కొమ్మ సంకేతం: వట సావిత్రీలో నిరంతరంగా ఉన్న మర్రి చెట్టు

వట వృక్షం, బార్గాడు లేదా మర్రి చెట్టు దక్షిణ ఆసియాలోఆధ్యాత్మికు కేంద్రముగా ఉంది, మరియు ఈ చెట్టు భారత దేశం యుక్క జాతీయ వృక్షం. ఇది మరణ దేవుడు అయిన యముడుతో ముడిపడి ఉండిది. కాబట్టి ఇది తరుచుగా స్మశాన వాటికల్లో దినిని నట్టుతారు. ఈ చెట్టు అమరత్వానికి చిహ్నంగా, గొప్ప దీర్ఘాయువు కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది తిరిగి మోలిచే సామర్థ్యంతో కలిగి ఉండే చెట్టు. తన భర్త అయిన రాజు సత్యవంతుడు ప్రాణాలను తిరిగి పొండుకోవటం కోసం సావిత్రీ మర్రి చెట్టు ద్వారా యముడితో బేరం కుదుర్చుకోవటం దాని ద్వారా ఆమెకు ఒక కుమారుడుని పొందవచ్చును – వట పూర్ణిమ, వట సావిత్రీ సంవత్సర వార్షిక వేడుకల్లో జ్ఞపకం చేసుకుంటారు.

ఇదే విధమైన తరహ ఒకటి హీబ్రు వేదలల్లో (బైబిలు)లో కనిపిస్తుంది. చనిపోయిన చెట్టు ఉంది… జీవంలోకి వస్తుంది… చనిపోయిన రాజుల నుండి ఒక క్రొత్త కుమారుని సూచిస్తుంది. దీనిలో ప్రధాన వ్యత్యాసం ఏమిటి అంటే భవిషత్తుల్లో కనిపించే ప్రవచనాన్ని వందలాది సంవత్సరాలుగా వివిధ  ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. వారి మిశ్రమ కథలో ఎవరోఒకరు వస్తున్నారు అని ఉహించారు. యెషయా (క్రీ.పూ 750) ఈ కథను ప్రారంభించాడు, తరువాత దేవుని-ప్రవక్తలు మరింత అభివృద్ధి చెందారు – చనిపోయిన చెట్టు నుండి కొమ్మ.

యెషయా, కొమ్మ (చిగురు)

యెషయా జీవించిన కాలం చారిత్రాత్మకంగా ధృవీకరరించే కాలంలో జీవించాడు, ఈ కాలం యూదుల చరిత్ర కలంలో తీసుకున్నది.

ఇశ్రాయేలు, దావీదు రాజులు కాలంలో చారిత్రాత్మకంగా ధృవీకరించే కాలక్రమంలో యెషయా జీవించాడు అని చూపించారు.

దావీదు రాజుల  రాజవంశం (క్రీ.పూ. 1000 – 600) యెరూషలేం నుండి పాలించినప్పుడు యెషయా రాశాడు. యెషయా కాలంలో (క్రీ.పూ 750) రాజవంశం, పాలన అవినీతిమయం. రాజులు దేవుని వద్దకు తిరిగి రావాలని, మోషే పది ఆజ్ఞలను పాటించాలని యెషయా విజ్ఞప్తి చేశాడు. ఇశ్రాయేలు పశ్చాత్తాపపడదని యెషయాకు తెలుసు, అందుచేత రాజ్యం నాశనమవుతుందని, రాజులు పరిపాలన మానేస్తారని అతను ముందే చెప్పాడు.

అతడు రాజ వంశానికి ఒక చిత్రాన్ని ఉపయోగించాడు, దానిని గొప్ప మర్రి చెట్టులా చిత్రీకరించాడు. ఈ చెట్టు దాని మూలంలో దావీదు రాజు తండ్రి యెష్షయిని కలిగి ఉంది. యెష్షయిని పై రాజుల రాజవంశం దావీదుతో ప్రారంభమై, అతని వారసుడైన సొలోమోను రాజుతో కొనసాగింది. క్రింద వివరించినట్లుగా, రాజవంశంలో తరువాతి కుమారుడు పరిపాలించినట్లు చెట్టు పెరుగుతూ అభివృద్ధి చెందింది.

యెషయా ఉపయోగించిన చిత్రం రాజవంశం ఒక పెద్ద మర్రి చెట్టుగా, రాజులు చెట్టు మొండెము నుండి అంటే స్థాపకుడి మూలం నుండి విస్తరించేను –  యెష్షయి

మొదట ఒక చెట్టు… తరువాత ఒక మొద్దు… తరువాత ఒక కొమ్మ (చిగురు)

ఈ  రాజవంశం ‘చెట్టు’ త్వరలోనే నరికివేయబడుతుందని, అది చనిపోయిన మొద్దుగా మారుతుందని యెషయా హెచ్చరించాడు. మొద్దు, చిగురు యొక్క భవిష్యత్తు గురించి అతను ఎలా వ్రాశాడో మీరు ఇక్కడ చూడండి:

ష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

యెషయా 11:1-2
రాజవంశం ఒకరోజు చనిపోయిన మొద్దుగా అవుతుందని యెషయా హెచ్చరించాడు

సుమారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో, యెషయాకు 150 సంవత్సరాల తరువాత ఈ ‘చెట్టు’ నరికివేయటం జరిగింది, బబులోనులు యెరూషలేమును జయించినప్పుడు, రాజుల రాజవంశాన్ని ముక్కలు చేసి, ఇశ్రాయేలీయులను బబులోనులు చెరకు తీసుకు వెళ్లారు (కాలక్రమం ఇది ఎరుపు కాలం). ఇది యూదుల మొదటి సారి చెరకు వెళ్ళటం – వీరిలో కొందరు భారతదేశానికి వలస వచ్చారు. సావిత్రి మరియు సత్యవంతుడు కథలో చనిపోయిన ఒక రాజు కుమారుడు – సత్యవంతుడు . మొద్దు గురించి ప్రవచించిన ప్రవచనంలో రాజుల శ్రేణి అంతా ముగిసిపోతుంది మరియు రాజవంశం కూడా చనిపోతుంది.

కొమ్మ: దావీదుకు కలిగిన జ్ఞానం నుంచి ‘ఆయన’ వస్తున్నాడు

యెష్షయి చనిపోయిన మొద్దు నుండిచిగురు

కానీ ప్రవచనం రాజులను నరికివేయడం కంటే భవిష్యత్తును మరింత ముందుకు చూసింది. ఇది మర్రి చెట్టు యొక్క సాధారణ లక్షణాన్ని ఉపయోగించేల చేసింది. మర్రి విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి ఇతర చెట్ల మొద్దు పై తరచుగా లేస్తాయి. మొలకెత్తిన మర్రి విత్తనానికి మొద్దు ఒక అతిధి. మర్రి విత్తనాలు ఒకసారి మొలకెత్తిన తర్వాత అది అతిధిగా ఉన్నమొద్దును మించిపోతుంది. ఈ చిగురుని యెషయా ముందుగా ఉహించాడు ఇది  ఒక మర్రి చెట్టులా ఉంటుంది, ఎందుకంటే కొత్త చిగురు దాని వేరులు నుండి పైకి వెళుతుంది – ఒక కొమ్మను ఏర్పరుస్తుంది. 

యెషయా ఈ ఊహాను ఉపయోగించి ప్రవచించెను, భవిష్యత్తులో ఒక రోజు మొద్దు అని పిలువబడేది ఒక కొమ్మల చనిపోయినమొద్దు నుంచి బయటకి వచ్చిది, చెట్టు మొద్దు నుండి మర్రి చిగురు మొలకెత్తినట్లు. యెషయా చిగురను ‘అతడు’ అని సూచించాడు, కాబట్టి యెషయా ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, రాజవంశం పడిపోయిన తరువాత దావీదు వంశం నుండి వస్తాడు. ఈ మనిషికి జ్ఞానం, శక్తి, జ్ఞానం వంటి లక్షణాలు ఉంటాయి, అది దేవుని ఆత్మ తనపై ఉన్నట్లుగా ఉంటుంది.

ఒక మర్రి చెట్టు దాని ఆతిధ్య మొద్దును మించిపోయింది. త్వరలో ఇది వేరులను, చిగురలను అల్లుకుని ప్రచారం చేసిది.

అనేక రచనలు పురాణాలలో మర్రి చెట్టును అమరత్వానికి ప్రతీకగా పేర్కొన్నాయి. దీని వైమానిక మూలాలు అదనపు మోండేమును ఏర్పరుస్తాయి. ఇది దీర్ఘాయువును సూచిస్తుంది, తద్వారా దైవిక సృష్టికర్తను సూచిస్తుంది. క్రీస్తుపూర్వం 750 లో యెషయా ముందుగా ఉహించిన ఈ కొమ్మ అనేక సారూప్య దైవిక లక్షణాలను కలిగి ఉంటుంది మరియు రాజవంశం ‘మొద్దు’ అదృశ్యమైన తరువాత చాలా కాలం పాటు ఉంటుంది.

యిర్మీయా మరియు కొమ్మ:

భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ప్రవక్తయైన యెషయా సంకేతంలా సులువుగా, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ అతనిది అనేక గురుతులలో మొదటిది. యెషయా తరువాత 150సంవత్సరాలకు అనగా, 600BCE లో దావీదు రాజ్య పరిపాలన ముగిసిన కాలములో ప్రవక్తయైన యిర్మీయా ఈ విధంగా వ్రాసాడు.

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

యిర్మీయా 23:5-6

దావీదు రాజ్య పరిపాలనను యెషయా వేరు చిగురుగా వివరించిన విషయమును యిర్మీయా ఇంకా దీర్ఘంగా వివరించాడు. కొమ్మ అనే మాటకు రాజు అని అర్ధం. కానీ దావీదుకు ముందు ఉన్న రాజుల ఆరిపోయిన, చనిపోయిన మొద్దు వలె కాదు.

కొమ్మ: ప్రభువు మన నీతి

కొమ్మ అనే పదం ఆయన నామములో చూసాము. దేవుని యొక్క నామము ఆయనపై ఉన్నది (ప్రభువు – హెబ్రీ భాషలో దేవుని పేరు), కాబట్టి ఒక మర్రి చెట్టు వలె, ఈ కొమ్మ దైవత్వమునకు చెందినది. మరియు ఆయన ‘మనకు’ (మానవులకు) నీతియై ఉన్నాడు.  

చనిపోయిన తన భర్తయైన సత్యవంతుడుని, సావిత్రి మరల అడగడానికి యముడు దగ్గరకు వెళ్లినప్పుడు, ఆ యముడున్ని ఎదుర్కోవడానికి ఆమె యొక్క నీతి ఆమెకు శక్తి నిచ్చింది. కుంభమేళా గురించి తెలిసిన ప్రకారం, మన పాపము లేదా అవినీతి మనకు సమస్యగా ఉంది, అందుకే మనలో నీతి లేదు. అందుకే మరణమును ఎదుర్కొనే శక్తి మనకు లేదని బైబిల్ చెప్తుంది. మరొక మాటలో చెప్పాలంటే మనము నిస్సహాయకులము:

14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

హెబ్రీ 2:14బి-15

బైబిల్లో, సాతానుని ఒక యముడిగా పోల్చవచ్చు; ఎందుకంటే మనకు విరోధంగా మరణమును అతడు పట్టుకొని యున్నాడు. ఏ విధంగా యముడు సత్యవంతుడు శరీరం గురించి వాదించాడో, బైబిలు కూడా ఒకరి శరీరం గురించి అపవాది వాదించినట్లు చెప్తుంది. 

అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.

యూదా 1:9

సావిత్రి మరియు సత్యవంతుడు విషయంలో యముడు పోరాడినట్టే, దైవజనుడైన మోషే విషయంలో సాతాను పోరాడాడు.  మన విషయంలో కూడా సాతానుడు ఇదే విధంగా వాదిస్తాడు. అప్పుడు దేవదూతలు మోషే విషయంలో – దేవుడే అనగా – సృష్టికర్త – మాత్రమే సాతానుతో మరణ విషయంలో వాదించగలడు అని అన్నారు. 

ఇక్కడ ‘కొమ్మ’ అనే మాటకు, భవిష్యత్తులో దేవుడు మనకు ‘నీతిని’ ఇస్తాడు అనే వాగ్దానం వలన, మరణముపై మనకు జయమును ఇచ్చాడు.  

ఎలా?

సావిత్రి మరియు సత్యవంతుడు ఉదంతము విషయంలో ఉన్న కొమ్మ గురించి జెకర్యా తన పుస్తకంలో ఈ ఇతివృత్తాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు మరిన్ని వివరాలను నింపుతు, రాబోయే కొమ్మ పేరును సమాంతరంగా వివరించాడు. అది మనము తరువాత చూద్దాము.

కురుక్షేత్రములో జరిగిన యుద్ధములో వలె: ‘అభిషిక్తుడైన’ నాయకుని యొక్క రాకను గూర్చి ప్రవచించబడింది

మహాభారత పురాణములో భగవద్గీత జ్ఞాన కేంద్రముగా ఉన్నది. ఇది ఒక గీతముగా (పాట) వ్రాయబడినప్పటికీ, నేడు దీనిని చదువుతారు. కురుక్షేత్ర యుద్ధమునకు – రాజుల కుటుంబము యొక్క ఇరు పక్షముల మధ్య జరిగిన యుద్ధము – ముందు ప్రభువైన కృష్ణుడు మరియు రాజరిక యుద్ధవీరుడైన అర్జునుడు మధ్య జరిగిన సంభాషణను గీత వివరిస్తుంది. ఈ యుద్ధములో పురాతన రాజరిక సామ్రాజ్యమును స్థాపించిన కురు రాజు వంశములోని రెండు శాఖలలో ఉన్న యోధులు మరియు నాయకులు తలపడ్డారు. ఈ రాజ వంశములోని ఏ శాఖకు – పాండవుల రాజు యదిష్టిరుడు లేక కౌరవుల రాజు దుర్యోధనుల మధ్య –పాలించు హక్కు ఉన్నది అని నిర్ణయించుటకు పాండవులు మరియు కౌరవులు యుద్ధమునకు దిగారు. దుర్యోధనుడు యదిష్టిరుని నుండి సింహాసనమును లాగుకున్నాడు, కాబట్టి దానిని తిరిగి సంపాదించుటకు యదిష్టిరుడు మరియు పాండవులు యుద్ధమునకు సిద్ధపడ్డారు. పాండవులలో యోధుడైన అర్జునుడు మరియు ప్రభువైన కృష్ణుడు మధ్య జరిగిన భగవద్గీత సంభాషణలో, కష్ట కాలములలో నిజమైన జ్ఞానము ఆత్మీయ స్వాతంత్ర్యమును మరియు ఆశీర్వాదమును కలిగిస్తుంది అను విషయము మీద దృష్టి సారించబడింది.

కీర్తనలు హెబ్రీ వేద పుస్తకమైన బైబిలులోని జ్ఞాన సాహిత్యమునకు కేంద్రముగా ఉన్నాయి. ఇవి పాటలుగా (గీతములుగా) వ్రాయబడిఅప్పటికీ నేడు వీటిని ప్రజలు చదువుతారు. రెండవ కీర్తన రెండు వ్యతిరేక శక్తుల మధ్య యుద్ధమునకు ముందు ఉన్నతమైన ప్రభువు మరియు ఆయన అభిషిక్తుని (=పాలకుడు) మధ్య జరిగిన సంభాషణను తెలియజేస్తుంది. ఈ రాబోవు యుద్ధమునకు రెండు వైపుల గొప్ప యోధులు మరియు నాయకులు ఉన్నారు. ఒక వైపున పురాతన రాజ వంశమును స్థాపించిన రాజైన దావీదు వారసుడు ఉన్నాడు. ఏ శాఖకు పాలించు హక్కు ఉన్నదో నిర్ణయించుటకు ఈ ఇరు పక్షములవారు యుద్ధము చేయగోరాయి. ప్రభువు మరియు ఆయన నిర్ణయించిన నాయకుని మధ్య 2వ కీర్తనలో జరిగిన సంభాషణ స్వాతంత్ర్యము, జ్ఞానము మరియు ఆశీర్వాదమును గూర్చి మాట్లాడుతుంది.

ఇవి పోలికలు కలిగియున్నాయి కదా?

సంస్కృత వేదములలోని జ్ఞానమును అర్థము చేసుకొనుటకు భగవద్గీత ఒక ప్రధాన ద్వారముగా ఉన్నట్లే, హెబ్రీ వేదములలోని (బైబిలు) జ్ఞానమును అర్థము చేసుకొనుటకు కీర్తనలు ద్వారముగా ఉన్నాయి. ఈ జ్ఞానమును పొందుకొనుటకు మనము కీర్తనలు మరియు వీటి యొక్క ప్రధాన లేఖకుడైన దావీదు రాజును గూర్చి కొంత నేపధ్య సమాచారమును తెలుసుకోవలసియున్నది.

దావీదు రాజు ఎవరు మరియు కీర్తనలు అంటే ఏమిటి?

దావీదు రాజు, కీర్తనలు మరియు ఇతర హెబ్రీ ఋషులు మరియు రచనలు చారిత్రిక కాలక్రమములో ఇవ్వబడినవి

దావీదు శ్రీ అబ్రాహాముకు వెయ్యి సంవత్సరముల తరువాత, శ్రీ మోషేకు ఐదు వందల సంవత్సరముల తరువాత సుమారుగా క్రీ.పూ 1000 కాలములో జీవించాడని ఇశ్రాయేలీయుల చరిత్రలో నుండి సేకరించబడిన కాలక్రమములో నుండి మీరు చూడవచ్చు. దావీదు తన కుటుంబములోని గొర్రెలను కాయు గొర్రెల కాపరిగా తన జీవితమును ఆరంభించాడు. ఒక గొప్ప విరోధి, ఆజానుబాహుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను జయించుటకు ఒక సైన్యమును తోడ్కొని వచ్చాడు, కాబట్టి ఇశ్రాయేలీయులు నిరుత్సాహపడి, ఓటమి చెందినవారిగా భావించుకున్నారు. దావీదు గొల్యాతుకు సవాల్ చేసి యుద్ధములో అతనిని హతమార్చాడు. ఒక గొప్ప యోధుని మీద ఒక యవ్వన గొర్రెల కాపరియైన బాలుడు సాధించిన అమోఘమైన విజయము దావీదుకు గొప్ప ఖ్యాతిని తెచ్చింది. 

అయితే, సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవముల తరువాత మాత్రమే అతడు రాజు కాగలిగాడు, ఎందుకంటే అతనికి ఇశ్రాయేలీయులలోను, మరియు బయట కూడా అనేకమంది విరోధులు ఉండిరి, మరియు వారు అతనిని వ్యతిరేకించారు. అయితే దావీదు దేవుని నమ్మాడు కాబట్టి మరియు దేవుడు అతనికి సహాయము చేశాడు కాబట్టి, దావీదు తుదకు తన విరోధులందరి మీద జయమును పొందాడు. హెబ్రీ వేదములైన బైబిలులోని పలు పుస్తకములు దావీదు పడిన ఈ సంఘర్షణలను మరియు విజయములను జ్ఞాపకము చేసుకుంటాయి.  

దావీదు ఒక ప్రఖ్యాతిగాంచిన వాయిద్యకారుడు కూడా, మరియు అతడు దేవుని కొరకు రమ్యమైన పాటలను మరియు పద్యములను కూడా వ్రాశాడు. ఈ పాటలు మరియు పద్యములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవి మరియు వేద పుస్తకములోని కీర్తనల గ్రంథమును రూపొందిస్తాయి. 

కీర్తనలలో ‘క్రీస్తును’ గూర్చిన ప్రవచనాలు

అతడు గొప్ప రాజు మరియు యోధుడు అయినప్పటికీ, దావీదు కీర్తనలలో తన రాజరిక వంశములో నుండి పుట్టబోవు ‘క్రీస్తు’ను గూర్చి వ్రాశాడు మరియు ఆ క్రీస్తు శక్తిలోను, అధికారములోను అతనిని మించిపోతాడు. భగవద్గీతను పోలిన రాజరిక యుద్ధ దృశ్యమును పోలినట్లు, హెబ్రీ వేదములలోని (బైబిలు) 2వ కీర్తనలో క్రీస్తు ఈ విధముగా పరిచయం చేయబడ్డాడు.

1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?

జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

2–మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము

రండి అని చెప్పుకొనుచు

3భూరాజులు యెహోవాకును ఆయన ‘అభిషిక్తునికిని’

విరోధముగా నిలువబడుచున్నారు

ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు

ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

5ఆయన ఉగ్రుడై వారితో పలుకును

ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును

6–నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద

నా ‘రాజు’ను ఆసీనునిగా చేసియున్నాను

7కట్టడను నేను వివరించెదను

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను

–నీవు నా కుమారుడవు

నేడు నిన్ను కనియున్నాను.

8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను

భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

9ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు

కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా

పగులగొట్టెదవు

10కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి

భూపతులారా, బోధనొందుడి.

11భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి

గడగడ వణకుచు సంతోషించుడి.

12ఆయన కోపము త్వరగా రగులుకొనును

కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన

కోపించును

అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.

ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

కీర్తనలు 2

ఇంతకు ముందు వివరించబడినట్లు అదే వాక్యము ఈ క్రింద గ్రీకు భాష నుండి అనువదించబడింది.

న్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2: 1-2 – హెబ్రీ మరియు గ్రీకు (LXX) మూల భాషలలో

కురుక్షేత్ర యుద్ధము యొక్క ఫలితములు

ఇక్కడ మీరు చూస్తున్నట్లు, 2వ కీర్తనలో ‘క్రీస్తు/అభిషిక్తుడు’ అను పదము యొక్క నేపధ్యము భగవద్గీతలోని కురుక్షేత్ర యుద్దమును పోలియున్నది. అంత సుదీర్ఘముగా జరిగిన కురుక్షేత్ర యుద్ధము యొక్క ఫలితములను గూర్చి ఆలోచన చేసినప్పుడు, వాటిలో కొన్ని తేడాలు కనిపిస్తాయి. అర్జునుడు మరియు పాండవులు యుద్ధములో గెలిచారు, కాబట్టి సింహాసనమును లాగుకున్న కౌరవుల చేతిలో నుండి అధికారము మరియు పరిపాలన పాండవుల చేతికి వచ్చింది, మరియు యదిష్టిరుడు యోగ్యమైన రాజైయ్యాడు. ఐదుగురు పాండవులు మరియు కృష్ణుడు మాత్రమే పద్దెనిమిది దినముల యుద్ధములో ప్రాణాలతో బయటపడ్డారు, మరియు కొంతమంది మినహా అందరు హతము చేయబడ్డారు. అయితే ఈ యుద్ధము తరువాత ముప్పై ఆరు సంవత్సరములు మాత్రమే పాలించి యదిష్టిరుడు సింహాసనమును విడిచి, అర్జునుడు యొక్క మనవడైన పరిక్షితుడుని రాజుగా చేశాడు. తరువాత అతడు ద్రౌపది మరియు అతని సహోదరులతో కలసి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ద్రౌపది మరియు నలుగురు పాండవులైన భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు మార్గమధ్యములోనే మరణించారు. యదిష్టిరునికి పరలోకములోనికి ఆహ్వానము దక్కింది. కౌరవుల తల్లియైన గాంధారి యుద్ధమును ఆపుచేయనందుకు కృష్ణుని మీద కోపపడి అతనిని శపించగా, అతడు యుద్ధమునకు ముప్పై ఆరు సంవత్సరముల తరువాత రెండు గోత్రముల మధ్య జరిగిన పోరాటములో అనుకోకుండా బాణము తగిలి మరణించాడు. కురుక్షేత్ర యుద్ధము మరియు తరువాత జరిగిన కృష్ణుని మరణము లోకమును కలియుగములోనికి నెట్టివేసింది.

కాబట్టి కురుక్షేత్ర యుద్ధము వలన మనకు ఏమి లాభము కలిగింది?

కురుక్షేత్ర యుద్ధము నుండి మనము పొందిన ఫలములు

కొన్ని వేల సంవత్సరముల తరువాత నివసిస్తున్న మనకు మరింత గొప్ప అవసరత ఉన్నది. మనము సంసారలో జీవిస్తు, నిరంతరము బాధను, రోగమును, వృద్ధాప్యమును మరియు మరణమును అనుభవిస్తాము. మనము నాయకుల యొక్క వ్యక్తిగత మిత్రులకు మరియు ధనికులకు సహాయము చేయు భ్రష్టమైన ప్రభుత్వముల ఆధీనములో నివసిస్తాము. కలియుగము యొక్క పరిణామములను మనము అనేక విధాలుగా అనుభవిస్తాము.

భ్రష్టత్వములేని ప్రభుత్వము కొరకు, కలియుగములో లేని సమాజము కొరకు, మరియు సంసారలో అంతములేని పాపము మరియు మరణము నుండి వ్యక్తిగత విమోచన కొరకు మనము ఎదురుచూస్తున్నాము.

2వ కీర్తనలోని ‘క్రీస్తు’ రాక ద్వారా మనము పొందిన ఫలములు

2వ కీర్తనలో పరిచయం చేయబడిన క్రీస్తు, ఈ మన అవసరతలను ఏ విధంగా తీర్చుతాడో హెబ్రీ ఋషులు వివరించారు. ఈ అవసరతలను తీర్చుటకు ఒక యుద్ధము జరగాలి, కాని కురుక్షేత్రములోను మరియు 2వ కీర్తనలోను తెలుపబడిన యుద్ధమునకు భిన్నమైన యుద్ధము ఒకటి జరగాలి. ఈ యుద్దమును కేవలం ‘క్రీస్తు’ మాత్రమే చేయగలడు. అధికారముతోను, బలముతోను ఆరంభించకుండా మనలను పాపము మరియు మరణము నుండి విమోచించుటకు క్రీస్తు మనలను సేవించుట ద్వారా ఆరంభిస్తాడని ప్రవక్తలు చూపారు. ఒక దినము నెరవేర్చబడు 2వ కీర్తనకు మార్గము ముందుగా మరొక విరోధిని జయించుటకు తిరిగి ప్రయాణము చేయుట ద్వారా జరుగుతుందని ఇది చూపుతుంది. ఇది సైన్య శక్తి ద్వారాగాక, సంసారకు బానిసలైన వారి కొరకు ప్రేమ చూపుట మరియు బలి అర్పించుట ద్వారా కలుగుతుంది. మనము ఈ ప్రయాణమును దావీదు రాజ వంశ వృక్షములోని ఒక మరణమైన కొమ్మలో నుండి పుట్టు చిగురుతో ఆరంభిస్తాము.

రాజ్ వలె: యేసు క్రీస్తు అను పేరులో ‘క్రీస్తు’ అను మాటకు అర్థం ఏమిటి?

కొన్నిసార్లు యేసు యొక్క చివరి పేరు ఏమిటి అని నేను ప్రజలను అడుగుతాను. వారు సాధారణంగా ఇలా జవాబిస్తారు,

“ఆయన చివరి పేరు ‘క్రీస్తు’ అనుకుంటా, కాని నాకు సరిగా తెలియదు.”

అప్పుడు నేను ఇలా అడుగుతాను,

“అయితే, యేసు బాలునిగా ఉన్నప్పుడు యోసేపు క్రీస్తు మరియు మరియ క్రీస్తు తమ కుమారుడైన యేసు క్రీస్తును బజారుకు తీసుకువెళ్లారా?”

ఇలా అడిగితే, “క్రీస్తు” యేసు యొక్క ఇంటి పేరు కాదని వారు గ్రహిస్తారు. కాబట్టి, ‘క్రీస్తు’ అంటే ఏమిటి? ఇది ఎక్కడ నుండి వచ్చింది? దీని అర్థము ఏమిటి? వాస్తవానికి ‘క్రీస్తు’ అను పదము ‘నాయకులు’ లేక ‘పరిపాలన’ అను అర్థమునిచ్చు ఒక బిరుదు అని వినుట చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వాతంత్ర్యమునకు ముందు భారత దేశమును పరిపాలించిన బ్రిటిష్ రాజ్యమును ఈ ‘రాజ్’ అను బిరుదు కొంతవరకు పోలియున్నది.

అనువాదము vs. లిప్యాంతరీకరణ

ముందుగా మనము అనువాదములోని కొన్ని మూల విషయములను అర్థము చేసుకుందాము. అనువాదకులు కొన్నిసార్లు పేర్లను మరియు బిరుదులను అనువదించునప్పుడు అర్థము కంటే ఎక్కువగా ధ్వని ఆధారంగా అనువదిస్తారు. దీనిని లిప్యాంతరీకరణ అని పిలుస్తారు. ఉదాహరణకు, कुंभ मेला అను హిందీ పదమునకు ఆంగ్ల లిప్యాంతరీకరణ “Kumbh Mela” అయ్యున్నది. मेला అను మాటకు అర్థము ‘తిరునాళ్ళు’ లేక ‘పండుగ’ అయినప్పటికీ, ఇది ఆంగ్ల భాషలో kumbh fairఅని అనువదించబడుటకు బదులుగా Kumbh Mela అని లిప్యాంతరీకరణ చేయబడుతుంది. “Raj” అను పదము “राज” అను హిందీ పదము యొక్క లిప్యాంతరీకరణ అయ్యున్నది. राज అను మాటకు అర్థము ‘పరిపాలన’ అయ్యున్నప్పటికీ, “British Rule” కు బదులుగా “British Raj” అను పదమును ఉపయోగించుట ద్వారా ఈ పదము ఆంగ్లములోనికి ధ్వని ద్వారా లిప్యాంతరీకరణ చేయబడినది. వేద పుస్తకము (బైబిలు) విషయములో కూడా, అనువాదకులు ఏ పేర్లను మరియు బిరుదులను అనువదించాలి (అర్థము ఆధారంగా) మరియు వేటిని లిప్యాంతరీకరణ (ధ్వని ఆధారంగా) చేయాలి అను విషయమును స్వయంగా నిర్ణయించవలసియుండినది. దీనికి విశేషమైన నియమము ఏమి లేదు.

సెప్టుజెంట్

హెబ్రీ వేదములు (పాత నిబంధన) ఆనాటి అంతర్జాతీయ భాష అయిన గ్రీకు భాషలోనికి అనువదించబడినప్పుడు క్రీ.పూ. 250లో బైబిలు మొట్టమొదటిసారిగా అనువదించబడింది. ఆ అనువాదమును సెప్టుజెంట్ (లేక LXX) అని పిలుస్తారు మరియు అది చాలా ఖ్యాతిని పొందింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది కాబట్టి, దానిలోని అనేక ఉద్ధరణములు పాత నిబంధనలో నుండి తీసుకొనబడినవి.

సెప్టుజెంట్ లో అనువాదము & లిప్యాంతరీకరణ

ఈ ప్రక్రియను మరియు అది ఆధునిక బైబిళ్ళ మీద చూపు ప్రభావమును ఈ క్రింద చిత్రము తెలియజేస్తుంది.

మూల భాషలలో నుండి ఆధునిక బైబిళ్ళలోనికి అనువాద క్రమమును గూర్చిన పట్టిక

చౌకము #1లో మూల హెబ్రీ పాత నిబంధన (క్రీ.పూ. 1500 – 400 మధ్య కాలములో వ్రాయబడినది) ఇవ్వబడినది. సెప్టుజెంట్ క్రీ.పూ. 250లో వ్రాయబడిన హెబ్రీ –> గ్రీకు అనువాదము కాబట్టి, బాణము చౌకము #1 నుండి #2 వైపుకు సూచిస్తుంది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది (క్రీ.శ. 50-90), కాబట్టి #2లో పాత మరియు క్రొత్త నిబంధనలు రెండు ఇవ్వబడినవి. క్రింద సగభాగములో (#3) బైబిలు యొక్క ఆధునిక భాషా అనువాదములు ఇవ్వబడినవి. పాత నిబంధన (హెబ్రీ వేదములు) మూల హెబ్రీ భాష నుండి అనువదించబడింది (1–>3) మరియు క్రొత్త నిబంధన మూల గ్రీకు భాష నుండి అనువదించబడింది  (2–>3). ఇంతకు ముందు వివరించబడినట్లు పేర్లను మరియు బిరుదులను అనువాదకులు నిర్ణయించవలసియుండినది. ఇది లిప్యాంతరీకరణ మరియు అనువాదము అను శీర్షికలతో నీలిరంగు బాణముల ద్వారా సూచించబడినది, మరియు అనువాదకులు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చని ఇది సూచిస్తుంది.

‘క్రీస్తు’ అను పదము యొక్క ఆరంభము 

‘క్రీస్తు’ అను పదము మీద దృష్టిపెట్టి పై ప్రక్రియను అనుసరించండి.

‘క్రీస్తు’ అను పదము బైబిలులో ఎక్కడ నుండి ఆవిర్భవించింది? 

‘מָשִׁיחַ’ (మషియాఖ్) అను పదము హెబ్రీ పాత నిబంధనలోని బిరుదైయున్నది, మరియు రాజుగా లేక నాయకునిగా ‘అభిషేకించబడిన లేక పవిత్రపరచబడిన’ వ్యక్తి అని దీని అర్థము. ఆ కాలములోని హెబ్రీ రాజులు రాజు అగుటకు ముందు అభిషేకించబడేవారు (నూనెతో తలంటు ఆచారము), కాబట్టి వారు అభిషిక్తులు లేక మషియాఖ్ అని పిలువబడేవారు. తరువాత వారు నాయకులైయ్యేవారు, అయితే వారి పరిపాలన దేవుని యొక్క పరలోక పరిపాలనకు ఆధీనములోను, ఆయన నియమములకు అనుగుణంగాను ఉండవలసియుండేది. ఈ భావనలో పాత నిబంధనలోని హెబ్రీ రాజులు రాజ్ ను పోలియుండేవారు. రాజ్ దక్షిణ ఆసియాలోని బ్రిటిష్ ప్రాంతములను పాలించేవాడు, కాని అతడు బ్రిటన్ లోని ప్రభుత్వము యొక్క ఆధీనములో ఉండి, దాని నియమ నిబంధనలను పాటించేవాడు.

పాత నిబంధన రానున్న ఒక విశేషమైన మషియాఖ్ ను గూర్చి ప్రవచించింది. ఆయన ఒక విశేషమైన రాజుగా ఉంటాడు. క్రీ.పూ. 250లో సెప్టుజెంట్ అనువదించబడినప్పుడు, అనువాదకులు అదే అర్థమునిచ్చు ఒక గ్రీకు పదమును ఉపయోగించారు. ఆ గ్రీకు పదము Χριστός (క్రిస్టోస్ అను వినిపిస్తుంది), మరియు అది క్రియో అను పదము నుండి వెలువడుతుంది, ఆచారముగా తలపై నూనె అంటుట అని ఆ పదము యొక్క అర్థము. ఈ ప్రవచించబడిన ‘మషియాఖ్’గా యేసును గుర్తించుటకు క్రొత్త నిబంధన రచయితలు క్రిస్టోస్ అను పదమును ఉపయోగించుట కొనసాగించారు.

ఐరోపా భాషలలో, దీనికి పోలిన అర్థమునిచ్చు వేరొక పదము లేదు కాబట్టి, క్రొత్త నిబంధన గ్రీకు పదమైన ‘క్రిస్టోస్’ను వారు ‘క్రైస్ట్’ అని లిప్యాంతరీకరణ చేశారు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన మూలములు కలిగిన, హెబ్రీ నుండి గ్రీకు భాషలోనికి అనువాదము ద్వారా వచ్చిన ఒక విశేషమైన బిరుదైయున్నది, మరియు తరువాత అది గ్రీకు భాషలో నుండి ఆధునిక భాషలలోనికి లిప్యాంతరీకరణ చేయబడినది. పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి ఆధునిక భాషలలోనికి సూటిగా అనువదించబడినది మరియు మూల హెబ్రీ పదమైన ‘మషియాఖ్’ విషయములో అనువాదకులు విభిన్నమైన ఎంపికలను చేశారు. కొన్ని భైబిళ్ళు ‘మషియాఖ్’ అను పదమును కొన్ని మార్పులతో ‘మెస్సీయ’ అని లిప్యాంతరీకరణ చేయగా, మరికొన్ని ‘అభిషిక్తుడు’ అని అర్థమునిచ్చు విధముగా అనువదించాయి. క్రీస్తు అను పదమునకు హిందీ పదము (मसीह) అరబిక్ భాష నుండి లిప్యాంతరీకరణ చేయబడినది, మరియు ఆ అరబిక్ పదము మూల హెబ్రీ భాషలో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది. కాబట్టి ‘మసిహ్’ అను దాని ఉచ్చారణ మూల హెబ్రీ పదమునకు దగ్గర సంబంధము కలిగినదిగా ఉన్నది. 

హెబ్రీ పదమైన מָשִׁיחַ (మషియాఖ్, మెస్సీయ) గ్రీకు సెప్టుజెంట్ లో “క్రిస్టోస్” అని అనువదించబడింది. ఇది ఆంగ్ల భాషలోనికి ‘క్రైస్ట్’ అని అనువదించబడింది. క్రిస్ట్ అను పదము యొక్క తెలుగు అనువాదము గ్రీకు పదమైన “క్రిస్టోస్”లో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది మరియు క్రీస్తు (Krīstu) అని పలుకబడుతుంది.

సాధారణంగా ‘క్రీస్తు’ అను పదమును మనము పాత నిబంధనలో చూడము గనుక, పాత నిబంధనతో ఈ పదము యొక్క అనుబంధము ఎల్లప్పుడు స్పష్టముగా కనిపించదు. కాని, ‘క్రీస్తు’=’మెస్సీయ’=’అభిషిక్తుడు’ అని, మరియు ఇది ఒక విశేషమైన బిరుదు అని ఈ అధ్యయనము ద్వారా మనకు స్పష్టమవుతుంది.

మొదటి శతాబ్దములో ఎదురుచూసిన క్రీస్తు

ఇప్పుడు సువార్తలో నుండి కొన్ని విషయములను చూద్దాము. క్రిస్మస్ వృత్తాంతములోని భాగముగా, యూదుల రాజును చూచుటకు జ్ఞానులు వచ్చినప్పుడు, హేరోదు రాజు ఈ క్రింది విధంగా స్పందించాడు. ఇక్కడ క్రీస్తు అను పదము ప్రత్యేకముగా యేసును సూచించనప్పటికీ, దానిలోని స్పష్టతను గమనించండి.

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:3-4

‘ప్రత్యేకించబడిన క్రీస్తు’ అను ఆలోచన హేరోదు మరియు అతని సలహాదారులకు అర్థమైయ్యింది అని మీరు చూడవచ్చు – మరియు ఇక్కడ ఈ పదము యేసును విశేషముగా సూచించదు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన నుండి వస్తుంది అని, మొదటి శతాబ్దములోని ప్రజలు (హేరోదు మరియు అతని సలహాదారులు వంటివారు) సెప్టుజెంట్ లో దీనిని సాధారణంగా చదివేవారని ఇది సూచిస్తుంది. ‘క్రీస్తు’ అను పదము ఒక పేరు కాదుగాని, ఒక బిరుదైయున్నది, మరియు మరియు ఒక నాయకుని లేక రాజును సూచిస్తుంది. ఇందువలనే, మరొక రాజు యొక్క రాకను బట్టి హేరోదు ‘కలత చెందాడు.’ ‘క్రీస్తు’ అను పదమును క్రైస్తవులు సృష్టించారు అను ఆలోచనను ఇప్పుడు మనము ప్రక్కనపెట్టవచ్చు. క్రైస్తవులు ఉనికిలోని రాక ముందే కొన్ని వందల సంవత్సరములుగా ఈ బిరుదు ఉపయోగించబడింది.

క్రీస్తు అధికారములోని వైరుధ్యములు

హెబ్రీ వేదములలో ప్రవచించబడిన రానున్న క్రీస్తు యేసే అని ఆయన యొక్క ఆదిమ అనుచరులు నమ్మారు, కాని ఇతరులు ఆయనను వ్యతిరేకించారు. 

ఎందుకు?

ప్రేమ లేక శక్తి ద్వారా పాలించుట అను వైరుధ్యములో దీనిని జవాబు దాగియున్నది. బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనములో భారత దేశమును పాలించు అధికారము రాజ్ కు ఇవ్వబడినది. అయితే రాజ్ మొదటిగా సైన్య శక్తితో వచ్చి దాని శక్తి ద్వారా దేశమును లోపరచుకున్నది కాబట్టి భారత దేశమును పాలించగలిగినది. ప్రజలు రాజ్ ను ఇష్టపడలేదు, కాబట్టి తుదకు గాంధీ వంటి నాయకుల నాయకత్వములో రాజ్ ముగింపునకు వచ్చింది.  

క్రీస్తుగా యేసు అధికారము కలిగియున్నను బలవంతముగా లోపరచుకొనుటకు రాలేదు. ప్రేమ లేక భక్తి ఆధారంగా నిత్య రాజ్యమును స్థాపించుటకు ఆయన వచ్చాడు, మరియు ఇలా జరిగుటకు ఒక వైపున శక్తి మరియు అధికారము అను వైరుధ్యము మరొక వైపున ఉన్న ప్రేమతో ఏకమవ్వవలసియుండినది. ‘క్రీస్తు’ రాకను అర్థము చేసుకొనుటలో మనకు సహాయం చేయుటకు హెబ్రీ ఋషులు ఈ వైరుధ్యమును వివరించారు. హెబ్రీ వేదములలో ‘క్రీస్తు’ అను పదము యొక్క మొదటి ప్రత్యక్షతలో వారు ఇచ్చిన మెళకువలను మనము అనుసరిద్దాము, వీటిని క్రీ.పూ. 1000లో హెబ్రీ రాజైన దావీదు వ్రాశాడు.

యూదుల చరిత్ర: భారత దేశములో & ప్రపంచమంతటా

యూదులకు భారత దేశములో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా నివాసముంటు భారత దేశ సమాజముల మధ్య చిన్న చిన్న సమాజములుగా జీవిస్తున్నారు. మిగిలిన అల్పసంఖ్యాక మతములకు (జైనులు, సిక్కులు, బౌద్ధులు వంటివారు) భిన్నముగా, యూదులు భారత దేశము వెలుపల నుండి వచ్చి ఇక్కడ తమ నివాసమును ఏర్పరచుకున్నారు. 2017 వేసవి కాలములో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ మోది ఇశ్రాయేలునకు చారిత్రిక పర్యటనకు వెళ్లుటకు ముందు, ఇశ్రాయేలు దేశ ప్రధానమంత్రియైన నితన్యాహుతో కలిసి వార్తాపత్రికలో ఒక సమైఖ్య వ్యాసమును వ్రాశాడు. వారు ఇలా వ్రాసినప్పుడు యూదులు భారత దేశమునకు వచ్చిన ఈ విషయమును వారు గుర్తించారు:

భారత దేశములో ఉన్న యూదుల సమాజము ఎల్లప్పుడూ ఆప్యాయతతోను, గౌరవముతోను ఆహ్వానించబడింది మరియు ఏనాడు హింసను ఎదుర్కొనలేదు.

వాస్తవానికి, యూదులు భారత దేశ చరిత్ర మీద ఒక విశేషమైన ప్రభావమును చూపారు, మరియు భారత చరిత్రలో ఒక కఠినమైన మర్మమునకు పరిష్కారమును ఇచ్చారు – భారత దేశములో రచనలు ఎలా ఆరంభమైయ్యాయి? ఈ ప్రశ్నకు జవాబు భారత సంస్కృతిలో సాంప్రదాయిక రచనలన్నిటి మీద ప్రభావం చూపుతుంది.

భారత దేశములో యూదుల చరిత్ర

భిన్నముగా ఉన్నప్పటికీ, యూదులు సాంప్రదాయిక భారత దేశ వస్త్రధారణను అనువర్తించుకున్నారు

యూదుల సమాజములు భారత దేశములో ఎంత కాలము నుండి నివసించుచున్నాయి? ‘ఇరవై ఏడు శతాబ్దములు” తరువాత మిజోరాంలో ఉన్న మనష్షే గోత్రమునకు (బెని మనషే) చెందిన యూదులు ఇశ్రాయేలు దేశమునకు తిరిగివచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ పత్రిక ఈ మధ్య ఒక వ్యాసమును ప్రచురించింది. అంటే తమ పితరులు క్రీ.పూ. 700 సంవత్సరములో ఇక్కడకి వచ్చినట్లు అది సూచిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ లో నివసించుచున్న ఎఫ్రయిము అను యూదుల గోత్రమునకు చెందిన (బెనె ఎఫ్రాయిమ్) వారి తెలుగు మాట్లాడు సోదరులు పర్షియా, ఆఫ్గనిస్తాన్, టిబెట్, మరియు చైనా దేశములలో సంచరిస్తు చివరికి వెయ్యి సంవత్సరముల క్రితం భారత దేశమునకు వచ్చిన జ్ఞాపికను వెల్లడి చేస్తారు. కేరళ రాష్ట్రములో, కొచ్చిన్ యూదులు అక్కడ రెండు వేల ఆరు వందల సంవత్సరములుగా నివసిస్తున్నారు. కొన్ని శతాబ్దములుగా యూదులు భారత దేశమంతా చిన్న చిన్న సమాజములను నిర్మించుకున్నారు. కాని ఇప్పుడు వారు భారత దేశమును విడచి ఇశ్రాయేలుకు వెళ్లుచున్నారు.

కొచ్చిన్ లోని యూదుల సమాజమందిరములోని ఒక శిలాఫలకము. ఇది వందల సంవత్సరములుగా అక్కడ ఉంది

యూదులు భారత దేశములో నివసించుటకు ఎలా వచ్చారు? ఇంత కాలము తరువాత వారు ఇశ్రాయేలుకు తిరిగి ఎందుకు వెళ్తున్నారు? వేరే అన్ని దేశముల కంటే ఎక్కువగా వారి చరిత్రను గూర్చి మనకు సత్యములు అందుబాటులో ఉన్నాయి. ఒక కాలక్రమమును ఉపయోగించి వారి చరిత్రను క్రోడీకరించుటకు మనము ఈ సమాచారమును ఉపయోగించుదాము.

అబ్రాహాము: యూదుల కుటుంబము ఆరంభమైయ్యింది

అబ్రాహాముతో ఈ కాలక్రమము ఆరంభమవుతుంది. అతనికి దేశముల వాగ్దానము ఇవ్వబడినది, మరియు అతడు దేవునితో అనేకమార్లు కలుసుకొని తుదకు తన కుమారుడైన ఇస్సాకును చిహ్నాత్మకముగా బలి అర్పించాడు. యేసు (యేసు సత్సంగ్) యొక్క భవిష్యత్ బలి కొరకు స్థలమును సూచించుట ద్వారా ఇది యేసు వైపుకు చూపు ఒక చిహ్నముగా ఉన్నది. ఇస్సాకు కుమారునికి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు వారసులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలమును సూచించు కాలక్రమము పచ్చ రంగులో కొనసాగుతుంది. ఈ కాలము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు (వంశావళి: అబ్రాహాము -> ఇస్సాకు -> ఇశ్రాయేలు (ఈయనకు యాకోబు అని కూడా పేరు) -> యోసేపు)  ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు నడిపించుటతో ఆరంభమవుతుంది, మరియు వారు అక్కడ బానిసలుగా చేయబడ్డారు.

ఫరోకు బానిసలుగా ఐగుప్తులో జీవించుట

మోషే: దేవుని ఆధీనములో ఇశ్రాయేలీయులు ఒక దేశమయ్యారు

ఐగుప్తును నాశనము చేసి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి ఇశ్రాయేలు దేశమునకు నడిపించిన పస్కా తెగులు తరువాత మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. అతడు మరణించుటకు ముందు, మోషే ఇశ్రాయేలీయుల మీద ఆశీర్వాదములను మరియు శాపములను ప్రకటించాడు (ఇక్కడ కాలక్రమము పసుపు రంగులో ఉంది). వారు దేవునికి విధేయులైతే ఆశీర్వదించబడతారు, కాకపోతే శపించబడతారు. ఇశ్రాయేలు చరిత్ర తరువాత ఈ ఆశీర్వాదములకు మరియు శాపములకు కట్టుబడియుంది.

కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించారు కాని వారికి రాజు లేడు, మరియు యెరూషలేము వారికి రాజధానిగా ఉండేది కాదు – ఆ కాలములో అది వేరొక ప్రజల ఆధీనములో ఉండేది. అయితే, రాజైన దావీదు కాలములో క్రీ.పూ. 1000లో ఇది మార్పు చెందింది.
యెరూషలేము నుండి పాలించిన దావీదు సామ్రాజ్యపు రాజుల పరిపాలనలో జీవించుట

దావీదు యెరూషలేములో ఒక రాజరిక సామ్రాజ్యమును స్థాపించాడు

దావీదు యెరూషలేమును జయించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అతడు రానున్న మెస్సీయను గూర్చి వాగ్దానమును పొందుకున్నాడు, మరియు ఆ కాలము మొదలుకొని ‘క్రీస్తు’ రాక కొరకు యూదులు ఎదురు చూశారు. ధనికుడు మరియు ప్రఖ్యాతిగాంచినవాడైన, అతని కుమారుడైన సొలొమోను అతని తరువాత రాజ్యమును పాలించి యెరూషలేములోని మోరీయ పర్వతము మీద మొదటి యూదుల దేవాలయమును నిర్మించాడు. దావీదు రాజు యొక్క వారసులు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించుట కొనసాగించారు మరియు ఈ కాలము నీలం రంగులో చూపబడుతుంది (క్రీ.పూ. 1000 – 600). ఇది ఇశ్రాయేలీయుల మహిమ కాలము – ఆ కాలములో వారు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదములను పొందుకున్నారు. వారు ఒక శక్తివంతమైన దేశముగా ఉండేవారు; వారి సమాజము, సంస్కృతి మరియు దేవాలయము పురోగతి చెందినదిగా ఉండేవి. అయితే ఈ కాలములో వారి మధ్య ఎదిగిన భ్రష్టత్వమును గూర్చి కూడా పాత నిబంధన వర్ణిస్తుంది. వారు మార్పు చెందని యెడల మోషే చెప్పిన శాపములు వారి మీదికి వస్తాయని ఈ కాలములో అనేకమంది ఋషులు ఇశ్రాయేలీయులను హెచ్చరించారు. ఈ కాలములో ఇశ్రాయేలీయులు రెండు రాజ్యములుగా విడిపోయారు: ఇశ్రాయేలు లేక ఎఫ్రాయిము అని పిలువబడు ఉత్తర రాజ్యము, మరియు యూదా అని పిలువబడు దక్షిణ రాజ్యము (నేటి కొరియన్ల వలె, ఒకే ప్రజల గుంపు రెండు దేశములుగా విడిపోవుట – ఉత్తర మరియు దక్షిణ కొరియా).

యూదుల మొదటి చెర: అష్షురు & బబులోను

చివరిగా, వారి మీద రెండు విడతలుగా శాపములు దిగివచ్చాయి. క్రీ.పూ. 722లో అష్షురీయులు ఉత్తర రాజ్యమును నాశనము చేసి అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులను తమ రాజ్యమంతటిలో చెరకు తీసుకొనిపోయారు. మిజోరాంలో ఉన్న బెనె మనష్షే మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బెనె ఎఫ్రాయిమ్ వారు ఈ కాలమూలో చెరకు తేబడిన ఇశ్రాయేలీయులే. తరువాత క్రీ.పూ 586లో నెబుకద్నేజరు అను బబులోనీయుల బలమైన రాజు తొమ్మిది వందల సంవత్సరముల క్రితం మోషే వ్రాసిన శాపమునకు అనుగుణంగా దక్షిణ రాజ్యమునుచెరగొని పోయాడు:

49 ​యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 
50 క్రూరముఖము కలిగి వృద్ధులను ¸°వనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 
51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 
52 ​మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.

ద్వితీయోపదేశకాండము 28: 49-52

నెబుకద్నేజరు యెరూషలేమును జయించి, దానిని కాల్చివేసి, సొలొమోను నిర్మించిన దేవాలయమును నాశనము చేశాడు. తరువాత అతడు ఇశ్రాయేలీయులను బబులోనును చెరగొనిపోయాడు. ఇది మోషే చేసిన ప్రవచనమును నెరవేర్చింది

63 కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 
64 ​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 

ద్వితీయోపదేశకాండము 28:63-64
జయించబడి బబులోనుకు చెరగొనిపోబడింది

 కేరళలోని కొచ్చిన్ ప్రాంతములో ఉన్న యూదులు ఈ సమయములో చెరగొనిపోబడిన యూదులు. డెబ్బై సంవత్సరముల పాటు, ఇది ఎరుపు రంగులో చూపబడింది, ఈ ఇశ్రాయేలీయులు (లేక నేడు పిలువబడుచున్నట్లు యూదులు)  అబ్రాహాముకు మరియు అతని వారసులకు వాగ్దానము చేయబడిన భూమికి వెలుపల నివసించారు.

 భారత సమాజముపై యూదులు చూపిన ప్రభావం

అశోక స్తంభము మీద బ్రహ్మి లిపి (క్రీ.పూ. 250 BCE)

 భారత దేశములో ఆరంభమైన రచనలను గూర్చిన ప్రశ్నను మనము చూద్దాము. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళము వంటి ఆధునిక భారత దేశ భాషలు మరియు ఋగ్వేదము మరియు ఇతర సాంప్రదాయక సాహిత్యము వ్రాయబడిన పురాతన సంస్కృతము వంటి భాషలను బ్రహ్మిక్ లిపులు అని పిలుస్తారు, మరియు ఇవన్నీ బ్రాహ్మి లిపి అని పిలువబడు పురాతన లిపి నుండి వెలువడినవి. బ్రాహ్మి లిపి నేడు అశోకుని కాలము వంటి కొన్ని పురాతన స్మారకముల మీద మాత్రమే కనిపిస్తుంది.

ఈ బ్రహ్మి లిపి ఆధునిక లిపులుగా ఎలా పరివర్తన చెందినదో అర్థము చేసుకోవచ్చుగాని, అసలు ఈ బ్రహ్మి లిపి భారత దేశమునకు ఎలా వచ్చింది అను విషయములో మాత్రం స్పష్టతలేదు. బ్రహ్మి లిపి హెబ్రీ-ఫొయినిషియన్ లిపితో సంబంధము కలిగియున్నదని పండితులు గుర్తిస్తారు, మరియు ఇది ఇశ్రాయేలులోని యూదులు భారత దేశములోనికి వలసవచ్చినప్పుడు ఉపయోగించిన లిపి అయ్యున్నది. చరిత్రకారుడైన డా. అవిగ్దోర్ షాచన్ (1) చెరలోని వచ్చి భారత దేశములో స్థిరపడిన ఇశ్రాయేలీయులు హెబ్రీ- ఫొయినిషియన్  లిపిని తెచ్చారని అది తరువాత బ్రహ్మి లిపి అయ్యింది అని ప్రతిపాదిస్తారు. బ్రహ్మి లిపికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఇది తెలియజేస్తుంది. అబ్రాహాము దేశములో నుండి చెరగొనిపోబడివచ్చిన యూదులు భారత దేశములో స్థిరపడిన కాలములోనే ఉత్తర భారత దేశములో బ్రహ్మి లిపి ప్రత్యక్షమగుట కేవలం ఒక యాదృచ్చికమేనా? అబ్రాహాము వారసుల యొక్క లిపిని అన్వయించుకున్న స్థానికులు దానిని (అ)బ్రహామిన్ లిపి అని పిలిచారు. అబ్రాహాము మతము ఒకే దేవుని నమ్మింది మరియు ఆయన కార్యములు పరిమితమైనవి కావు. ఆయన మొదటివాడు, కడపటివాడు, నిత్యుడు. (అ)బ్రహాము ప్రజల మతములో నుండే బ్రహ్మన్ మీద నమ్మకము కూడా ఇక్కడే మొదలైయుండవచ్చు. తమ లిపిని మరియు మతమును భారత దేశమునకు తెచ్చిన యూదులు, దేశమును స్వాధీనపరచుకొని పాలించాలని ప్రయత్నించిన ఇతరుల కంటే ఎక్కువగా భారత దేశము యొక్క ఆలోచన మరియు చరిత్ర మీద ప్రభావము చూపారు. మరియు హెబ్రీ- ఫొయినిషియన్/బ్రహ్మి లిపిలో వ్రాయబడిన హెబ్రీ వేదములు, రానున్న వానిని గూర్చి తెలియజేస్తాయి, ఇది సంస్కృతములోని ఋగ్వేదములు ఉన్న రానున్న పురుషను పోలియున్నది. తమ పితరుల దేశము నుండి పశ్చిమ ఆసియాలోనికి చెరగొనిపోబడి వచ్చిన యూదుల యొక్క చరిత్ర మీద మరొకసారి దృష్టిపెడదాము.

పారసీకుల పరిపాలనలో చెరలో నుండి తిరిగివచ్చుట

అటు తరువాత, పారసీక రాజైన కొరేషు బబులోనును జయించి ప్రపంచములోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు. యూదులు తమ దేశమునకు తిరిగివెళ్లుటకు అతడు అనుమతినిచ్చాడు.

పారసీక సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

అయితే వారు స్వతంత్ర దేశముగా మాత్రం కాలేదు, వారు పారసీక సామ్రాజ్యములో ఒక సంస్థానమైయ్యారు. ఇది రెండు వందల సంవత్సరముల పాటు కొనసాగింది మరియు కాలక్రమములో గులాబీ రంగులో ఉంది. ఈ కాలములో యూదుల దేవాలయము (దీనిని రెండవ దేవాలయము అని పిలుస్తారు) మరియు యెరూషలేము పట్టణము పునర్నిమించబడ్డాయి. ఇశ్రాయేలుకు తిరిగివచ్చుటకు యూదులకు అనుమతి ఇవ్వబడినప్పటికీ, అనేకమంది చెరలోనే విదేశాలలో ఉండిపోయారు.

గ్రీకుల కాలము

అలెగ్జాండర్ మహా చక్రవర్తి పారసీకుల సామ్రాజ్యమును జయించి మరొక రెండు వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలును గ్రీకు సామ్రాజ్యములో ఒక సంస్థానముగా చేశాడు. ఇది నిండు నీలము రంగులో చూపించబడింది.

గ్రీకు సామ్రాజ్యములలో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల కాలము

తరువాత రోమీయులు గ్రీకు సామ్రాజ్యములను ఓడించి ప్రపంచ శక్తిగా ఆధిపత్యము చెలాయించారు. యూదులు మరొకసారి ఈ సామ్రాజ్యములో సంస్థానమైయ్యారు మరియు ఇది లేత పసుపు రంగులో చూపబడింది. ఈ సమయములో యేసు జీవించాడు. సువార్తలలో రోమా సైనికులు ఎందుకు ఉన్నారో ఇది వివరిస్తుంది – యేసు జీవితమునకు ముందు ఇశ్రాయేలులోని యూదులను రోమీయులు పాలించారు కాబట్టి.

రోమా సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల నాయకత్వములో యూదుల రెండవ చెర

బబులోనీయుల కాలము మొదలుకొని (క్రీ.పూ. 586) దావీదు రాజుల కాలము వలె యూదులు స్వతంత్రులుగా ఉండేవారు కాదు. స్వాతంత్ర్యమునకు ముందు బ్రిటిష్ వారు భారత దేశమును పాలించిన విధముగానే, ఇతర సామ్రాజ్యములు వారిని పాలించాయి. యూదులు దీనిని ద్వేషించి రోమా పరిపాలన మీద తిరిగిబాటు చేశారు. రోమీయులు వచ్చి యెరూషలేమును నాశనం చేసి (క్రీ.శ. 70), రెండవ దేవాలయమును కాల్చివేసి, రోమా సామ్రాజ్యమంతటిలో బానిసలుగా ఉండుటకు యూదులను చెరగొనిపోయారు. ఇది యూదుల రెండవ చెర. రోమా సామ్రాజ్యము చాలా పెద్దదిగా ఉండేది కాబట్టి, యూదులు ప్రపంచము యొక్క నలుమూలలకు చెదిరిపోయారు.

క్రీ.శ. 70లో యెరూషలేము మరియు దేవాలయమును రోమీయులు ధ్వంసం చేశారు. యూదులు ప్రపంచము నలుమూలల చెదిరిపోయారు

యూదులు సుమారుగా రెండు వేల సంవత్సరముల పాటు ఈ విధంగా నివసించారు: అన్య దేశములకు చెదిరిపోయారుగాని, ఆ దేశములవారు వారిని అంగీకరించలేదు. అనేక దేశములలో వారు తరచుగా భయంకరమైన హింసను ఎదుర్కొన్నారు. యూదుల మీద హింస ఐరోపాలో ఎక్కువగా జరిగింది. పశ్చిమ ఐరోపాలోని స్పెయిన్ దేశము మొదలుకొని రష్యా వరకు ఈ రాజ్యములలావు యూదులు భయంకరమైన పరిస్థితుల మధ్య నివసించారు. ఈ హింసలను తప్పించుకొనుటకుగాను యూదులు కొచ్చిన్ కి రావడం ఆరంభించారు. పశ్చిమ ఆసియాలోని యూదులు పదిహేడు, పద్దెనిమిదయ శతాబ్దములలో భారత దేశములోని ఇతర భాగములకు వచ్చుట ఆరంభించారు.

డేవిడ్ సస్సన్ & సన్స్ – భారత దేశములో నివసించిన ధనికులైన బఘ్దాది యూదులు

వీరిని బఘ్దాది యూదులు అని పిలచేవారు, వీరు ముంబై, ఢిల్లీ, మరియు కలకత్తా వంటి చోట్ల స్థిరపడ్డారు. క్రీ.పూ. 1500లలో మోషే ఇచ్చిన శాపములకు అనుగుణంగానే వారు జీవించడం జరిగింది.

65 ​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 

ద్వితీయోపదేశకాండము 28:65

ఇశ్రాయేలీయులకు విరోధముగా ఇవ్వబడిన శాపముల కారణంగా ప్రజలు ఇలా ప్రశ్నించుట ఆరంభించారు:

24 యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

ద్వితీయోపదేశకాండము 29:24

మరియు దీనికి జవాబు:

25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి 
26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి 
27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. 
28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. 

ద్వితీయోపదేశకాండము 29:25-28

క్రింద ఇవ్వబడిన కాలక్రమము ఈ పంతొమ్మిదివందల సంవత్సరాల కాలమును చూపుతుంది. ఇది సుదీర్ఘమైన ఎరుపు రంగు గీతలో చూపబడింది.

యూదుల యొక్క విస్తృతమైన చారిత్రిక కాలక్రమము – వారి రెండు చెర కాలములు ఇవ్వబడినవి

యూదా ప్రజలు తమ చరిత్రలో రెండు చెర కాలములను అనుభవించారు అని మీరు చూడవచ్చు, కాని రెండవ చెర మొదటి చెర కాలము కంటే చాలా సుదీర్ఘమైనదిగా ఉన్నది.

ఇరవైయ్యవ శతాబ్దపు మారణహోమం (హోలోకాస్ట్)

హిట్లర్, నాజీ జర్మనీ ద్వారా ఐరోపాలో ఉన్న యూదులందరినీ హతమార్చాలని ప్రయత్నించినప్పుడు యూదులపై హింస తారాస్థాయికి చేరింది. అతడు ఇంచుమించు సఫలీకృతుడైయ్యాడుగాని, చివరికి అతడు ఓడించబడ్డాడు మరియు యూదుల శేషము మిగిలిపోయ్యింది.

ఇశ్రాయేలు యొక్క ఆధునిక పునర్జన్మ

మాతృభూమి లేకుండా కొన్ని వేల సంవత్సరముల తరువాత ‘యూదులు’ అను వారు మిగిలియున్నారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయము. కాని ఇది మూడు వేల ఐదువందల సంవత్సరాల క్రితం మోషే వ్రాసిన చివరి మాటలను కలిగియుంటుంది. 1948లో, మోషే కొన్ని శతాబ్దముల క్రితం వ్రాసిన విధముగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆధునిక ఇశ్రాయేలు యొక్క పునర్జన్మను లోకము చవిచూసింది:

​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 
​మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 

ద్వితీయోపదేశకాండము 30:3-5

గొప్ప ప్రతిఘటన మధ్య ఈ దేశము స్థాపించబడుట కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము. చుట్టుపక్కల ఉన్న దేశములన్నీ కలిసి 1948లో … 1956లో … 1967లో మరియు 1973లో ఇశ్రాయేలు మీదికి యుద్ధమునకు వచ్చాయి. చాలా చిన్న దేశమైన ఇశ్రాయేలు కొన్ని సందర్భాలలో ఒకేసారి ఐదు దేశముల మీద యుద్ధము చేసింది. మరియు ఇశ్రాయేలు నిలువబడుట మాత్రమేగాక, దాని సరిహద్దులు పెరిగాయి. 1967లో జరిగిన ఆరురోజుల యుద్ధములో, మూడు వేల సంవత్సరముల క్రితం దావీదు స్థాపించిన దాని చారిత్రిక రాజధానియైన యెరూషలేమును ఇశ్రాయేలు తిరిగి సంపాదించుకుంది. ఇశ్రాయేలు దేశము యొక్క స్థాపనకు ఫలితంగా, మరియు ఈ యుద్దముల వలన కలిగిన పరిణామముల కారణంగా నేడు ప్రపంచములోనే అత్యంత కఠినమైన రాజకీయ సమస్యను మనము ఎదుర్కొనుచున్నాము.

మోషే ద్వారా ప్రవచించబడినట్లు మరియు ఇక్కడ మరింత స్పష్టముగా వివరించబడినట్లు, ఇశ్రాయేలు యొక్క పునర్జన్మ భారత దేశములో ఉన్న యూదులు ఇశ్రాయేలుకు తిరిగివెళ్లుటకు ఒక అవకాశమును ఇచ్చింది. తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత దేశమునకు చెందినవారైన యూదులు ఇశ్రాయేలులో ఎనబై వేల మంది ఉన్నారు మరియు నేడు భారత దేశములో కేవలం ఐదు వేల మంది యూదులు మాత్రమే మిగిలియున్నారు. మోషే ఇచ్చిన ఆశీర్వాదము ప్రకారం వారు అత్యంత ‘దూర దేశము’ల నుండి (మిజోరాం వంటి) కూడా ‘సమకూర్చబడుతున్నారు మరియు ‘తిరిగి’ తీసుకొనిరాబడుతున్నారు. దీని అంతర్భావములను యూదులు మరియు యూదులు కానివారు కూడా గమనించాలని మోషే వ్రాశాడు.

(1) డా. అవిగ్దోర్ షాచన్.  ఇన్ ది ఫుట్స్టెప్స్ ఆఫ్ ది లోస్ట్ టెన్ ట్రైబ్స్ పేజీ 261

లక్ష్మీ నుండి శివుని వరకు: శ్రీ మోషే యొక్క ఆశీర్వాదములు & శాపములు నేడు ఎలా ప్రతిధ్వనిస్తాయి

ఆశీర్వాదము మరియు అదృష్టమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు, అదృష్టము, సఫలత మరియు ఐశ్వర్య దేవతయైన లక్ష్మీ మీదికి మన ధ్యాస మళ్లుతుంది. దురాశ లేకుండా చేయు కష్టమును ఆమె దీవిస్తుంది. పాల సముద్రమును మథనం చేసిన కథలో, పవిత్రమైన పువ్వులను విసిరినప్పుడు ఇంద్రుడు చూపిన అమర్యాద వలన లక్ష్మీ స్వయంగా దేవతలను విడచి పాల సముద్రములోనికి ప్రవేశించింది. అయితే, ఆమె తిరిగి వచ్చుట కొరకు వెయ్యి సంవత్సరముల పాటు సముద్రమును మథనము చేసిన తరువాత, ఆమె పునర్జన్మలో నమ్మకమైనవారిని దీవించింది.

నాశనమును గూర్చి, పతనమును గూర్చి మరియు ధ్వంశమును గూర్చి ఆలోచన చేసినప్పుడు, శివుని యొక్క ఉగ్ర అవతారమైన, లేక శివుని యొక్క మూడవ కన్ను అయిన భైరవును మీదికి మన దృష్టి మళ్లుతుంది. ఆ కన్ను ఇంచుమించు ఎల్లప్పుడు మూయబడి ఉంటుందిగాని, దుష్టులను నాశనము చేయుటకు మాత్రం అతడు దానిని తెరుస్తాడు. ప్రజలు ఒకరి నుండి ఆశీర్వాదములను ఆశిస్తారు, మరొకరి నుండి వచ్చు శాపమును లేక నాశనమును గూర్చి భయపడతారు కాబట్టి భక్తులు లక్షీ మరియు శివుని మీద ఎక్కువ దృష్టిని పెడతారు.

ఆశీర్వాదములు & శాపములు … ఇశ్రాయేలీయులకు … మనకు ఉపదేశించుటకు.

హెబ్రీ వేదములలో బయలుపరచబడిన సృష్టికర్త దేవుడు లక్ష్మీ ద్వారా కలుగు ఆశీర్వాదములకు మరియు భైరవుడు లేక శివుని మూడవ కన్ను ద్వారా కలుగు శాపము మరియు నాశనమునకు కర్తగా ఉన్నాడు. ఇవి అతని భక్తులైన యేర్పరచబడిన జనాంగమైన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినవి. ఇవి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు నడిపించిన తరువాత వారికి పది ఆజ్ఞలను – పాపము వారి మీద ఏలుబడి చేస్తుందో లేదో తెలుపు పరిమాణము – ఇచ్చినప్పుడు ఇవ్వబడినవి. ఈ ఆశీర్వాదములు మరియు శాపములు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినవి కాని ఇతర దేశములు కూడా వీటిని గుర్తించి ఇశ్రాయేలీయులకు ఆయన ఆశీర్వాదములను ఇచ్చిన విధముగానే మనకు కూడా ఇస్తాడని గ్రహించుటకు చాలా కాలం క్రితమే ప్రకటించబడినవి. మనలో ఐశ్వర్యమును మరియు ఆశీర్వాదమును కోరుకొని, నాశనమును మరియు శాపమును తప్పించుకోవాలని కోరువారు ఇశ్రాయేలీయుల అనుభవము నుండి నేర్చుకోవచ్చు.

శ్రీ మోషే మూడు వేల ఐదు వందల సంవత్సరముల క్రితం నివసించాడు మరియు హెబ్రీ వేదములలోని మొదటి పుస్తకములను అతడు రచించాడు. అతడు వ్రాసిన చివరి పుస్తకమైన ద్వితీయోపదేశకాండములో, అతడు మరణించుటకు ముందు వ్రాసిన చివరి మాటలు ఉన్నాయి. దీనిలో ఇశ్రాయేలు ప్రజలకు అనగా యూదులకు ఇవ్వబడిన ఆశీర్వాదములు మరియు శాపములు ఉన్నాయి. ఈ ఆశీర్వాదములు మరియు శాపములు ప్రపంచ చరిత్రను రూపిస్తాయి కాబట్టి యూదులు మాత్రమేగాక ఇతర దేశములు కూడా వీటిని గుర్తించాలని మోషే వ్రాశాడు. ఈ ఆశీర్వాదములు & శాపములు భారత దేశ చరిత్ర మీద కూడా ప్రభావము చూపాయి. ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క సంపూర్ణ సూచిక ఇక్కడ ఇవ్వబడినది. వీటి సారంశము ఈ క్రింద ఇవ్వబడినది.

శ్రీ మోషే యొక్క ఆశీర్వాదములు

ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును (పది ఆజ్ఞలు) పాటించిన యెడల పొందు ఆశీర్వాదములను గూర్చి వర్నిస్తూ మోషే ఆరంభించాడు. దేవుని ఆశీర్వాదములు ఎంత గొప్పగా ఉంటాయంటే మిగిలిన దేశములన్నీ ఆయన ఇచ్చు ఆశీర్వాదములను గుర్తిస్తాయి. ఈ ఆశీర్వాదములను పొందుట ద్వారా ఇలా జరుగుతుంది:

10 భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.

ద్వితీయోపదేశకాండము 28:10

… మరియు శాపములు

అయితే, ఇశ్రాయేలీయులు ఆజ్ఞలను పాటించుటలో విఫలమైన యెడల, ఆశీర్వాదములను పోలిన విధముగానే వారు శాపములను పొందుకుంటారు. ఈ శాపములను కూడా చుట్టుపక్కల ఉన్న దేశములు చూసినప్పుడు, ఇలా జరుగుతుంది:

37 యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.

ద్వితీయోపదేశకాండము 28:37

మరియు శాపములు చరిత్రయందంతట వ్యాపిస్తాయి.

46 మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.

ద్వితీయోపదేశకాండము 28:46

అయితే ఈ శాపములలో అత్యంత ఘోరమైనవి ఇతర దేశములలో నుండి వస్తాయని కూడా దేవుడు హెచ్చరించాడు.

49 ​యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 
50 క్రూరముఖము కలిగి వృద్ధులను ¸°వనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 
51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 
52 ​మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. 

ద్వితీయోపదేశకాండము 28:49-52

అవి చెడ్డవిగా ఆరంభమై, అత్యంత ఘోరమైనవవుతాయి.

63 కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 
64 ​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 
65 ​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 

ద్వితీయోపదేశకాండము 28:63-65

దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య అధికారిక ఒప్పందము ద్వారా ఆశీర్వాదములు మరియు శాపములు స్థాపించబడతాయి:

13 నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. 
14 నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను 
15 ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. 

ద్వితీయోపదేశకాండము 29:13-15

ఈ నిబంధన పిల్లలకు, లేక భవిష్యత్ తరములకు కూడా వర్తిస్తుంది. వాస్తవానికి ఈ నిబంధన భవిష్యత్ తరముల కొరకు – ఇశ్రాయేలీయులు మరియు పరదేశీయులు – కూడా ఇవ్వబడింది.

22 కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి 
23 వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి 
24 యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. 

ద్వితీయోపదేశకాండము 29:22-24

దీనికి జవాబు:

25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి 
26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి 
27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. 
28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. 

ద్వితీయోపదేశకాండము 29:25-28

ఆశీర్వాదములు మరియు శాపములు కలిగాయా?

ఆశీర్వాదములు ఆనందకరమైనవి, మరియు శాపములు ఘోరమైనవి, కాని మనము అడగవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమనగా: “అవి అసలు జరిగాయా?” హెబ్రీ వేదములలోని పాత నిబంధన భాగములోని ఎక్కువ శాతము ఇశ్రాయేలీయుల చరిత్రను నమోదు చేస్తుంది, కాబట్టి వారి చరిత్ర మనకు తెలుసు. పాత నిబంధన కాకుండా ఇతర చారిత్రిక నివేదికలు మరియు అనేక పురావస్తుశాస్త్ర ఆధారములు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇశ్రాయేలు లేక యూదుల చరిత్రను గూర్చి ఒక స్థిరమైన నివేదికను ఇస్తాయి. ఒక కాలక్రమము ద్వారా అది ఇక్కడ ఇవ్వబడినది. మోషే సెలవిచ్చిన శాపములు సంభవించాయో లేదో మీరు స్వయంగా చదివి తెలుసుకోండి. 2700 సంవత్సరముల క్రితము నుండి యూదుల గుంపులు (ఉదా. మిజోరాంలోని బెని మెనషే) భారత దేశములోనికి ఎందుకు వలస వెళ్లాయో ఇది వివరిస్తుంది. ఖచ్చితముగా మోషే హెచ్చరించిన విధముగానే ఆష్షురు, బబులోను దేశములు దాడి చేయుట వలన వారు భారత దేశమునకు చెదిరిపోయారు.

మోషే ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క ముగింపు

మోషే చివరి మాటలు శాపములతో ముగియలేదు. ఈ విధంగా మోషే తన చివరి ప్రకటనను చేశాడు.

నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన 
సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్త మునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల 
​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 
​మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 

ద్వితీయోపదేశకాండము 30:1-5

కొన్ని వేల సంవత్సరముల పాటు చెరలో ఉండిన తరువాత, 1948లో – నేడు జీవించున అనేకమంది జీవిత కాలములోనే – ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయము ద్వారా ఆధునిక ఇశ్రాయేలు దేశము పునర్జన్మించింది మరియు ప్రపంచ దేశములలో నుండి యూదులు ఇశ్రాయేలుకు తిరిగివెళ్లుట ఆరంభించారు – ఇది కూడా మోషే ప్రవచించినట్లే జరిగింది. నేడు భారత దేశములో, కొచ్చిన్ మరియు మిజోరాంలో ఉన్న వేల సంవత్సరముల యూదుల సమాజములు అంతరించిపోతున్నాయి, ఎందుకంటే యూదులు తమ పితరుల దేశమునకు తిరిగివెళ్లిపోతున్నారు. నేడు భారత దేశములో కేవలం ఐదు వేల మంది యూదులు మాత్రమే మిగిలియున్నారు. శాపములు వారి చరిత్రను రూపించిన విధముగానే మన కన్నుల ఎదుట మోషే ఆశీర్వాదములు కూడా నెరవేర్చబడుతున్నాయి.

ఇవి మన కొరకు అనేక అంతర్భావములను కలిగియున్నాయి. మొదటిగా, ఆశీర్వాదములు మరియు శాపములకు అధికారము మరియు శక్తి దేవుని యొద్ద నుండి కలుగుతుంది.మోషే కేవలం జ్ఞానోదయమును పొందిన సందేశకుడు లేక ఋషి మాత్రమే. ఈ శాపములు మరియు ఆశీర్వాదములు ప్రపంచములోని అనేక దేశములకు వేల సంవత్సరములుగా వ్యాపిస్తు, కొన్ని కోట్ల మందిని ప్రభావితము చేస్తున్నాయి అను సత్యము (యూదులు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చుట ఒక అల్లకల్లోలమును సృష్టించింది- మరియు తరచుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించు కార్యములు అక్కడ జరుగుతున్నాయి) –ఈ దేవునికి బైబిలు (వేద పుస్తకము) తెలియజేయు శక్తి మరియు అధికారము ఉన్నదని రుజువు చేస్తుంది. అవే హెబ్రీ వేదములలో ‘భూమి మీద ఉన్న ప్రజలందరు’ దీవించబడతారని కూడా ఆయన వాగ్దానము చేశాడు. ‘భూమి మీద ఉన్న ప్రజలందరిలో” మీరు నేను కూడా ఉన్నాము. మరలా అబ్రాహాము కుమారుని బలి అర్పించు సందర్భములో కూడా, ‘దేశములన్నీ దీవించబడతాయి’ అని దేవుడు పునరుధ్ఘాటించాడు. ఈ బలి యొక్క స్థలము మరియు వివరములు ఈ ఆశీర్వాదమును ఎలా పొందుకోవాలో తెలుసుకొనుటలో మనకు సహాయం చేస్తాయి. మిజోరాం, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ నుండి తిరిగివచ్చుచున్న యూదుల మీద కుమ్మరించబడు ఆశీర్వాదములను, ఆయన వాగ్దానము చేసిన విధముగా దేవుడు భారత దేశములోని రాష్ట్రములన్నిటికి మరియు ప్రపంచములోని ఇతర దేశములకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడనుటకు చిహ్నముగా ఉన్నది. యూదుల వలె, మన శాపము మధ్యలో మనకు కూడా ఆశీర్వాదములు వాగ్దానము చేయబడినవి. మనము ఆశీర్వాదము అను బహుమానమును ఎందుకు పొందుకోకూడదు?

యోం కిప్పుర్ – అసలైన దుర్గా పూజ

దుర్గా పూజ (లేక దుర్గోత్సవము) అశ్విని మాసములోని 6-10 దినములలో దక్షిణ ఆసియా ప్రాంతములోని అనేక చోట్ల జరపబడుతుంది. దుర్గా దేవి ప్రాచీన కాలములో అసురుడైన మహిషాసురుడుతో చేసిన యుద్ధములో పొందిన జయమును జ్ఞాపకము చేసుకొనుటకు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ మూడు వేల ఐదువందల సంవత్సరముల క్రితం ఆరంభమై, హెబ్రీ సంవత్సరములోని ఏడవ చంద్రమాన మాసములోని పదియవ రోజున జరుపుకొను మరింత ప్రాచీన పండుగయైన యోం కిప్పుర్ ను (లేక ప్రాయశ్చిత్త దినము) పోలియున్నదని చాలామంది భక్తులు గ్రహించరు. ఈ రెండు పండుగలు ప్రాచీనమైనవి, మరియు ఈ రెండు పండుగలు తమ తమ క్యాలెండర్లలో ఒకే దినమున జరుపబడతాయి (హిందు మరియు హెబ్రీ క్యాలెండర్లలో అదనపు లీప్ మాసము వేర్వేరు సంవత్సరములలో ఉంటుంది, కాబట్టి ఇవి పాశ్చాత్య క్యాలెండర్ లో ఒకే దినమున జరుపబడవు, కాని ఇవి ఎల్లప్పుడు సెప్టెంబర్-అక్టోబర్ మాసములలో జరుపబడతాయి), ఈ రెంటిలో బలులు ఉన్నాయి, మరియు ఈ రెండు గొప్ప విషయములను జ్ఞాపకము చేసుకుంటాయి. దుర్గా పూజ మరియు యోం కిప్పుర్ ల మధ్య ఉన్న పోలికలు ఆశ్చర్యకరమైనవి. కొన్ని భిన్నత్వములు కూడా అంతే ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి.

ప్రాయశ్చిత్త దినము పరిచయం చేయబడుట

మోషే మరియు అతని సహోదరుడైన అహరోను ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించారు మరియు యేసు జననమునకు పదిహేను వందల సంవత్సరముల మునుపు ధర్మశాస్త్రమును పొందుకున్నారు 

కలియుగములో ఇశ్రాయేలీయులను (హెబ్రీయులు లేక యూదులు) బానిసత్వము నుండి విడిపించి వారిని నడిపించుటకు పది ఆజ్ఞలను పొందుకున్న శ్రీ మోషేను గూర్చి మనము ఇంతకు ముందు చూశాము. ఆ పది ఆజ్ఞలు చాలా కఠినమైనవి, మరియు ఒక పాపము ద్వారా ప్రేరేపించబడు వ్యక్తి వాటిని పాటించుట అసాద్యము. ఈ ఆజ్ఞలను నిబంధన మందసము అని పిలువబడు ఒక విశేషమైన పెట్టెలో పెట్టారు. ఈ నిబంధన మందసము అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడు ఒక విశేషమైన దేవాలయములో ఉంచబడింది.

మోషే సహోదరుడైన అహరోను మరియు అతని వారసులు ప్రజల పాపములను కప్పుపుచ్చుటకు లేక ప్రాయశ్చిత్తము చెల్లించుటకు ఈ దేవాలయములో పూజారులుగా బలులు అర్పించేవారు. యోం కిప్పుర్ – ప్రాయశ్చిత్త దినమున విశేషమైన బలులు అర్పించబడేవి. ఇవి నేడు మనకు విలువైన పాఠములైయున్నవి, మరియు ప్రాయశ్చిత్త దినమును (యోం కిప్పుర్) దుర్గాపూజలోని ఆచారములతో పోల్చుట ద్వారా మనము అనేక విషయములను నేర్చుకోవచ్చు.

ప్రాయశ్చిత్త దినము మరియు విడిచిపెట్టబడు మేక (బలిపశువు)

హెబ్రీ వేదములు, అనగా నేటి బైబిలు, ప్రాయశ్చిత్త దినమున అర్పించవలసిన బలులు మరియు చేయవలసిన ఆచారములను గూర్చి మోషే దినముల నుండే ఖచ్చితమైన హెచ్చరికలను ఇచ్చింది. ఈ హెచ్చరికలు ఏ విధంగా ప్రారంభమైయ్యాయో మనము చూస్తాము:

అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను
​నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. 

లేవీయకాండము 16:1-2 

ప్రాధాన పూజారియైన అహరోను యొక్క ఇద్దరు కుమారులు దేవుని సన్నిధి ఉన్న అతిపరిశుద్ధ స్థలములోనికి అమర్యాదగా ప్రవేశించినప్పుడు, వారిద్దరు మరణించారు. పది ఆజ్ఞలను పూర్తిగా పాటించుటలో విఫలమైనందున ఆ పరిశుద్ధ సన్నిధిలో వారు మరణించారు.  

కాబట్టి జాగ్రత్తతో కూడిన హెచ్చరికలు ఇవ్వబడినవి, దీనిలో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన పూజారి సంవత్సరములో ఒక్కసారి మాత్రమే ప్రవేశించగల దినము కూడా ఇవ్వబడినది – అదే ప్రాయశ్చిత్త దినము. వేరొక దినమున అతడు ప్రవేశిస్తే, అతడు నిశ్చయముగా మరణిస్తాడు. అయితే ఈ దినమున కూడా, నిబంధన మందసము ఉన్న స్థలములోనికి ప్రవేశించుటకు ముందు ప్రధాన పూజారి ఈ విధంగా చేయవలసి ఉండేది:

అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.
అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను. 

లేవీయకాండము 16: 3-4

దుర్గా పూజ యొక్క సప్తమి రోజున, ప్రాణ ప్రతిష్టన్ ద్వారా దుర్గా దేవి విగ్రహములలోనికి ఆహ్వానించబడుతుంది మరియు తరువాత విగ్రహమును కడిగి, వస్త్రములను ధరింపజేస్తారు. యోం కిప్పుర్ లో కూడా స్నానము చేయబడుతుంది, కాని దేవుడు గాక ప్రధాన పూజారి స్నానము చేసి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లుటకు సిద్ధపడతాడు. దేవుడైన యెహోవాను ఆహ్వానించవలసిన అవసరం ఉండేది కాదు – ఎందుకంటే అతిపరిశుద్ధ స్థలములో ఆయన సన్నిధి సంవత్సరము అంతా ఉండేది. కాబట్టి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుటకు సిద్ధపడవలసిన అవసరత ఉండేది. స్నానము చేసి, వస్త్రములు ధరించిన తరువాత, పూజారి బలులను అర్పించుటకు జంతువులను తేవలసియుండేది.

మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. 
అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి 

లేవీయకాండము 16: 5-6

కప్పుటకు, లేక, ప్రాయశ్చిత్తము చెల్లించుటకు అహరోను కుమారులు ఒక ఎద్దును బలి అర్పించేవారు. దుర్గా పూజ సమయములో కూడా ఎద్దు లేక మేకల బలులు అర్పించబడతాయి. యోం కిప్పుర్ విషయములో, పూజారి యొక్క సొంత పాపములను కప్పిపుచ్చుకొనుటకు ఒక ఎద్దును బలి అర్పించుట ఒక ఎంపిక మాత్రమే కాదు. పూజారి తన పాపమును బలి ద్వారా కప్పుకొనకపోతే అతడు నిశ్చయముగా మరణిస్తాడు.

తరువాత వెంటనే, యాజకుడు ఒక ప్రత్యేకమైన రెండు మేకల సంస్కారమును జరిగించేవాడు.

ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. 
అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక1 పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను. 
ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. 

లేవీయకాండము 16: 7-9

తన సొంత పాపముల కొరకు ఎద్దును అర్పించిన తరువాత, పూజారి రెండు మేకలను తీసుకొని చీట్లు వేసేవాడు. ఒక మేకను విడిచిపెట్టబడు మేకగా లేక బలిపశువుగా నిర్ధారించేవాడు. మరొక మేక పాపపరిహారార్థబలిగా వధించబడేది. ఎందుకు?

15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. 
16 అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. 

లేవీయకాండము 16: 15-16

విడిచిపెట్టబడిన మేకకు లేక బలిపశువుకు ఏమవుతుంది?

20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. 
21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. 
22 ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్ట వలెను. 

లేవీయకాండము 16: 20-22

ఎద్దు బలి అహరోను సొంత పాపముల కొరకు అర్పించబడేది. మొదటి మేక యొక్క బలి ఇశ్రాయేలు ప్రజల పాపముల కొరకు అర్పించబడేది. తరువాత సజీవమైన బలి పశువు తల మీద అహరోను తన చేతులను ఉంచి – చిహ్నాత్మకముగా – ప్రజల పాపములను దాని మీదికి నెట్టేవాడు. తరువాత ప్రజల పాపములు వారి యొద్ద నుండి దూరమైపోయాయి అని చూపుటకు చిహ్నాత్మకముగా ఆ మేకను అరణ్యములోనికి తోలివేసేవారు. ఇలా ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్త దినమున, అనగా ప్రాయశ్చిత్త దినమున మాత్రమే చేసేవారు.

ప్రాయశ్చిత్త దినము మరియు దుర్గా పూజ

ప్రతి సంవత్సరము ఈ రోజున మాత్రమే ఈ పండుగను జరపాలని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? దీని అర్థము ఏమిటి? దుర్గా పూజ దుర్గా గేదె రాక్షసుడైన మహిషాసురుని జయించిన దినమును జ్ఞాపకము చేసుకుంటుంది. ఇది మునుపు జరిగిన సన్నివేశమును జ్ఞాపకము చేసుకుంటుంది.  ప్రాయశ్చిత్త దినము కూడా జయమును జ్ఞాపకము చేసుకుంటుంది గాని, భవిష్యత్తులో కలుగు జయమును జ్ఞాపకము చేసుకుంటుంది. నిజమైన జంతు బలులను వారు అర్పించేవారుగాని, అవి కూడా చిహ్నాత్మకముగానే ఉన్నాయి. వేద పుస్తకము (బైబిలు), దీనిని వివరిస్తుంది 

ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 

హెబ్రీయులకు 10:4

ప్రాయశ్చిత్త దినమున అర్పించబడు బలులు యాజకుడు మరియు భక్తుల యొక్క పాపములను పూర్తిగా తీసివేయలేవు కాబట్టి, వాటిని ప్రతి సంవత్సరము ఎందుకు అర్పించేవారు? వేద పుస్తకము (బైబిలు), ఇలా వివరిస్తుంది

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.
ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. 
అయితే ఆ బలులు అర్పిం చుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి 

హెబ్రీయులకు 10:1-3

బలులు పాపములను పూర్తిగా శుద్ధి చేయగలిగితే, వాటిని మరలా మరలా అర్పించవలసిన అవసరత ఉండేది కాదు. కాని అవి ప్రతి ఏటా పునరావృతం చేయబడేవి కాబట్టి, అవి ప్రభావవంతమైనవి కావని అర్థమవుతుంది.

కాని యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు ఇది మారిపోయింది.

కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. 
పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. 
అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. 

హెబ్రీయులకు 10:5-7

ఆయన తనను తాను బలిగా అర్పించుకొనుటకు వచ్చాడు. మరియు ఆయన అలా బలి అర్పించినప్పుడు

10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 

హెబ్రీయులకు 10: 10

రెండు మేకల యొక్క బలులు చిహ్నాత్మకముగా భవిష్యత్ బలి మరియు యేసు యొక్క విజయము వైపునకు చూపాయి. ఆయన బలి అర్పించబడ్డాడు కాబట్టి బలి అర్పించబడిన మేక ఆయనే. బలిపశువు లేక విడిచిపెట్టబడిన మేక కూడా ఆయనే, ఎందుకంటే ఆయన సర్వలోక సమాజము యొక్క పాపములను తన మీద వేసుకొని, మనము శుద్ధిచేయబడునట్లు వాటిని మన నుండి దూరము చేశాడు.

ప్రాయశ్చిత్త దినము దుర్గా పూజకు కూడా కారణమైయ్యిందా?

ఇశ్రాయేలు నుండి ప్రవాసీయులు క్రీ.పూ 700లలో భారతా దేశమునకు వచ్చిన విధానమును, మరియు భారత దేశములోని మతములు మరియు విద్యల మీద వారు చూపిన ప్రభావమును గూర్చి మనము ఇశ్రాయేలీయుల చరిత్రలో చూశాము.  ఈ ఇశ్రాయేలీయులు ప్రతి ఏటా ఏడవ నెల పదియవ దినమున ప్రాయశ్చిత్త దినమును జరుపుకునేవారు. భారత దేశములోని భాషలకు వారు తోడ్పాటును ఇచ్చిన విధముగానే, వారు తమ ప్రాయశ్చిత్త దినమును కూడా ఇచ్చారు, అది చెడు మీద గొప్ప విజయమును జ్ఞాపకము చేసుకొను దుర్గా పూజగా మారింది. ఈ ఆలోచన దుర్గా పూజను గూర్చి మనము కలిగియున్న చారిత్రిక అవగాహనకు సరిపోతుంది, దుర్గా పూజ క్రీ.పూ. 600లలో ఆరంభమైయ్యింది.

ప్రాయశ్చిత్త దిన బలులు ఆగిపోయినప్పుడు

మన కొరకు యేసు (యేసు సత్సంగ్) అర్పించిన బలి ప్రభావవంతమైనది మరియు పరిపూర్ణమైనది. యేసు సిలువ మీద బలిగావించబడిన (క్రీ.శ. 33) తరువాత, కొంత కాలమునకు రోమీయులు క్రీ.శ. 70లో అతిపరిశుద్ధ స్థలమున్న దేవాలయమును ధ్వంసం చేశారు. ఆ దినము తరువాత నేటి వరకు యూదులు ఎన్నడు కూడా ప్రాయశ్చిత్త దినమున బలులను అర్పించలేదు. నేడు, యూదులు ఉపవాసముండుట ద్వారా ఈ దినమును ఆచరిస్తారు. బైబిలు వివరించుచున్నట్లు, ఒక ప్రభావవంతమైన బలి అర్పించబడిన తరువాత జంతువుల బలులను అర్పించుటను కొనసాగించవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుడు వాటిని ఆపివేశాడు.

దుర్గా పూజ మరియు ప్రాయశ్చిత్త దినమున విగ్రహములు

విగ్రహములో దేవత నివసించునట్లు దుర్గా పూజ దినమున దుర్గా దేవి ఆహ్వానించబడుతుంది. ప్రాయశ్చిత్త దినము రానున్న బలిని గూర్చి జ్ఞాపకము చేసుకునేది కాబట్టి, దానిలో ఏ విగ్రహమును పెట్టేవారు కాదు. అతిపరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు అదృశ్యుడు కాబట్టి, దానిలో ఎలాంటి విగ్రహము ఉండేది కాదు.  

కాని, ముందుగానే కొన్ని వందల సంవత్సరముల పాటు జరుపబడిన ప్రాయశ్చిత్త దినములు చూపిన విధముగా సార్థకమైన బలి అర్పించినప్పుడు ఒక చిత్రము జ్ఞాపకము చేసుకొనబడింది. వేద పుస్తకము (బైబిలు) వివరించునట్లు

15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

కొలస్సయ్యులకు 1:15

సార్థకమైన బలి అర్పించినప్పుడు, అదృశ్యుడైన దేవుని స్వరూపము జ్ఞాపకము చేసుకొనబడింది, ఆయనే యేసు అను నరుడు.

పరిస్థితిని సమీక్షించుట

మనము వేద పుస్తకమును (బైబిలు) అధ్యయనం చేస్తున్నాము. ఆయన ప్రణాళికను బయలుపరచుటకు దేవుడు అనేక చిహ్నములను ఇచ్చాడని మనము చూశాము. ఆదియందు ఆయన రానున్న ‘ఆయన’ను గూర్చి ప్రవచించాడు. దాని తరువాత శ్రీ అబ్రాహాము అర్పించిన బలి, పస్కా బలి, మరియు ప్రాయశ్చిత్త దినమును చూస్తాము. ఇశ్రాయేలీయుల మీద మోషే యొక్క ఆశీర్వాదములు మరియు శాపములు కూడా తరువాత ఉన్నాయి. ఇది వారి చరిత్రను కొనసాగిస్తు ఇశ్రాయేలీయులను ప్రపంచమంతా చెదరగొట్టింది, మరియు ఇక్కడ వివరించబడినట్లు భారత దేశములోనికి కూడా చెదరగొట్టింది.

సూర్యుని క్రింద జీవిత సంతృప్తిని కనుగొనుటకు ప్రయత్నించుట మాయ

మాయ అను సంస్కృతము పదమునకు ‘లేనిది’ అని అర్థము, కాబట్టి ఇది “వంచన’ అయ్యున్నది. పలువురు సాధువులు మరియు గురుకులములు మాయలో ఉన్న వంచనను పలు విధాలుగా వర్ణించారు, కాని సామాన్యముగా భౌతిక వస్తువులు మన ఆత్మను తప్పుదోవ పట్టించి మనలను బానిసత్వములో బంధించగలవు అను ఆలోచనను వ్యక్తపరచారు. మన ఆత్మ భౌతిక వస్తువులను నియంత్రించి, వాటిని ఆస్వాదించాలని ఆశపడుతుంది. అయితే, అలా చేయడం ద్వారా మనము దురభిలాష, లోభము మరియు కోపమును సేవించుట ఆరంభిస్తాము. తరువాత మనము మన ప్రయత్నములను ముమ్మరము చేసి, తప్పు మీద తప్పు చేసి, మాయ లేక వంచనలో మరింత లోతుగా కూరుకొనిపోతాము. ఈ విధంగా మాయ ఒక సుడిగాలి వలె పని చేసి, మరింత బలమును పొందుకొని, ఒక వ్యక్తిని మరింత బిగపట్టి నిరాశలోనికి నడిపిస్తుంది. తాత్కాలికమైన దానిని శాశ్వతమైన విలువ కలిగినదిగా పరిగణించి, లోకము అందించలేని నిత్యమైన ఆనందమును వెదకునట్లు మాయ చేస్తుంది.

జ్ఞానమును గూర్చి వ్రాయబడిన ఒక అద్భుతమైన తమిళ పుస్తకము, తిరుక్కురళ్, మాయను గూర్చి మరియు మన మీద మాయ యొక్క ప్రభావమును గూర్చి ఈ విధంగా వర్ణిస్తుంది:

“ఒకడు తన బంధములను హత్తుకొనియుండి, వాటిని విడిచిపెట్టుటకు ఇష్టపడనప్పుడు, దుఖములు కూడా వానిని విడువక పట్టుకుంటాయి.”

తిరుక్కురళ్ 35.347–348

హెబ్రీ వేదములలో కూడా తిరుక్కురళ్ ను పోలిన జ్ఞాన సాహిత్యము ఉన్నది. ఈ జ్ఞాన సాహిత్యము యొక్క రచయిత పేరు సొలొమోను. అతడు ‘సూర్యుని క్రింద’ నివసించుచున్నప్పుడు అనుభవించిన మాయను మరియు దాని ప్రభావములను జ్ఞాపకము చేసుకున్నాడు – అనగా, భౌతిక వస్తువులకు మాత్రమే విలువ ఉన్నదని అన్నట్లు జీవిస్తూ, సూర్యుని క్రింద భౌతిక లోకములో నిలిచియుండు ఆనందము కొరకు వెదకుట.

‘సూర్యుని క్రింద’ సొలొమోను మాయను అనుభవించుట

తన జ్ఞానమును బట్టి సుప్రసిద్ధుడైన పురాతన రాజైన సొలొమోను సుమారుగా క్రీ. పూ. 950 కాలములో బైబిలులోని పాత నిబంధనలో భాగమైన అనేక పద్యములను వ్రాశాడు. ప్రసంగి గ్రంథములో, జీవితములో సంతృప్తిని పొందుటకు అతడు చేసిన ప్రయత్నములన్నిటిని గూర్చి వర్ణించాడు. అతడు ఇలా వ్రాశాడు:

  నీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయ ముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.
2 నవ్వుతోనీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతోనీచేత కలుగునదేమియనియు నేవంటిని.
3 నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.
4 ​నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
5 నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
6 వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
7 ​పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
8 నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
9 నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.
10 నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.

ప్రసంగి 2:1-10

ధనము, ఖ్యాతి, జ్ఞానము, గొప్ప కట్టడములు, స్త్రీలు, సుఖము, రాజ్యము, మంచి ఉద్యోగము, ద్రాక్షరసము… సొలొమోను ఇవన్నీ అనుభవించాడు – మరియు లోకములో ఇప్పటి వరకు జీవించిన ప్రజలందరి కంటే ఎక్కువ అనుభవించాడు. ఐంస్టీన్ వంటి జ్ఞానము, లక్ష్మీ మిట్టల్ వంటి ఐశ్వర్యము, ఒక బాలీవుడ్ స్టార్ వంటి సామాజిక/లైంగిక జీవితము, మరియు బ్రిటిష్ రాజ కుటుంబములోని ప్రిన్స్ విలియం వంటి రాజరికము – అన్ని కలిపి ఒక వ్యక్తిలో మిళితమైయ్యాయి. ఇట్టి వ్యక్తిని ఎవరు జయించగలరు? అతడు ప్రజలందరిలో ఇంత సంతృప్తిపరుడు అని మీరు అనుకోవచ్చు.

అతడు వ్రాసిన మరొక పద్యముల పుస్తకమైన పరమగీతములో, ఇది కూడా బైబిలులో ఉన్నది, అతడు తాను అనుభవించుచున్న ఒక శృంగారకరమైన ప్రేమ-వ్యవహారమును గూర్చి వ్రాశాడు – జీవిత కాల సంతృప్తిని కలిగిస్తుంది అనిపించు విషయము. పూర్తి పద్యము ఇక్కడ ఉన్నది. అయితే అతనికి మరియు అతని ప్రేయసికి మధ్య జరిగిన ప్రేమ సంభాషణ పద్యములోని ఒక భాగము క్రింద ఇవ్వబడింది

పరమగీతము యొక్క సారాంశము

 

అతను
9 నా ప్రియమైన, నిన్ను ఒక మరేతో పోలుస్తున్నాను
ఫరో యొక్క రథం గుర్రాలలో.
10 మీ బుగ్గలు చెవిపోగులతో అందంగా ఉన్నాయి,
ఆభరణాల తీగలతో మీ మెడ.
11 మేము మీకు బంగారు చెవిపోగులు చేస్తాము,
వెండితో నిండి ఉంది.

ఆమె
12 రాజు తన బల్ల వద్ద ఉన్నప్పుడు,
నా పరిమళం దాని సువాసనను వ్యాప్తి చేసింది.
13 నా ప్రియమైన నాకు మిర్రల సాచెట్
నా రొమ్ముల మధ్య విశ్రాంతి.
14 నా ప్రియమైన నాకు గోరింట వికసిస్తుంది
ఎన్ గెడి యొక్క ద్రాక్షతోటల నుండి.

అతను
15 నా ప్రియమైన, మీరు ఎంత అందంగా ఉన్నారు!
ఓహ్, ఎంత అందంగా ఉంది!
మీ కళ్ళు పావురాలు.

ఆమె
16 ప్రియమైన, నీవు ఎంత అందంగా ఉన్నావు!
ఓహ్, ఎంత మనోహరమైనది!
మరియు మా మంచం ప్రశాంతంగా ఉంది.

అతను

17 మా ఇంటి కిరణాలు దేవదారు;
మా తెప్పలు ఫిర్లు.

ఆమె

3 అడవి చెట్ల మధ్య ఆపిల్ చెట్టులా
యువకులలో నాకు ప్రియమైనది.
నేను అతని నీడలో కూర్చోవడం ఆనందంగా ఉంది,
మరియు అతని పండు నా రుచికి తీపిగా ఉంటుంది.
4 అతను నన్ను విందు హాలుకు నడిపించనివ్వండి,
మరియు నాపై అతని బ్యానర్ ప్రేమగా ఉండనివ్వండి.
5 ఎండుద్రాక్షతో నన్ను బలోపేతం చేయండి,
ఆపిల్లతో నన్ను రిఫ్రెష్ చేయండి,
నేను ప్రేమతో మూర్ఛపోతున్నాను.
6 అతని ఎడమ చేయి నా తల క్రింద ఉంది,
అతని కుడి చేయి నన్ను ఆలింగనం చేస్తుంది.
7 యెరూషలేము కుమార్తెలు, నేను నిన్ను వసూలు చేస్తున్నాను
గజెల్స్ మరియు ఫీల్డ్ యొక్క పనుల ద్వారా:
ప్రేమను రేకెత్తించవద్దు లేదా మేల్కొల్పవద్దు
అది కోరుకునే వరకు.

పరమగీతము 1:9 – 2:7

సుమారుగా మూడు వేల సంవత్సరముల క్రితం వ్రాయబడిన ఈ పద్యములో, ఒక ఉత్తమమైన బాలీవుడ్ చలనచిత్రములో కనిపించు శృంగార తీక్ష్ణత ఉన్నది. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యముతో అతడు ఏడు వందల మంది ఉంపుడుగత్తెలను పొందుకున్నాడని బైబిలు నివేదిస్తుంది! అత్యంత ప్రఖ్యాతిగాంచిన బాలీవుడ్ లేక హాలీవుడ్ ప్రేమికులు ఏనాడు పొందలేని సంఖ్య ఇది. కాబట్టి ఇంత ప్రేమను పొందుకొని అతడు సంతృప్తి కలిగి జీవించాడు అని మీరనుకోవచ్చు. అయితే ఇంత ప్రేమ, ఇంత ఐశ్వర్యము, ప్రఖ్యాతి మరియు జ్ఞానము పొందియుండిన తరువాత కూడా – అతడు జీవితాన్ని ఇలా క్రోడీకరించాడు:

  వీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.
2 వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
3 ​సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
4 ​తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.
5 ​సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.
6 ​గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.
7 ​నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును
8 ​​ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.
9 మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.
10 ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.
11 పూర్వులు జ్ఞాపక మునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.
12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని.
13 ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
14 ​సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.

ప్రసంగి 1:1-14

  11 ​అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
12 రాజు తరువాత రాబోవు వాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించు టకై పూనుకొంటిని.
13 అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయో జనకరమని నేను తెలిసికొంటిని.
14 ​జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని.
15 కావున బుద్ధి హీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే.
16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దిన ములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే.
17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.
18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.
19 వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.
20 కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.
21 ​ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.
22 ​సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
23 ​వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియం దైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే.

ప్రసంగి 2:11-23

ఆహ్లాదము, ఐశ్వర్యము, మంచి ఉద్యోగము, ప్రగతి, శృంగార ప్రేమలో అనుభవించు ఉన్నతమైన సంతృప్తి కూడా మాయయే అని అతడు చూపాడు. కాని నేడు కూడా సంతృప్తిని పొందుటకు ఇదే ఖచ్చితమైన మార్గమని మనము వింటుంటాము. వీటి ద్వారా సొలొమోను సంతృప్తిని పొందలేదు అని అతడు వ్రాసిన పద్య భాగము ఇంతకు ముందే మనకు చెప్పింది.

సొలొమోను అతని పద్యములను కొనసాగిస్తూ మరణము మరియు జీవితమును విశ్లేషించాడు:

  19 నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.
20 ​సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
21 ​నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?

ప్రసంగి 3:19-21

  2 సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
3 అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
4 బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.
5 బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

ప్రసంగి 9:2-5

ఐశ్వర్యము మరియు ప్రేమను అన్వేషించుటను గూర్చిన పద్యములు – వీటిని సాధారణంగా మనము అపవిత్రమైనవిగా చూస్తాము – పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఎందుకు వ్రాయబడ్డాయి? పవిత్ర గ్రంథములు సన్యాసులుగా జీవించుటను గూర్చి, ధర్మమును గూర్చి, మరియు నైతిక విలువలను గూర్చి మాట్లాడాలని మనము ఆశిస్తాము. మరియు బైబిలులోని సొలొమోను మరణమును గూర్చి అంతిమగమ్యముగాను మరియు నిరాశాజనకముగాను ఎందుకు వ్రాశాడు?

సొలొమోను అనుసరించిన మార్గము, ఇది లోకములో ఎక్కువ మంది అనుసరించు మార్గము, స్వయం కొరకు జీవించు, మరియు తన సుఖము మరియు సంతోషము కొరకు తనకు నచ్చిన విధానములను అనుసరించు మార్గమైయున్నది. కాని సొలొమోను అనుభవించిన అంతము అంత మంచిది కాదు – సంతృప్తి తాత్కాలికమైనది మరియు వంచనయైయున్నది. అతని పద్యములు బైబిలులో ఒక పెద్ద హెచ్చరికగా ఉన్నాయి – “అక్కడకి వెళ్లవద్దు – అది మిమ్మును నిరుత్సాహపరుస్తుంది!” ఇంచుమించు మనమంతా సొలొమోను అనుసరించిన మార్గములో వెళ్లుటకు ప్రయత్నిస్తాము కాబట్టి, అతని మాటలు వింటే మనము జ్ఞానవంతులమవుతాము.

సువార్తసొలొమోను పద్యములకు జవాబిచ్చుట

బైబిలులో ప్రస్తావించబడిన వారందరిలో యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) అత్యంత సుపరిచితమైన వ్యక్తి. ఆయన కూడా జీవితమును గూర్చి వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు

“… జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని”

యోహాను 10:10

 

28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.     

మత్తయి 11:28-30

యేసు ఇలా చెప్పినప్పుడు సొలొమోను తన పద్యములలో వ్రాసిన వ్యర్థతకు మరియు నిరాశకు జవాబిచ్చాడు. సొలొమోను అనుసరించిన మరణ-మార్గమునకు ఇది జవాబు కావచ్చు. ఎందుకంటే, సువార్తకు అర్థము ‘శుభవార్త’ కదా. సువార్త నిజముగా శుభవార్త అయ్యున్నదా? దీనికి జవాబును తెలుసుకొనుటకు మనకు సువార్తను గూర్చి కొంత అవగాహన కావాలి. మరియు సువార్తలో చెప్పబడిన విషయములను మనము పరీక్షించాలి – అవివేకముగా విమర్శించుటకు బదులుగా, సువార్తను గూర్చి క్షుణ్ణంగా ఆలోచనచేయాలి.

నేను నా గాధలో వివరించినట్లు, నేను కూడా ఇదే మార్గమును అనుసరించాను. మీరు కూడా వీటిని పరీక్షించుటను ఆరంభించుటకు ఈ వెబ్సైటులోని వ్యాసములు రూపొందించబడినవి. యేసు నరావతారి అగుటను గూర్చి చదువుతూ ఆరంభిస్తే బాగుంటుంది.

పది ఆజ్ఞలు: కలియుగములో కరోనా వైరస్ పరీక్ష వంటిది

మనము కలియుగములో జీవిస్తున్నామని సహజంగా అందరు ఒప్పుకుంటారు. ఇది నాలుగు యుగములలో చివరిది. మిగిలిన మూడు యుగములు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. ఈ నాలుగు యుగములలో సామాన్యముగా ఏమి కనిపిస్తుంది అంటే, మొదటి యుగమైన సత్యయుగము మొదలుకొని, మనము ప్రస్తుతము నివసించుచున్న కలియుగము వరకు నైతిక మరియు సామాజిక పతనము క్రమక్రమముగా జరుగుతు వస్తుంది.

మహాభారతములోని మార్కండేయుడు కలియుగములో మానవ స్వభావమును ఈ విధంగా వర్ణించాడు:

కోపము, ఉగ్రత మరియు అజ్ఞానము పెరుగుతాయి

ధర్మము, సత్యము, పరిశుభ్రత, సహనము, కరుణ, భౌతిక శక్తి మరియు జ్ఞాపకము దినదినము కృశించిపోతాయి.

ఎలాంటి కారణము లేకుండా ప్రజలు హత్యచేయు ఆలోచనలను తలపెడతారు మరియు దానిలోని తప్పును గ్రహింపరు.

వ్యామోహమును సామాజికముగా అంగీకరిస్తారు మరియు లైంగిక సంభోగమును జీవితము యొక్క ముఖ్యమైన అవసరతగా పరిగణిస్తారు.

పాపము బహుగా పెరిగిపోతుంది, కాని మంచితనము అంచెలంచెలుగా అంతరించిపోతుంది.

ప్రజలు మత్తును కలిగించు పానీయములకు మరియు మాదకద్రవ్యాలకు బానిసలవుతారు.

గురువులను గౌరవించుట మానివేస్తారు మరియు వారి శిష్యులు వారిని గాయపరుస్తారు. వారి బోధలను హేళన చేస్తారు, మరియు కామమును అనుసరించువారు మానవుల యొక్క మనస్సులపై పట్టును సంపాదిస్తారు.

భగవంతులమని లేక దేవుళ్లు ఇచ్చిన వరములమని మానవులంతా తమను గూర్చి తాము ప్రకటించుకుంటారు మరియు బోధించుటకు బదులుగా దానిని వ్యాపారముగా మార్చివేస్తారు.

ప్రజలు వివాహములు చేసుకొనుట మాని కేవలం కామ వాంఛలను తీర్చుకొనుటకు సహజీవనం చేస్తారు.

మోషే మరియు పది ఆజ్ఞలు

మన ప్రస్తుత యుగమును హెబ్రీ వేదములు కూడా ఇంచుమించు ఇదే విధంగా వర్ణిస్తాయి. పాపము చేయుటకు మానవులు వాంఛను కలిగియున్నందున, వారు పస్కా ద్వారా ఐగుప్తు నుండి తప్పించుకొని వచ్చిన తరువాత కొంత కాలమునకు దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞలను ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుట మాత్రమే మోషే యొక్క లక్ష్యము కాదుగాని, వారిని ఒక నూతన జీవన విధానములోనికి నడిపించుట కూడా అతని లక్ష్యమైయుండెను. కాబట్టి ఇశ్రాయేలీయులను విడిపించిన పస్కా దినమునకు యాబై రోజులు తరువాత, మోషే వారిని సీనాయి పర్వతము (హోరేబు పర్వతము) యొద్దకు నడిపించాడు, అక్కడ వారు దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నారు. కలియుగములోని సమస్యలను వెలికితీయుటకు ఈ ధర్మశాస్త్రము కలియుగములో ఇవ్వబడినది.

మోషే పొందుకున్న ఆజ్ఞలు ఏవి? ధర్మశాస్త్రమంతా చాలా పెద్దదైనప్పటికీ, మోషే మొదటిగా రాతి పలకల మీద వ్రాయబడియున్న కొన్ని నైతిక ఆజ్ఞలను దేవుని నుండి పొందుకున్నాడు, వీటిని పది ఆజ్ఞలు(లేక డెకలోగ్) అని పిలుస్తారు. ఈ పది ఆజ్ఞలు ధర్మశాస్త్రము అంతటి యొక్క సారాంశముగా ఉన్నాయి – సూక్ష్మ వివరములను తెలుపుటకు ముందు ఇవ్వబడిన నైతిక విలువలు – మరియు ఇవి కలియుగములో ఉన్న భ్రష్టత్వముల నుండి పశ్చాత్తాపపడునట్లు మనలను ప్రోత్సహించుటకు దేవుడిచ్చిన క్రియాశీల శక్తిగా ఉన్నాయి.

పది ఆజ్ఞలు

దేవుడు రాతి పలకల మీద వ్రాసిన, తరువాత మోషే హెబ్రీ వేదములలో నమోదు చేసిన పది ఆజ్ఞల పట్టిక ఈ క్రింద ఇవ్వబడినది.

వుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
9 ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
10 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
12 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
13 నరహత్య చేయకూడదు.
14 వ్యభిచరింపకూడదు.
15 దొంగిలకూడదు.
16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పె

ను. నిర్గమకాండము 20:1-17

పది ఆజ్ఞల యొక్క ప్రమాణము

ఇవి ఆజ్ఞలని నేడు మనము కొన్నిసార్లు మరచిపోతుంటాము. ఇవి సలహాలు కావు. ఇవి ప్రతిపాదనలు కూడా కావు. అయితే ఈ ఆజ్ఞలను మనము ఎంత వరకు పాటించాలి? పది ఆజ్ఞలు ఇవ్వబడుటకు ముందు ఈ క్రింది మాటలు వ్రాయబడ్డాయి

  3 మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
4 నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.

నిర్గమకాండము 19:3,5

పది ఆజ్ఞల తరువాత ఈ మాటలు వ్రాయబడ్డాయి

  7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.

నిర్గమకాండము 24:7

కొన్నిసార్లు స్కూల్ పరీక్షలలో, అధ్యాపకుడు కొన్ని ప్రశ్నలను ఇచ్చి (ఉదాహరణకు ఇరవై) వాటిలో కొన్నిటికి మాత్రమే జవాబులు వ్రాయమని చెబుతాడు. ఉదాహరణకు, ఇరవై ప్రశ్నలలో ఒక పదిహేను ప్రశ్నలను ఎంపిక చేసుకొని మనము జవాబివ్వవచ్చు. ప్రతి విద్యార్థి కూడా అతనికి/ఆమెకు సులువుగా ఉన్న పదిహేను ప్రశ్నలను ఎన్నుకొని వాటికి జవాబివ్వవచ్చు. ఈ విధంగా అధ్యాపకుడు పరీక్షను కొంత వరకు సులభతరం చేస్తాడు.

చాలా మంది పది ఆజ్ఞలను గూర్చి కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు. దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చిన తరువాత “వీటిలో మీకు నచ్చిన ఆరింటిని పాటించండి” అని చెప్పినట్లు వారు ఆలోచిస్తారు. దేవుడు మన ‘చెడు క్రియలను’ మరియు ‘సత్క్రియలను’ సమతుల్యం చేస్తున్నాడని మనమనుకుంటాము కాబట్టి ఇలా ఆలోచన చేస్తాము. మనము చేయు మంచి పనులు మనలోని చెడ్డ క్రియలను కొట్టివేయగలిగితే దేవుని కనికరమును పొందుటకు ఇది సరిపోతుంది అని మనము ఆశించవచ్చు. 

అయితే, అవి ఈ విధంగా ఇవ్వబడలేదని పది ఆజ్ఞలను నిజాయితీగా చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రజలు అన్ని ఆజ్ఞలను అన్ని వేళల పాటించాలి మరియు వీటికి విధేయులవ్వాలి. వీటిని పాటించుటలో ఎదురయ్యే కష్టముల కారణంగానే అనేకమంది పది ఆజ్ఞలను తిరస్కరిస్తారు. అయితే అవి కలియుగములో జరుగు క్రియలను అధిగమించుటకు కలియుగములో ఇవ్వబడినవి.

పది ఆజ్ఞలు మరియు కరోనా వైరస్ పరీక్ష

2020లో లోకమును అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో పోల్చుట ద్వారా కలియుగములో ఇవ్వబడిన కఠినమైన పది ఆజ్ఞల యొక్క ఉద్దేశ్యమును మనము అర్థము చేసుకోవచ్చు. COVID-19 అనునది కరోనా వైరస్ – మన కంటికి కనిపించని ఒక చాలా సూక్ష్మమైన వైరస్ – ద్వారా కలుగు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకొనుటకు కష్టమగుట వంటి లక్షణములను కలిగిన వ్యాధి. 

ఒక వ్యక్తికి జ్వరము, దగ్గు వచ్చాయని ఊహించండి. అసలు సమస్య ఏమిటని ఆ వ్యక్తి ఆలోచిస్తుంటాడు. అతనికి/ఆమెకు ఒక సామన్య జ్వరము వచ్చిందా లేక కరోనా వైరస్ వచ్చిందా? కరోనా వైరస్ అయితే అది చాలా తీవ్రమైన సమస్య – ప్రాణము కూడా పోవచ్చు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి మరియు ఎవరికైనా అది సోకవచ్చు కాబట్టి అది కరోనా వైరస్ అయ్యుండవచ్చు. వారి జీవితములో కరోనా ఉన్నాదో లేదో నిర్థారించుటకు వారికి ఒక విశేషమైన పరీక్ష చేయబడుతుంది. కరోనా వైరస్ పరీక్ష వారి వ్యాధిని నయం చేయదుగాని, వారిలో COVID-19కు కారణమైయ్యే కరోనా వైరస్ ఉన్నదో లేదో, లేక అది కేవలం ఒక సామన్య జ్వరమో నిర్థారించి చెబుతుంది.

పది ఆజ్ఞల విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. 2020లో కరోనా వైరస్ వ్యాపించుచున్న విధముగానే కలియుగములో నైతిక భ్రష్టత్వము కూడా వ్యాపించుచున్నది. నైతిక భ్రష్టత్వము వ్యాపించుచున్న ఈ యుగములో మనము నీతిమంతులముగా ఉన్నామో లేక మనము కూడా పాపమను మరక కలిగినవారిగా ఉన్నామో తెలుసుకోవాలని ఆశిస్తాము. మనము పాపము నుండి మరియు దాని వలన కలుగు కర్మా నుండి స్వతంత్రులముగా ఉన్నామా లేక ఇంకా పాపమును పట్టుకునే ఉన్నామా అని మన జీవితములను పరీక్షించుకొనుటకు పది ఆజ్ఞలు ఇవ్వబడినవి. పది ఆజ్ఞలు కరోనా వైరస్ పరీక్ష వలె పని చేస్తాయి – దీని ద్వారా మీకు వ్యాధి (పాపము) ఉన్నదో లేదో మీరు తెలుసుకోగలరు.

ఇతరులతో, మనతో మనము మరియు దేవునితో మనము ఎలా వ్యవహరించాలని దేవుడు కోరతాడో ఆ గురి నుండి ‘తప్పిపోవుటనే’ పాపము అంటారు. అయితే మన సమస్యను గుర్తించుటకు బదులుగా మనలను మనము ఇతరులతో పోల్చుకొంటుంటాము (సరికాని ప్రమాణములతో కొలుచుకుంటాము), మతపరమైన పుణ్యమును పొందుకొనుటకు ప్రయత్నిస్తాము, లేక అన్నిటిని విడచి మన ఇష్టానికి జీవిస్తుంటాము. కాబట్టి దేవుడు పది ఆజ్ఞలను ఈ క్రింది ఉద్దేశముతో ఇచ్చాడు:

  20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

రోమీయులకు 3:20

పది ఆజ్ఞల యొక్క ప్రమాణము వెలుగులో మన జీవితములను మనము పరీక్షించుకుంటే, అది అంతరంగ సమస్యను తెలుపు కరోనా వైరస్ పరీక్షను చేయించుకొనుటను పోలియుంటుంది. పది ఆజ్ఞలు మన సమస్యకు “పరిష్కారం” ఇవ్వవుగాని, దేవుడు ఇచ్చిన పరిష్కారమును స్వీకరించుటకు మనలోని సమస్యను స్పష్టముగా బయలుపరుస్తుంది. మనలను మనము మోసము చేసుకొనుటకు బదులుగా, మనలను మనము సరిగా విశ్లేషించుకొనుటకు ధర్మశాస్త్రము సహాయపడుతుంది.

పశ్చాత్తాపములో దేవుని బహుమానము ఇవ్వబడింది

యేసు క్రీస్తు – యేసు సత్సంగ్ – యొక్క మరణము మరియు పునరుత్థానము ద్వారా పాప క్షమాపణ అను బహుమానమును ఇచ్చుట ద్వారా దేవుడు దీనికి పరిష్కారమునిచ్చాడు. యేసు చేసిన కార్యము మీద నమ్మకము లేక విశ్వాసము ఉంటే జీవితమను బహుమానము మనకు ఇవ్వబడుతుంది.

  16 ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

గలతీయులకు 2:16

శ్రీ అబ్రాహాము దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడినట్లు, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడగలము. అయితే అందుకు మనము పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపమును ప్రజలు చాలాసార్లు అపార్థం చేసుకుంటారు, కాని పశ్చాత్తాపము అంటే “మన మనస్సులను మార్చుకొనుట.” అనగా మన పాపములను విడిచి దేవుని వైపు మరియు ఆయన ఇచ్చు బహుమానము వైపుకు తిరుగుట. వేద పుస్తకము (బైబిలు) వివరించుచున్నట్లు:

  19 ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును

అపొస్తలుల కార్యములు 3:19

మనము మారుమనస్సుపొంది దేవుని వైపు తిరిగితే, మన పాపములు మనకు విరోధముగా లెక్కించబడవు మరియు మనము జీవమును పొందుతాము. దేవుడు, తన మహా కరుణతో, కలియుగములో పాపమునకు పరీక్షను మరియు వాక్సిన్ ను కూడా మనకు ఇచ్చాడు.

కాళీ, మరణము & పస్కా చిహ్నము

కాళీ సాధారణంగా మరణ దేవత అయ్యున్నది. అక్షరార్థంగా ఇది సంస్కృత పదమైన కాల్ అనగా కాలము నుండి వెలువడుతుంది. కాళీ యొక్క చిత్రములు భయమును కలిగించునవిగా ఉంటాయి. ఆమె నరకబడిన తలల హారమును, నరకబడిన చేతుల వస్త్రమును ధరించుకొని, రక్తము కారుచున్న అప్పుడే నరికిన తలను చేతబట్టుకొని, పండుకొనియున్న ఆమె భర్తయైన శివుని శరీరము మీద కాలు మోపి ఉంటుంది. హెబ్రీ వేదములో – బైబిలు – జరిగిన మరొక మరణ వృత్తాంతమును అర్థము చేసుకొనుటలో కాళీని గూర్చిన వృత్తాంతము సహాయపడుతుంది.

పండుకొనియున్న శివుని మీద కాలు పెట్టి నరికిన తలలు మరియు చేతులు ధరించుకున్న కాళీ

దయ్యముల-రాజైన మహిషాసురుడు దేవుళ్ల మీదికి యుద్ధమునకు వచ్చిన సందర్భమును కాళీ పురాణము జ్ఞాపకము చేసుకుంటుంది. కాబట్టి వారు తమ సారములలో నుండి కాళీని సృష్టించారు. అక్కడ జరిగిన గొప్ప రక్తపాతములో కాళీ దయ్యముల-సైన్యమును చీల్చి చెండాడి, ఆమె మార్గములో వచ్చినవారిని నాశనము చేసింది. ఆ యుద్ధము యొక్క అంతములో ఆమె దయ్యముల రాజైన మహిషాసురునితో పోరాడి వానిని నాశనము చేసింది. కాళీ ఆమె విరోధుల శరీరములను ముక్కలు ముక్కలుగా నరికింది, కాని ఆమె రక్తముతో ఎంత ముగ్ధురాలైయ్యింది అంటే ఆ మరణము మరియు నాశన మార్గమును విడిచిపెట్టలేకపోయింది. యుద్ధ భూమిలో శివుడు నిర్జీవముగా పండుకొనుటకు నిర్ణయించుకున్నంత వరకు ఆమెను ఎలా ఆపాలో దేవతలకు తెలియలేదు. కాళీ నరకబడిన విరోధుల తలలను మరియు చేతులను ధరించుకొని శివుని మీద కాలు మోపినప్పుడే ఆమె స్పృహలోనికి వచ్చింది మరియు నాశనమునకు ముగింపు కలిగింది.

హెబ్రీ వేదములో ఉన్న పస్కా కథనము కాళీ మరియు శివుని గూర్చిన ఈ కథను పోలియున్నది. ఒక దుష్ట రాజును ఎదురించుటకు కాళీ వలెనె ఒక దూత అనేకమందిని హతమార్చింది అని పస్కా వృత్తాంతము నమోదు చేస్తుంది. కాళీని ఆపుటకు బలహీన స్థానమును తీసుకున్న శివుని వలెనె మరణ దూతను గృహములలోనికి ప్రవేశించకుండా ఆపుటకు ఒక నిస్సహాయమైన గొర్రెపిల్ల వధించబడినది. కాళీని గూర్చిన ఈ కథ యొక్క అర్థము అహమును జయించుటలో సహాయం చేస్తుంది అని సాధువులు చెబుతారు. పస్కా వృత్తాంతము కూడా నజరేయుడైన యేసు – యేసు సత్సంగ్ – యొక్క రాకను మరియు మన కొరకు వచ్చి బలి అర్పించుట ద్వారా ఆయన తన అహమును విడిచిపెట్టుటను గూర్చి తెలియజేస్తుంది. పస్కా వృత్తాంతమును తెలుసుకొనుట యుక్తమైన పని.

నిర్గమన పస్కా

తన కుమారుడుని అబ్రహము బలి ఇవ్వడం అనేది యేసు బలిని సూచించే సంకేతం ఏల అనేది  మనం చూశాం. అబ్రాహాము తరువాత, ఆయన కుమారుడు ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలీయులు అని పిలుచే వారు, ఆయని వారసులుగా చాలా మంది ప్రజలుగా ఉన్నారు, కానీ వారు ఈజిప్టులో బానిసలుగా కూడా ఉన్నారు.

మనం ఇప్పుడు ఇశ్రాయేలీయుల నాయకుడు మోషే తీసుకున్న పెద్ద నాటకీయ పోరాటానికి వచ్చాము, ఇది బైబిల్లోని నిర్గమనగా హీబ్రూ వేదంలో నమోదు చేసి ఉంది. సుమారు క్రీస్తుపూర్వం 1500 లో అబ్రాహాము తర్వాత, 500 సంవత్సరాల తరువాత మోషే ఇశ్రాయేలీయులను ఈజిప్టు బానిసత్వం నుండి ఎలా నడిపించాడో ఇది నమోదు చేసి ఉంది. ఈజిప్టు  ఫరో (పాలకుడు) ను ఎదుర్కోవాలని మోషేను సృష్టికర్త ఆజ్ఞాపించాడు అది వారి ఇద్దరి మధ్య వివాదం ఏర్పడి, ఈజిప్టుపై తొమ్మిది తెగుళ్ళు లేదా విపత్తులను తెచ్చినది. ఇశ్రాయేలీయులను విడిపించటానికి ఫరో అంగీకరించలేదు కాబట్టి దేవుడు 10వ మరియు చివరి తెగులును తీసుకురాబోతున్నాడు. 10వ తెగులు  పూర్తి ఖాతా ఇక్కడ ఉంది.

10 వ తెగులు కోసం ఈజిప్టులోని ప్రతి ఇంటి మీద గా  ఒక మరణదూత (ఆత్మ) వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇంటిలో ఉండి గొర్రెపిల్లను బలి ఇచ్చి, దాని రక్తం ఆ ఇంటి గుమ్మాలకు రాయాలి, రాసిన వారు తప్ప, మొత్తం భూమి అంతటా ప్రతి ఇంటిలో ఉన్న మొదటి కుమారుడు ఒక నిర్దిష్ట రాత్రి చనిపోతాడు. ఫరో విధి, అతను విధేయతను చూపుకపోతే,  గొర్రె రక్తాన్ని తన తలుపు మీద తకింపకపోతే, సింహాసనం వారసుడు అయిన తన కొడుకు చనిపోతాడు. మరియు ఈజిప్టులోని ప్రతి ఇల్లు తన మొదటి కుమారుడిని కోల్పోతుంది – బలి అర్పించిన గొర్రె రక్తం గుమ్మాలపై తకింపనందున. ఈజిప్ట్ జాతీయ విపత్తును ఎదుర్కొంది.

కానీ గొర్రెపిల్లను బలి ఇచ్చి, దాని రక్తమును గుమ్మాల మీద పూసిన  ఇళ్లలో అందరూ సురక్షితంగా ఉంటారని వాగ్దానం చేశారు. మరణ దూత ఆ ఇంటి మీదుగా వెళుతుంది. కాబట్టి ఆ రోజును పస్కా అని పిలుస్తారు (మరణం గొర్రె రక్తం పూసిన అన్ని ఇళ్ళ పై దాటి వెళ్ళింది).

పస్కా గుర్తు

ఈ కథ విన్న వారు తలుపుల మీద రక్తం మరణ దూతకు సంకేతంగా భావించారు. కానీ 3500 సంవత్సరాల క్రితం రాసిన ఖాతా నుండి తీసుకున్న ఆసక్తికరమైన వివరాలను గమనించండి

యెహోవా మోషేతో ఇలా అన్నాడు… “… నేను యెహోవా. నీవు ఉన్న ఇళ్ళపై [పస్కా గొర్రెపిల్ల] రక్తం మీకు గుర్తుగా ఉంటుంది; రక్తాన్ని చూసినప్పుడు నేను మీ మీదుగా దాటి వెళ్తాను.

నిర్గమకాండము 12 : 13

దేవుడు తలుపు మీద రక్తం కోసం వెతుకుతున్నప్పుడు, ఆయన దానిని  చూసినప్పుడు మరణం దాటిపోతుంది, రక్తం దేవునికి సంకేతం కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్పుతుంది, రక్తం ‘మీకు గుర్తు’ – ప్రజలు. ఈ భాగాన్ని చదివిన మనందరికీ ఇది ఒక గుర్తు. కానీ అది ఎలా గుర్తు? తరువాత యెహోవా వారికి ఇలా ఆజ్ఞాపించాడు:

 రాబోయే తరాలకు శాశ్వత ఆర్డినెన్స్‌గా ఈ రోజును జరుపుకోండి. మీరు భూమిలోకి ప్రవేశించినప్పుడు… ఈ వేడుకను పాటించండి… అది యెహోవాకు పస్కా బలి

నిర్గమకాండం 12:-27

పస్కా వద్ద గొర్రెతో యూదుడు

ప్రతి సంవత్సరం ఒకే రోజున పస్కా పండుగ జరుపుకోవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. యూదుల క్యాలెండర్, హిందూ క్యాలెండర్ వంటి చంద్ర క్యాలెండర్, కాబట్టి ఇది పాశ్చాత్య క్యాలెండర్ నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పాశ్చాత్య క్యాలెండర్ ద్వారా పండుగ రోజు మారుతుంది. కానీ ఈ రోజు వరకు, 3500 సంవత్సరాల తరువాత కూడా, యూదులు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుని అప్పటి ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపిస్తూ తమ సంవత్సరపు అదే తేదీన పస్కా పండుగను జరుపుకుంటారు.

పస్కా గుర్తు యేసు ప్రభువుని సూచిస్తుంది

చరిత్ర నుండి ఈ పండుగను మనం  చుస్తే ఇది చాలా అసాధారణమైనదాన్ని గమనించవచ్చు. మీరు దీనిని సువార్తలో గమనించవచ్చు, అక్కడ యేసుని బంధించటం,  విచారణ వివరాలను నమోదు చేసి ఉంది ( మొదటి పస్కా  తెగులు తరువాత 1500 సంవత్సరాలకి):

28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.

యోహాను 18:28

39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.

యోహాను 18:39

మరో మాటలో చెప్పాలంటే, యూదుల క్యాలెండర్‌లో పస్కా రోజున యేసును బంధించి సిలువ వేయడానికి పంపారు. యేసుకు ఇచ్చిన బిరుదులలో ఒకటి

 29 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.
30 నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.

యోహాను 1:29-30

పస్కా మనకు ఎలా గుర్తుగా ఉందో ఇక్కడ చూద్దాం. యేసు, ‘దేవుని గొర్రెపిల్ల’, 1500 సంవత్సరాల ముందు జరిగిన మొదటి పస్కా పండుగ జ్ఞాపకార్థం యూదులందరూ గొర్రెపిల్లను బలి ఇస్తున్న సంవత్సరంలోనే అదే రోజున యేసును సిలువ వేశారు (అనగా బలి). ప్రతి సంవత్సరం తిరిగి సంభవించే రెండు సెలవుల వార్షిక రాజుని ఇది వివరిస్తుంది. యూదుల పస్కా పండుగ దాదాపు ప్రతి సంవత్సరం ఈస్టర్ మాదిరిగానే జరుగుతుంది – క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. (యూదుల క్యాలెండర్‌లో చంద్ర-ఆధారిత లీపు సంవత్సరాల చక్రం కారణంగా ప్రతి 19 వ సంవత్సరానికి ఒక నెల విభేదం ఉంటుంది). అందుకే ఈస్టర్ రోజు ప్రతి సంవత్సరం కదులుతుంది ఎందుకంటే ఇది పస్కాపై ఆధారపడి ఉంటుంది, మరియు యూదుల క్యాలెండర్ ద్వారా పస్కా రోజుని నియమిస్తారు, ఇది పాశ్చాత్య సంవత్సర క్యాలెండర్ కంటే భిన్నంగా లెక్కిస్తారు

ఇప్పుడు ‘గుర్తులు’ ఏమి చేస్తాయనే దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు క్రింద కొన్ని గుర్తులను చూడవచ్చు.

 

భారత దేశం గుర్తు

 

మెక్‌డొనాల్డ్స్ , నైక్ గురించి ఆలోచించేలా చేయడానికి వాణిజ్య గుర్తు

జెండా, భారతదేశం గుర్తు లేదా చిహ్నం. మనము, దీర్ఘచతురస్రాన్ని పైన ఒక నారింజ, దానిపై ఆకుపచ్చ బ్యాండ్ని ‘చూడము’. లేదు, మనం జెండాను చూసినప్పుడు భారతదేశం గురించి ఆలోచిస్తాం. ‘గోల్డెన్ ఆర్చ్స్’ గుర్తు మెక్‌డొనాల్డ్స్ గురించి ఆలోచించేలా చేస్తుంది. నాదల్ తల పైనబ్యాండ్‌లోని ‘√’ గుర్తు నైక్‌కు గుర్తు. నాదల్‌పై ఈ గుర్తు చూసినప్పుడు మనం వాళ్ళ వస్తువులు గురించి ఆలోచించాలని నైక్ కోరుకుంటాడు. మన ఆలోచనను కావలసిన వస్తువు వైపుకు నడిపించడానికి గుర్తులు, మన మనస్సులో సూచించే గుర్తులుగా ఉంటాయి.

నిర్గమన హీబ్రూ వేదంలోని ఈ పస్కా వృత్తాంతం గుర్తు ప్రజల కోసమేనని, సృష్టికర్త దేవుడి కోసం కాదని స్పష్టంగా చెప్పాడు (అయినప్పటికీ ఆయన రక్తం కోసం వెతుకుతాడు, ఆయన దానిని చూస్తే ఇంటి మీదుగా పోడు). అన్ని గుర్తులు మాదిరిగానే, మనం పస్కా పండుగ వైపు చూసేటప్పుడు మనం ఏమి ఆలోచించాలని ఆయన కోరుకున్నాడు? యేసు ఉన్న రోజునే గొర్రెపిల్లలను బలి ఇచ్చే విశేషమైన సమయం, ఇది యేసు బలిని సూచిస్తుంది.

నేను క్రింద చూపినట్లు అది మన మనస్సులో పనిచేస్తుంది. ఈ గుర్తు యేసు త్యాగానికి మనలను సూచిస్తుంది.

పస్కాకు యేసును సిలువ వేసిన కచ్చితమైన సమయం ఒక గుర్తు

ఆ మొదటి పస్కా పండుగలో గొర్రె పిల్లలను బలి ఇచ్చి రక్తం వ్యాపించటం ద్వారా ప్రజలు జీవించారు. అందువల్ల, ఈ గుర్తు, యేసును సూచిస్తుంది ‘దేవుని గొర్రెపిల్ల’ కూడా మరణానికి బలిగా ఇవ్వబడింది, ఆయన రక్తం చిందినందున మనం జీవం అందుకోవచ్చని చెప్పడం.

అబ్రాహాము గుర్తులో అబ్రాహాము తన కొడుకు బలి కోసం పరీక్షించిన ప్రదేశం మోరియా పర్వతం. ఒక గొర్రె చనిపోయింది కాబట్టి అబ్రాహాము కొడుకు జీవించగలిగాడు.

అబ్రాహాము గుర్తు ఆ ప్రదేశానికి సూచిస్తుంది

మోరియా పర్వతం, అక్షరాలు అదే ప్రదేశంలో యేసును బలి ఇచ్చారు. స్థలాన్ని సూచించటం ద్వారా ఆయన మరణం అర్ధాన్ని ‘చూసేలా’ చేయడానికి ఇది ఒక గుర్తు. పస్కా పండుగలో యేసు బలికి మరో ఒకటి దొరుకుతుంది – సంవత్సరంలో అదే రోజును సూచించడం ద్వారా. ఒక గొర్రె బలి మరోసారి ఉపయోగించటం జరిగింది – ఇది కేవలం ఒక సంఘటన యాదృచ్చికం కాదని చూపిస్తుంది -అది యేసు బలిని సూచించడానికి. రెండు వేర్వేరు మార్గాల్లో (స్థానం ద్వారా, సమయం ద్వారా) పవిత్రమైన హీబ్రూ వేదాలలో రెండు ముఖ్యమైన పండుగలు యేసు బలిని నేరుగా సూచిస్తాయి. చరిత్రలో మరే వ్యక్తి గురించి నేను ఆలోచించలేను, అతని మరణం ఇట్టువంటి నాటకీయ పద్ధతిలో సమాంతరాల ద్వారా ముందే సూచించబడింది. నువ్వు చెయ్యగలవా?

ఈ గుర్తులు ఇవ్వటానికి కారణం, దాని ద్వారా యేసు బలి నిజంగా ప్రణాళిక చేసినది, దేవునిచే నియమించబడిందని మనకు నమ్మకం ఉంటుంది. యేసు త్యాగం మనల్ని మరణం నుండి ఎలా రక్షిస్తుంది మరియు పాపం నుండి మనలను ఎలా శుభ్రపరుస్తుంది – అందుకున్న వారందరికీ దేవుని నుండి వచ్చిన బహుమతి అనే దానిని  ఉహించుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం.

బలి పర్వతమును పవిత్రమైనదిగా చేయుట

కైలాష్ (లేక కైలాస) పర్వతము భారత దేశము మరియు చైనా ప్రాంతములోని టిబెట్ దేశమునకు సరిహద్దులో ఉన్నది. హిందువులు, భౌద్ధులు, మరియు జైనులు కైలాస పర్వతమును పవిత్రమైన పర్వతముగా భావిస్తారు. కైలాస పర్వతము ప్రభువైన శివుడు (లేక మహాదేవ), ఆయన భార్యయైన పార్వతి దేవి (ఉమా, గౌరి అని కూడా పిలుస్తారు), మరియు వారి సంతానమైన గణేష్ ప్రభువు (గణపతి లేక వినాయక) నివసించు స్థలమని హిందువులు నమ్ముతారు. వేల మంది హిందువులు మరియు జైనులు కైలాస పర్వతమునకు తీర్థయాత్రకు వెళ్తారు మరియు అది ఇచ్చు ఆశీర్వాదములను పొందుకొనుటకు పవిత్రమైన ఆచారముగా దాని చుట్టు ప్రదక్షిణాలు చేస్తారు.

పార్వతి స్నానం చేయుచునప్పుడు చూడకుండా ప్రభువైన శివుని గణేష్ ఆపినందుకు కైలాసము మీద శివుడు గణేష్ యొక్క తల నరికి అతనిని హతమార్చాడు. తరువాత ఒక ఏనుగు తల తీసి గణేష్ మొండెము మీద అతికించినప్పుడు అతడు శివుని యొద్దకు తిరిగివచ్చాడు అని వివరిస్తు ఈ సుపరిచితమైన కథ కొనసాగుతుంది. ప్రభువైన శివుడు తన కుమారుని మరణము నుండి మరలా పొందుకొనునట్లు దాని తలను గణేష్ కు బలిగా అర్పిస్తు ఏనుగు మరణించింది. ఈ బలి కైలాస పర్వతము మీద జరిగింది కాబట్టి నేడు అది పవిత్రమైన పర్వతముగా గుర్తించబడుతుంది. ఈ కైలాసము మేరు పర్వతము – విశ్వము యొక్క ఆత్మీయ మరియు తార్కిక కేంద్రము – యొక్క భౌతిక వ్యక్తీకరణము అని కూడా కొందరు నమ్ముతారు. ఈ ఆత్మీయత మేరు పర్వతము నుండి కైలాస పర్వతము వరకు కేంద్రీకృతమైనదని సూచించుటకు వృత్తాకారములో అనేక దేవాలయములు ఇక్కడ నిర్మించబడినవి.

పర్వతము మీద బలి ద్వారా కుమారుని మరణము నుండి వెలికితీయుటకు దేవుడు ప్రత్యక్షమైన ఈ క్రమమును మరొక పర్వతము – మోరీయా పర్వతము – మీద తన కుమారుని విషయములో శ్రీ అబ్రాహాము అనుభవించాడు. ఆ బలి కూడా యేసు సత్సంగ్ – యేసు – యొక్క రానున్న నరావతారమును గూర్చి మరింత లోతైన, తార్కికమైన వాస్తవమును చూపు చిహ్నముగా ఉన్నది. నాలుగు వేల సంవత్సరముల క్రితం శ్రీ అబ్రాహాము ఎదుర్కొన్న అనుభవాలను హెబ్రీ వేదములు స్మరణకు తెచ్చి వాటి ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఈ చిహ్నమును అర్థము చేసుకొనుట ద్వారా ‘దేశములన్నిటికీ’ – హెబ్రీయులకు మాత్రమే కాదు – ఆశీర్వాదమును కలుగుతుంది అని హెబ్రీ వేదములు ప్రకటిస్తాయి. కాబట్టి ఈ వృత్తాంతమును గూర్చి తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుట ఉపయోగకరముగా ఉంటుంది.

శ్రీ అబ్రాహాము అర్పించిన బలికి పర్వత చిహ్నము

అనేక శతాబ్దముల క్రితం దేశములను గూర్చిన వాగ్దానము అబ్రాహాముకు ఏ విధంగా ఇవ్వబడినదో మనము చూశాము. యూదులు మరియు అరబులు నేడు అబ్రాహాము సంతానములో నుండి వచ్చారు, కాబట్టి వాగ్దానము నెరవేర్చబడింది అని, అతడు చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాడు అని మనకు తెలుసు. అబ్రాహాము ఈ వాగ్దానమును నమ్మాడు గనుక, అతనికి నీతి ఇవ్వబడినది – నీతిగల యోగ్యత ద్వారా అతడు మోక్షమును పొందలేదుగాని, ఉచిత బహుమానముగా మోక్షమును పొందాడు.

కొంత సమయం తరువాత, అబ్రాహాము ఎంతో కాలముగా ఎదురుచూస్తున్న కుమారుడైన ఇస్సాకును (ఇతనిలో నుండి నేటి యూదులు వచ్చారు) పొందాడు. ఇస్సాకు యవ్వనుడయ్యాడు. అయితే దేవుడు అబ్రాహామును ఒక నాటకీయమైన పద్ధతిలో పరీక్షించాడు. ఈ మర్మాత్మకమైన పరీక్షను గూర్చిన పూర్తి వివరణను మీరు ఇక్కడ చదవవచ్చు, కాని ఇక్కడ నీతి యొక్క జీతమును అర్థము చేసుకొనుటకు కొన్ని ముఖ్యమైన విషయములను మనము చూద్దాము.

అబ్రాహాము యొక్క పరీక్ష

ఈ పరీక్ష ఒక కఠినమైన ఆజ్ఞతో ఆరంభమైయ్యింది:

అప్పుడు దేవుడు “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.”

ఆదికాండము 22:2

అబ్రాహాము ఈ ఆజ్ఞకు విధేయుడై ‘మరుసటి రోజు ఉదయానే లేచి’ ‘మూడు దినములు’ ప్రయాణం చేసి పర్వతము యొద్దకు చేరుకున్నాడు. తరువాత

ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనెను.

ఆదికాండము 22:9-10

అబ్రాహాము ఆజ్ఞను అనుసరించుటకు సిద్ధమయ్యాడు. అయితే అప్పుడు ఒక అసాధారణమైన కార్యము జరిగింది:

యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను;

అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.

అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.

ఆదికాండము 22:11-13

చివరి ఘడియలో ఇస్సాకు మరణము నుండి రక్షించబడ్డాడు మరియు అబ్రాహాము ఒక పొట్టేలును చూసి అతనికి బదులుగా దానిని బలి ఇచ్చాడు. దేవుడు పొట్టేలును అనుగ్రహించాడు మరియు పొట్టేలు ఇస్సాకు స్థానమున బలి అర్పించబడింది.

బలి: భవిష్యత్తు కొరకు ఎదురుచూపు

అప్పుడు అబ్రాహాము ఆ స్థలమునకు పేరు పెట్టాడు. అతడు యేమని పేరు పెట్టాడో గమనించండి:

అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును

ఆదికాండము 22:14

అబ్రాహాము ఆ స్థలమునకు ‘యెహోవా యీరే (సమకూర్చును)’ అని పేరు పెట్టెను. ఈ పేరు భూతకాలములో ఉందా, వర్తమాన కాలములో ఉందా, లేక భవిష్యత్ కాలములో ఉందా? సందేహములను తొలగించుటకు తరువాత ఇవ్వబడిన వ్యాఖ్య “…యెహోవా చూచుకొనును” అని సెలవిస్తుంది. ఇది కూడా భవిష్యత్ కాలములో ఉంది – ఈ విధంగా భవిష్యత్తు కొరకు ఎదురుచూస్తుంది. కాని ఈ పేరు పెట్టుట ఇస్సాకు స్థానములో పొట్టేలు (మగ గొర్రె) బలి అర్పించబడిన తరువాత జరిగింది. అబ్రాహాము ఆ స్థలమునకు పేరు పెట్టుచున్నప్పుడు తన కుమారుని స్థానములో బలి అర్పించబడిన పొట్టేలును సంబోధించుచున్నాడని చాలా మంది అనుకుంటారు. కాని అప్పటికే అది బలి అర్పించబడి కాల్చబడింది. ఒకవేళ అబ్రాహాము అప్పటికే మరణించి, బలి అర్పించబడి, కాల్చబడిన పొట్టేలును గూర్చి ఆలోచన చేస్తే, అతడు ఆ స్థలమునకు ‘యెహోవా సమకూర్చాడు’ అని భూత కాలమును సంబోధిస్తూ పేరు పెట్టియుండేవాడు. మరియు తరువాత ఇవ్వబడిన వ్యాఖ్య “అందుచేత యెహోవా పర్వతము మీదచూచుకొన్నాడు అని నేటి వరకు చెప్పబడును” అని ఉండేది. అబ్రాహాము భవిష్యత్ కాలములో దానికి పేరు పెట్టాడు కాబట్టి అతడు అప్పటికే మరణించిన బలి పొట్టేలును గూర్చి ఆలోచన చేయలేదు. మరొక విషయమును గూర్చి అతడు జ్ఞానోదయమును పొందాడు. అతనికి భవిష్యత్తును గూర్చి ఏదో జ్ఞానోదయము కలిగింది. కానీ దేనిని గూర్చి?

బలి ఎక్కడ అర్పించబడింది

ఈ బలి అర్పించుట కొరకు అబ్రాహాము నడిపించబడిన పర్వతమును జ్ఞాపకము చేసుకోండి:

అప్పుడు దేవుడు “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి….”

వ. 2

ఇది ‘మోరీయా’లో జరిగింది. ఇది ఎక్కడ ఉంది? ఇది అబ్రాహాము దినములలో (క్రీ.పూ. 2000) అరణ్యముగా ఉండినప్పటికీ, వెయ్యి సంవత్సరముల తరువాత (క్రీ.పూ. 1000) రాజైన దావీదు అక్కడ యెరూషలేము పట్టణమును స్థాపించాడు, మరియు అతని కుమారుడైన సొలొమోను అక్కడ మొదటి దేవాలయమును నిర్మించాడు. పాత నిబంధనలోని చారిత్రిక పుస్తకములలో తరువాత మనము ఈ విధంగా చదువుతాము:

తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున … యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను

2 దినవృత్తాంతములు 3:1

మరొక మాటలో, ఆదిమ పాత నిబంధన కాలమైన అబ్రాహాము కాలములో (క్రీ.పూ. 4000) ‘మోరీయా పర్వతము’ అరణ్యములో జనసంచారము లేకుండా ఉన్న ఒక పర్వత శిఖరముగా ఉండేది, కాని వెయ్యి సంవత్సరముల తరువాత దావీదు, సొలొమోనుల ద్వారా అది ఇశ్రాయేలీయులకు కేంద్ర పట్టణమైపోయింది మరియు అక్కడ వారు తమ సృష్టికర్త కొరకు దేవాలయమును నిర్మించారు. నేటి వరకు కూడా అది యూదులకు పరిశుద్ధ స్థలముగాను, ఇశ్రాయేలు దేశ రాజధానిగాను ఉన్నది.

యేసు – యేసు సత్సంగ్ – మరియు అబ్రాహాము అర్పించిన బలి

ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుకు ఇవ్వబడిన బిరుదులను గూర్చి ఆలోచన చెయ్యండి. యేసుకు అనేక బిరుదులు ఇవ్వబడినవి. అయితే వాటిలో అత్యంత సుపరిచితమైన బిరుదు ‘క్రీస్తు’. కాని ఆయనకు మరొక ప్రాముఖ్యమైన బిరుదు ఇవ్వబడినది. దీనిని మనము యోహాను సువార్తలో బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన మాటలలో చూస్తాము:

మరువాడు యోహాను యేసు (అనగా యేసు సత్సంగ్) తనయొద్దకు రాగా చూచి “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల”అనెను.

యోహాను 1:29

మరొక మాటలో, యేసుకు ‘దేవుని గొర్రెపిల్ల’ అను బిరుదు ఇవ్వబడింది. ఇప్పుడు యేసు జీవితము యొక్క చివరి ఘడియలను జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఎక్కడ అప్పగించబడ్డాడు మరియు సిలువవేయబడ్డాడు? యెరూషలేములో (మనము చూసినట్లు = ‘మోరీయా పర్వతము’) ఆయన అప్పగించబడినప్పుడు ఇది చాలా స్పష్టముగా నివేదించబడింది:

ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని [పిలాతు] తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.

లూకా 23:7

యేసు అప్పగించబడుట, తీర్పు మరియు సిలువ మరణము యెరూషలేములో (= మోరీయా పర్వతము) జరిగాయి. మోరీయా పర్వతము యొద్ద జరిగిన సన్నివేశములను ఈ క్రింది కాలక్రమము తెలియజేస్తుంది.

 పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు మోరీయా పర్వతము యొద్ద జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు

ఇప్పుడు మరొకసారి అబ్రాహామును గూర్చి ఆలోచన చెయ్యండి. ‘యెహోవా సమకూర్చును (యీరే)’ అని ఈ స్థలమునకు భవిష్యత్ కాలములో ఎందుకు పేరు పెట్టాడు? తాను మోరీయా పర్వతము మీద చేసిన దానిని పోలియున్న మరొక కార్యము జరిగి ఖచ్చితముగా భవిష్యత్తులో ‘సమకూర్చబడుతుంది’ అని అతనికి ఎలా తెలుసు? దీనిని గూర్చి ఆలోచన చెయ్యండి – తన స్థానములో గొర్రెపిల్ల అర్పించబడింది కాబట్టి ఇస్సాకు (అతని కుమారుడు) మరణము నుండి చివరి క్షణములో రక్షించబడ్డాడు. రెండు వేల సంవత్సరముల తరువాత, యేసు ‘దేవుని గొర్రెపిల్ల’ అని పిలువబడి అదే స్థలములో బలిగావించబడ్డాడు. ‘ఆ స్థలము’లోనే జరుగుతుంది అని అబ్రాహాముకు ఎలా తెలుసు? ప్రజాపతి, అనగా స్వయంగా సృష్టికర్తయైన దేవుని యొద్ద నుండి జ్ఞానోదయమును పొందితేనే అతడు అంత అసాధారణమైన విషయమును తెలుసుకొనియుంటాడు మరియు ప్రవచించియుంటాడు.

దేవుని మనస్సు బయలుపరచబడింది

చరిత్రలో ఈ సన్నివేశముల మధ్య రెండు వేల సంవత్సరముల వ్యవధి ఉన్నను స్థలము విషయములో ఈ రెండు సన్నివేశములను కలిపిన ఒకే మనస్సు ఉన్నట్లు అనిపిస్తుంది.

అబ్రాహాము అర్పించిన బలి – రెండు వేల సంవత్సరముల తరువాత జరుగబోవు కార్యమును ప్రవచిస్తుంది – మనము యేసు యొక్క బలిని గూర్చి ఆలోచించుటకు చిహ్నముగా ఉన్నది.

మునుపటి సన్నివేశము (అబ్రాహాము అర్పించిన బలి) తదుపరి సన్నివేశమును (యేసు యొక్క బలి) ప్రస్తావిస్తుంది మరియు తదుపరి సన్నివేశమును జ్ఞాపకము చేయుటకు చిత్రీకరించబడింది. వేల సంవత్సరముల దూరము కలిగియున్న ఈ సన్నివేశములను అనుసంధానము చేయుట ద్వారా ఈ మనస్సు (సృష్టికర్తయైన దేవుడు) తనను తాను బయలుపరచుకొనుచున్నది అనుటకు ఇది రుజువుగా ఉన్నది. అబ్రాహాము ద్వారా దేవుడు మాట్లాడాడనుటకు ఇది చిహ్నముగా ఉన్నది.

మీ కొరకు, నా కొరకు శుభ సందేశము

మరికొన్ని వ్యక్తిగత కారణముల వలన ఈ కథనము చాలా ప్రాముఖ్యమైయున్నది. చివరిగా, దేవుడు అబ్రాహాముకు ఇలా సెలవిచ్చాడు

” మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును…”

ఆదికాండము 22:18

మీరు ‘భూలోకములోని జనములన్నిటి’లో ఒక దేశమునకు చెందినవారైయున్నారు – మీ భాష, మతము, విద్య, వయస్సు, లింగము, లేక ఐశ్వర్యము ఏమైనా సరే! కాబట్టి ఈ వాగ్దానము మీకు కూడా విశేషముగా చేయబడినది. వాగ్దానము ఏమిటో గమనించండి – స్వయంగా దేవుని యొద్ద నుండి కలిగిన ‘ఆశీర్వాదము’! ఇది కేవలం యూదుల కొరకు మాత్రమేగాక, లోకములోని ప్రజలందరి కొరకు ఇవ్వబడింది.

ఈ ‘ఆశీర్వాదము’ ఎలా ఇవ్వబడింది? ఇక్కడ ‘సంతానము’ అను పదము ఏకవచనములో ఉన్నది. అనేకమంది వారసులను లేక ప్రజలను ప్రస్తావించునప్పుడు ఉపయోగించు ‘సంతానములు’ అను పదము ఇక్కడ ఉపయోగించబడలేదు, కాని ‘అతడు’ అను విధముగా ఏకవచనము ఇక్కడ ఉపయోగించబడింది. ‘వారి’ ద్వారా అను విధముగా అనేకమంది ప్రజలు లేక ఒక గుంపు ద్వారా ఇది జరుగదు. హెబ్రీ వేదములలో ‘అతడు’ సర్పము యొక్క ‘మడిమెను కొట్టును’ అని నమోదు చేయబడిన విధముగానే చరిత్ర యొక్క ఆరంభములో ఇవ్వబడిన వాగ్దానమును ఇది ఖచ్చితముగా అనుసరిస్తుంది మరియు పురుషసూక్తలో ఇవ్వబడిన పురుషబలి (‘అతడు’) వాగ్దానమునకు సమాంతరముగా ఉన్నది. ఈ చిహ్నము ద్వారా అదే స్థలము – మోరీయా పర్వతము (= యెరూషలేము) – ప్రవచించబడింది మరియు ఈ పురాతన వాగ్దానములను గూర్చి తదుపరి వివరాలను ఇస్తుంది. ఈ వాగ్దానము ఎలా ఇవ్వబడిందో, మరియు నీతి యొక్క వెల ఎలా చెల్లించబడుతుందో అర్థము చేసుకొనుటలో అబ్రాహాము అర్పించిన బలిని గూర్చిన వృత్తాంతమును గూర్చిన వివరములు మనకు సహాయం చేస్తాయి.

దేవుని ఆశీర్వాదము ఎలా ప్రాప్తి అయ్యింది?

ఇస్సాకు స్థానములో బలియగుట ద్వారా పొట్టేలు అతనిని మరణము నుండి రక్షించిన విధముగానే, దేవుని గొర్రెపిల్ల, తన త్యాగపూరిత మరణము ద్వారా మనలను మరణము యొక్క శక్తి మరియు శిక్ష నుండి రక్షిస్తాడు. బైబిలు ఇలా ప్రకటిస్తుంది

… పాపమువలన వచ్చు జీతము మరణము

రోమీయులకు 6:23

మరొక విధముగా చెప్పాలంటే, మనము చేయు పాపములు మరణమును కలిగించు కర్మను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇస్సాకు స్థానములో బలియైన గొర్రెపిల్ల మరణమునకు వెలను చెల్లించింది. అబ్రాహాము ఇస్సాకులు దానిని కేవలం అంగీకరించవలసియుండెను. అతడు ఏ విధముగా కూడా దానికి యోగ్యునిగా లేడు. కాని దానిని అతడు బహుమతిగా పొందుకున్నాడు. ఖచ్చితముగా ఈ విధముగానే అతడు మోక్షమును పొందుకున్నాడు.

ఇది మనము అనుసరించగల ఒక పద్ధతిని చూపుతుంది. యేసు ‘లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల’ అయ్యున్నాడు. దీనిలో మీ పాపము కూడా ఉన్నది. ఆయన మీ కొరకు వెలను చెల్లించాడు కాబట్టి గొర్రెపిల్ల అయిన యేసు మీ పాపములను ‘మోయాలని’ ఆశపడుతున్నాడు. దీనిని పొందుకొనుటకు మీరు అర్హతను సాధించలేరు కాని బహుమతిగా పొందుకోగలరు. పురుష అయిన యేసును పిలవండి, మరియు మీ పాపములను మోసుకొనిపొమ్మని ఆయనను అడగండి. ఆయన అర్పించిన బలి ఆయనకు ఈ శక్తిని అనుగ్రహిస్తుంది. రెండు వేల సంవత్సరముల క్రితం యేసు ‘సమకూర్చిన’ అదే స్థలమైన మోరీయా పర్వతము మీద, అబ్రాహాము కుమారుని యొక్క బలిని గూర్చిన వృత్తాంతములో ఇది నిశ్చయపరచబడింది కాబట్టి ఇది మనకు తెలుసు.

దీని తరువాత, పస్కా పండుగ చిహ్నములో ఇది ఎప్పుడు జరుగుతుందో ప్రవచించబడింది.