లక్ష్మీ నుండి శివుని వరకు: శ్రీ మోషే యొక్క ఆశీర్వాదములు & శాపములు నేడు ఎలా ప్రతిధ్వనిస్తాయి

  • by

ఆశీర్వాదము మరియు అదృష్టమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు, అదృష్టము, సఫలత మరియు ఐశ్వర్య దేవతయైన లక్ష్మీ మీదికి మన ధ్యాస మళ్లుతుంది. దురాశ లేకుండా చేయు కష్టమును ఆమె దీవిస్తుంది. పాల సముద్రమును మథనం చేసిన కథలో, పవిత్రమైన పువ్వులను విసిరినప్పుడు ఇంద్రుడు చూపిన అమర్యాద వలన లక్ష్మీ స్వయంగా దేవతలను విడచి పాల సముద్రములోనికి ప్రవేశించింది. అయితే, ఆమె తిరిగి వచ్చుట కొరకు వెయ్యి సంవత్సరముల పాటు సముద్రమును మథనము చేసిన తరువాత, ఆమె పునర్జన్మలో నమ్మకమైనవారిని దీవించింది.

నాశనమును గూర్చి, పతనమును గూర్చి మరియు ధ్వంశమును గూర్చి ఆలోచన చేసినప్పుడు, శివుని యొక్క ఉగ్ర అవతారమైన, లేక శివుని యొక్క మూడవ కన్ను అయిన భైరవును మీదికి మన దృష్టి మళ్లుతుంది. ఆ కన్ను ఇంచుమించు ఎల్లప్పుడు మూయబడి ఉంటుందిగాని, దుష్టులను నాశనము చేయుటకు మాత్రం అతడు దానిని తెరుస్తాడు. ప్రజలు ఒకరి నుండి ఆశీర్వాదములను ఆశిస్తారు, మరొకరి నుండి వచ్చు శాపమును లేక నాశనమును గూర్చి భయపడతారు కాబట్టి భక్తులు లక్షీ మరియు శివుని మీద ఎక్కువ దృష్టిని పెడతారు.

ఆశీర్వాదములు & శాపములు … ఇశ్రాయేలీయులకు … మనకు ఉపదేశించుటకు.

హెబ్రీ వేదములలో బయలుపరచబడిన సృష్టికర్త దేవుడు లక్ష్మీ ద్వారా కలుగు ఆశీర్వాదములకు మరియు భైరవుడు లేక శివుని మూడవ కన్ను ద్వారా కలుగు శాపము మరియు నాశనమునకు కర్తగా ఉన్నాడు. ఇవి అతని భక్తులైన యేర్పరచబడిన జనాంగమైన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినవి. ఇవి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు నడిపించిన తరువాత వారికి పది ఆజ్ఞలను – పాపము వారి మీద ఏలుబడి చేస్తుందో లేదో తెలుపు పరిమాణము – ఇచ్చినప్పుడు ఇవ్వబడినవి. ఈ ఆశీర్వాదములు మరియు శాపములు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినవి కాని ఇతర దేశములు కూడా వీటిని గుర్తించి ఇశ్రాయేలీయులకు ఆయన ఆశీర్వాదములను ఇచ్చిన విధముగానే మనకు కూడా ఇస్తాడని గ్రహించుటకు చాలా కాలం క్రితమే ప్రకటించబడినవి. మనలో ఐశ్వర్యమును మరియు ఆశీర్వాదమును కోరుకొని, నాశనమును మరియు శాపమును తప్పించుకోవాలని కోరువారు ఇశ్రాయేలీయుల అనుభవము నుండి నేర్చుకోవచ్చు.

శ్రీ మోషే మూడు వేల ఐదు వందల సంవత్సరముల క్రితం నివసించాడు మరియు హెబ్రీ వేదములలోని మొదటి పుస్తకములను అతడు రచించాడు. అతడు వ్రాసిన చివరి పుస్తకమైన ద్వితీయోపదేశకాండములో, అతడు మరణించుటకు ముందు వ్రాసిన చివరి మాటలు ఉన్నాయి. దీనిలో ఇశ్రాయేలు ప్రజలకు అనగా యూదులకు ఇవ్వబడిన ఆశీర్వాదములు మరియు శాపములు ఉన్నాయి. ఈ ఆశీర్వాదములు మరియు శాపములు ప్రపంచ చరిత్రను రూపిస్తాయి కాబట్టి యూదులు మాత్రమేగాక ఇతర దేశములు కూడా వీటిని గుర్తించాలని మోషే వ్రాశాడు. ఈ ఆశీర్వాదములు & శాపములు భారత దేశ చరిత్ర మీద కూడా ప్రభావము చూపాయి. ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క సంపూర్ణ సూచిక ఇక్కడ ఇవ్వబడినది. వీటి సారంశము ఈ క్రింద ఇవ్వబడినది.

శ్రీ మోషే యొక్క ఆశీర్వాదములు

ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును (పది ఆజ్ఞలు) పాటించిన యెడల పొందు ఆశీర్వాదములను గూర్చి వర్నిస్తూ మోషే ఆరంభించాడు. దేవుని ఆశీర్వాదములు ఎంత గొప్పగా ఉంటాయంటే మిగిలిన దేశములన్నీ ఆయన ఇచ్చు ఆశీర్వాదములను గుర్తిస్తాయి. ఈ ఆశీర్వాదములను పొందుట ద్వారా ఇలా జరుగుతుంది:

10 భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.

ద్వితీయోపదేశకాండము 28:10

… మరియు శాపములు

అయితే, ఇశ్రాయేలీయులు ఆజ్ఞలను పాటించుటలో విఫలమైన యెడల, ఆశీర్వాదములను పోలిన విధముగానే వారు శాపములను పొందుకుంటారు. ఈ శాపములను కూడా చుట్టుపక్కల ఉన్న దేశములు చూసినప్పుడు, ఇలా జరుగుతుంది:

37 యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.

ద్వితీయోపదేశకాండము 28:37

మరియు శాపములు చరిత్రయందంతట వ్యాపిస్తాయి.

46 మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.

ద్వితీయోపదేశకాండము 28:46

అయితే ఈ శాపములలో అత్యంత ఘోరమైనవి ఇతర దేశములలో నుండి వస్తాయని కూడా దేవుడు హెచ్చరించాడు.

49 ​యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 
50 క్రూరముఖము కలిగి వృద్ధులను ¸°వనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 
51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 
52 ​మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. 

ద్వితీయోపదేశకాండము 28:49-52

అవి చెడ్డవిగా ఆరంభమై, అత్యంత ఘోరమైనవవుతాయి.

63 కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 
64 ​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 
65 ​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 

ద్వితీయోపదేశకాండము 28:63-65

దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య అధికారిక ఒప్పందము ద్వారా ఆశీర్వాదములు మరియు శాపములు స్థాపించబడతాయి:

13 నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. 
14 నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను 
15 ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. 

ద్వితీయోపదేశకాండము 29:13-15

ఈ నిబంధన పిల్లలకు, లేక భవిష్యత్ తరములకు కూడా వర్తిస్తుంది. వాస్తవానికి ఈ నిబంధన భవిష్యత్ తరముల కొరకు – ఇశ్రాయేలీయులు మరియు పరదేశీయులు – కూడా ఇవ్వబడింది.

22 కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి 
23 వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి 
24 యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. 

ద్వితీయోపదేశకాండము 29:22-24

దీనికి జవాబు:

25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి 
26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి 
27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. 
28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. 

ద్వితీయోపదేశకాండము 29:25-28

ఆశీర్వాదములు మరియు శాపములు కలిగాయా?

ఆశీర్వాదములు ఆనందకరమైనవి, మరియు శాపములు ఘోరమైనవి, కాని మనము అడగవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమనగా: “అవి అసలు జరిగాయా?” హెబ్రీ వేదములలోని పాత నిబంధన భాగములోని ఎక్కువ శాతము ఇశ్రాయేలీయుల చరిత్రను నమోదు చేస్తుంది, కాబట్టి వారి చరిత్ర మనకు తెలుసు. పాత నిబంధన కాకుండా ఇతర చారిత్రిక నివేదికలు మరియు అనేక పురావస్తుశాస్త్ర ఆధారములు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇశ్రాయేలు లేక యూదుల చరిత్రను గూర్చి ఒక స్థిరమైన నివేదికను ఇస్తాయి. ఒక కాలక్రమము ద్వారా అది ఇక్కడ ఇవ్వబడినది. మోషే సెలవిచ్చిన శాపములు సంభవించాయో లేదో మీరు స్వయంగా చదివి తెలుసుకోండి. 2700 సంవత్సరముల క్రితము నుండి యూదుల గుంపులు (ఉదా. మిజోరాంలోని బెని మెనషే) భారత దేశములోనికి ఎందుకు వలస వెళ్లాయో ఇది వివరిస్తుంది. ఖచ్చితముగా మోషే హెచ్చరించిన విధముగానే ఆష్షురు, బబులోను దేశములు దాడి చేయుట వలన వారు భారత దేశమునకు చెదిరిపోయారు.

మోషే ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క ముగింపు

మోషే చివరి మాటలు శాపములతో ముగియలేదు. ఈ విధంగా మోషే తన చివరి ప్రకటనను చేశాడు.

నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన 
సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్త మునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల 
​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 
​మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 

ద్వితీయోపదేశకాండము 30:1-5

కొన్ని వేల సంవత్సరముల పాటు చెరలో ఉండిన తరువాత, 1948లో – నేడు జీవించున అనేకమంది జీవిత కాలములోనే – ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయము ద్వారా ఆధునిక ఇశ్రాయేలు దేశము పునర్జన్మించింది మరియు ప్రపంచ దేశములలో నుండి యూదులు ఇశ్రాయేలుకు తిరిగివెళ్లుట ఆరంభించారు – ఇది కూడా మోషే ప్రవచించినట్లే జరిగింది. నేడు భారత దేశములో, కొచ్చిన్ మరియు మిజోరాంలో ఉన్న వేల సంవత్సరముల యూదుల సమాజములు అంతరించిపోతున్నాయి, ఎందుకంటే యూదులు తమ పితరుల దేశమునకు తిరిగివెళ్లిపోతున్నారు. నేడు భారత దేశములో కేవలం ఐదు వేల మంది యూదులు మాత్రమే మిగిలియున్నారు. శాపములు వారి చరిత్రను రూపించిన విధముగానే మన కన్నుల ఎదుట మోషే ఆశీర్వాదములు కూడా నెరవేర్చబడుతున్నాయి.

ఇవి మన కొరకు అనేక అంతర్భావములను కలిగియున్నాయి. మొదటిగా, ఆశీర్వాదములు మరియు శాపములకు అధికారము మరియు శక్తి దేవుని యొద్ద నుండి కలుగుతుంది.మోషే కేవలం జ్ఞానోదయమును పొందిన సందేశకుడు లేక ఋషి మాత్రమే. ఈ శాపములు మరియు ఆశీర్వాదములు ప్రపంచములోని అనేక దేశములకు వేల సంవత్సరములుగా వ్యాపిస్తు, కొన్ని కోట్ల మందిని ప్రభావితము చేస్తున్నాయి అను సత్యము (యూదులు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చుట ఒక అల్లకల్లోలమును సృష్టించింది- మరియు తరచుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించు కార్యములు అక్కడ జరుగుతున్నాయి) –ఈ దేవునికి బైబిలు (వేద పుస్తకము) తెలియజేయు శక్తి మరియు అధికారము ఉన్నదని రుజువు చేస్తుంది. అవే హెబ్రీ వేదములలో ‘భూమి మీద ఉన్న ప్రజలందరు’ దీవించబడతారని కూడా ఆయన వాగ్దానము చేశాడు. ‘భూమి మీద ఉన్న ప్రజలందరిలో” మీరు నేను కూడా ఉన్నాము. మరలా అబ్రాహాము కుమారుని బలి అర్పించు సందర్భములో కూడా, ‘దేశములన్నీ దీవించబడతాయి’ అని దేవుడు పునరుధ్ఘాటించాడు. ఈ బలి యొక్క స్థలము మరియు వివరములు ఈ ఆశీర్వాదమును ఎలా పొందుకోవాలో తెలుసుకొనుటలో మనకు సహాయం చేస్తాయి. మిజోరాం, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ నుండి తిరిగివచ్చుచున్న యూదుల మీద కుమ్మరించబడు ఆశీర్వాదములను, ఆయన వాగ్దానము చేసిన విధముగా దేవుడు భారత దేశములోని రాష్ట్రములన్నిటికి మరియు ప్రపంచములోని ఇతర దేశములకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడనుటకు చిహ్నముగా ఉన్నది. యూదుల వలె, మన శాపము మధ్యలో మనకు కూడా ఆశీర్వాదములు వాగ్దానము చేయబడినవి. మనము ఆశీర్వాదము అను బహుమానమును ఎందుకు పొందుకోకూడదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *