Skip to content

అన్ని కాలముల కొరకు & ప్రజలందరి కొరకు తీర్థయాత్ర: అబ్రాహాము ఆరంభించాడు

  • by

కతరగమ పండుగకు ముందు జరుగు తీర్థయాత్ర (పాద యాత్ర) భారత దేశములో మాత్రమే జరుపబడదు. ఈ తీర్థయాత్ర వల్లి అను శ్రీలంకకు చెందిన ఒక స్థానిక అమ్మాయి కొరకు హిమాలయాలలో ఉన్న తన తల్లిదండ్రుల (శివుడు & పార్వతీ) గృహమును విడచి శ్రీలంకకు ప్రయాణము చేసిన ప్రభువైన మురుగన్ (కతరగమ, కార్తికేయ లేక స్కంద అను పేర్లు గల ప్రభువు) యొక్క యాత్రకు జ్ఞాపికగా ఉన్నది. వారి ప్రేమను మరియు వివాహమును జ్ఞాపకము చేసుకొనుటకు శ్రీలంకలో ఉన్న కతరగమ దేవాలయములో కతరగమ పెరహేర (ఊరేగింపు) పండుగ జరుపబడుతుంది.

ఈ పండుగ సమయానికి కతరగమ చేరుకొనుటకు సుమారుగా నలబై ఐదు దినముల ముందు నుండే భక్తులు కొన్ని వందల కిలోమీటర్ల తీర్థయాత్రను ఆరంభిస్తారు. యుద్ధ దేవుడైన ప్రభువైన మురుగన్ కు జ్ఞాపికగా, అనేకమంది ఒక వెల్ ను (బల్లెము) చేతబట్టుకొని వారికి సుపరిచితమైన సురక్షితమైన స్థలమును విడచి ఈ తీర్థయాత్ర ద్వారా తెలియని లోకములోనికి ప్రవేశిస్తారు.

తీర్థయాత్రికులు అమావాస్య దినమున కతరగమ పండుగను ఆరంభించుటకు కతరగమ పర్వతమును ఎక్కుటతో తీర్థయాత్ర ముగుస్తుంది. పదునాలుగు రోజుల పాటు ప్రతి రోజు రాత్రి వల్లి దేవాలయము వరకు మురుగన్ విగ్రహము యొక్క ఊరేగింపు జరుగుతుంది. తరువాత పౌర్ణమి దినము యొక్క ఉదయమున మురుగన్ విగ్రహమును మెనిక్ గంగ నదిలో విసర్జన చేసి దాని పవిత్రమైన నీటిని భక్తుల మీద చల్లు నీటిని-చిమ్ము కార్యక్రమము ద్వారా ఈ పండుగ ముగుస్తుంది.

మంటలలో నడుచు ఆచారము ఈ పండుగలో ఒక ముఖ్యమైన ఆకర్షణగా ఉన్నది, దీనిలో భక్తులు మండుచున్న బొగ్గుల మీద నడుచుచు అడంకులను ఎదుర్కొనుటకు అసామాన్యమైన విశ్వాసమును కనుపరుస్తారు.

పలు భాషలు, మతములు మరియు జాతులకు చెందిన ప్రజలు కలిసి ఈ వార్షిక తీర్థయాత్రలో పాల్గొని, మార్గదర్శమును, ఆశీర్వాదమును, స్వస్థతను వెదకుచు తమ విశ్వాసమును పరీక్షించుకుంటారు. ఈ విధంగా వారు నాలుగు వేల సంవత్సరముల క్రితం అబ్రాహాము ఆరంభించిన పద్ధతిని అనుసరిస్తారు. అతడు కొన్ని నెలలు గాక, తన జీవిత కాలమంతా తీర్థయాత్రలో గడిపాడు. అతడు చేసిన తీర్థయాత్ర నాలుగు వేల సంవత్సరముల తరువాత మీ జీవితముల మీద మరియు నా జీవితము మీద ప్రభావము చూపుతుంది. అతడు చేసిన తీర్థయాత్రలో అతడు పవిత్రమైన పర్వతము మీద ఒక అసామాన్యమైన బలిని అర్పించి, దేవుని మీద తన విశ్వాసమును కనుపరచవలసియుండెను. దీని ద్వారా సముద్రమును చీల్చుకొని అగ్నిలో గుండా ప్రయాణించి ఒక దేశము జన్మించింది – తరువాత అది దక్షిణ ఆసియా ప్రాంతమంతటి మీద ప్రభావము చూపింది. నేడు మనకు కూడా ఆశీర్వాదమును మరియు మార్గదర్శకమునిచ్చు అతని తీర్థయాత్ర ఎలా ఆరంభమైయ్యిందో చూచుట వలన మనకు కూడా జ్ఞానోదయము కలుగుతుంది. అబ్రాహాము చేసిన తీర్థయాత్రను చూచుటకు ముందు, అతని తీర్థయాత్రను గూర్చి వేదపుస్తకములో నమోదుచేయబడిన నేపధ్యమును చూద్దాము.

మానవుని సమస్య – దేవుని ప్రణాళిక

మానవాళి ప్రజాపతియైన సృష్టికర్త యొక్క ఆరాధనను విడిచి నక్షత్రములను గ్రహములను ఆరాధించుట ఆరంభించారు అని మనము చూశాము. ఇందు వలన ప్రజాపతి మను/నోవహు కుమారుల వారసుల భాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. అందుకే నేడు భాషల ద్వారా వేరు చేయబడిన అనేక దేశములు ఉన్నాయి. మానవాళి యొక్క ఒకే పూర్వ అనుభవమును గూర్చి నేడు లోకమంతటా ఉపయోగించబడుతున్న ఏడు దినముల క్యాలెండర్లు మరియు గొప్ప జలప్రళయమును గూర్చిన పలు స్మృతులలో చూడవచ్చు.

ఒక పరిపూర్ణమైన వ్యక్తి యొక్క బలి ద్వారా ‘ఋషులు అమరత్వమును పొందుకుంటారు’ అని ప్రజాపతి చరిత్ర యొక్క ఆరంభములో వాగ్దానము చేశాడు. మనలను బాహ్యముగా మాత్రమేగాక మన అంతరంగమును కూడా శుద్ధిచేయుటకు ఈ బలి ఒక పూజ వలె పని చేస్తుంది. అయితే, సృష్టికర్త యొక్క ఆరాధన భ్రష్టుపట్టిపోవుటతో, క్రొత్తగా చెదిరిపోయిన దేశములు ఈ ఆరంభ వాగ్దానమును మరచిపోయాయి. నేడు దీనిని ఋగ్వేదము మరియు వేదపుస్తకము – బైబిలు – వంటి కొన్ని పుస్తకములు మాత్రమే జ్ఞాపకము చేసుకుంటాయి.

అయితే ప్రజాపతి/దేవుడు ఒక ప్రణాళికను రూపించాడు. ఇది మీరు నేను ఊహించగలిగినది కాదు, ఎందుకంటే ఇది మన దృష్టిలో చాలా అల్పమైనదిగా అప్రయోజనమైనదిగా ఉంటుంది. కాని ఆయన ఇదే ప్రణాళికను నిర్ణయించాడు. ఈ ప్రణాళిక ప్రకారం సుమారుగా క్రీ.పూ 2000లో (అనగా 4000 సంవత్సరముల క్రితం) ఆయన ఒక మనుష్యుని మరియు అతని కుటుంబమును పిలచి, అతడు ఆశీర్వాదమును పొందుకొనుటకు ఇష్టపడితే అతడు, అతని వారసులు ఆశీర్వదించబడతారు అని వాగ్దానము చేశాడు. బైబిలు దీనిని ఈ  విధంగా జ్ఞాపకము చేసుకుంటుంది.

అబ్రాహాముతో చేయబడిన వాగ్దానము

 

యెహోవా అబ్రాముతో, “మీ దేశం, మీ ప్రజలు మరియు మీ తండ్రి ఇంటి నుండి నేను మీకు చూపించే భూమికి వెళ్ళు.

“నేను నిన్ను గొప్ప దేశంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నేను మీ పేరును గొప్పగా చేస్తాను, మరియు మీరు ఆశీర్వదిస్తారు. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారెవరైనా శపిస్తాను; మరియు భూమిపై ఉన్న ప్రజలందరూ మీ ద్వారా ఆశీర్వదించబడతారు. “

4 కాబట్టి యెహోవా చెప్పినట్లు అబ్రాము వెళ్ళాడు; లోతు అతనితో వెళ్ళాడు. హర్రాన్ నుండి బయలుదేరినప్పుడు అబ్రామ్కు డెబ్బై ఐదు సంవత్సరాలు. 5 అతను తన భార్య సారాయ్, అతని మేనల్లుడు లోత్, వారు సేకరించిన ఆస్తులన్నీ, హర్రాన్ లో వారు సంపాదించిన ప్రజలను తీసుకొని వారు కనాను దేశానికి బయలుదేరారు, వారు అక్కడికి చేరుకున్నారు….

7 యెహోవా అబ్రాముకు కనిపించి, “నీ సంతానానికి నేను ఈ భూమిని ఇస్తాను” అని అన్నాడు. అందువల్ల ఆయన తనకు కనిపించిన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు.

ఆదికాండము 12: 1-7

మన కష్ట కాలములో మనకు నిరీక్షణ కలుగునట్లు మనకు సహాయం చేయుటకు ఆశపడు ఒక వ్యక్తిగతమైన దేవుడు ఉన్నాడా అని నేడు చాలా మంది ఆశ్చర్యపడుతుంటారు. ఈ కథనములో పైప్రశ్నను మనము పరీక్షించవచ్చు, ఎందుకంటే దీనిలో ఒక వ్యక్తికి చేయబడిన ఒక వ్యక్తిగత వాగ్దానము ఉంది, మరియు దీనిలో కొన్ని విషయములను మనము ధృవీకరించవచ్చు. ‘నేను నీ నామమును గొప్ప చేసెదను’ అని ప్రభువు స్వయంగా అబ్రాహాముతో వాగ్దానము చేసినట్లు ఈ వృత్తాంతము నమోదు చేస్తుంది. మనము 21వ శతాబ్దములో జీవించుచున్నాము – 4000 సంవత్సరముల తరువాత – మరియు అబ్రాహాము/అబ్రాము అను పేరు చరిత్రలో సార్వత్రికముగా ప్రఖ్యాతిగాంచిన పేర్లలో ఒకటైయున్నది. ఈ వాగ్దానము అక్షరార్థముగాను, చారిత్రికముగాను, పరిశీలనాత్మకముగాను నెరవేరింది.

మనకు అందుబాటులో ఉన్న అత్యంత పురాతనమైన బైబిలు ప్రతు డెడ్ సి స్క్రోల్స్ కు చెందినది మరియు ఇది క్రీ.పూ 200-100 కాలమునకు చెందినది. అంటే ఈ వాగ్దానము కనీసం ఆ కాలము నుండి అయినా ప్రచురణలో ఉన్నది. అయితే క్రీ.పూ. 200లో కూడా ఒక చిన్న యూదుల సమూహము మధ్య మినహా అబ్రాహాము అను పేరు అంత ప్రచిలితము కాలేదు. కాబట్టి అది వ్రాయబడిన తరువాతనే వాగ్దానముల యొక్క నెరవేర్పు జరిగింది అని మనము గ్రహించగలము. ఇది వాగ్దానము ‘నెరవేర్చబడిన’ తరువాత దానిని గూర్చి వ్రాయబడిన సందర్భము కాదు.

… అతని యొక్క గొప్ప దేశము ద్వారా

మరొక ఆశ్చర్యపరచు విషయం ఏమిటంటే అబ్రాహాము తన జీవిత కాలమంతటిలో గుర్తించదగిన కార్యమేది – ఒకని పేరు గొప్పదిగా చేయబడుటకు చేయు కార్యములను – చేయలేదు. అతడు అసాధారణమైనదేది వ్రాయలేదు (మహాభారతమును వ్రాసిన వ్యాసుడు వలె), అతడు గుర్తించదగినదేది నిర్మించలేదు (తాజ్ మహాల్ ను నిర్మించిన షాజహాన్ వలె), మంచి యుద్ధ నైపుణ్యముతో అతడు సైన్యమును నడిపించలేదు (భగవద్గీతలో అర్జునుడు వలె), లేక అతడు రాజకీయముగా కూడా నాయకత్వం వహించలేదు (మహాత్మా గాంధీ వలె). ఒక రాజుగా అతడు రాజ్యమును కూడా పాలించలేదు. వాస్తవానికి, అరణ్యములో గుడారము వేసుకొని ప్రార్థన చేసి, తరువాత ఒక కుమారుని కనుట కంటే ఎక్కువ అతడు ఏమి చేయలేదు.

చరిత్రలో కొన్ని వేల సంవత్సరముల పాటు గుర్తుండు అతని దినములలోని ప్రజలను గూర్చి మీరు ప్రవచించవలసి వస్తే, రాజులు, సైన్యాధిపతులు, యోధులు, లేక ఆస్థాన కవులను గూర్చి మీరు ఆలోచించిస్తారు. కాని వారి పేర్లన్ని సమసిపోయాయి – కాని అరణ్యములో ఒక కుటుంబమును మాత్రమే కలిగియుండిన ఒక వ్యక్తి నేడు ప్రపంచములో ఇంటిల్లిపాదీకి సుపరిచితమైయ్యాడు. అతడు జన్మనిచ్చిన దేశములు అతనిని గూర్చిన నివేదికను భద్రము చేశారు కాబట్టే అతని పేరు నేడు గొప్పదిగా ఉన్నది – తరువాత అతనిలో నుండి పుట్టిన వ్యక్తులు మరియు దేశములు గొప్పవారైయ్యారు. అనేక సంవత్సరముల క్రితం ఇదే వాగ్దానము చేయబడింది (నేను నిన్ను గొప్ప జనాంగముగా చేసెదను … నేను నీ నామమును గొప్ప చేసెదను). తన జీవితములో తాను చేసిన గొప్ప కార్యముల ద్వారాగాక కేవలం తన వారసుల ద్వారా మాత్రమే ఇంత ఖ్యాతిని పొందిన వ్యక్తిని నేను చరిత్రలో చూడనేలేదు.

… వాగ్దానము చేయువాని చిత్తము ద్వారా

మరియు అబ్రాహాము వంశపువారైన ప్రజలు – యూదులు – కూడా పురాతన వైభవముతో ఖ్యాతిగడించిన వారేమి కాదు. ఐగుప్తులోని పిరమిడ్ల వలె వారు గొప్ప నిర్మాణములను నిర్మించలేదు – ఖచ్చితముగా తాజ్మహల్ వంటివి కూడా కట్టలేదు, గ్రీకుల వలె తత్వశాస్త్రమును వ్రాయలేదు, బ్రీటిషు వారి వలె దేశాలను వశపరచుకొని పాలించలేదు. ఈ దేశములన్నీ ప్రపంచ-వ్యాప్త సామ్రాజ్యములుగా తమ సరిహద్దులను అసాధారణమైన సైన్య శక్తితో విశాలపరచుకున్నాయి – కాని యూదులు అలా ఏనాడు చేయలేదు. యూదా ప్రజల యొక్క ఘనత వారు వ్రాసిన ధర్మశాస్త్రము మరియు పుస్తకము (వేద పుస్తకము లేక బైబిలు) ద్వారా కలుగుతుంది; తమ దేశములో పుట్టిన కొందరు మహాపురుషుల ద్వారా కలుగుతుందు; మరియు ప్రత్యేకించబడిన విశేషమైన ప్రజలుగా వారు ఇన్ని వేల సంవత్సరములు మనుగడలో ఉండిరి. వారి ఘనత వారు సాధించిన వాటి ద్వారా కలుగలేదు గాని, వారి కొరకు మరియు వారి ద్వారా చేయబడిన కార్యముల ద్వారా కలిగింది.

ఈ వాగ్దానమును నెరవేర్చు వ్యక్తిని ఇప్పుడు చూడండి. ఇక్కడ, స్పష్టముగా మరలా మరలా “నేను” అని వ్రాయబడియున్నది. దీనిని ఒక అంతరంగ సామర్థ్యము, స్వాధీనపరచుకొను శక్తి లేక ‘దేశము’ యొక్క బలముగాక సృష్టికర్త సాధిస్తాడు అను ప్రకటన చరిత్రలో వారు గొప్పతనమును సాధించిన విధానములోనికి చక్కగా పొందుపరచబడుతుంది. ఆధునిక యూదుల దేశమైన ఇశ్రాయేలులో జరుగు సన్నివేశముల మీద నేడు మీడియా పెట్టు విశేషమైన దృష్టి ఇక్కడ మన మాటను రుజువుచేస్తుంది. ఇంచుమించు ఇశ్రాయేలు వంటి వైశాల్యమును కలిగియున్న లోకములోని ఇతర దేశములైన హన్గేరి, నార్వే, పపుఆ న్యూ గునియా, బొలివియా, లేక సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి దేశములలో జరుగు సన్నివేశములను గూర్చిన వార్తలను మీరు తరచుగా వింటారా? కాని 80 లక్షల జనాభా కలిగిన చిన్న దేశమైన ఇశ్రాయేలు తరచుగా వార్తలలో ఉంటుంది.

ఈ ప్రాచీన మనుష్యునికి ప్రకటించబడిన పురాతనమైన వాగ్దానము ఉన్నది ఉన్నట్లుగా నెరవేరునట్లు చరిత్రలోగాని మానవ సన్నివేశములలోగాని ఏది చేసియుండేదికాదు, కాని అతడు వాగ్దానమును నమ్మి ప్రత్యేకించబడిన మార్గములో వెళ్లుటకు సిద్ధపడ్డాడు గనుక అతడి జీవితములో ఇది నెరవేర్చబడింది. ఈ వాగ్దానము ఏదో ఒక విధముగా విఫలమైయుండే సాధ్యతను గూర్చి ఆలోచించండి. కాని అది నెరవేర్చబడింది, నేడు కూడా నెరవేరుతుంది, మరియు అది కొన్ని వేల సంవత్సరముల క్రితం ప్రకటించబడింది. ఇది వాగ్దానము చేసిన వాని శక్తి మరియు అధికారము ద్వారా మాత్రమే నెరవేర్చబడింది.

నేటికి కూడా లోకమును కదిలిస్తున్న తీర్థయాత్ర

This map shows the route of Abraham's Journey

ఈ పటము అబ్రాహాము తీర్థయాత్ర చేసిన మార్గమును సూచిస్తుంది

“యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను” (వ. 4) అని బైబిలు నివేదిస్తుంది. అతడు పటములో చూపించిన మార్గములో తీర్థయాత్రకు ప్రయాణమైయ్యాడు, ఇది నేటికి కూడా చరిత్రను సృష్టిస్తుంది.

మనకు ఆశీర్వాదములు

కాని ఇది అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ఇంకొక విషయము కూడా వాగ్దానము చేయబడింది. ఆశీర్వాదము అబ్రాహాము కొరకు మాత్రమేకాదు గాని

“భూమి యొక్క సమస్త వంశములు (అతని) ద్వారా ఆశీర్వదించబడతాయి

వ. 4

మీరు నేను ఈ విషయమును గమనించాలి. మనము ఆర్యులమైనా, ద్రవిడులమైనా, తమిళులమైనా, నేపాలీయులమైనా, లేక వేరే ఎవరిమైనా సరే; మన కులం ఏమైనా సరే; మన మతం ఏమైనా సరే, హిందువులమైనా, ముస్లింలమైనా, జైనులమైనా, సిక్కులమైనా లేక క్రైస్తవులమైనా; మనము ధనికులమైనా దరిద్రులమైనా, ఆరోగ్యవంతులమైనా రోగులమైనా; విద్యావంతులమైనా, కాకపోయినా – ‘భూమి యొక్క సమస్త వంశములు’ అనగా దానిలో మనమంతా ఉన్నాము. ఆశీర్వాదమునకు వాగ్దానము ఆ దినము మొదలుకొని నేటి వరకు సజీవులుగా ఉన్న ప్రతివారికి వర్తిస్తుంది – అనగా నీకు కూడా. ఎలా? ఎప్పుడు? ఎలాంటి ఆశీర్వాదము? దీనిని గూర్చి ఇక్కడ స్పష్టముగా తెలియపరచలేదుగాని, మీ మీద మరియు నా మీద ప్రభావము చూపు ఒక కార్యము ఇక్కడ ఆరంభమైయ్యింది. అబ్రాహాముతో చేయబడిన వాగ్దానములోని మొదటి భాగము నెరవేర్చబడింది అని మనము చారిత్రికముగాను అక్షరార్థముగాను ఇప్పుడే రుజువు చేశాము. అలాంటప్పుడు మీకు నాకు చేయబడిన వాగ్దానములోని ఒక భాగము నెరవేరదని నమ్ముటకు మన దగ్గర కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే అది మార్పులేనిది మరియు సార్వత్రికమైనది కాబట్టి ఈ వాగ్దానము సత్య అయ్యున్నది. కాని ఈ వాగ్దానములోని సత్యమును అర్థము చేసుకొనుటకు మనము దానిని విప్పవలసియున్నది. ఈ వాగ్దానము మనకు ఎలా వర్తిస్తుందో గ్రహించుటకు మనకు జ్ఞానోదయము కావాలి. అబ్రాహాము యొక్క తీర్థయాత్రను అనుసరించుట కొనసాగించుటలో మనము ఈ జ్ఞానోదయమును పొందుకుంటాము. లోకములో ప్రజలు సాధించుటకు ప్రయాసపడు మోక్షము యొక్క తాళపు చెవి, ఈ విశేషమైన మనుష్యుని మనము అనుసరించుట కొనసాగించుచుండగా మనందరి కొరకు బయలుపరచబడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *