Skip to content

వచ్చే రాజు కీర్తిగల రాజు: వందల సంవత్సరాల ముందే పేరు పెట్టబడింది

  • by

విష్ణు పురాణం రాజు వేనుని గురించి చెప్పుతుంది. వేను మంచి రాజుగా ప్రారంభమైనప్పటికీ, అవినీతి ప్రభావాల కారణంగా అతను చాలా చెడ్డవాడు అయ్యాడు, అతడు బలులు, ప్రార్థనలను నిషేధించాడు. అతడు విష్ణువు కంటే గొప్పవాడని కూడా పేర్కొన్నాడు. రాజుగా అతను సరైన ధర్మానికి బోధించటం, ఒక ఉదాహరణగా ఉండాలని, దానిని అణగదొక్క కూడదు అని, ఋషులు, బ్రాహ్మణులు / పూజారులు అతనికి  నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు, అయితే వేను వినలేదు. వేను రాజు పశ్చాత్తాపం చెందనందుకు వారు ఒప్పించలేక పోయినందున పూజారులు నిరాశ చెందారు, కాబట్టి పూజారులు, ధర్మాన్ని పునరుద్ధరించడానికి, అతను మార్చిన చెడు రాజ్యాన్ని వదిలించుకోవటానికి అతన్ని చంప్పుతారు.

ఇంకా ఆ రాజ్యం పాలకుడు లేని రాజ్యాముగా అయింది. కాబట్టి పూజారులు వేను రాజు కుడిభుజం మధించారు పృథువు / ప్రుతు అనే గొప్ప వ్యక్తి ఉద్భవించాడు. పృథువు వేను వారసుడిగా నియమించారు. అటువంటి నైతిక వ్యక్తి రాజు కావాలని అందరూ సంతోషించారు మరియు పృథువు పట్టాభిషేక వేడుకలకు బ్రహ్మ కూడా హాజరయ్యారు. పృథువు పాలనలో రాజ్యం స్వర్ణ యుగంలోకి ప్రవేశించింది.

హీబ్రూ ప్రవక్తలు యెషయా, యిర్మీయా ఎదుర్కొంటున్న ఇలాంటి గందరగోళాన్ని ఇది వివరిస్తుంది. వారు ఇశ్రాయేలు రాజులను చూశారు, మొదట్లో  నీతి గలవారు పది ఆజ్ఞల ధర్మాన్ని అనుసరించారు, అనుసరిచిన వారు అవినీతిపరులు అయ్యారు. చెట్టు నరికివేసినట్లు రాజవంశం పడిపోతుందని వారు ప్రవచించారు. కానీ వారు భవిష్యత్ గొప్ప నీతి రాజు గురించి కూడా ప్రవచించారు, పడిపోయిన చెట్టు మొద్దు నుండి చిగురు పైకి లేచును.

పూజారులు, రాజుల మధ్య పాత్రలు గుర్చిన స్పష్టమైన విభజనను వేను కథ వివరిస్తుంది. రాజు వేనును పూజారులు తొలగించినప్పుడు వారు తమ హక్కు కానందున వారు పాలన చేపట్టలేరు. యెషయా, యిర్మీయా కాలంలో కూడా రాజుల, పూజారల మధ్య పాత్రల విభజన కూడా అమలులో ఉంది. ఈ కథలలోని వ్యత్యాసం ఏమిటంటే, పృథువుకు ఆయన పుట్టిన తరువాత పేరు పెట్టారు, అయితే హీబ్రూ ప్రవక్తలు ముందు రాబోయే గొప్ప నీతి రాజుకు ఆయన పుట్టుకకు వందల సంవత్సరాల ముందే ఎలా పేరు పెట్టారో చూసాం.

రాబోయే కొమ్మ గురించి యెషయా మొదట రాశాడు. వివేకం మరియు శక్తిని కలిగి ఉన్న పడిపోయిన దావీదు రాజవంశం నుండి ఒక ఆయన వస్తున్నాడు. తరువాత యిర్మీయా ఈ కొమ్మను ప్రభువు అని పిలుస్తారు – సృష్టికర్త దేవునికి హీబ్రూ పేరు, ఆయన మన నీతి.

