కైలాష్ (లేక కైలాస) పర్వతము భారత దేశము మరియు చైనా ప్రాంతములోని టిబెట్ దేశమునకు సరిహద్దులో ఉన్నది. హిందువులు, భౌద్ధులు, మరియు జైనులు కైలాస పర్వతమును పవిత్రమైన పర్వతముగా భావిస్తారు. కైలాస పర్వతము ప్రభువైన శివుడు (లేక మహాదేవ), ఆయన భార్యయైన పార్వతి దేవి (ఉమా, గౌరి అని కూడా పిలుస్తారు), మరియు వారి సంతానమైన గణేష్ ప్రభువు (గణపతి లేక వినాయక) నివసించు స్థలమని హిందువులు నమ్ముతారు. వేల మంది హిందువులు మరియు జైనులు కైలాస పర్వతమునకు తీర్థయాత్రకు వెళ్తారు మరియు అది ఇచ్చు ఆశీర్వాదములను పొందుకొనుటకు పవిత్రమైన ఆచారముగా దాని చుట్టు ప్రదక్షిణాలు చేస్తారు.
పార్వతి స్నానం చేయుచునప్పుడు చూడకుండా ప్రభువైన శివుని గణేష్ ఆపినందుకు కైలాసము మీద శివుడు గణేష్ యొక్క తల నరికి అతనిని హతమార్చాడు. తరువాత ఒక ఏనుగు తల తీసి గణేష్ మొండెము మీద అతికించినప్పుడు అతడు శివుని యొద్దకు తిరిగివచ్చాడు అని వివరిస్తు ఈ సుపరిచితమైన కథ కొనసాగుతుంది. ప్రభువైన శివుడు తన కుమారుని మరణము నుండి మరలా పొందుకొనునట్లు దాని తలను గణేష్ కు బలిగా అర్పిస్తు ఏనుగు మరణించింది. ఈ బలి కైలాస పర్వతము మీద జరిగింది కాబట్టి నేడు అది పవిత్రమైన పర్వతముగా గుర్తించబడుతుంది. ఈ కైలాసము మేరు పర్వతము – విశ్వము యొక్క ఆత్మీయ మరియు తార్కిక కేంద్రము – యొక్క భౌతిక వ్యక్తీకరణము అని కూడా కొందరు నమ్ముతారు. ఈ ఆత్మీయత మేరు పర్వతము నుండి కైలాస పర్వతము వరకు కేంద్రీకృతమైనదని సూచించుటకు వృత్తాకారములో అనేక దేవాలయములు ఇక్కడ నిర్మించబడినవి.
పర్వతము మీద బలి ద్వారా కుమారుని మరణము నుండి వెలికితీయుటకు దేవుడు ప్రత్యక్షమైన ఈ క్రమమును మరొక పర్వతము – మోరీయా పర్వతము – మీద తన కుమారుని విషయములో శ్రీ అబ్రాహాము అనుభవించాడు. ఆ బలి కూడా యేసు సత్సంగ్ – యేసు – యొక్క రానున్న నరావతారమును గూర్చి మరింత లోతైన, తార్కికమైన వాస్తవమును చూపు చిహ్నముగా ఉన్నది. నాలుగు వేల సంవత్సరముల క్రితం శ్రీ అబ్రాహాము ఎదుర్కొన్న అనుభవాలను హెబ్రీ వేదములు స్మరణకు తెచ్చి వాటి ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఈ చిహ్నమును అర్థము చేసుకొనుట ద్వారా ‘దేశములన్నిటికీ’ – హెబ్రీయులకు మాత్రమే కాదు – ఆశీర్వాదమును కలుగుతుంది అని హెబ్రీ వేదములు ప్రకటిస్తాయి. కాబట్టి ఈ వృత్తాంతమును గూర్చి తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుట ఉపయోగకరముగా ఉంటుంది.
శ్రీ అబ్రాహాము అర్పించిన బలికి పర్వత చిహ్నము
అనేక శతాబ్దముల క్రితం దేశములను గూర్చిన వాగ్దానము అబ్రాహాముకు ఏ విధంగా ఇవ్వబడినదో మనము చూశాము. యూదులు మరియు అరబులు నేడు అబ్రాహాము సంతానములో నుండి వచ్చారు, కాబట్టి వాగ్దానము నెరవేర్చబడింది అని, అతడు చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాడు అని మనకు తెలుసు. అబ్రాహాము ఈ వాగ్దానమును నమ్మాడు గనుక, అతనికి నీతి ఇవ్వబడినది – నీతిగల యోగ్యత ద్వారా అతడు మోక్షమును పొందలేదుగాని, ఉచిత బహుమానముగా మోక్షమును పొందాడు.
కొంత సమయం తరువాత, అబ్రాహాము ఎంతో కాలముగా ఎదురుచూస్తున్న కుమారుడైన ఇస్సాకును (ఇతనిలో నుండి నేటి యూదులు వచ్చారు) పొందాడు. ఇస్సాకు యవ్వనుడయ్యాడు. అయితే దేవుడు అబ్రాహామును ఒక నాటకీయమైన పద్ధతిలో పరీక్షించాడు. ఈ మర్మాత్మకమైన పరీక్షను గూర్చిన పూర్తి వివరణను మీరు ఇక్కడ చదవవచ్చు, కాని ఇక్కడ నీతి యొక్క జీతమును అర్థము చేసుకొనుటకు కొన్ని ముఖ్యమైన విషయములను మనము చూద్దాము.
అబ్రాహాము యొక్క పరీక్ష
ఈ పరీక్ష ఒక కఠినమైన ఆజ్ఞతో ఆరంభమైయ్యింది:
అప్పుడు దేవుడు “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.”
ఆదికాండము 22:2
అబ్రాహాము ఈ ఆజ్ఞకు విధేయుడై ‘మరుసటి రోజు ఉదయానే లేచి’ ‘మూడు దినములు’ ప్రయాణం చేసి పర్వతము యొద్దకు చేరుకున్నాడు. తరువాత
ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనెను.
ఆదికాండము 22:9-10
అబ్రాహాము ఆజ్ఞను అనుసరించుటకు సిద్ధమయ్యాడు. అయితే అప్పుడు ఒక అసాధారణమైన కార్యము జరిగింది:
యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను;
అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.
అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.
ఆదికాండము 22:11-13
చివరి ఘడియలో ఇస్సాకు మరణము నుండి రక్షించబడ్డాడు మరియు అబ్రాహాము ఒక పొట్టేలును చూసి అతనికి బదులుగా దానిని బలి ఇచ్చాడు. దేవుడు పొట్టేలును అనుగ్రహించాడు మరియు పొట్టేలు ఇస్సాకు స్థానమున బలి అర్పించబడింది.
బలి: భవిష్యత్తు కొరకు ఎదురుచూపు
అప్పుడు అబ్రాహాము ఆ స్థలమునకు పేరు పెట్టాడు. అతడు యేమని పేరు పెట్టాడో గమనించండి:
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును
ఆదికాండము 22:14
అబ్రాహాము ఆ స్థలమునకు ‘యెహోవా యీరే (సమకూర్చును)’ అని పేరు పెట్టెను. ఈ పేరు భూతకాలములో ఉందా, వర్తమాన కాలములో ఉందా, లేక భవిష్యత్ కాలములో ఉందా? సందేహములను తొలగించుటకు తరువాత ఇవ్వబడిన వ్యాఖ్య “…యెహోవా చూచుకొనును” అని సెలవిస్తుంది. ఇది కూడా భవిష్యత్ కాలములో ఉంది – ఈ విధంగా భవిష్యత్తు కొరకు ఎదురుచూస్తుంది. కాని ఈ పేరు పెట్టుట ఇస్సాకు స్థానములో పొట్టేలు (మగ గొర్రె) బలి అర్పించబడిన తరువాత జరిగింది. అబ్రాహాము ఆ స్థలమునకు పేరు పెట్టుచున్నప్పుడు తన కుమారుని స్థానములో బలి అర్పించబడిన పొట్టేలును సంబోధించుచున్నాడని చాలా మంది అనుకుంటారు. కాని అప్పటికే అది బలి అర్పించబడి కాల్చబడింది. ఒకవేళ అబ్రాహాము అప్పటికే మరణించి, బలి అర్పించబడి, కాల్చబడిన పొట్టేలును గూర్చి ఆలోచన చేస్తే, అతడు ఆ స్థలమునకు ‘యెహోవా సమకూర్చాడు’ అని భూత కాలమును సంబోధిస్తూ పేరు పెట్టియుండేవాడు. మరియు తరువాత ఇవ్వబడిన వ్యాఖ్య “అందుచేత యెహోవా పర్వతము మీదచూచుకొన్నాడు అని నేటి వరకు చెప్పబడును” అని ఉండేది. అబ్రాహాము భవిష్యత్ కాలములో దానికి పేరు పెట్టాడు కాబట్టి అతడు అప్పటికే మరణించిన బలి పొట్టేలును గూర్చి ఆలోచన చేయలేదు. మరొక విషయమును గూర్చి అతడు జ్ఞానోదయమును పొందాడు. అతనికి భవిష్యత్తును గూర్చి ఏదో జ్ఞానోదయము కలిగింది. కానీ దేనిని గూర్చి?
బలి ఎక్కడ అర్పించబడింది
ఈ బలి అర్పించుట కొరకు అబ్రాహాము నడిపించబడిన పర్వతమును జ్ఞాపకము చేసుకోండి:
అప్పుడు దేవుడు “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి….”
వ. 2
ఇది ‘మోరీయా’లో జరిగింది. ఇది ఎక్కడ ఉంది? ఇది అబ్రాహాము దినములలో (క్రీ.పూ. 2000) అరణ్యముగా ఉండినప్పటికీ, వెయ్యి సంవత్సరముల తరువాత (క్రీ.పూ. 1000) రాజైన దావీదు అక్కడ యెరూషలేము పట్టణమును స్థాపించాడు, మరియు అతని కుమారుడైన సొలొమోను అక్కడ మొదటి దేవాలయమును నిర్మించాడు. పాత నిబంధనలోని చారిత్రిక పుస్తకములలో తరువాత మనము ఈ విధంగా చదువుతాము:
తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున … యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను
2 దినవృత్తాంతములు 3:1
మరొక మాటలో, ఆదిమ పాత నిబంధన కాలమైన అబ్రాహాము కాలములో (క్రీ.పూ. 4000) ‘మోరీయా పర్వతము’ అరణ్యములో జనసంచారము లేకుండా ఉన్న ఒక పర్వత శిఖరముగా ఉండేది, కాని వెయ్యి సంవత్సరముల తరువాత దావీదు, సొలొమోనుల ద్వారా అది ఇశ్రాయేలీయులకు కేంద్ర పట్టణమైపోయింది మరియు అక్కడ వారు తమ సృష్టికర్త కొరకు దేవాలయమును నిర్మించారు. నేటి వరకు కూడా అది యూదులకు పరిశుద్ధ స్థలముగాను, ఇశ్రాయేలు దేశ రాజధానిగాను ఉన్నది.
యేసు – యేసు సత్సంగ్ – మరియు అబ్రాహాము అర్పించిన బలి
ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుకు ఇవ్వబడిన బిరుదులను గూర్చి ఆలోచన చెయ్యండి. యేసుకు అనేక బిరుదులు ఇవ్వబడినవి. అయితే వాటిలో అత్యంత సుపరిచితమైన బిరుదు ‘క్రీస్తు’. కాని ఆయనకు మరొక ప్రాముఖ్యమైన బిరుదు ఇవ్వబడినది. దీనిని మనము యోహాను సువార్తలో బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన మాటలలో చూస్తాము:
మరువాడు యోహాను యేసు (అనగా యేసు సత్సంగ్) తనయొద్దకు రాగా చూచి “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల”అనెను.
యోహాను 1:29
మరొక మాటలో, యేసుకు ‘దేవుని గొర్రెపిల్ల’ అను బిరుదు ఇవ్వబడింది. ఇప్పుడు యేసు జీవితము యొక్క చివరి ఘడియలను జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఎక్కడ అప్పగించబడ్డాడు మరియు సిలువవేయబడ్డాడు? యెరూషలేములో (మనము చూసినట్లు = ‘మోరీయా పర్వతము’) ఆయన అప్పగించబడినప్పుడు ఇది చాలా స్పష్టముగా నివేదించబడింది:
ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని [పిలాతు] తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
లూకా 23:7
యేసు అప్పగించబడుట, తీర్పు మరియు సిలువ మరణము యెరూషలేములో (= మోరీయా పర్వతము) జరిగాయి. మోరీయా పర్వతము యొద్ద జరిగిన సన్నివేశములను ఈ క్రింది కాలక్రమము తెలియజేస్తుంది.
ఇప్పుడు మరొకసారి అబ్రాహామును గూర్చి ఆలోచన చెయ్యండి. ‘యెహోవా సమకూర్చును (యీరే)’ అని ఈ స్థలమునకు భవిష్యత్ కాలములో ఎందుకు పేరు పెట్టాడు? తాను మోరీయా పర్వతము మీద చేసిన దానిని పోలియున్న మరొక కార్యము జరిగి ఖచ్చితముగా భవిష్యత్తులో ‘సమకూర్చబడుతుంది’ అని అతనికి ఎలా తెలుసు? దీనిని గూర్చి ఆలోచన చెయ్యండి – తన స్థానములో గొర్రెపిల్ల అర్పించబడింది కాబట్టి ఇస్సాకు (అతని కుమారుడు) మరణము నుండి చివరి క్షణములో రక్షించబడ్డాడు. రెండు వేల సంవత్సరముల తరువాత, యేసు ‘దేవుని గొర్రెపిల్ల’ అని పిలువబడి అదే స్థలములో బలిగావించబడ్డాడు. ‘ఆ స్థలము’లోనే జరుగుతుంది అని అబ్రాహాముకు ఎలా తెలుసు? ప్రజాపతి, అనగా స్వయంగా సృష్టికర్తయైన దేవుని యొద్ద నుండి జ్ఞానోదయమును పొందితేనే అతడు అంత అసాధారణమైన విషయమును తెలుసుకొనియుంటాడు మరియు ప్రవచించియుంటాడు.
దేవుని మనస్సు బయలుపరచబడింది
చరిత్రలో ఈ సన్నివేశముల మధ్య రెండు వేల సంవత్సరముల వ్యవధి ఉన్నను స్థలము విషయములో ఈ రెండు సన్నివేశములను కలిపిన ఒకే మనస్సు ఉన్నట్లు అనిపిస్తుంది.
మునుపటి సన్నివేశము (అబ్రాహాము అర్పించిన బలి) తదుపరి సన్నివేశమును (యేసు యొక్క బలి) ప్రస్తావిస్తుంది మరియు తదుపరి సన్నివేశమును జ్ఞాపకము చేయుటకు చిత్రీకరించబడింది. వేల సంవత్సరముల దూరము కలిగియున్న ఈ సన్నివేశములను అనుసంధానము చేయుట ద్వారా ఈ మనస్సు (సృష్టికర్తయైన దేవుడు) తనను తాను బయలుపరచుకొనుచున్నది అనుటకు ఇది రుజువుగా ఉన్నది. అబ్రాహాము ద్వారా దేవుడు మాట్లాడాడనుటకు ఇది చిహ్నముగా ఉన్నది.
మీ కొరకు, నా కొరకు శుభ సందేశము
మరికొన్ని వ్యక్తిగత కారణముల వలన ఈ కథనము చాలా ప్రాముఖ్యమైయున్నది. చివరిగా, దేవుడు అబ్రాహాముకు ఇలా సెలవిచ్చాడు
” మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును…”
ఆదికాండము 22:18
మీరు ‘భూలోకములోని జనములన్నిటి’లో ఒక దేశమునకు చెందినవారైయున్నారు – మీ భాష, మతము, విద్య, వయస్సు, లింగము, లేక ఐశ్వర్యము ఏమైనా సరే! కాబట్టి ఈ వాగ్దానము మీకు కూడా విశేషముగా చేయబడినది. వాగ్దానము ఏమిటో గమనించండి – స్వయంగా దేవుని యొద్ద నుండి కలిగిన ‘ఆశీర్వాదము’! ఇది కేవలం యూదుల కొరకు మాత్రమేగాక, లోకములోని ప్రజలందరి కొరకు ఇవ్వబడింది.
ఈ ‘ఆశీర్వాదము’ ఎలా ఇవ్వబడింది? ఇక్కడ ‘సంతానము’ అను పదము ఏకవచనములో ఉన్నది. అనేకమంది వారసులను లేక ప్రజలను ప్రస్తావించునప్పుడు ఉపయోగించు ‘సంతానములు’ అను పదము ఇక్కడ ఉపయోగించబడలేదు, కాని ‘అతడు’ అను విధముగా ఏకవచనము ఇక్కడ ఉపయోగించబడింది. ‘వారి’ ద్వారా అను విధముగా అనేకమంది ప్రజలు లేక ఒక గుంపు ద్వారా ఇది జరుగదు. హెబ్రీ వేదములలో ‘అతడు’ సర్పము యొక్క ‘మడిమెను కొట్టును’ అని నమోదు చేయబడిన విధముగానే చరిత్ర యొక్క ఆరంభములో ఇవ్వబడిన వాగ్దానమును ఇది ఖచ్చితముగా అనుసరిస్తుంది మరియు పురుషసూక్తలో ఇవ్వబడిన పురుషబలి (‘అతడు’) వాగ్దానమునకు సమాంతరముగా ఉన్నది. ఈ చిహ్నము ద్వారా అదే స్థలము – మోరీయా పర్వతము (= యెరూషలేము) – ప్రవచించబడింది మరియు ఈ పురాతన వాగ్దానములను గూర్చి తదుపరి వివరాలను ఇస్తుంది. ఈ వాగ్దానము ఎలా ఇవ్వబడిందో, మరియు నీతి యొక్క వెల ఎలా చెల్లించబడుతుందో అర్థము చేసుకొనుటలో అబ్రాహాము అర్పించిన బలిని గూర్చిన వృత్తాంతమును గూర్చిన వివరములు మనకు సహాయం చేస్తాయి.
దేవుని ఆశీర్వాదము ఎలా ప్రాప్తి అయ్యింది?
ఇస్సాకు స్థానములో బలియగుట ద్వారా పొట్టేలు అతనిని మరణము నుండి రక్షించిన విధముగానే, దేవుని గొర్రెపిల్ల, తన త్యాగపూరిత మరణము ద్వారా మనలను మరణము యొక్క శక్తి మరియు శిక్ష నుండి రక్షిస్తాడు. బైబిలు ఇలా ప్రకటిస్తుంది
… పాపమువలన వచ్చు జీతము మరణము
రోమీయులకు 6:23
మరొక విధముగా చెప్పాలంటే, మనము చేయు పాపములు మరణమును కలిగించు కర్మను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇస్సాకు స్థానములో బలియైన గొర్రెపిల్ల మరణమునకు వెలను చెల్లించింది. అబ్రాహాము ఇస్సాకులు దానిని కేవలం అంగీకరించవలసియుండెను. అతడు ఏ విధముగా కూడా దానికి యోగ్యునిగా లేడు. కాని దానిని అతడు బహుమతిగా పొందుకున్నాడు. ఖచ్చితముగా ఈ విధముగానే అతడు మోక్షమును పొందుకున్నాడు.
ఇది మనము అనుసరించగల ఒక పద్ధతిని చూపుతుంది. యేసు ‘లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల’ అయ్యున్నాడు. దీనిలో మీ పాపము కూడా ఉన్నది. ఆయన మీ కొరకు వెలను చెల్లించాడు కాబట్టి గొర్రెపిల్ల అయిన యేసు మీ పాపములను ‘మోయాలని’ ఆశపడుతున్నాడు. దీనిని పొందుకొనుటకు మీరు అర్హతను సాధించలేరు కాని బహుమతిగా పొందుకోగలరు. పురుష అయిన యేసును పిలవండి, మరియు మీ పాపములను మోసుకొనిపొమ్మని ఆయనను అడగండి. ఆయన అర్పించిన బలి ఆయనకు ఈ శక్తిని అనుగ్రహిస్తుంది. రెండు వేల సంవత్సరముల క్రితం యేసు ‘సమకూర్చిన’ అదే స్థలమైన మోరీయా పర్వతము మీద, అబ్రాహాము కుమారుని యొక్క బలిని గూర్చిన వృత్తాంతములో ఇది నిశ్చయపరచబడింది కాబట్టి ఇది మనకు తెలుసు.
దీని తరువాత, పస్కా పండుగ చిహ్నములో ఇది ఎప్పుడు జరుగుతుందో ప్రవచించబడింది.