రుగ్ వేదం (లేక రిగ్ వేద)లో అత్యంత ప్రసిద్ధ కీర్తన బహుశా పురుషసుక్త (పురుషసుక్తం). ఇది 10 వ మండల 90 వ అధ్యాయంలో ఉంది. ఈ కీర్తన ఒక విశిష్టమైన పురుషుని – పురుస (పురుష అని పలుకబడింది) కోసం ఉద్దేశించింది. ఇది రుగ్ వేద లో కనుగొనబడింది. ప్రపంచంలో అత్యంత పురాతన మంత్రాలలో ఇది ఒకటి. ముక్తి లేక మోక్షం (జ్ఞానోదయం) మార్గాన్ని గురించి మనం నేర్చుకోగల్గినదానిని చూడడానికి దీనిని అధ్యయనం చెయ్యడం అత్యంత యోగ్యమైనది.
కనుక పురుష ఎవరు? వేదిక భాగం ఇలా చెపుతుంది:
“పురుష, ప్రజాపతి ఇద్దరూ ఒకే వ్యక్తి.” (సంస్కృత ప్రతిలేఖనం పురుసోహిప్రజాపతి) మాధ్యందియసతపతబ్రాహ్మణ VII.4:1,156
ఉపనిషత్తులు ఇదే అంశాన్ని చెపుతూఉన్నాయి, ఇలా చెపుతున్నాయి:
“పురుష సమస్తం మీద శ్రేష్టమైనవాడు. పురుషకు ఏదీ (ఎవరూ) ఘనమైనది కాదు. ఆయనే ముగింపు, అత్యంత ఉన్నతమైన లక్ష్యం.” (అవ్యకత్పురుసఃపరాహ్. పురుసన్నపరంకింసిత్సకత్సాస పర గటి) కతోపనిషత్ 3:11
“అవ్యక్తతకు మించిన సర్వాధికారి పురుష….. ఆయనను యెరిగిన వారు స్వతంత్రులుగా మారుతారు, నిత్యత్వాన్ని పొందుతారు (అవ్యకత్ యు పరాహ్ పురుష …. యజ్నత్వముస్యతేజంతురాంత్వం స గచ్చతి) కతోపనిషత్ 6:8
కాబట్టి పురుష అంటే ప్రజాపతి (సమస్త సృష్టికి ప్రభువు). అయితే అత్యంత ప్రాముఖ్యమైనది, ఆయనను నేరుగా తెలుసుకోవడం నిన్నూ, నన్నూ ప్రభావితం చేస్తుంది. ఉపనిషత్ ఇలా చెపుతుంది:
“నిత్యజీవంలోనికి ప్రవేశించడానికి మరో ఇతర మార్గం లేదు. (అయితే పురుష ద్వారా) (నన్యఃపంతవిద్యతే – అయనయ) సేతస్వతరోపనిషత్ 3:8
కాబట్టి మనం పురుషను వివరించే రుగ్ వేదలో ఉన్న కీర్తన పురుషసుక్తను అధ్యయనం చేద్దాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు, మనం ఆలోచించడానికి ఒక అసాధారణ, నవీన తలంపును మన ముందు ఉంచుతున్నాను: పురుషసుక్తలో చెప్పబడిన ఈ పురుష దాదాపు 2000 సంవత్సరాల క్రితం యెషుసత్సంగ్ (నజరేతువాడు యేసు) మానవావతారంలో నెరవేర్చబడ్డాడా? నేను చెప్పిన విధంగా, బహుశా ఇది ఒక వింతైన తలంపు. అయితే యేసుసత్సంగ్ (నజరేతువాడు యేసు) అన్ని మతాలలో పరిశుద్ధుడుగా కనిపిస్తున్నాడు. ఆయన దేవుని మానవావతారంగా చెప్పబడ్డాడు. ఆయన, పురుష ఇద్దరూ కూడా (మనం చూస్తున్నట్లు) బలిగా అర్పించబడ్డారు. అందుచేత ఇది ఈ భావనను గురించి ఆలోచించేలా, దానిని పరిశోధించేలా ఒక మంచి కారణాన్ని చూపుతుంది. సంస్కృత ప్రతిలేఖనాలు, పురుషసుక్త మీద నాకున్న అనేక ఇతర తలంపులు జోసఫ్ పదింజరేకర రాసిన క్రిస్ట్ ఇన్ ద ఎన్షియెంట్ వేదాస్ (పేజీ 346. 2007)ను అధ్యయనం చెయ్యడంద్వారా కలిగాయి.
పురుషసుక్త మొదటి వచనం
సంస్కృతం నుండి ప్రతిలేఖనం | ఇంగ్లీషులోనికి అనువాదం |
సహస్రసిర్సా-పురుషఃసహస్రాక్షహ్స్రపత్ సభుమిమ్విస్వాతోవర్త్వాత్యతిస్తాద్దసంగులం | పురుషకు వెయ్యి తలలు ఉన్నాయి, వెయ్యి కళ్ళు ఉన్నాయి, వెయ్యి పాదాలు ఉన్నాయి. భూమికి అన్నివైపులూ ఆవరించి, ఆయన ప్రకాశిస్తున్నాడు. పది వేళ్ళకు తన్నుతాను పరిమితం చేసుకొన్నాడు. |
పై భాగంలో చూచినవిధంగా పురుష ప్రజాపతిలా ఒకేలా ఉన్నాడు. ఇక్కడ వివరించిన విధంగా (as explained here), ఆదిమ వేదాలు దేవుడు సమస్తాన్ని సృష్టించాడనీ – “సమస్త సృష్టికి ప్రభువు” అని యెంచుతున్నాయి,
పురుషసుక్త ఆరంభంలో పురుషకు ‘వెయ్యి తలలు, వెయ్యికళ్ళు, వెయ్యి పాదాలు’ ఉన్నాయని మనం చూసాం. దీని అర్థం ఏమిటి? ‘వెయ్యి’ అనే పదం ఒక నిర్దిష్టమైన సంఖ్యకాదు. అయితే దీని అర్థం ‘అసంఖ్యాకమైనది’ లేక ‘పరిమితి లేనిది.’ కాబట్టి పురుష పరిమితిలేని జ్ఞానాన్ని (‘బుద్ధి’) కలిగియున్నాడు. ఈ నాటి భాషలో చెప్పాలంటే ఆయన సర్వజ్ఞాని లేక సర్వం యెరిగినవాడు. ఇది దేవుని (ప్రజాపతి) దైవిక గుణలక్షణం. ఆయన ఒక్కడే సమస్తం యెరిగినవాడు, దేవుడు చూస్తాడు, అన్నింటిని గురించిన అవగాహన కూడా ఉంది. పురుష ‘వెయ్యి కళ్ళు’ కలిగియున్నాడు అని చెప్పడం పురుష సర్వవ్యాపి అని చెప్పడం లాంటిదే – సమస్తాన్ని గురించిన అవగాహన ఆయనకు ఉంది ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. అదేవిధంగా ‘వెయ్యి పాదాలు’ పదం సర్వశక్తి – పరిమితిలేని శక్తిని సూచిస్తుంది.
ఈ విధంగా పురుషసుక్త ఆరంభంలో సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడైన వ్యక్తిగా పురుష పరిచయం చెయ్యబడడం మనం చూసాం. మానవావతారి అయిన దేవుడు మాత్రమే అటువంటి వ్యక్తిగా ఉండగలడు. ‘ఆయన తన్నుతాను పది వేళ్ళకు పరిమితం చేసుకొన్నాడు’ అనే వాక్యంతో వచనం ముగించబడింది. దీని అర్థం ఏమిటి? అవతారం చెందిన వ్యక్తిగా, పురుష తనకున్న దైవిక శక్తులను శూన్యం చేసుకొన్నాడు, సామాన్య మానవుని వలే పరిమితం చేసుకొన్నాడు – ‘పది వేళ్ళు ఉన్నవాని’లా. ఆ విధంగా పురుష దేవుడు అయినప్పటికీ, అన్నింటిని పరిమితం చేసుకొని, తన మానవావతారంలో తన్నుతాను శూన్యం చేసుకొన్నాడు.
యేషుసత్సంగ్ (నజరేతువాడు యేసు)ను గురించి మాట్లాడుతున్నప్పుడు వేద పుస్తకాన్ (బైబిలు) ఖచ్చితంగా ఇదే తలంపును వ్యక్తపరుస్తుంది. బైబిలు ఇలా చెపుతుంది:
మీ మనసు (వైఖరి) క్రీస్తు యేసుకు కలిగిన మనసులా ఉండాలి:
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,
10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:5-11)
పురుషసుక్తలో పురుషను గురించి పరిచయం చేసినప్పుడు వినియోగించిన ఒకే తలంపులను ఖచ్చితంగా వేద పుస్తకాన్ (బైబిలు) వినియోగించడం మీరు చూడవచ్చు – అనంతుడైన దేవుడు పరిమితుయిన మనిషిగా అవతరించడం. అయితే బైబిలులోని ఈ వాక్యభాగం పురుషసుక్త చేసిన విధంగా త్వరితంగా ఆయన బలిని వివరిస్తుంది పురుషసుక్త కూడా వివరిస్తుంది. కనుక మోక్షాన్ని కోరుకొనే ప్రతీ ఒక్కరూ ఈ దైవ వాక్కులను మరింత పరిశోదించడం యోగ్యమైనదే. ఎందుకంటే ఉపనిషత్తులు ఇలా చెపుతున్నాయి:
‘నిత్యజీవంలోనికి ప్రవేశించడానికి మరో మార్గం లేదు (అయితే పురుష ద్వారా) (నన్యఃపంతవిద్యతే-అయనయ) శ్వేతస్వవతరోపనిషత్ 3:8
పురుషసుక్త వచనం 2 ఇక్కడ కొనసాగిద్దాం.