చిగురునుజెకర్యాకొనసాగిస్తున్నారు

ఆలయాన్ని పునర్నిర్మించడానికి బబులోను చెర తరువాత జెకర్యా తిరిగి వచ్చాడు

ప్రవక్త అయిన జెకర్యా క్రీస్తుపూర్వం 520 లో నివసించాడు, యూదులు తమ మొదటి బానిసత్వం నుండి యెరూషలేముకు తిరిగి రావడం ప్రారంభించారు. తిరిగి వచ్చిన తరువాత, నాశనం అయిన వారి ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రధాన యాజకుని పేరు యెహోషువ, అతను ఆలయ పూజారుల పనిని తిరిగి ప్రారంభించాడు. తిరిగి వచ్చిన యూదుల ప్రజలను నడిపించడంలో రిషి-ప్రవక్త అయిన జెకర్యా, ప్రధాన యాజకుడైన యెహోషువతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఈ యెహోషువ గురించి దేవుడు – జెకర్యా ద్వారా – ఇక్కడ చెప్పాడు:

ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;

జెకర్యా 3:8-9

చిగురును! గురించి 200 సంవత్సరాల ముందు యెషయా ప్రారంభించాడు,  60 సంవత్సరాల క్రితం యిర్మీయా కొనసాగించాడు, రాయల్ రాజవంశం ఇప్పుడు నరికివేయబడినప్పటికీ, జెకర్యా ‘చిగురుతో’ మరింత ముందుకు సాగించాడు. మర్రి చెట్టులాగే ఈ చిగురు చనిపోయిన మొద్దు మూలాలను నుండి ప్రచారం కొనసాగింది. ఆ చిగురును ఇప్పుడు ‘నా సేవకుడు’ – దేవుని సేవకుడు అంటారు. క్రీస్తుపూర్వం 520లో  యెరూషలేంలో ప్రధాన యాజకుడు యెహోషువ, జెకర్యా సహోద్యోగి, ఈ రాబోయే చిగురుకు గుర్తు.

కానీ ఎలా?

‘ఒకే రోజులో’  పాపాలను ప్రభువు ఎలా తొలగిస్తాడు?

చిగురు: రాజు, యాజకుడుకలయిక

హీబ్రూ వేదాలలో అర్థం చేసుకోవటానికి యాజకుడు, రాజు పాత్రలు కచ్చితంగా వేరు చేయబడ్డాయి. రాజుల్లో ఎవరూ యాజకులు కాలేరు, పూజారులు రాజులు కాలేరు. యాజకుని (పూజారి) పాత్ర దేవునికి బలులు అర్పించడం ద్వారా దేవునికి, మనిషికి మధ్య మధ్యవర్తిత్వం వహించడం మరియు సింహాసనం నుండి న్యాయంతో పరిపాలించడం రాజు యొక్క బాధ్యత. రెండూ కీలకమైనవి; రెండూ విభిన్నమైనవి. అయినప్పటికీ జెకర్యా భవిష్యత్తు గురించి ఇలా వ్రాశాడు:

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
10 చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి
11 వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి
12 అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
13 అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.

జెకర్యా 6:9-13

పూర్వంలోని వాటికి వ్యతిరేకంగా, జెకర్యా రోజుల్లో (యెహోషువ) లోని ప్రధాన యాజకుడు (పూజారి) రాజు కిరీటాన్ని గుర్తు గా చిగురును ఉంచాలి. (యెహోషువ ‘రాబోయే విషయాలకు గుర్తు’ అని గుర్తుంచుకోండి). రాజు కిరీటాన్ని ధరించడంలో ప్రధాన యాజకుడు యెహోషువ, రాజు, యాజకునిగా ఒక వ్యక్తి ఐక్యపరచడాన్ని ముందుగానే చూశాడు – రాజు సింహాసనంపై యాజకుడు. ఇంకా, జెకర్యా రాసినది ‘యెహోషువ’ చిగురు పేరు. దాని అర్థం ఏమిటి?

‘యేసు’, ‘యెహోషువ’ పేర్లులు

బైబిలు అనువాదం యొక్క కొంత చరిత్రను మనం తెలుసుకోవాలి. అసలు హిబ్రూ వేదాలు క్రీస్తుపూర్వం 250 లో గ్రీకులోకి అనువదించారు, దీనిని సెప్టువాగింట్ లేదా ఎల్ఎక్స్ఎక్స్ (LXX) అని పిలుస్తారు. ఇప్పటికీ విస్తృతంగా చదివిన, ఎల్ఎక్స్ఎక్స్ (LXX) లో ‘క్రీస్తు’ మొదట ఎలా ఉపయోగించారో మనం చూసాం, ఇక్కడ ‘యెహోషువ’ కోసం అదే విశ్లేషణను అనుసరిదాం.

యెహోషువ ‘ = ‘యేసు‘. రెండూహీబ్రూపేర్లుయోషువానుండివచ్చాయి

యెహోషువ అసలు హీబ్రూ పేరు ‘యోషువా’ యొక్క [తెలుగులో] యెహోషువ బాష అనువాద కరణ. క్రీస్తుపూర్వం 520 లో జెకర్యా ‘యెహోషువ ‘ ను హీబ్రూలో ఎలా రాశారో క్వాడ్రంట్ # 1 చూపిస్తుంది. ఇది [తెలుగులో] (# 1 => # 3) లో ‘యెహోషువ’ అని బాష అనువాద కరణ చేశారు. హీబ్రూలో ‘యోషువా’ [తెలుగులో] యెహోషువా మాదిరిగానే ఉంటుంది. క్రీస్తుపుర్వం 250  లో ఎల్ఎక్స్ఎక్స్ (LXX)  హిబ్రూ నుండి గ్రీకుకు అనువదించబడినప్పుడు ‘యెషువా’ని, యిసొఅస్ (# 1 => # 2) కు బాష అనువాదం కరణ చేశారు. హీబ్రూలో ‘యోషువా’ గ్రీకు భాషలో యిసొఅస్ మాదిరిగానే ఉంటుంది. గ్రీకు అనువదించబడినప్పుడు, యిసొఅస్ [తెలుగులో] కి ‘యేసు’ (# 2 => # 3) కు బాష అనువాద కరణ చేయబడుతుంది. గ్రీకు భాషలో యిసొఅస్ యేసు [తెలుగులో] మాదిరిగానే ఉంటుంది.

హీబ్రూ భాషలో మాట్లాడినప్పుడు యేసును యోషువా అని పిలిచారు, కాని గ్రీకు క్రొత్త నిబంధనలో ఆయన పేరును యిసొఅస్’ అని వ్రాశారు – గ్రీకు పాత నిబంధన ఎల్ఎక్స్ఎక్స్ (LXX)   ఆ పేరు రాసినట్లే. క్రొత్త నిబంధన గ్రీకు నుండి [తెలుగులో] కు అనువదించినప్పుడు (# 2 => # 3) ‘యిసొఅస్ తెలిసిన ‘యేసు’ కి భాష అనువాద కరణ చేయబడుతుంది. కాబట్టియేసు’ = ‘యెహోషువా, ‘యేసు’ మధ్యంతర గ్రీకు మెట్టు గుండా వెళుతున్నాడు, ‘యెహోషువా’ నేరుగా హీబ్రూ నుండి వస్తోంది.

సారాంశంలో, క్రీస్తుపూర్వం 520లో నజరేయుడైన యేసుకి, ప్రధాన యాజకుడైన యెహోషువా ఇద్దరికీ ఒకే పేరు ఉంది, దీనిని వారి స్థానిక హీబ్రూలో ‘యోషువా’ అని పిలుస్తారు. గ్రీకు భాషలో ఇద్దరినీ ‘యిసొఅస్’ అని పిలిచేవారు.

చిగురునజరేయుడైనయేసు

ఇప్పుడు జెకర్యా ప్రవచనం అర్ధంగా ఉంది. క్రీస్తుపూర్వం 520 లో చేసిన అంచనా ఏమిటంటే, రాబోయే చిగురు పేరు ‘యేసు’, నేరుగా నజరేయుడైన యేసును సూచిస్తుంది.

యెష్షయి, దావీదు అతని పూర్వీకులు కాబట్టి యేసు ‘యెష్షయి మొద్దు నుండి’ వస్తాడు. యేసు జ్ఞానం కలిగి, అవగాహన కలిగి ఉన్నాడు. ఆయని తెలివి, సమతుల్యత, అంతర్దృష్టి విమర్శకులను మరియు అనుచరులను ఆకట్టుకుంటాయి. సువార్తల్లోని అద్భుతాల ద్వారా ఆయన శక్తి కాదనలేనిది. వాటిని నమ్మకూడదని ఒకరు ఎంచుకోవచ్చు; కానీ వాటిని విస్మరించలేరు. ఒక రోజు ఈ చిగురు నుండి యేసు వస్తాడని యెషయా ఊహించిన అసాధారణమైన జ్ఞానం, శక్తిని కలిగి ఉన్న గుణానికి యేసు సరిపోతాడు.

ఇప్పుడు నజరేయుడైన యేసు జీవితం గురించి ఆలోచించండి. ఆయన కచ్చితంగా ఒక రాజు అని పేర్కొన్నాడు – నిజానికి రాజు. ‘క్రీస్తు‘ అంటే ఇదే. కానీ భూమిపై ఉన్నప్పుడు ఆయన చేసినది వాస్తవానికి అర్చకత్వం. యాజకుడు (పూజారి) ప్రజల తరపున ఆమోదయోగ్యమైన త్యాగాలు చేశాడు. అందులో యేసు మరణం చాలా ముఖ్యమైనది, అది కూడా మన తరపున దేవునికి అర్పణ. ఆయన మరణం ప్రతి వ్యక్తి చేసిన పాపానికి, అపరాధానికి ప్రాయశ్చిత్తం. జెకర్యా  ఉహించినట్లుగా భూమి యొక్క పాపాలను అక్షరాలా ‘ఒకే రోజులో’ తొలగించారు – యేసు చనిపోయి రోజు అన్ని పాపాలకు చెల్లింపు చెల్లించిన రోజు. ఆయని మరణంలో ఆయన యాజకుని అన్ని అవసరాలను నెరవేర్చాడు, ఆయన ఎక్కువగా ‘క్రీస్తు’ / రాజు అని పిలువబడ్డాడు. తన పునరుత్థానంలో, మరణంపై తన శక్తిని, అధికారాన్ని చూపించాడు. ఆయన రెండు పాత్రలను ఒకచోట చేర్చుకున్నాడు. దావీదు చాలా కాలం క్రితం ‘క్రీస్తు’ అని పిలిచే చిగురు, యాజకుడు-రాజు. ఆయన పుట్టుకకు 500 సంవత్సరాల ముందు జెకర్యా ఆయని పేరు ఊహించారు.

ప్రవచనాత్మకసాక్ష్యం

ఆయన రోజులో, ఈనాటికీ, యేసు అధికారాన్ని విమర్శకులు ప్రశ్నించారు. ఆయన సమాధానం, ముందు వచ్చిన ప్రవక్తలను సూచించటం, వారు ఆయన జీవితాన్ని ముందే చూశారని పేర్కొన్నారు. తనను వ్యతిరేకిస్తున్న వారితో యేసు చెప్పిన ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది:

 … ఇవి నా గురించి సాక్ష్యమిచ్చే లేఖనాలు…

యోహాను 5:39

మరో మాటలో చెప్పాలంటే, యేసు తన జీవితాన్ని గురించి వందల సంవత్సరాల క్రితం హీబ్రూ వేదాలలో ప్రవచించాడని పేర్కొన్నారు. మానవ అంతర్దృష్టితో వందల సంవత్సరాల భవిష్యత్తును అసలు ఉహించలేనందున, యేసు నిజంగా మానవాళి కోసం దేవుని ప్రణాళికగా వచ్చాడని ధృవీకరించడానికి ఇది సాక్ష్యమని చెప్పాడు. దీన్ని వ్యక్తిగతంగా ధృవీకరించడానికి హీబ్రూ వేదాలు ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి.

హీబ్రూ ప్రవక్తలు ఇప్పటివరకు ఏమి ఉహించారు వాటిని సంగ్రహంగా చూద్దాం. యేసు రాకడ మానవ చరిత్ర ప్రారంభంలో సూచించబడింది. యేసు బలి ఇవ్వవలసిన ప్రదేశాన్ని అబ్రాహాము ముందే చెప్పాడు, పస్కా సంవత్సరం రోజు గురించి ముందే చెప్పబడింది. రాబోయే రాజు గురించి ముందే చెప్పడానికి ‘క్రీస్తు’ అనే బిరుదు 2 వ కీర్తనలో ఉపయోగించి ఉందని మనం చూశాము. ఆయన వంశం, యాజక వృత్తి మరియు పేరు ఉహించినట్లు మనం ఇప్పుడే చూశాము. నజరేయుడైన యేసు గురించి చాలా మంది ప్రవక్తలచే  ముందే ఉహించినట్లు, ఇంక చరిత్రలో మరెవరైనా గురించి మీరు ఆలోచించగలరా?

ముగింపు: జీవవృక్షంఅందరికీఇవ్వబడింది

మర్రి చెట్టులాంటి అమరత్వం మరియు నిరంతర ఉండే చెట్టు చిత్రం బైబిలు చివరి అధ్యాయం వరకు కొనసాగుతుంది, భవిష్యత్తులో, తదుపరి విశ్వంలో, ‘జీవ నది నీటి’ తో మళ్ళీ ముందుకు చూసారు.

ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.

ప్రకటన 22:2

అన్ని దేశాల ప్రజలు – మీతో సహా – మరణం నుండి విముక్తి జీవ వృక్షం గొప్పతనం, రెండింటినీ అనుభవించడానికి ఆహ్వానించబడ్డారు – నిజంగా అమర మర్రి చెట్టు. కానీ ఈ చిగురు మొదట  ‘కత్తిరించాలి’ అని హీబ్రూ ప్రవక్తలు ప్రవచించిన విషయం గురించి మనం తరువాత చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *