుకు వారధిని నిర్మించాలనుకొంటాం. మనం బలులు అర్పిస్తాం. పూజలు చేస్తాం, సన్యాసితను అభ్యసిస్తాం, పండుగలు ఆచరిస్తాం, దేవాలయాలకు వెళ్తాం, అనేక ప్రార్థనలు చేస్తాం, మన పాపాల్ని తగ్గిస్తాం లేక మానివేయడానికే ప్రయత్నిస్తాం. యోగ్యతను సంపాదించడానికి ఈ చర్యల జాబితా మనలో కొంతమందికి చాలా దీర్ఘంగా ఉండవచ్చు. సమస్య ఏమిటంటే, మన ప్రయత్నాలూ, యోగ్యతలూ, బలులూ, సన్యాసిత అభ్యాసాలూ చెడు లేనివిగా ఉన్నప్పటికీ అవి చాలవు, ఎందుకంటే మన పాపాలకు అవసరమైన (జీతం) వెల మరణం. తరువాత పటంలో ఇది ఉదహరించబడింది.

మతపర యోగ్యతలు – అవి మంచివైనప్పటికీ – దేవునికీ మనకూ మధ్య ఉన్న ఎడబాటును పూడ్చలేవు

దేవుని నుండి మనల్ని వేరు చేసే ఎడబాటును దాటడానికి మన మతపర ప్రయత్నాల ద్వారా ఒక ‘వారధిని’ నిర్మించదానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది చెడ్డది కాకపోయినా ఇది మనం సమస్యను పరిష్కరించదు. ఎందుకంటే ఆవలి వైపుకు సంపూర్తిగా వెళ్ళడంలో సఫలం కాదు. మన ప్రయత్నాలు చాలవు. శాఖాహారాలను తినడం ద్వారా క్యాన్సరు వ్యాధిని (మరణాన్ని కలిగిస్తుంది) బాగు చెయ్యడంలా ఉంటుంది. శాఖాహారాలను తినడం చాలా మంచిది – అయితే అది క్యాన్సర్ ను బాగు చెయ్యదు. దానికోసం పూర్తిగా భిన్నమైన చికిత్స అవసరం. ఈ ప్రయత్నాలను మతపర అర్హత ‘వంతెన’ తో ఉదహరించవచ్చు. అఘాధంలో కేవలం కొంత భాగం వరకు మాత్రమే ఇది వెళ్తుంది – దేవుని నుండి ఇంకా ఎడబాటులోనే ఉంచుతాయి.

కర్మనియమం చెడు వార్త – ఇది చాలా చెడు వార్త, దానిని వినడానికి కూడా ఇష్టపదం, ఈ నియమానం నెరవేరుతుందని ఆశతో – మన పరిస్థితి గురుత్వం మన ఆత్మల్లో క్షీణించి పోయేంతవరకూ మన జీవితాలను కార్యకలాపాలతోనూ, విషయాలతోనూ మన జీవితాలను నింపాలని మనం తరచుగా ప్రయత్నిస్తుంటాం. అయితే ఈ కర్మనియమంతోనే ఆగిపోలేదు.

పాపమునకు జీతం మరణం అయితే ……. (రోమా 6:23)

నియమం దిశ ఇప్పుడు మరొక దిశలోనికి – మంచి వార్త – సువార్త వైపుకు వెళ్ళబోతుందని ‘అయితే’ అనే చిన్న పదం చూపిస్తుంది. ఇది మోక్షానికీ, జ్ఞానోదయానికీ మార్చబడిన కర్మ నియమం. కాబట్టి మోక్షం శుభవార్త ఏమిటి?

ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవును కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. (రోమా 6:23)

దేవునికీ మనకూ ఉన్న ఈ ఎడబాటును పూడ్చివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు బలియాగం చాలినది అనునదే మంచి వార్త. ఇది మనకు తెలుసు ఎందుకంటే యేసు మరణించి తరువాత మూడు రోజులకు ఆయన శరీరంతో తిరిగి లేచాడు, సజీవుడుగా శరీర పునరుత్థానంలో తిరిగి వచ్చాడు.  ఈ నాడు అనేకమంది ప్రజలు ప్రభువైన యేసు పునరుత్థానాన్ని విశ్వసించడాన్ని నిరాకరించడానికి ఎంపిక చేసుకోవడాన్ని ఒక బలమైన అభియోగంగా చేసినప్పటికీ ఆయన సజీవుడు. ఈ అంశం ఒక విశ్వవిద్యాలయంలో చేసిన ఉపన్యాసంలో కనిపిస్తుంది. (వీడియో లింక్ ఇక్కడ ఉంది). విశ్వఆత్మ, ప్రధానుడైన ప్రభువైన యేసు పరిపూర్ణ బలిని అర్పించాడు. ఆయన మానవుడు కనుక అగాధం విస్తృతిని పూడ్చడానికీ మానవుని పక్షంగా స్పర్శించగలడు, పరిపూర్ణుడు కనుక దేవుని పక్షాన్ని కూడా స్పర్శించగలడు. నిత్య జీవానికి ఆయన వారధి. ఈ అంశం ఈ క్రింద ఉదహరించబడింది.

దేవునికీ, మానవునికీ విస్తరించిన అగాధానికి ప్రభువైన యేసు వారధి. ఆయన బలి మన పాపాలకు వెల చెల్లించింది

ప్రభువైన యేసు బలి ఏవిధంగా మనకు అనుగ్రహింపబడిందో గమనించండి. ఇది మనకు ఒక బహుమానంగా (వరంగా) అనుగ్రహింపబడింది. బహుమానాలను గురించి ఆలోచించండి. ఇచ్చిన బహుమతి ఎటువంటిదైనా అది నిజంగా బహుమతి అయితే దాని కోసం నీవు ప్రయాస పడని బహుమతి. నీకున్న అర్హతను బట్టి నీవు దానిని పొందలేదు. నీవు దానిని సంపాదించుకొన్నావు అంటే అది బహుమతి కానే కాదు! అదేవిధంగా ప్రభువైన యేసు బలిని నీవు సంపాదించుకోలేవు, దానికి అర్హుడవు కావు. అది నీకు బహుమానంగా అనుగ్రహింపబడింది.  బహుమతి అంటే ఏమిటి? ఇది ‘నిత్యజీవం’  అంటే నీకు మరణాన్ని తెచ్చిన పాపం ఇప్పుడు రద్దు చెయ్యబడింది. దేవునితో సంబంధం కలిగియుండడానికి, నిత్య జీవాన్ని పొందడానికి దాటి వెళ్ళడానికి ప్రభువైన యేసు బలి ఒక వంతెనలా ఉంది-ఇది శాశ్వతంగా ఉంటుంది.  మృతులలో నుండి సజీవుడిగా లేవడం ద్వారా తనను తాను ప్రభువుగా కనపరచుకొన్న ప్రభువైన యేసు ఈ బహుమతిని అనుగ్రహించాడు.

కాబట్టి నీవూ, నేనూ ఈ నిత్యజీవం వంతెనను ఏవిధంగా ‘దాటగలం’? మరల బహుమానాలను గురించి ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు కష్టపడకుండా నీకు ఒక బహుమానాన్ని ఇచ్చారనుకోండి, ఆ బహుమానం నుండి ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే నీవు దానిని ‘స్వీకరించాలి.’ ఎప్పుడైనా బహుమతి ఇచ్చినప్పుడు రెండు ప్రత్యామ్యాయాలు ఉంటాయి. బహుమానాన్ని నిరాకరించడం (“వద్దు, కృతజ్ఞతలు”) లేక దానిని స్వీకరించడం (“మీ బహుమానం కోసం వందనాలు, నేను దానిని తీసుకొంటాను”). కాబట్టి ప్రభువైన యేసు అనుగ్రహించే బహుమానాన్ని స్వీకరించాలి. కేవలం ‘నమ్మడం’, ‘అధ్యయనం చెయ్యడం’, ‘అర్థంచేసుకోవడం’ కాదు. దేవుని వైపుకు తిరగి, ఆయన మనకు అనుగ్రహించే బహుమానాన్ని పొందడానికి వంతెన మీద ‘నడవడం’ తరువాత పటంలో ఉదహరించబడింది.

ప్రభువైన యేసు బలి మనలో ప్రతీ ఒక్కరూ ఎంపిక చేసుకొని స్వీకరించవలసిన దేవుని బహుమానం

కనుక ఈ బహుమానాన్ని ఏవిధంగా స్వీకరిస్తాము? బైబిలు ఇలా చెపుతుంది:

“ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.” (రోమా 10:13) 

ఈ వాగ్దానం ‘అందరి’కోసం అని గమనించండి. ఒక నిర్దిష్ట మతం, జాతి, దేశంలో ఉన్నవారికి కాదు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు కనుక ఈనాటికీ సజీవుడిగా ఉన్నాడు. అయన ‘ప్రభువు’ కాబట్టి ఆ నామంలో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన నిత్యజీవం బహుమానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయనతో సంబాషణ చెయ్యడం ద్వారా – నీవు ఆయనకు ప్రార్థన చెయ్యాలి, ఆయనను అడగాలి. ఒకవేళ ఇంతకు ముందు నీవిలా చేసి యుండకపోవచ్చు. ఆయనతో ఈ సంబాషణ, ఈ ప్రార్థన చెయ్యడానికి నీకు సహాయం చెయ్యడానికి ఇక మాదిరి ఇక్కడ ఉంది. ఇది మాంత్రిక సంబంధ మంత్రోచ్చారణ కాదు. శక్తిని ఇచ్చే ప్రత్యేక పదాలు కాదు. ఈ బహుమానం ఇవ్వడానికి ఆయనకు ఉన్న సామర్ధ్యం, ఇష్టత మీద విశ్వాసం. మనం విశ్వసించినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. కాబట్టి మీ ప్రభువైన యేసుకు గట్టిగా ప్రార్థన చెయ్యడం లేదా ఆత్మలో మౌనంగా ప్రార్థన చేసి ఆయన బహుమానాన్ని స్వీకరించడంలో ఈ మార్గదర్శిని అనుసరించండి.

ప్రియమైన యేసు, నా పాపాలు నా జీవితంలో ఉండగా నేను దేవుని నుండి దూరం అయ్యానని నేను అర్థం చేసుకొన్నాను. నేను చాలా కష్టపడినప్పటికీ నా నుండి ఏ ప్రయత్నమూ, బలియాగామూ ఈ ఎడబాటును పూడ్చలేకపోయాయి. అయితే పాపాలన్నిటినీ కడిగి పవిత్రపరచడానికి నీ మరణం బలియాగమని నేను అర్థం చేసుకొన్నానునా పాపాలను సహితం.  నీ బలియాగాన్ని సిలువులో అర్పించి, మృతులలో నుండి లేచావని నేను విశ్వసిస్తున్నాను. నీ బలి యాగం చాలినదని నేను విశ్వసిస్తున్నాను. నా పాపాలనుండి నన్ను పవిత్రపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను, శాశ్వత జీవాన్ని కలిగియుండడానికి దేవునితో నన్ను చేర్చండి. పాపానికి బానిసగా ఉండే జీవితం జీవించాలని నేను కోరుకోవడం లేదు. అది నన్ను కర్మ అధికార బంధకంలో పట్టియుంచుతుంది. ప్రభువైన యేసూ నా కోసం ఇదంతా చేస్తున్నందుకు నీకు వందనాలు. నీవే నా ప్రభువుగా నిన్ను అనుసరించడానికి నా జీవితంలో నీవే నన్ను నడిపించుచున్నందుకు నీకు వందనాలు.