Skip to content

ప్రభువైన యేసు బలియాగం నుండి శుద్ధి వరాన్ని పొందడం ఎలా?

మనుష్యులందరి కోసం తనను తాను బలిగా అర్పించుకోడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశం పురాతన రుగ్.వేదాల సంకీర్తనలలో ముందు ఛాయగా కనిపించింది, ఆదిమ హెబ్రీ వేదాల పండుగలు, వాగ్దానాలలో కూడా సూచించబడింది. ప్రార్థ స్నాన (ప్రతాసన) మంత్రం ప్రార్థనను మనం వల్లె వేసిన ప్రతీ సారి మనం అడిగే ప్రశ్నకు ప్రభువైన యేసే సమాధానం. ఇది ఎలా సాధ్యం? మనలనందరినీ ప్రభావితం చేసే కర్మ నియమాన్ని బైబిలు (వేదం పుస్తకం) ప్రకటిస్తుంది.

పాపమునకు వచ్చు జీతం మరణం….. (రోమా 6:23)

ఈ కర్మ నియమాన్ని ఒక ఉదాహరణ ద్వారా ఈ క్రింద చూపించాను. “మరణం” అంటే ఎడబాటు. మన ఆత్మ మన శరీరంలో నుండి ఎడబాటు అయినప్పుడు మనం భౌతికంగా చనిపోతాం. అదే విధంగా దేవుని నుండి మనం ఆత్మీయగా ఎడబాటు చెందుతాం. ఇది సత్యం, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు (పాప రహితుడు).

రెండు శిఖరాల మధ్య అగాధం వలనే మనం దేవుని నుండి ఎడబాటు అయ్యాం

మనం ఒక శిఖరం మీద ఉన్నవారిలా మన గురించి మనం చూడవచ్చు. దేవుడు మరొక శిఖరం మీద ఉన్నట్టు చూడవచ్చు. అంతం లేని పాప అగాధం చేత మనం దేవునినుండి వేరై యున్నాం.

ఈ ఎడబాటు దోషారోపణనూ, భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం సహజంగా చెయ్యడానికి ప్రయత్నించేదేమిటంటే మన వైపునుండి (మరణం) దేవుని వైపుకు వారధిని నిర్మించాలనుకొంటాం. మనం బలులు అర్పిస్తాం. పూజలు చేస్తాం, సన్యాసితను అభ్యసిస్తాం, పండుగలు ఆచరిస్తాం, దేవాలయాలకు వెళ్తాం, అనేక ప్రార్థనలు చేస్తాం, మన పాపాల్ని తగ్గిస్తాం లేక మానివేయడానికే ప్రయత్నిస్తాం. యోగ్యతను సంపాదించడానికి ఈ చర్యల జాబితా మనలో కొంతమందికి చాలా దీర్ఘంగా ఉండవచ్చు. సమస్య ఏమిటంటే, మన ప్రయత్నాలూ, యోగ్యతలూ, బలులూ, సన్యాసిత అభ్యాసాలూ చెడు లేనివిగా ఉన్నప్పటికీ అవి చాలవు, ఎందుకంటే మన పాపాలకు అవసరమైన (జీతం) వెల మరణం. తరువాత పటంలో ఇది ఉదహరించబడింది.

మతపర యోగ్యతలు – అవి మంచివైనప్పటికీ – దేవునికీ మనకూ మధ్య ఉన్న ఎడబాటును పూడ్చలేవు

దేవుని నుండి మనల్ని వేరు చేసే ఎడబాటును దాటడానికి మన మతపర ప్రయత్నాల ద్వారా ఒక ‘వారధిని’ నిర్మించదానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది చెడ్డది కాకపోయినా ఇది మనం సమస్యను పరిష్కరించదు. ఎందుకంటే ఆవలి వైపుకు సంపూర్తిగా వెళ్ళడంలో సఫలం కాదు. మన ప్రయత్నాలు చాలవు. శాఖాహారాలను తినడం ద్వారా క్యాన్సరు వ్యాధిని (మరణాన్ని కలిగిస్తుంది) బాగు చెయ్యడంలా ఉంటుంది. శాఖాహారాలను తినడం చాలా మంచిది – అయితే అది క్యాన్సర్ ను బాగు చెయ్యదు. దానికోసం పూర్తిగా భిన్నమైన చికిత్స అవసరం. ఈ ప్రయత్నాలను మతపర అర్హత ‘వంతెన’ తో ఉదహరించవచ్చు. అఘాధంలో కేవలం కొంత భాగం వరకు మాత్రమే ఇది వెళ్తుంది – దేవుని నుండి ఇంకా ఎడబాటులోనే ఉంచుతాయి.

కర్మనియమం చెడు వార్త – ఇది చాలా చెడు వార్త, దానిని వినడానికి కూడా ఇష్టపదం, ఈ నియమానం నెరవేరుతుందని ఆశతో – మన పరిస్థితి గురుత్వం మన ఆత్మల్లో క్షీణించి పోయేంతవరకూ మన జీవితాలను కార్యకలాపాలతోనూ, విషయాలతోనూ మన జీవితాలను నింపాలని మనం తరచుగా ప్రయత్నిస్తుంటాం. అయితే ఈ కర్మనియమంతోనే ఆగిపోలేదు.

పాపమునకు జీతం మరణం అయితే ……. (రోమా 6:23)

నియమం దిశ ఇప్పుడు మరొక దిశలోనికి – మంచి వార్త – సువార్త వైపుకు వెళ్ళబోతుందని ‘అయితే’ అనే చిన్న పదం చూపిస్తుంది. ఇది మోక్షానికీ, జ్ఞానోదయానికీ మార్చబడిన కర్మ నియమం. కాబట్టి మోక్షం శుభవార్త ఏమిటి?

ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవును కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. (రోమా 6:23)

దేవునికీ మనకూ ఉన్న ఈ ఎడబాటును పూడ్చివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు బలియాగం చాలినది అనునదే మంచి వార్త. ఇది మనకు తెలుసు ఎందుకంటే యేసు మరణించి తరువాత మూడు రోజులకు ఆయన శరీరంతో తిరిగి లేచాడు, సజీవుడుగా శరీర పునరుత్థానంలో తిరిగి వచ్చాడు.  ఈ నాడు అనేకమంది ప్రజలు ప్రభువైన యేసు పునరుత్థానాన్ని విశ్వసించడాన్ని నిరాకరించడానికి ఎంపిక చేసుకోవడాన్ని ఒక బలమైన అభియోగంగా చేసినప్పటికీ ఆయన సజీవుడు. ఈ అంశం ఒక విశ్వవిద్యాలయంలో చేసిన ఉపన్యాసంలో కనిపిస్తుంది. (వీడియో లింక్ ఇక్కడ ఉంది). విశ్వఆత్మ, ప్రధానుడైన ప్రభువైన యేసు పరిపూర్ణ బలిని అర్పించాడు. ఆయన మానవుడు కనుక అగాధం విస్తృతిని పూడ్చడానికీ మానవుని పక్షంగా స్పర్శించగలడు, పరిపూర్ణుడు కనుక దేవుని పక్షాన్ని కూడా స్పర్శించగలడు. నిత్య జీవానికి ఆయన వారధి. ఈ అంశం ఈ క్రింద ఉదహరించబడింది.

దేవునికీ, మానవునికీ విస్తరించిన అగాధానికి ప్రభువైన యేసు వారధి. ఆయన బలి మన పాపాలకు వెల చెల్లించింది

ప్రభువైన యేసు బలి ఏవిధంగా మనకు అనుగ్రహింపబడిందో గమనించండి. ఇది మనకు ఒక బహుమానంగా (వరంగా) అనుగ్రహింపబడింది. బహుమానాలను గురించి ఆలోచించండి. ఇచ్చిన బహుమతి ఎటువంటిదైనా అది నిజంగా బహుమతి అయితే దాని కోసం నీవు ప్రయాస పడని బహుమతి. నీకున్న అర్హతను బట్టి నీవు దానిని పొందలేదు. నీవు దానిని సంపాదించుకొన్నావు అంటే అది బహుమతి కానే కాదు! అదేవిధంగా ప్రభువైన యేసు బలిని నీవు సంపాదించుకోలేవు, దానికి అర్హుడవు కావు. అది నీకు బహుమానంగా అనుగ్రహింపబడింది.  బహుమతి అంటే ఏమిటి? ఇది ‘నిత్యజీవం’  అంటే నీకు మరణాన్ని తెచ్చిన పాపం ఇప్పుడు రద్దు చెయ్యబడింది. దేవునితో సంబంధం కలిగియుండడానికి, నిత్య జీవాన్ని పొందడానికి దాటి వెళ్ళడానికి ప్రభువైన యేసు బలి ఒక వంతెనలా ఉంది-ఇది శాశ్వతంగా ఉంటుంది.  మృతులలో నుండి సజీవుడిగా లేవడం ద్వారా తనను తాను ప్రభువుగా కనపరచుకొన్న ప్రభువైన యేసు ఈ బహుమతిని అనుగ్రహించాడు.

కాబట్టి నీవూ, నేనూ ఈ నిత్యజీవం వంతెనను ఏవిధంగా ‘దాటగలం’? మరల బహుమానాలను గురించి ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు కష్టపడకుండా నీకు ఒక బహుమానాన్ని ఇచ్చారనుకోండి, ఆ బహుమానం నుండి ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే నీవు దానిని ‘స్వీకరించాలి.’ ఎప్పుడైనా బహుమతి ఇచ్చినప్పుడు రెండు ప్రత్యామ్యాయాలు ఉంటాయి. బహుమానాన్ని నిరాకరించడం (“వద్దు, కృతజ్ఞతలు”) లేక దానిని స్వీకరించడం (“మీ బహుమానం కోసం వందనాలు, నేను దానిని తీసుకొంటాను”). కాబట్టి ప్రభువైన యేసు అనుగ్రహించే బహుమానాన్ని స్వీకరించాలి. కేవలం ‘నమ్మడం’, ‘అధ్యయనం చెయ్యడం’, ‘అర్థంచేసుకోవడం’ కాదు. దేవుని వైపుకు తిరగి, ఆయన మనకు అనుగ్రహించే బహుమానాన్ని పొందడానికి వంతెన మీద ‘నడవడం’ తరువాత పటంలో ఉదహరించబడింది.

ప్రభువైన యేసు బలి మనలో ప్రతీ ఒక్కరూ ఎంపిక చేసుకొని స్వీకరించవలసిన దేవుని బహుమానం

కనుక ఈ బహుమానాన్ని ఏవిధంగా స్వీకరిస్తాము? బైబిలు ఇలా చెపుతుంది:

“ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.” (రోమా 10:13) 

ఈ వాగ్దానం ‘అందరి’కోసం అని గమనించండి. ఒక నిర్దిష్ట మతం, జాతి, దేశంలో ఉన్నవారికి కాదు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు కనుక ఈనాటికీ సజీవుడిగా ఉన్నాడు. అయన ‘ప్రభువు’ కాబట్టి ఆ నామంలో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన నిత్యజీవం బహుమానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయనతో సంబాషణ చెయ్యడం ద్వారా – నీవు ఆయనకు ప్రార్థన చెయ్యాలి, ఆయనను అడగాలి. ఒకవేళ ఇంతకు ముందు నీవిలా చేసి యుండకపోవచ్చు. ఆయనతో ఈ సంబాషణ, ఈ ప్రార్థన చెయ్యడానికి నీకు సహాయం చెయ్యడానికి ఇక మాదిరి ఇక్కడ ఉంది. ఇది మాంత్రిక సంబంధ మంత్రోచ్చారణ కాదు. శక్తిని ఇచ్చే ప్రత్యేక పదాలు కాదు. ఈ బహుమానం ఇవ్వడానికి ఆయనకు ఉన్న సామర్ధ్యం, ఇష్టత మీద విశ్వాసం. మనం విశ్వసించినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. కాబట్టి మీ ప్రభువైన యేసుకు గట్టిగా ప్రార్థన చెయ్యడం లేదా ఆత్మలో మౌనంగా ప్రార్థన చేసి ఆయన బహుమానాన్ని స్వీకరించడంలో ఈ మార్గదర్శిని అనుసరించండి.

ప్రియమైన యేసు, నా పాపాలు నా జీవితంలో ఉండగా నేను దేవుని నుండి దూరం అయ్యానని నేను అర్థం చేసుకొన్నాను. నేను చాలా కష్టపడినప్పటికీ నా నుండి ఏ ప్రయత్నమూ, బలియాగామూ ఈ ఎడబాటును పూడ్చలేకపోయాయి. అయితే పాపాలన్నిటినీ కడిగి పవిత్రపరచడానికి నీ మరణం బలియాగమని నేను అర్థం చేసుకొన్నానునా పాపాలను సహితం.  నీ బలియాగాన్ని సిలువులో అర్పించి, మృతులలో నుండి లేచావని నేను విశ్వసిస్తున్నాను. నీ బలి యాగం చాలినదని నేను విశ్వసిస్తున్నాను. నా పాపాలనుండి నన్ను పవిత్రపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను, శాశ్వత జీవాన్ని కలిగియుండడానికి దేవునితో నన్ను చేర్చండి. పాపానికి బానిసగా ఉండే జీవితం జీవించాలని నేను కోరుకోవడం లేదు. అది నన్ను కర్మ అధికార బంధకంలో పట్టియుంచుతుంది. ప్రభువైన యేసూ నా కోసం ఇదంతా చేస్తున్నందుకు నీకు వందనాలు. నీవే నా ప్రభువుగా నిన్ను అనుసరించడానికి నా జీవితంలో నీవే నన్ను నడిపించుచున్నందుకు నీకు వందనాలు.

1 thought on “ప్రభువైన యేసు బలియాగం నుండి శుద్ధి వరాన్ని పొందడం ఎలా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *