Skip to content

రాజ్ వలె: యేసు క్రీస్తు అను పేరులో ‘క్రీస్తు’ అను మాటకు అర్థం ఏమిటి?

  • by

కొన్నిసార్లు యేసు యొక్క చివరి పేరు ఏమిటి అని నేను ప్రజలను అడుగుతాను. వారు సాధారణంగా ఇలా జవాబిస్తారు,

“ఆయన చివరి పేరు ‘క్రీస్తు’ అనుకుంటా, కాని నాకు సరిగా తెలియదు.”

అప్పుడు నేను ఇలా అడుగుతాను,

“అయితే, యేసు బాలునిగా ఉన్నప్పుడు యోసేపు క్రీస్తు మరియు మరియ క్రీస్తు తమ కుమారుడైన యేసు క్రీస్తును బజారుకు తీసుకువెళ్లారా?”

ఇలా అడిగితే, “క్రీస్తు” యేసు యొక్క ఇంటి పేరు కాదని వారు గ్రహిస్తారు. కాబట్టి, ‘క్రీస్తు’ అంటే ఏమిటి? ఇది ఎక్కడ నుండి వచ్చింది? దీని అర్థము ఏమిటి? వాస్తవానికి ‘క్రీస్తు’ అను పదము ‘నాయకులు’ లేక ‘పరిపాలన’ అను అర్థమునిచ్చు ఒక బిరుదు అని వినుట చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వాతంత్ర్యమునకు ముందు భారత దేశమును పరిపాలించిన బ్రిటిష్ రాజ్యమును ఈ ‘రాజ్’ అను బిరుదు కొంతవరకు పోలియున్నది.

అనువాదము vs. లిప్యాంతరీకరణ

ముందుగా మనము అనువాదములోని కొన్ని మూల విషయములను అర్థము చేసుకుందాము. అనువాదకులు కొన్నిసార్లు పేర్లను మరియు బిరుదులను అనువదించునప్పుడు అర్థము కంటే ఎక్కువగా ధ్వని ఆధారంగా అనువదిస్తారు. దీనిని లిప్యాంతరీకరణ అని పిలుస్తారు. ఉదాహరణకు, कुंभ मेला అను హిందీ పదమునకు ఆంగ్ల లిప్యాంతరీకరణ “Kumbh Mela” అయ్యున్నది. मेला అను మాటకు అర్థము ‘తిరునాళ్ళు’ లేక ‘పండుగ’ అయినప్పటికీ, ఇది ఆంగ్ల భాషలో kumbh fairఅని అనువదించబడుటకు బదులుగా Kumbh Mela అని లిప్యాంతరీకరణ చేయబడుతుంది. “Raj” అను పదము “राज” అను హిందీ పదము యొక్క లిప్యాంతరీకరణ అయ్యున్నది. राज అను మాటకు అర్థము ‘పరిపాలన’ అయ్యున్నప్పటికీ, “British Rule” కు బదులుగా “British Raj” అను పదమును ఉపయోగించుట ద్వారా ఈ పదము ఆంగ్లములోనికి ధ్వని ద్వారా లిప్యాంతరీకరణ చేయబడినది. వేద పుస్తకము (బైబిలు) విషయములో కూడా, అనువాదకులు ఏ పేర్లను మరియు బిరుదులను అనువదించాలి (అర్థము ఆధారంగా) మరియు వేటిని లిప్యాంతరీకరణ (ధ్వని ఆధారంగా) చేయాలి అను విషయమును స్వయంగా నిర్ణయించవలసియుండినది. దీనికి విశేషమైన నియమము ఏమి లేదు.

సెప్టుజెంట్

హెబ్రీ వేదములు (పాత నిబంధన) ఆనాటి అంతర్జాతీయ భాష అయిన గ్రీకు భాషలోనికి అనువదించబడినప్పుడు క్రీ.పూ. 250లో బైబిలు మొట్టమొదటిసారిగా అనువదించబడింది. ఆ అనువాదమును సెప్టుజెంట్ (లేక LXX) అని పిలుస్తారు మరియు అది చాలా ఖ్యాతిని పొందింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది కాబట్టి, దానిలోని అనేక ఉద్ధరణములు పాత నిబంధనలో నుండి తీసుకొనబడినవి.

సెప్టుజెంట్ లో అనువాదము & లిప్యాంతరీకరణ

ఈ ప్రక్రియను మరియు అది ఆధునిక బైబిళ్ళ మీద చూపు ప్రభావమును ఈ క్రింద చిత్రము తెలియజేస్తుంది.

మూల భాషలలో నుండి ఆధునిక బైబిళ్ళలోనికి అనువాద క్రమమును గూర్చిన పట్టిక

చౌకము #1లో మూల హెబ్రీ పాత నిబంధన (క్రీ.పూ. 1500 – 400 మధ్య కాలములో వ్రాయబడినది) ఇవ్వబడినది. సెప్టుజెంట్ క్రీ.పూ. 250లో వ్రాయబడిన హెబ్రీ –> గ్రీకు అనువాదము కాబట్టి, బాణము చౌకము #1 నుండి #2 వైపుకు సూచిస్తుంది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది (క్రీ.శ. 50-90), కాబట్టి #2లో పాత మరియు క్రొత్త నిబంధనలు రెండు ఇవ్వబడినవి. క్రింద సగభాగములో (#3) బైబిలు యొక్క ఆధునిక భాషా అనువాదములు ఇవ్వబడినవి. పాత నిబంధన (హెబ్రీ వేదములు) మూల హెబ్రీ భాష నుండి అనువదించబడింది (1–>3) మరియు క్రొత్త నిబంధన మూల గ్రీకు భాష నుండి అనువదించబడింది  (2–>3). ఇంతకు ముందు వివరించబడినట్లు పేర్లను మరియు బిరుదులను అనువాదకులు నిర్ణయించవలసియుండినది. ఇది లిప్యాంతరీకరణ మరియు అనువాదము అను శీర్షికలతో నీలిరంగు బాణముల ద్వారా సూచించబడినది, మరియు అనువాదకులు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చని ఇది సూచిస్తుంది.

‘క్రీస్తు’ అను పదము యొక్క ఆరంభము 

‘క్రీస్తు’ అను పదము మీద దృష్టిపెట్టి పై ప్రక్రియను అనుసరించండి.

‘క్రీస్తు’ అను పదము బైబిలులో ఎక్కడ నుండి ఆవిర్భవించింది? 

‘מָשִׁיחַ’ (మషియాఖ్) అను పదము హెబ్రీ పాత నిబంధనలోని బిరుదైయున్నది, మరియు రాజుగా లేక నాయకునిగా ‘అభిషేకించబడిన లేక పవిత్రపరచబడిన’ వ్యక్తి అని దీని అర్థము. ఆ కాలములోని హెబ్రీ రాజులు రాజు అగుటకు ముందు అభిషేకించబడేవారు (నూనెతో తలంటు ఆచారము), కాబట్టి వారు అభిషిక్తులు లేక మషియాఖ్ అని పిలువబడేవారు. తరువాత వారు నాయకులైయ్యేవారు, అయితే వారి పరిపాలన దేవుని యొక్క పరలోక పరిపాలనకు ఆధీనములోను, ఆయన నియమములకు అనుగుణంగాను ఉండవలసియుండేది. ఈ భావనలో పాత నిబంధనలోని హెబ్రీ రాజులు రాజ్ ను పోలియుండేవారు. రాజ్ దక్షిణ ఆసియాలోని బ్రిటిష్ ప్రాంతములను పాలించేవాడు, కాని అతడు బ్రిటన్ లోని ప్రభుత్వము యొక్క ఆధీనములో ఉండి, దాని నియమ నిబంధనలను పాటించేవాడు.

పాత నిబంధన రానున్న ఒక విశేషమైన మషియాఖ్ ను గూర్చి ప్రవచించింది. ఆయన ఒక విశేషమైన రాజుగా ఉంటాడు. క్రీ.పూ. 250లో సెప్టుజెంట్ అనువదించబడినప్పుడు, అనువాదకులు అదే అర్థమునిచ్చు ఒక గ్రీకు పదమును ఉపయోగించారు. ఆ గ్రీకు పదము Χριστός (క్రిస్టోస్ అను వినిపిస్తుంది), మరియు అది క్రియో అను పదము నుండి వెలువడుతుంది, ఆచారముగా తలపై నూనె అంటుట అని ఆ పదము యొక్క అర్థము. ఈ ప్రవచించబడిన ‘మషియాఖ్’గా యేసును గుర్తించుటకు క్రొత్త నిబంధన రచయితలు క్రిస్టోస్ అను పదమును ఉపయోగించుట కొనసాగించారు.

ఐరోపా భాషలలో, దీనికి పోలిన అర్థమునిచ్చు వేరొక పదము లేదు కాబట్టి, క్రొత్త నిబంధన గ్రీకు పదమైన ‘క్రిస్టోస్’ను వారు ‘క్రైస్ట్’ అని లిప్యాంతరీకరణ చేశారు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన మూలములు కలిగిన, హెబ్రీ నుండి గ్రీకు భాషలోనికి అనువాదము ద్వారా వచ్చిన ఒక విశేషమైన బిరుదైయున్నది, మరియు తరువాత అది గ్రీకు భాషలో నుండి ఆధునిక భాషలలోనికి లిప్యాంతరీకరణ చేయబడినది. పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి ఆధునిక భాషలలోనికి సూటిగా అనువదించబడినది మరియు మూల హెబ్రీ పదమైన ‘మషియాఖ్’ విషయములో అనువాదకులు విభిన్నమైన ఎంపికలను చేశారు. కొన్ని భైబిళ్ళు ‘మషియాఖ్’ అను పదమును కొన్ని మార్పులతో ‘మెస్సీయ’ అని లిప్యాంతరీకరణ చేయగా, మరికొన్ని ‘అభిషిక్తుడు’ అని అర్థమునిచ్చు విధముగా అనువదించాయి. క్రీస్తు అను పదమునకు హిందీ పదము (मसीह) అరబిక్ భాష నుండి లిప్యాంతరీకరణ చేయబడినది, మరియు ఆ అరబిక్ పదము మూల హెబ్రీ భాషలో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది. కాబట్టి ‘మసిహ్’ అను దాని ఉచ్చారణ మూల హెబ్రీ పదమునకు దగ్గర సంబంధము కలిగినదిగా ఉన్నది. 

హెబ్రీ పదమైన מָשִׁיחַ (మషియాఖ్, మెస్సీయ) గ్రీకు సెప్టుజెంట్ లో “క్రిస్టోస్” అని అనువదించబడింది. ఇది ఆంగ్ల భాషలోనికి ‘క్రైస్ట్’ అని అనువదించబడింది. క్రిస్ట్ అను పదము యొక్క తెలుగు అనువాదము గ్రీకు పదమైన “క్రిస్టోస్”లో నుండి లిప్యాంతరీకరణ చేయబడినది మరియు క్రీస్తు (Krīstu) అని పలుకబడుతుంది.

సాధారణంగా ‘క్రీస్తు’ అను పదమును మనము పాత నిబంధనలో చూడము గనుక, పాత నిబంధనతో ఈ పదము యొక్క అనుబంధము ఎల్లప్పుడు స్పష్టముగా కనిపించదు. కాని, ‘క్రీస్తు’=’మెస్సీయ’=’అభిషిక్తుడు’ అని, మరియు ఇది ఒక విశేషమైన బిరుదు అని ఈ అధ్యయనము ద్వారా మనకు స్పష్టమవుతుంది.

మొదటి శతాబ్దములో ఎదురుచూసిన క్రీస్తు

ఇప్పుడు సువార్తలో నుండి కొన్ని విషయములను చూద్దాము. క్రిస్మస్ వృత్తాంతములోని భాగముగా, యూదుల రాజును చూచుటకు జ్ఞానులు వచ్చినప్పుడు, హేరోదు రాజు ఈ క్రింది విధంగా స్పందించాడు. ఇక్కడ క్రీస్తు అను పదము ప్రత్యేకముగా యేసును సూచించనప్పటికీ, దానిలోని స్పష్టతను గమనించండి.

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:3-4

‘ప్రత్యేకించబడిన క్రీస్తు’ అను ఆలోచన హేరోదు మరియు అతని సలహాదారులకు అర్థమైయ్యింది అని మీరు చూడవచ్చు – మరియు ఇక్కడ ఈ పదము యేసును విశేషముగా సూచించదు. ‘క్రీస్తు’ అను పదము పాత నిబంధన నుండి వస్తుంది అని, మొదటి శతాబ్దములోని ప్రజలు (హేరోదు మరియు అతని సలహాదారులు వంటివారు) సెప్టుజెంట్ లో దీనిని సాధారణంగా చదివేవారని ఇది సూచిస్తుంది. ‘క్రీస్తు’ అను పదము ఒక పేరు కాదుగాని, ఒక బిరుదైయున్నది, మరియు మరియు ఒక నాయకుని లేక రాజును సూచిస్తుంది. ఇందువలనే, మరొక రాజు యొక్క రాకను బట్టి హేరోదు ‘కలత చెందాడు.’ ‘క్రీస్తు’ అను పదమును క్రైస్తవులు సృష్టించారు అను ఆలోచనను ఇప్పుడు మనము ప్రక్కనపెట్టవచ్చు. క్రైస్తవులు ఉనికిలోని రాక ముందే కొన్ని వందల సంవత్సరములుగా ఈ బిరుదు ఉపయోగించబడింది.

క్రీస్తు అధికారములోని వైరుధ్యములు

హెబ్రీ వేదములలో ప్రవచించబడిన రానున్న క్రీస్తు యేసే అని ఆయన యొక్క ఆదిమ అనుచరులు నమ్మారు, కాని ఇతరులు ఆయనను వ్యతిరేకించారు. 

ఎందుకు?

ప్రేమ లేక శక్తి ద్వారా పాలించుట అను వైరుధ్యములో దీనిని జవాబు దాగియున్నది. బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనములో భారత దేశమును పాలించు అధికారము రాజ్ కు ఇవ్వబడినది. అయితే రాజ్ మొదటిగా సైన్య శక్తితో వచ్చి దాని శక్తి ద్వారా దేశమును లోపరచుకున్నది కాబట్టి భారత దేశమును పాలించగలిగినది. ప్రజలు రాజ్ ను ఇష్టపడలేదు, కాబట్టి తుదకు గాంధీ వంటి నాయకుల నాయకత్వములో రాజ్ ముగింపునకు వచ్చింది.  

క్రీస్తుగా యేసు అధికారము కలిగియున్నను బలవంతముగా లోపరచుకొనుటకు రాలేదు. ప్రేమ లేక భక్తి ఆధారంగా నిత్య రాజ్యమును స్థాపించుటకు ఆయన వచ్చాడు, మరియు ఇలా జరిగుటకు ఒక వైపున శక్తి మరియు అధికారము అను వైరుధ్యము మరొక వైపున ఉన్న ప్రేమతో ఏకమవ్వవలసియుండినది. ‘క్రీస్తు’ రాకను అర్థము చేసుకొనుటలో మనకు సహాయం చేయుటకు హెబ్రీ ఋషులు ఈ వైరుధ్యమును వివరించారు. హెబ్రీ వేదములలో ‘క్రీస్తు’ అను పదము యొక్క మొదటి ప్రత్యక్షతలో వారు ఇచ్చిన మెళకువలను మనము అనుసరిద్దాము, వీటిని క్రీ.పూ. 1000లో హెబ్రీ రాజైన దావీదు వ్రాశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *