మనలను మరియు ఇతరులను బైబిలు ఎలా చిత్రీకరిస్తుందో మన మునుపటి వ్యాసంలో చూశాము – మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి. అయితే వేద పుస్తకము (బైబిలు) ఈ పునాది మీద తదుపరి ఆలోచనను నిర్మిస్తుంది. కీర్తనలు పాత నిబంధన హెబ్రీయులు తాము దేవుని ఆరాధించినప్పుడు ఉపయోగించిన పవిత్రమైన పాటలు మరియు శ్లోకములైయున్నవి. 14వ కీర్తన దావీదు రాజు (ఈయన ఒక ఋషి కూడా) ద్వారా సుమారుగా క్రీ.పూ. 1000లో వ్రాయబడినది, మరియు దేవుని దృష్టికోణము నుండి వస్తువులు ఎలా కనబడతాయో ఈ శ్లోకం నివేదిస్తుంది.
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
కీర్తనలు 14:2-3
3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
సర్వ మానవాళిని వర్ణించుటకు ‘చెడియున్నారు’ అను పదము ఇక్కడ ఉపయోగించబడింది. మనము ‘చెడియున్నాము’ అను మాట ‘దేవుని స్వరూపమందున్న’ ఆరంభ దశను సూచిస్తుంది. దేవుని నుండి మనము కోరిన స్వతంత్రత మరియు ‘మంచి’ని చేయకపోవుటలో మన చెడియున్న స్థితి కనబడుతుంది అని ఇది సెలవిస్తుంది.
ఎల్వ్స్ మరియు ఆర్క్స్ లను గూర్చి ఆలోచించుట
ఆర్క్స్ అనేక విధాలుగా భయంకరమైనవారు. కాని వారు కేవలం ఎల్వ్స్ యొక్క చెడిపోయిన వారసులు మాత్రమే
భూమధ్య భాగములోని ఆర్క్స్ గురించి ఆలోచించండి అను విషయమును సరిగా అర్థము చేసుకొనుటకు లార్డ్ అఫ్ ది రింగ్స్ లేక హాబిట్ లోని ఉదాహరణను చూద్దాము. ఆర్క్స్ రూపములోను, ప్రవర్తనలోను, మరియు భూమితో వ్యవహరించు విధానములో కూడా చాలా భయంకరమైనవారు. అయినను వారు ఎల్వ్స్ యొక్క వారసులేగాని సౌరోన్ వలన చెడిపోయినవారు.
ఎల్వ్స్ ఘనులు మరియు దివ్యమైనవారు
ఎల్వ్స్ (లేగాలోస్ గురించి ఆలోచించండి) ప్రకృతితో కలిగియుండిన ఘనతను, ఐక్యతను మరియు అనుబంధమును మీరు చూసి, భ్రష్టమైన ఆర్క్స్ కూడా ఒకప్పుడు ఎల్వ్స్ గాని ‘చెడిపోయారు’ అని గమనించినప్పుడు ఇక్కడ ప్రజలను గూర్చి చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది. దేవుడు ఎల్వ్స్ ను సృష్టించాడుగాని వారు ఆర్క్స్ అయిపోయారు.
ప్రజల మధ్య ఉన్న సార్వత్రిక ఆశయము అని మనము చెప్పిన దానితో ఇది సరిగా సరిపోతుంది, మన పాపము మరియు శుద్ధీకరణ అవసరతను గూర్చిన అవగాహన – కుంభ మేళ పండుగలో ఉదహరించబడినట్లు. కాబట్టి ఇక్కడ మనము జ్ఞానబోధకమైన ఒక దృష్టికోణమును పొందుతాము: ప్రజలు జ్ఞానులుగా, వ్యక్తిగతమైనవారిగా, నైతికమైనవారిగా, అంత మాత్రమేగాక చెడిపోయినవారిగా బైబిలు ఆరంభమవుతుంది, మరియు ఇది మనలను గూర్చి మనము చేయు పరిశీలనకు తగినదిగా ఉన్నది. బైబిలు ప్రజలను గూర్చి చేసిన విశ్లేషణలో చాలా ఖచ్చితముగా ఉంది, మరియు మన క్రియల కారణంగా మరుగునపడు –మన చెడిపోయిన స్థితి కారణంగా – మన అంతరంగ నైతిక స్వభావమును గుర్తిస్తుంది. బైబిలులో మానవులను గూర్చి సరిగానే వ్రాయబడినది. కాని, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: దేవుడు మనలను ఈ విధంగా ఎందుకు చేశాడు – నైతిక విలువలతో కాని చెడిపోయిన స్థితిలో? ఒక ప్రఖ్యాతిగాంచిన నాస్తికుడైన క్రిస్టోఫర్ హిచ్చెన్స్ ఈ విధంగా ఫిర్యాదు చేశాడు:
“… అట్టి ఆలోచనల [అనగా, చెడ్డవి] నుండి ప్రజలు స్వతంత్రులు కావాలని దేవుడు తలంచియుంటే, ఆయన మరొక రకమైన జీవులను చేసి జాగ్రత్తపడవలసింది.” క్రిస్టోఫర్ హిచ్చెన్స్. 2007. గాడ్ ఇస్ నాట్ గ్రేట్: హౌ రెలిజియన్స్ స్పొయిల్స్ ఎవెర్య్థిం
గ్. పేజీ. 100
కాని ఇక్కడే బైబిలును విమర్శించు తొందరలో అతడు ఒక పాముఖ్యమైన విషయమును మరచిపోతాడు. దేవుడు మనలను ఈ విధంగా చేశాడని బైబిలు చెప్పుట లేదు, కాని ఈ క్లిష్టమైన పరిస్థితిని కొనితెచ్చుటకు ఆ ఆదిమ సృష్టి వృత్తాంతము తరువాత ఏదో ఒక ఘోరమైన కార్యము జరిగింది. మన సృష్టి తరువాత మానవ చరిత్రలో ఏదో ఒక ప్రాముఖ్యమైన సన్నివేశము జరిగింది. ఆదికాండములో – బైబిలులోని (వేద పుస్తకము) మొట్టమొదటి మరియు పురాతనమైన పుస్తకము – వ్రాయబడినట్లు మొదటి మానవులు దేవుని ఎదురించారు, మరియు తాము చేసిన తిరుగుబాటులో వారు మార్పు చెంది చెడిపోయారు. అందువలనే నేడు మనము తమస్ లో లేక చీకటిలో జీవించుచున్నాము.
మానవాళి యొక్క పతనము
మానవ చరిత్రలోని ఈ సన్నివేశమును చాలాసార్లు పతనము అని పిలుస్తారు. మొదటి పురుషుడైన ఆదామును దేవుడు సృష్టించాడు. దేవునికి ఆదాముకు మధ్య నమ్మకత్వమునకు వివాహ ఒప్పందము వలె ఒక ఒప్పందము జరిగింది మరియు ఆదాము దానిని ఉల్లంఘించాడు. ఆ వృక్ష ఫలము భుజింపము అని వారు సమ్మతించినప్పటికీ ఆదాము ‘మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును’ తిన్నాడని బైబిలు నివేదిస్తుంది. ఆ ఒప్పందము మరియు వృక్షము, దేవునికి నమ్మకముగా ఉండుటకు లేక ఉండకపోవుటకు ఎంచుకొను స్వచిత్తమును ఆదాముకు ఇచ్చాయి. ఆదాము దేవుని స్వరూపమందు చేయబడి, ఆయనతో సహవాసములో ఉంచబడ్డాడు. కాని తనను సృష్టించిన విషయములో ఆదాము ఎదుట ఎలాంటి ఎంపిక ఉండలేదు, కాబట్టి దేవునితో స్నేహము విషయములో ఎంపిక చేసుకొను అవకాశమును దేవుడు ఆదాముకు ఇచ్చాడు. కూర్చొనుట అసాధ్యమైనప్పుడు నిలబడుటను ఎంచుకొనుటకు ఇవ్వబడు అవకాశము సరైనది కానట్లే, ఆదాము మరియు దేవునికి మధ్య స్నేహము మరియు నమ్మకము ఒక ఎంపికగా ఉండవలెను. ఈ ఎంపిక ఒక వృక్ష ఫలము తినకూడదు అను ఆజ్ఞ మీద కేంద్రీకృతమైనది. కాని ఆదాము తిరుగుబాటు చేయుటకు ఎంచుకున్నాడు. ఆదాము తిరుగుబాటు చేయుట ద్వారా ఆరంభించినది తరతరాలుగా వ్యాపిస్తూ నేటికి మన కాలములో కూడా కొనసాగుతుంది. దీని అర్థము ఏమిటో తరువాత చూద్దాము.